Showing posts with label పర్యటనలు. Show all posts
Showing posts with label పర్యటనలు. Show all posts

Tuesday, September 20, 2016

ఈజిప్ట్‌ అధ్యక్షుడి భారత పర్యటన


ఈజిప్ట్‌ అధ్యక్షుడు అట్టెల్‌ ఫత్తాప్‌ా ఎల్‌-సిసీ 2016 సెప్టెంబర్‌ 2న ప్రధానమంత్రి నరేంద్రమోడితో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించే దిశగా రక్షణ, భద్రతా రంగాల్లో సహకరించుకోవాలని నిర్ణయించారు. నౌకా వాణిజ్యానికి సంబంధించి రవాణా ఒప్పందంపై సంతకాల  చేశారు.

మయన్మార్‌లో సుష్మా స్వరాజ్‌ పర్యటన


మయన్మార్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ 2016 ఆగస్టు 22న ఆ దేశంలో పర్యటించారు. భారత్‌కు వ్యతిరేకంగా మయన్మార్‌లో ఎలాంటి కార్యకలాపాలను అనుమతించేది లేదని ఆ దేశం తెలిపింది. పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు హితిన్‌ క్యా, విదేశాంగ మంత్రి అంగ్‌సాన్‌ సూకీతో సుష్మ సమావేశమయ్యారు.

మయన్మార్‌ అధ్యక్షుడి భారత పర్యటన


మయన్మార్‌ అభివృద్ధి కోసం అక్కడి ప్రభుత్వ కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడి హామీ ఇచ్చారు. మయన్మార్‌ అధ్యక్షుడు యు హతిన్‌ క్యా భారత పర్యటనలో భాగంగా 2016 ఆగస్టు 29న ప్రధాని మోడితో భేటీ అయ్యారు. ఉగ్రవాదంపై పోరు, చొరబాటు కార్యక్రమాల  నిరోధం, రవాణా, వైద్యం, పునరుత్పాదక ఇంధన రంగాల్లో సంబంధాల్ని విస్త ృతం చేసుకోవాని ఈ సమావేశంలో నిర్ణయించారు.