Showing posts with label దినోత్సవాలు. Show all posts
Showing posts with label దినోత్సవాలు. Show all posts
Monday, August 14, 2023
Saturday, August 12, 2023
Friday, August 11, 2023
Tuesday, August 8, 2023
Article 370 : ‘ఆర్టికల్ 370’ రద్దుకు నాలుగేళ్లు
- జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి 2023 ఆగస్టు 5తో నాలుగేళ్లు పూర్తయింది.
- 2019 ఆగస్టు 5న ఈ అధికరణను కేంద్రం రద్దు చేసింది. ఆ తర్వాత జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా (జమ్మూ కశ్మీర్, లద్దాఖ్) విభజించింది.
Tuesday, August 1, 2023
ప్రపంచ తల్లిపాల వారోత్సవం
World Breastfeeding Week
1st to 7th August
2023 Theme :
Let’s make breastfeeding and work, work!
ప్రపంచ తల్లిపాల వారోత్సవం
1-7 ఆగస్టు
2023 థీమ్ :
తల్లిపాలను ప్రారంభించడం పనిచేసే తల్లిదండ్రులకు మార్పు
Monday, July 31, 2023
Friday, July 28, 2023
Thursday, July 27, 2023
ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం
World Hepatitis Day 2023
Theme - One Life, One Liver
ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం 2023
థీమ్ - వన్ లైఫ్, వన్ లివర్
ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం 2023
World Nature Conservation Day 2023
Theme - Forests and Livelihoods : Sustaining People and Planet
ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం 2023
థీమ్ - అడవులు మరియు జీవనోపాధి : ప్రజలు మరియు గ్రహాన్ని నిలబెట్టడం
Tuesday, July 18, 2023
అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాల ముగింపు
- క్షత్రియ సేవాసమితి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు వేడుకల కార్యక్రమం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో 2023 జులై 4న జరిగింది.
- రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ- తన ప్రాణాల్ని 26 ఏళ్ల వయసులోనే బలి ఇచ్చిన అల్లూరిది దేశ స్వాతంత్య్రోద్యమంలో ఒక ప్రముఖ అధ్యాయమని అభివర్ణించారు.
- భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు స్మృతివనాన్ని రాష్ట్రపతి వర్చువల్‌గా ప్రారంభించారు. కేంద్ర సాంస్కృతికశాఖ రూపొందించిన 3డీ యానిమేషన్ చిత్రాన్ని ఆవిష్కరించారు.
- జయంతి వేడుకలను ఏడాది కిందట భీమవరంలో ప్రధాని మోదీ ప్రారంభించగా.. హైదరాబాద్‌లో ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి ముర్ము వచ్చారు
Thursday, October 6, 2016
సీఎస్‌ఐఆర్ 75వ వార్షికోత్సవం
శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్) 75వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని 2016 సెప్టెంబర్ 26న ఢల్లీలో ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోడి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలో తగ్గిపోతున్న నేల, నీటి వనరుల లభ్యత దృష్ట్యా పంట దిగుబడులు పెంచడానికి శాస్త్రీయ పరిష్కార మార్గాలను అభివృద్ధి చేయాలని ప్రధాని మోడి శాస్త్రవేత్తలకు సూచించారు.ఈ సందర్భంగా ప్రధాని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్, అసోం, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల నుంచి వచ్చిన రైతులతో చర్చించారు. సీఎస్‌ఐఆర్ సంస్థ శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖలలో భాగం. ఈ సంస్థ కింద 38 అధునాతన పరిశోధన సంస్థలు ఉన్నాయి. ఇవి ఏరోస్పేస్ నుంచి వ్యవసాయం వరకూ అనేక అంశాలపై పరిశోధలను చేస్తున్నాయి. ఈ సందర్భంగా పీతాంబర్ అనే పసుపు వంగడాన్ని ప్రధాని మోడి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డును ప్రకటించారు.
భౌతికశాస్త్రం సుధీర్ కుమార్ వెంపటి, అనంత రామకృష్ణ
జీవశాస్త్రం రిషికేష్ నారాయణ, సువేంద్రనాథ్ భట్టాచార్య
రసాయనశాస్త్రం పార్థసారధి ముఖర్జీ
భూమి, వాతావరణం, సునీల్ కుమార్ సింగ్
అంతరిక్ష శాస్త్రం
ఇంజినీరింగ్ సైన్స్ అవినాష్ కుమార్, వెంకట నారాయణ
గణితశాస్త్రం నవీన్ గార్గ్
వైద్యశాస్త్రం నియాజ్ అహ్మద్
లైఫ్ సైన్సెస్ నేషనల్ బొటానికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్,
అరోమాటిక్ ప్లాంట్స్ (సీఐఎంఏపీ, లక్నో)
Sunday, September 11, 2016
Saturday, August 27, 2016
ఫిడేల్ క్యాస్ట్రో 90వ జన్మదిన వేడుకలు
క్యూబా పోరాట యోధుడు, మాజీ అధ్యక్షుడు ఫిడేల్ క్యాస్ట్రో 90వ పుట్టిన రోజును 2016 ఆగస్టు 13న ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్యూబావాసి జోస్ క్యాసెలార్ 90 మీటర్ల (80 కేజీు) అతిపెద్ద చుట్టను తయారుచేసి క్యాస్ట్రోపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన, పెద్ద సిగార్‌గా ఇది గిన్నిస్ రికార్డుకెక్కింది. ఫిడేల్ క్యాస్ట్రో 1926 ఆగస్టు 13న జన్మించాడు.
Friday, August 26, 2016
Monday, August 22, 2016
2016 ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమ ఎన్నవ వార్షికోత్సవం ?
క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా 2016 ఆగస్టు 8న మధ్యప్రదేశ్‌లోని భాభ్రా వద్ద తిరంగా యాత్రను ప్రధాని నరేంద్రమోడి ప్రారంభించారు. క్విట్ ఇండియా ఉద్యమం 74వ వార్షికోత్సవం సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ జన్మస్థలం మధ్యప్రదేశ్ అలీరాజ్‌పూర్ జిల్లాలోని భాభ్రా గ్రామాన్ని నరేంద్రమోడి సందర్శించి ఆయన విగ్రహానికి నివాళులర్పించారు.మహారాష్ట్ర ప్రభుత్వం రెండో దశ క్విట్ ఇండియా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. పలు సామాజిక సమస్యలపై పోరాటానికి, సుపరిపాలన లక్ష్యంతో క్విట్ ఇండియా ఉద్యమ ప్లాటినం జూబ్లీ వేడుకల సంస్మరణగా ఈ నిర్ణయం తీసుకుంది. 1942 ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది.
Thursday, August 18, 2016
కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం చేపట్టిన సైనిక చర్య పేరు..?
2016 జులై 26న దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్‌ను ఘనంగా నిర్వహించారు. 1999 మే-జులైలో భారత్-పాక్ మధ్య కార్గిల్ యుద్ధం చోటు చేసుకుంది. కార్గిల్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద భారత్‌కు సంబంధించిన కీలక ప్రదేశాలను పాక్ సైనికులు ముజాహిదీన్ ముసుగులో దురాక్రమణకు పాల్పడ్డా రు. వారిని తరిమి కొట్టడానికి భారత
సైన్యం ఆపరేషన్ విజయ్ పేరిట సైనికచర్యను చేపట్టింది. అధికారికంగా ఈ యుద్ధం 1999 జులై 26న ముగిసింది. ఈ పోరులో 500 మందికి పైగా భారత సైనికులు వీర మరణం పొందారు.
ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం ఎప్పుడు..?
ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం, నైపుణ్య భారత్ తొలి వార్షికోత్సవాన్ని 2016 జులై 15న ఘనంగా నిర్వహించారు. ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం సందర్భంగా ఢల్లీిలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ భారత నైపుణ్యా పోటీ తొలి విడతను ప్రారంభించారు. నైపుణ్యాభివృధ్ధి మంత్రిత్వశాఖ రూపొందించిన 4 ప్రధాన కార్యక్రమాలు ప్రధానమంత్రి
కౌశల్ వికాస్ యోజన 2.0, భారత అంతర్జాతీయ నైపుణ్య కేంద్రాలు, ఇండియా స్కిల్స్ ఆన్‌లైన్, కార్మిక నిర్వహణ సమాచార వ్యవస్థను రాష్ట్రపతి ప్రారంభించారు. 2016 చివరి నాటికి మొత్తం 50 భారత అంతర్జాతీయ నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. తొలి దశ కింద 15 కేంద్రాను ప్రారంభించారు.
Tuesday, August 16, 2016
రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ఏ తేదీ నాటికి 4 సం॥ పూర్తయ్యాయి..?
రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ 2016 జులై 25 నాటికి 4 సం॥లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటుచేసిన పురావస్తు ప్రదర్శనశాల రెండో విభాగాన్ని రాష్ట్రపతి సమక్షంలో ప్రధాని మోడి ప్రారంభించారు. పర్యాటకుల కోసం ఉద్దేశించిన రాష్ట్రపతి భవన్ సంక్షిప్త రూప వెబ్‌సైట్‌ను ప్రణబ్ ప్రారంభించారు.
Subscribe to:
Posts (Atom)















