Showing posts with label Meditation. Show all posts
Showing posts with label Meditation. Show all posts

Tuesday, April 23, 2019

ధ్యానం ప్రారంభించడానికి చిట్కాలు (Tips to Get Started with Meditation)



ప్రశాంతముగా ఇరవై నిమిషాలు ధ్యానం చేయుటకు సిద్ధం అవ్వండి

మీకు తెలుసా మనం కొంచం సమయాన్ని ధ్యానం కోసం  కేటాయిస్తే మనకు ఎంత మంచి అనుభూతి కలుగుతుందో ?

మీ సౌకర్యం కోసం ఈ కింద చిట్కాలు ఇవ్వడం జరిగింది. ఇవి మీకు ధ్యానం చెయ్యడం లో సహాయ పడతాయి. మీరు ఈ చిట్కాలు చదివిన తరువాత, ధ్యానం  చెయ్యడానికి ఈ క్రిందవున్న 'గైడెడ్ మెడిటేషన్' ని క్లిక్ చెయ్యండి

1 మీకు అనుకూలమైన సమయాన్ని చూసుకోండి


ధ్యానం  అనేది పూర్తిగా విశ్రాంతి సమయం. కాబట్టి దీనిని మీకు పూర్తిగా అనుకూలమైన సమయంలో చెయ్యాలి. కాబట్టి మీకు   ఆటంకము కలగని సమయాన్ని, ప్రాంతాన్ని చూసుకోండి. మాములుగా సూర్యోదయం మరియు సూర్యాస్తమయం       సమయాలు ధ్యానం  చెయ్యడానికి అనుకూలంగా వుంటాయి.



2 ఒక నిశబ్ధమైన ప్రదేశాన్ని చూసుకోండి


 మీకు అనుకూలమైన సమయాన్ని చూసుకొన్న మాదిరిగానే మీకు ఆటంకము కలగని ప్రదేశాన్ని చూసుకోండి. ఒక నిశ్శబ్దమైన  మరియు ప్రశాంతమైన పరిసరాలు మనకు ధ్యానం  యొక్క గొప్ప  అనుభూతి కలగడానికి దోహదపడాయి.



3 మీకు అనుకూలమైన భంగిమ లో కూర్చోండి


మీ భంగిమ కూడా మీ ధ్యానం  మీద ప్రభావం చూపుతుంది. మీరు ప్రశాంతంగా, సౌకర్యవంతంగా, స్థిరంగా ఉండేలా చూసుకోండి. మీ వెన్నెముక నిటారుగా ఉండేలా  నేరుగా కూర్చోండి. మీరు ధ్యానం  చేసినంతసేపు  కళ్ళు మూసుకొని  భుజములు మరియు మెడ ప్రశాంతంగా ఉంచుకోండి. పద్మాసనం లో కూర్చొని ధ్యానం  చెయ్యమని మన పురాణాలు చెబుతున్నాయి.

4 మీ పొట్టను ఖాళీగా ఉంచుకోండి




 మీరు భోజనం చెయ్యడానికి ముందు ధ్యానం  చెయ్యడం మంచిది.

ఒకవేళ మీరు భోజనం చేసిన తరువాత ధ్యానం  చేస్తే మీకు నిద్ర రావచ్చు. ఏది ఏమైనా కూడా మీరు ఆకలిగా వున్నపుడు ధ్యానం  చెయ్యడానికి ప్రయత్నించకండి.

ఎందుకంటే మీ ద్యాసంతా ఆకలి మీదకు వెళుతుంది. ఐతే మీరు  భోజనం చేసిన 2 గంటల తరువాత ధ్యానం  చెయ్యవచ్చు.



5 సులభమైన వ్యాయామం తో ప్రారంభించండి


సులభమైన వ్యాయామం లేదా సూర్య నమస్కారాలు చెయ్యడం వలన రక్త ప్రసరణ జరుగుతుంది. దీనివల్ల మీ శరీరం లో వున్నా జడత్వం పోయి శరీరం తేలికగా అనిపిస్తుంది.

ఇలా చెయ్యడం వలన మీరు ధ్యానం  లో చాలాసేపు కూర్చోగలరు.

 6 కొన్ని దీర్ఘమైన శ్వాసలు తీసుకోండి


 దీర్ఘమైన శ్వాసలు తీసుకోవడం వలన మీరు ధ్యానం  బాగా చెయ్యగలరు. అలాగే ధ్యానం  చెయ్యడానికి ముందు నాడి  శోదన ప్రాణాయామం చెయ్యడం కూడా మంచిది.

దీనివలన మీ శ్వాస క్రమభద్ధమై   మీకు ప్రశాంతత కలుగ చేస్తుంది.



7 మీ ముఖము పైన చిరునవ్వు వుంచండి



మీరు చిరునవ్వు తో ధ్యానం  చెయ్యడం వలన మీరు ప్రశాంతమైన అనుభవం పొందగలరు.

 నెమ్మదిగా కళ్ళు తెరవండి


  మీరు ధ్యానం  చెయ్యడం పూర్తి అయిన తరువాత కంగారు పడకుండా నెమ్మదిగా మీ పరిసరాలు గుర్తుకు తెచ్చుకుని నెమ్మదిగా కళ్ళు తెరవండి. 

ధ్యానం


ధీ + యానం = ధ్యానం
ధీ = సూక్ష్మశరీరాది సముదాయం
అంటే, "ఆస్ట్రల్ బాడీ కాంప్లెక్స్" అన్నమాట
యానం = ప్రయాణం

"ధ్యానం" అంటే "సూక్ష్మశరీరాది సముదాయంతో చేసే ప్రయాణం"
దీనినే "ఆస్ట్రల్ ట్రావెల్" అంటాం.

ధ్యానం ద్వారానే సర్వలోకాలూ తిరగగలుగుతాం
ధ్యానం ద్వారానే సర్వలోకవాసులనూ కలుసుకోగలుగుతాం
ధ్యానం ద్వారానే సర్వలోక రహస్యాలనూ తెలుసుకోగలుగుతాం
ధ్యానం ద్వారానే సర్వలోక ఆనందాలూ పొందగలుగుతాం.

ఆనాపానసతి


ఆనాపానసతి ... అన్నది గౌతమబుద్ధుడు సుమారు 2500 సం|| క్రితం ఉపయోగించిన పాళీ భాష పదం. పాళీ భాషలో... "ఆనాపానసతి" అంటే "మన శ్వాసతో మనం కూడుకుని వుండడం" ... మరి దీనినే మనం "శ్వాస మీద ధ్యాస" అని చెప్పుకుంటున్నాం. ఆనాపానసతి అన్నదే ప్రపంచానికి … సకల ఋషులు, సకల యోగులు .. అందరూ కలిసికట్టుగా ఇచ్చిన  అద్భుతమైన వరం.

'ఆన' అంటే 'ఉచ్ఛ్వాస'
'అపాన' అంటే 'నిశ్వాస'
'సతి' అంటే 'కూడుకుని వుండడం'

సహజంగానే ప్రతి ఒక్కళ్ళూ  "సత్యాన్ని కనుక్కోవాలి" అన్నప్పుడు చివరిగా  చేరే స్థితే ఆనాపానసతి .. చివరికి కనుక్కునే ఉపాయమే ఆనాపానసతి.

ధ్యానం చేసే పద్ధతి 

  • సుఖాసనంలో హాయిగా కూర్చుని చేతులు రెండూ కలిపి, కళ్ళు రెండూ మూసుకుని ప్రకృతి సహజంగా జరుగుతూన్న ఉచ్ఛ్వాస నిశ్వాసలనే  ఏకధారగా గమనిస్తూ వుండాలి. 
  • ఏ దేవతారూపాన్నీ, ఏ గురు రూపాన్నీ ప్రత్యేకంగా ఊహించుకోరాదు. ఏ దైవ నామస్మరణా  వుండరాదు.
  • ఈ విధమైన ఆలోచనారహిత-స్థితిలో కలిగే అనేకానేక శారీరక, నాడీమండల, అత్మానుభవాలను శ్రద్ధగా గమనిస్తూ వుండాలి. ఆ స్థితిలో శరీరం వెలుపల వున్న విశ్వమయ ప్రాణశక్తి .. అపారంగా శరీరంలోకి  ప్రవేశించి .. నాడీమండలాన్ని  శుద్ధి చేస్తూ వుంటుంది. 
  • ఎవరి వయస్సు ఎంత వుంటుందో .. కనీసం  అన్ని నిమిషాలు .. తప్పనిసరిగా .. రోజుకి రెండు సార్లుగా .. ధ్యానం  చెయ్యాలి.  ఈ విధంగా ప్రతి రోజూ నియమబద్ధంగా ధ్యాన అభ్యాసాన్ని అలవాటు చేసుకోవాలి.


ధ్యానం వల్ల లాభాలు


  • ధ్యాన సాధన ద్వారా శారీరక, మానసిక అనారోగ్యాలైన బి.పి, షుగరు, చర్మ వ్యాధులు, డిప్రెషన్, వెన్నునొప్పి, కాన్సరు, గుండెనొప్పి వంటి సమస్త వ్యాధులు తగ్గుతాయి మరియు దుర్గుణాలు, దురలవాట్లు కూడా పోగొట్టుకోవచ్చు.
  • మానసిక ఆందోళనలు, ఒత్తిడిని జయించి మానసిక ప్రశాంతతను పొందవచ్చు.
  • జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, బుద్ధికుశలత మొదలైనవి పెరుగుతాయి.
  • ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరిగి జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను, లాభ నష్టాలను సమబుద్ధితో స్వీకరించగలరు.
  • మూఢ నమ్మకాలు, భయాలు పోయి చావు-పుట్టుకల జ్ఞానం ద్వారా మరణభయాన్ని కూడా జయించగలరు.
  • ధ్యానం మనిషిని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి, హింస నుండి అహింస వైపు, అజ్ఞానం నుండి ఆత్మజ్ఞానం వైపు, మానవత్వం నుండి దైవత్వం వైపు నడిపిస్తుంది.

మెడిటేషన్ వల్ల లాభాలు


మెడిటేషన్ అనేది ఒక పురుషులకు లేదా ఆధ్యాత్మిక గురువులకు మాత్రమే అనుకుంటారు. అయితే ధ్యానం కేవలం ఒక మతపరమైన అనుభవం కాదు. మీరు ఇది ఆధ్మాత్మికత అని చెప్పవచ్చు కానీ ఇది ప్రధానంగా మీ ఆరోగ్యాన్నిక మెరుగుపరుచుకోవడానికి ఒక మార్గం అని చెప్పవచ్చు . 
  • మెడిటేషన్ వల్ల మీకు తెలియని అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. మెడిటేషన్ వల్ల మానసిక మరియు భావోద్వేగ ఆరోగ్యం మెరుగుపచడం మాత్రేమే కాదు, మెడిటేషన్ వల్ల భౌతిక ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే మీ భావోద్వేగ ఆరోగ్యం మీ భౌతిక ఆరోగ్యం ఫిట్ నెస్ మీద ప్రభావం చూపుతుంది. 
  • మెడిటేషన్ వల్ల ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు. ప్రస్తుత రోజుల్లో ఒత్తిడి తగ్గించుకోవడానికి మెడిటేషన్ ఒక అత్యవసర మార్గంగా ఏర్పడింది. 
  • ఒక్క మానసిక, భౌతిక ఆరోగ్యంకోసం మాత్రమే కాదు, బరువు తగ్గించుకోవడానికి, ఒత్తిడి మరియు ఆందోళన రుగ్మతలను నివారించుకోవడం కోసం మెడిటేషన్ అద్భుతంగా సహాయపడుతుంది. 
  • అయితే మెడిటేషన్ ను సరిగా ఎలా చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కరెక్టైన పద్దతిలో, కరెక్టైన సమయంలో మెడిటేషన్ చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. లేదంటే, ఈ వ్యాయామం వల్ల ఇది వ్యర్థం అవుతుంది. 
  • అంటే మెడిటేషన్ చేసే సమయంలో మీ ఏకాగ్రత వేరే ఎక్కడా ఉండకూడదు, మనస్సు నిలకడగా ఉంచుకోవాలి. మెడిటేషన్ చేసే సమయంలో ఇతర ఆలోచనలు కట్టిపెట్టాలి. ఫోన్ కాల్స్ చూడటం, మెయిల్స్ చెక్ చేయడం వంటి పనులు చేయకూడదు . మెడిటేషన్ చేయడానికి మీరు పూర్తిగా సమయాన్ని వెచ్చించాలి. 
  • మెడిటేషన్ వల్ల నిద్రలేమి మరియు డిప్రెషన్ వంటి సమస్యలు నేచురల్ గా మరియు ఎఫెక్టివ్ గా నివారించబడుతాయి. 
మెడిటేషన్ వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ... 
స్ట్రెస్ రిలీఫ్

నిద్రపట్టేందుకు సహాయపడుతుంది 


కోపాన్ని కంట్రోల్ చేస్తుంది 


బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది 


భావోద్వేగాలను స్థిరంగా ఉంచుతుంది 



శ్వాస సంబంధిత సమస్యలకు నివారిస్తుంది 


వ్యాధినిరోధకతను మెరుగుపరుస్తుంది

కండరాల తిమ్మెర్లను నివారిస్తుంది

జ్ఝాపకశక్తిని మెరుగుపరుస్తుంది