Wednesday, August 31, 2016

ఈ రోజు (1-9-2016) నవ తెలంగాణ పేపర్ లో పబ్లిష్ అయిన నా ఆర్టికల్

ఈ రోజు (1-9-2016) నవ తెలంగాణ పేపర్ లో పబ్లిష్ అయిన నా ఆర్టికల్ - సక్సెస్స్ సీక్రెట్, యన్.సంతోష్ కుమారా చారి

Contact us

N.Santhoshkumarachary
News Papers Columnist
Ex-Associate Editor, SHINE INDIA
Writer
Competetive Exams Faculty
E-mail : nskchary81@gmail.com

About

N.Santhoshkumarachary
News Papers Columnist
Ex-Associate Editor, SHINE INDIA
Writer
Competetive Exams Faculty
E-mail : nskchary81@gmail.com


Tuesday, August 30, 2016

ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీ ఎవరు?


ఆంధ్రప్రదేశ్‌ కొత్త డీజీపీగా నండూరి సాంబశివరావు నియమితులయ్యారు.  ప్రస్తుత డీజీపీ జేవీ రాముడు 2016 జులై 23న పదవీ విరమణ చేయడంతో సాంబశివరావుకు డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

Thank u Friends..Follow Success Secret-Reach Your Target


Thank u Friends..Follow Success Secret-Reach Your Target

Monday, August 29, 2016

భూమిని చుట్టివచ్చిన తొలి సౌరశక్తి విమానం పేరు ఏమిటి?


భూమిని చుట్టివచ్చిన తొలి సౌరశక్తి విమానంగా సోలార్‌ ఇంపల్స్‌-2 రికార్డు సృష్టించింది. పునరుత్పాదక ఇంధనానికి ప్రాచుర్యం కల్పించడమే లక్ష్యంగా దీని యాత్ర పూర్తయింది. 2015 మార్చి 9న అబుదాబి విమానాశ్రయం నుంచి దీని ప్రపంచ యాత్ర మొదలైంది. చివరిసారిగా ఈజిప్టు రాజధాని కైరో నుంచి ఇది గమ్యానికి చేరింది. దీంతో 4 ఖండాలు, 2 మహా సముద్రాలు, 3 సముద్రాలను దాటుకుంటూ చేపట్టిన 42,000 కి.మీ ప్రయాణం పూర్తయింది. కారు కంటే తక్కువ బరువుండే సోలార్‌ ఇంపల్స్‌లో4 ఇంజన్‌లు ఉన్నాయి. రెక్కల్లో ఏర్పాటుచేసిన దాదాపు 17,000 సౌరఘటాలు వీటికి కావల్సిన సౌరశక్తిని అందిస్తున్నాయి. గంటకు 80 కి.మీ. వేగంతో ఇది ప్రయాణిస్తుంది. 2015 మార్చి 10న ఒమన్‌లోని మస్కట్‌ నుంచి ఈ విమానం అహ్మదాబాద్‌కు, మార్చి 18న అహ్మదాబాద్‌ నుంచి వారణాసికి చేరుకుంది. మార్చి 19న వారణాసి నుంచి మయన్మార్‌లోని మాండలేకు చేరింది. స్విట్జర్లాండ్‌ వాసి బెర్ట్‌ర్యాండ్‌ పికార్డ్‌ సోలార్‌ ఇంపల్స్‌-2ను నడిపారు.

రియోలో భారత్‌కు తొలి పతకం అందించిన సాక్షి మాలిక్‌

రియో ఒలింపిక్స్‌లో భారత్‌ ఖాతా తెరిచింది. రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ మహిళ ఫ్రీస్టైల్‌ 58 కేజీ విభాగంలో కాంస్య పతకం సాధించింది. క్వార్టర్‌ఫైనల్లో ఓడిపోయినప్పటికీ, తనపై గెలిచిన ప్రత్యర్థి ఫైనల్‌ చేరడంతో సాక్షి రెపిచేజ్‌ రౌండ్‌కు అర్హత సాధించింది. రెపిచేజ్‌ రౌండ్‌లో సాక్షి మాలిక్‌ పురెవ్‌డోర్జిన్‌ ఓర్కాన్‌(మంగోలియా)పై గెలిచింది. పతకం కోసం జరిగిన పోరులో టినిబెకోవా ఐసు (కిర్గిజ్‌స్థాన్‌)ను ఓడించి కాంస్య పతకం సాధించింది. దీంతో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో భారత్‌ తరఫున పతకం సాధించిన తొలి మహిళగా సాక్షి రికార్డు నమోదు చేసింది.

విశ్వం పుట్టుకపై మరో సిద్ధాంతం ‘బిగ్‌బౌన్స్‌’


విశ్వం పుట్టుకపై మరో సిద్ధాంతాన్ని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. వినాశన స్థితిలోని పాత విశ్వం నుంచే తిరిగి పుంజుకునే బిగ్‌బౌన్స్‌ ప్రక్రియ ద్వారా మనుగడలోకి వచ్చినట్లు చెబుతున్నారు. తాజా అధ్యయనం ప్రకారం మన విశ్వం ఆవిర్భావం బిగ్‌బౌన్స్‌ సిద్ధాంతంపై ఆధారపడిందని వివరిస్తున్నారు. మామూలుగా అత్యున్నత సాంద్రత స్థాయికి చేరిన, ఉష్ణ పదార్థం దశ నుంచి పేలడం ద్వారా మన విశ్వం ఏర్పడిందని బిగ్‌బ్యాంగ్‌ సిద్ధాంతం చెబుతోంది. దీనిపై భౌతిక శాస్త్రవేత్తల్లో భిన్న వాదనలున్నాయి. విశ్వం వ్యాకోచం, సంకోచం దశ మధ్య సాగుతోందనీ, ప్రస్తుతం వ్యాకోచదశలో ఉందనేది కొంతమంది శాస్త్రవేత్తల భావన. బిగ్‌బౌన్స్‌గా వ్యవహరిస్తున్న ఈ సిద్ధాంతం 1922 నుంచి ఉన్నా వెలుగులోకి రాలేదు. 

ఇటీవల మరణించిన ఎస్.హెచ్.రజా ఏ రంగంలో ప్రసిద్ధుడు?


భారతీయ కళా విధానాలు, ప్రతిమా(నిర్మాణ) శాస్త్రాలను జగత్ప్రసిద్ధి చేసిన ప్రఖ్యాత చిత్రకారుడు ఎస్‌.హెచ్‌.రజా (94) ఢిల్లీలో 2016 జులై 23న మరణించాడు. మధ్యప్రదేశ్‌లోని బరియాలో 1922లో జన్మించిన రజా 12వ ఏట నుంచే చిత్రలేఖనం ప్రారంభించారు. ఫ్రాన్స్‌ ఆహ్వానం మేరకు 1950లో పారిస్‌ వెళ్లిన రజా అక్కడి యువతిని పెళ్లిచేసుకున్నారు. ఆమె 2002లో క్యాన్సర్‌తో చనిపోయింది.

భారత హాకీ దిగ్గజం మహ్మద్‌ షాహిద్‌ మృతి


భారత హాకీ దిగ్గజం మహ్మద్‌ షాహిద్‌(56) అనారోగ్యంతో 2016 జులై 20న ఢిల్లీలో మరణించాడు. 3 ఒలింపిక్స్‌లో పాల్గొన్న షాహిద్‌ 1980 మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన భారత జట్టులో సభ్యుడు. 1985-86 లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. 3 ఒలింపిక్స్‌లో ఆడిన షాహిద్‌ను భారత ప్రభుత్వం అర్జున, పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 

బంగాళాఖాతంలో సహజ వాయువు నిల్వలు


బంగాళాఖాతంలో సహజ వాయువు నిల్వలు బయటపడ్డాయి. గ్యాస్‌హైడ్రేట్ల రూపంలో ఉన్న ఈ నిల్వల ను కృష్ణా-గోదావరి బేసిన్‌లో భారత్‌, అమెరికా సంయుక్త అన్వేషణ ద్వారా గుర్తించాయి. వీటి నుంచి సహజ వాయువులను ఉత్పత్తి చేయడం సాధ్యమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. సహజవాయువు ఉత్పత్తికి అనువైన గ్యాస్‌ హైడ్రేట్ల నిల్వ హిందూ మహాసముద్ర పరిధిలో వెలుగుచూడటం ఇదే ప్రథమం. మన దేశంలో గ్యాస్‌హైడ్రేట్లు అన్వేషణను ప్రభుత్వరంగ సంస్థ ఓఎన్‌జీసీ నేతృత్వంలో అమెరికా భూ విజ్ఞాన సర్వే (యూఎస్‌జీఎస్‌), ది జపనీస్‌ డ్రిల్లింగ్‌ కంపెనీ, జపాన్‌ ఏజెన్సీ ఫర్‌ మెరైన్‌ ఎర్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సంస్థలకు చెందిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం 2014 సెప్టెంబరులో ప్రారంభించింది. సముద్ర తవ్వకం, సంప్రదాయ అవక్షేప కోరింగ్‌, పీడన కోరిగ్‌ లాంటి చర్యల ద్వారా హిందూ మహాసముద్ర పరిధిలో (బంగాళాఖాతం కూడా ఈ పరిధిలోకే వస్తుంది) అన్వేషణనలు వారు కొనసాగించారు. బంగాళాఖాతంలో కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌లో గరుకు ఇసుకను నిక్షిప్తం చేసుకునే భూ పొరల్లో గ్యాస్‌ హైడ్రేట్ల నిల్వను భారీగా గుర్తించినట్లు యూఎన్‌జీసీ ప్రకటించింది. సహజ వాయువును విరివిగా అందించే వనరులుగా గ్యాస్‌హైడ్రేట్లకు పేరుంది. సహజ వాయువు, నీరు కలిసి మంచు రూపంలో కలిసి ఉండేవే ఈ హైడ్రేట్లు. ఇవి మహా సముద్రాల, ధృవ ప్రాంతాల్లో ప్రకృతి సిద్ధంగా ఆవిర్భవిస్తాయి. 

పెట్రాపోల్‌-బెనాపోల్‌ ఐసీపీ ఏయే దేశాల మధ్య ఏర్పాటు చేశారు?


భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య వాణిజ్యం కోసం పెట్రాపోల్‌-బెనాపోల్‌ నడుమ ఏర్పాటైన ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ (ఐసీపీ)ని ప్రధాని నరేంద్రమోడి, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా ప్రారంభించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యంలో సగానికి సగం పెట్రాపోల్‌-బెనాపోల్‌ ద్వారానే అవుతుందని అంచనా. భద్రతతో పాటు కస్టమ్స్‌, ఇమ్మిగ్రేషన్‌ లాంటివన్నీ ఒకేచోట సమర్థంగా పూర్తయ్యేలా దీన్ని తీర్చిదిద్దారు. సరకుతోపాటు ప్రజలు సరిహద్దులు దాటి రాకపోకలు చేయడాన్ని సులభతరం చేసే సదుపాయాలు దీనిలో ఉంటాయి. ఈ సరిహద్దు కేంద్రం ద్వారా ఏటా 15 లక్షల మంది ప్రజలతోపాటు 1,50,000 ట్రక్కుల రాకపోకలు చేసే అవకాశం ఉంది.

ICP -  Integrated Check Post 

ఆఫ్రికాలోనే పొడవైన వంతెనగా రబాత్‌


మొరాకో రాజధాని రబాత్‌ సమీపంలో ఇటీవలే నిర్మాణం పూర్తిచేసుకున్న వంతెన ఆఫ్రికాలోనే పొడవైనదిగా రికార్డుకెక్కింది. తీగ ఆధారంగా ఈ వంతెనను నిర్మించారు. 

ఏ దేశ జాతీయ దినోత్సవాన్ని బ్యాస్టిల్ డే అంటారు?


ఫ్రాన్స్‌లోని నీస్‌ నగరంలో సముద్రతీర విహార కేంద్రం వద్ద 2016 జులై 14న నిర్వహించిన జాతీయ దినోత్సవ వేడుకల్లో  ఓ ఉగ్రవాది భారీ లారీతో దాడి చేసిన ఘటనలో 84 మంది దుర్మరణం పాలయ్యారు. ట్యునీషియాలో జన్మించిన ఫ్రాన్స్‌వాసి మొహమ్మద్‌ లాహౌయె బౌహ్లెల్‌ (31) ఈ ఘటనకు పాల్పడినట్లుగా తేల్చారు. జనంపైకి లారీని తోలడంతోపాటు బౌహ్లెల్‌  కాల్పులకూ తెగబడటంతో పోలీసు అధికారులు అతన్ని కాల్చి చంపారు. నవంబరులో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదుల దాడి అనంతరం అత్యవసర పరిస్థితిని ప్రకటించి సైన్యాన్ని, రిజర్వు బలగాల్ని మోహరించగా, జులైతో అత్యవసర పరిస్థితిని ఎత్తేయనున్నట్లు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దాడి జరిగింది. దీంతో అత్యవసర పరిస్థితిని మరో 3 నెలలు పొడిగించనున్నట్లు ప్రకటించారు.  ఫ్రాన్స్‌ జాతీయ దినోత్సవం(జులై 14)ను బ్యాస్టిల్‌ డే అంటారు.


కాబూల్ లో ఇటీవల కిడ్నాప్ కు గురైన భారతీయ మహిళ ఎవరు?


అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో అపహరణకు గురైన భారతీయ మహిళ జుడిత్‌ డిసౌజా(40) అపహరణ నుంచి బయటపడి భారత్‌ చేరుకున్నారు. కాబూల్‌లోని ఆగాఖాన్‌ ఫౌండేషన్‌లో సీనియర్‌ సాంకేతిక సలహాదారుగా పనిచేస్తున్న జుడిత్‌ను 2016 జూన్‌ 9న ఆమె కార్యాలయం బయట ఉగ్రవాదులుగా భావిస్తున్న అగంతకులు మరో ఇద్దరితోపాటు అపహరించారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియలేదు.

మిస్టర్ వరల్డ్ కిరీటాన్ని సాధించిన తొలి భారతీయుడు ఎవరు?


మిస్టర్‌ వరల్డ్‌-2016 కిరీటాన్ని భారత్‌కు చెందిన రోహిత్‌ ఖండేల్వాల్‌గెల్చుకున్నాడు. ఈ కిరీటం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. రోహిత్‌ స్వస్థలం హైదరాబాద్‌. రోహిత్‌ మిస్టర్‌ వరల్డ్‌ మల్టీమీడియా అవార్డును చేజిక్కించుకున్నాడు. బ్రిటన్‌లోని సౌత్‌ పోర్ట్‌ థియేటర్‌లో తుది పోటీ జరిగింది.     విజేతగా నిలిచిన రోహిత్‌ 50,000 డాలర్లు (రూ.33.62 లక్షలు) ప్రైజ్‌మనీ గెల్చుకున్నాడు. ప్యూర్టోరికోలకు చెందిన ఫెర్నాండో అల్వారేజ్‌(21), మెక్సికోవాసి ఆల్డో ఎస్పార్జా(26) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించుకున్నారు. రోహిత్‌ మిస్టర్‌ ఇండియా-2015 పోటీల్లో విజేతగా నిలిచి మిస్టర్‌ వరల్డ్‌-2016 పోటీలకు వెళ్లి అక్కడా సత్తా చాటాడు. 1996లో మొదలైన మిస్టర్‌ వరల్డ్‌ పోటీలను ప్రతి 2 సం॥కు ఒకసారి నిర్వహిస్తున్నారు.


1         రోహిత్‌ ఖండేల్వాల్‌              భారత్‌
2         ఫెర్నాండో అల్వారేజ్‌           ప్యూర్టోరికో
3         ఆల్డో ఎస్పార్జా                       మెక్సికో

నెటిజన్లు ఎక్కువగా వెతికిన భారతీయ నటుడు సల్మాన్‌ఖాన్‌


పదేళ్లకాలంలో నెటిజన్లు ఎక్కువగా వెతికిన భారతీయ నటుడిగా సల్మాన్‌ఖాన్‌ వార్తల్లో నిలిచారు. గూగుల్‌ వెల్లడించిన వివరాల ప్రకారం సల్మాన్‌ఖాన్‌ తర్వాత స్థానాల్లో షారుక్‌ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌, అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌ నిలిచారు. నటీమణుల విషయంలో సన్నీలియోన్‌ అగ్రస్థానంలో నిలిచింది. కత్రినాకైఫ్‌, కరీనాకపూర్‌, కాజల్‌ అగర్వాల్‌, దీపికా పదుకొణె తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

నెటిజన్లు ఎక్కువగా వెతికిన కథానాయకులు

1         సల్మాన్‌ఖాన్‌
2         షారుక్‌ఖాన్‌
3         అక్షయ్‌ కుమార్‌
4         అమితాబ్‌ బచ్చన్‌
5         రజనీకాంత్‌

నెటిజన్లు ఎక్కువగా వెతికిన కథానాయికలు

1         సన్నీలియోన్‌ 
2        కత్రినాకైఫ్‌
3         కరీనాకపూర్‌
4        కాజల్‌ అగర్వాల్‌
5         దీపికా పదుకొణె

నెటిజన్లు ఎక్కువగా వెతికిన క్లాసిక్‌ కథానాయకులు

1          అమితాబ్‌ 
2          కమల్‌హాసన్‌
3          రాజేష్‌ఖన్నా
4          రాజ్‌కుమార్‌
5          మిథున్‌చక్రవర్తి

నెటిజన్లు ఎక్కువగా వెతికిన క్లాసిక్‌ కథానాయికలు

1         రేఖ
2        శ్రీదేవి
3        మధుబాల
4        హేమమాలిని
5        జీనత్‌ అమన్‌

నెటిజన్లు ఎక్కువగా వెతికిన చిత్రాలు

1        పీకే
2        కహానీ
3        బాహుబలి
4        ఆషికీ 2
5        ధూమ్‌ 3 

DRDL డైరెక్టర్‌గా ఎం.ఎస్‌.ఆర్‌.ప్రసాద్‌


రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థకు చెందిన హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన అభివృద్ధి ప్రయోగశాల (DRDL) డైరెక్టర్‌గా శాస్త్రవేత్త ఎం.ఎస్‌.ఆర్‌.ప్రసాద్‌ నియమితుయ్యారు. క్షిపణుల రూపకల్పనలో  కీలకమైన ఈ ప్రయోగశాలకు మొదటిసారిగా తెలుగు వ్యక్తి డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

DRDL - Defence Research & Development Laboratory




DRDO - Defence Research and Development Organisation



ఉగ్రవాదులపై నిఘాకు జెఫైర్‌-ఎస్‌


ఉగ్రవాదులపై నిఘా పెట్టేందుకు పరిశోధకులు సూడో శాటిలైట్‌గా వ్యవహరించే ప్రత్యేక మానవ రహిత డ్రోన్‌ విమానం జెఫైర్‌-ఎస్‌ను రూపొందించారు. ఇది 45 రోజులపాటు గగనతలంలోనే ఉండి 70 వేల అడుగుల ఎత్తు నుంచి నిఘా పెట్టగలదు. ఈ డ్రోన్‌ పగటి వేళ సౌరశక్తి ద్వారా తనలోని లిథియం సల్ఫర్‌ బ్యాటరీలను రీఛార్జి చేసుకుని, రాత్రి వేళల్లో విద్యుత్‌ను వాడుకుంటుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని అధిగమించేందుకు సాధారణ విమానాల కంటే రెండు రెట్లపైన ఎగురుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులపై నిఘా పెట్టేందుకు బ్రిటన్‌ సైన్యానికి చెందిన ప్రత్యేక దళాలు దీన్ని ఉపయోగించుకుంటున్నాయి. 

Sunday, August 28, 2016

తెలంగాణలో ప్రధాని మోడి పర్యటన


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధాని నరేంద్రమోడి 2016 ఆగస్టు 7న తొలిసారిగా రాష్ట్రంలో పర్యటించారు. తెలంగాణలో ఇంటింటికీ మంచినీరివ్వాల న్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం మిషన్‌ భగీరథను మెదక్‌ జిల్లా గజ్వేల్‌లోని కోమటిబండ వద్ద ప్రధాని ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీపీసీ థర్మల్‌ విద్యుత్తు, రామగుండం ఎరువుల  కర్మాగారం, కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీకి శంకుస్థాపనతోపాటు, ఆదిలాబాద్‌ జిల్లా జైపూర్‌లో నిర్మించిన సింగరేణి థర్మల్‌ విద్యుత్తు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. హైదరబాద్‌ ఎల్బీ స్టేడియంలో మోడితో మనం...మహా సమ్మేళనం పేరుతో బీజేపీ  తెలంగాణ రాష్ట్రశాఖ ఏర్పాటుచేసిన కార్యకర్త సమావేశంలో ప్రధాని మోడి పాల్గొన్నారు. 

భారత్‌లో రెట్టింపవుతున్న ఇంటర్నెట్‌ వినియోగదారులు


ది ఫ్యూచర్‌ ఆఫ్‌ ఇంటర్నెట్‌ ఇన్‌ ఇండియా పేరిట నాస్‌కామ్‌, అకమాయ్‌ టెక్నాలజీస్‌ తయారు చేసిన నివేదిక ప్రకారం గ్రామీణ భారతం క్రమ క్రమంగా వెబ్‌ విహారం చేస్తున్న నేపథ్యంలో 2020 కల్లా ఇంటర్నెట్‌ వినియోగదారులు  రెట్టింపు కంటే అధికమై 73 కోట్లలకు చేరతారు. దేశంలో 2015 చివరి నాటికి ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య 35 కోట్లలకు చేరింది. చైనా తర్వాత అత్యధిక సంఖ్యలో భారత్‌లోనే ఇంటర్నెట్‌ వినియోగదారులు ఉన్నారు. అయితే భారత్‌ అత్యధిక వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌గా కొనసాగుతోంది. ఇప్పటికే ఇంటర్నెట్‌ వినియోగంలో అమెరికాను భారత్‌ అధిగమించింది

అనంత పద్మనాభ ఆలయ ఖజానాపై వినోద్‌రాయ్‌ నివేదిక



కేరళలోని అనంత పద్మనాభ ఆలయ ఖజానా నుంచి 769 బంగారు కుండలు మాయమైనట్లు సుప్రీంకోర్టుకు మాజీ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ వినోద్‌రాయ్‌ నివేదిక సమర్పించారు. ఈ మొత్తం బంగారం విలువ రూ.186 కోట్లని, దాన్ని దొంగిలించి ఉండొచ్చని నివేదికలో వెల్లడించారు. 35 కిలోల బరువైన రూ.14 లక్షల విలువైన వెండి కడ్డీ కూడా మాయమైందని, 1970లో అమ్మిన 2.11 ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులు లేవని కూడా నివేదికలో వెల్లడించారు.


మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ప్రథమ స్థానంలో ఉన్న నగరం?


మధుమేహ వ్యాధి తీవ్రతకు సంబంధించి అసోచామ్‌ దేశంలోని డిల్లీ, ముంబయి, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌ తదితర నగరాల్లో నిర్వహించిన అధ్యయనం వివరాలను వెల్లడించింది. డిల్లీలో 42.5% మంది మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు. ముంబయి (38.5%), అహ్మదాబాద్‌ (36%) నగరాలు తర్వాతి స్థానాల్లో ఉండగా హైదరాబాద్‌ జనాభాలో 22.6% మంది మధుమేహంతో బాధపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మధుమేహం సంఖ్య పెరుగుతోందని అసోచామ్‌ సర్వేలో వెల్లడైంది. జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పు రాకపోతే 2035 కల్లా 12.5 కోట్ల మంది భారతీయులు మధుమేహం బారినపడే ముప్పుందని వెల్లడించింది.

26 వారాలు ప్రసూతి సెలవు


సంఘటిత రంగంలోని మహిళా ఉద్యోగులకు ఇచ్చే వేతనంతో కూడిన ప్రసూతి సెలవును 12 వారాల నుంచి 26 వారాలకు పెంచారు. ఈ మేరకు ప్రసూతి సౌకర్యాల సవరణ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం లభించింది. కేబినెట్‌ 2016 ఆగస్టు 10న బిల్లుకు తదనంతర ఆమోదం తెలిపింది. దీంతో కనీసం 10 మంది ఉద్యోగులున్న ప్రతి కంపెనీలో మహిళా ఉద్యోగులకు 26 వారాలు ప్రసూతి సెలవు లభించనున్నాయి. జీవించి ఉన్న ఇద్దరు పిల్లల వరకు 26 వారాలు ప్రసూతి సెలవు వర్తిస్తుంది. ఆ తర్వాత నుంచి 12 వారాలు వర్తిస్తుంది. అద్దె గర్భం(సరోగసీ) ద్వారా తల్లి హోదాను పొందిన మహిళలకు,పిల్లలను దత్తత తీసుకున్న తల్లులకూ 12 వారాలు ప్రసూతి సెలవును వర్తింపజేయనున్నారు. 50 మందికి మించి ఉద్యోగులు ఉన్న ప్రతి సంస్థలో శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
ప్రసూతి సెలవులు  ఎక్కువగా ఇస్తున్న దేశాలు
1. కెనడా 50 వారాలు
2. నార్వే 44 వారాలు
3. భారత్‌ 26 వారాలు

ఈ రోజు ఈనాడు పేపర్(చదువు)లో నా పుస్తక సమీక్ష - సక్సెస్ సీక్రెట్, యన్.సంతోష్ కుమారా చారి


పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంటే ఇదేనేమో..!

హవ్వ..కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకంటే ఇదేనేమో..!

ఎంటర్ టైన్ మెంట్

ఎంటర్ టైన్ మెంట్ 

Imagine Yours Childhood Days (గుర్తుకుస్తున్నాయి..గుర్తుకుస్తున్నాయీ..!)

Saturday, August 27, 2016

దహీ హండీపై సుప్రీం ఆదేశాలు


శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మహారాష్ట్రలో సంప్రదాయంగా నిర్వహించే దహీ హండీ(ఉట్టి కొట్టే కార్యక్రమం) పై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్సవంలో 18 ఏళ్లు దాటిన వాళ్లు మాత్రమే పాల్గొనాలని, పిరమిడ్‌ ఎత్తు 20 అడుగులకు మించరాదని ఆదేశించింది.

తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా భాషకు ప్రాచీన హోదాపై దాఖలైన పిటిషన్‌ కొట్టివేత

తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా భాషలకు ప్రాచీన హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు కొట్టివేసింది. భాషకు ప్రాచీన హోదా కల్పించే విషయంలో తాము జోక్యం చేసుకోలేమని ప్రకటించింది. మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌తో కూడిన ప్రథమ ధర్మాసనం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.

ఇస్లామాబాద్‌లో సార్క్‌ కూటమి హోం మంత్రుల సమావేశం


7వ సార్క్‌ కూటమి హోం మంత్రుల సమావేశాన్ని 2016 ఆగస్టు 4న ఇస్లామాబాద్‌లో నిర్వహించారు. భారత హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ సమావేశంలో ప్రసంగించారు. ఉగ్రవాదును ప్రోత్సహించడం, వారిని కీర్తించడం మానుకోవాలని పాక్‌కు సింగ్‌ సూచించారు. రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ సమావేశంలో హిందీలో ప్రసంగించారు. పాక్‌ హోమంత్రి చౌధురి నిసార్‌ అలీఖాన్‌ తన ప్రసంగంలో కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు. ‘కశ్మీర్‌లో అమాయక ప్రజలపై జరుగుతున్న హింస బహిరంగ ఉగ్రవాదమే’ అని ఆయన వ్యాఖ్యానించారు.

మిస్‌ ఆసియా`2016గా త్రిక్సియా మారి


కొచ్చిలో నిర్వహించిన మిస్‌ ఆసియా-2016 పోటీలో ఫిలిప్పీన్స్‌ యువతి త్రిక్సియా మారి విజేతగా నిలిచింది.బెనారస్‌ యువతి యుగేనియా వసీయవా 2వ స్థానంలో, భారత సుందరి అంకితా కరాట్‌ 3వ స్థానంలో నిలిచారు. 

మదర్‌థెరిసాకు సెయింట్‌ హోదాకు కరేన్‌ వాస్వాని లోగో


సంఘ సేవకురాలు, నోబెల్‌ గ్రహీత మదర్‌థెరిసాకు సెయింట్‌ హోదా ఇచ్చేందుకు వాటికన్‌లో నిర్వహించనున్న కార్యక్రమానికి అధికార చిహ్నంగా ముంబయి డిజైనర్‌ కరేన్‌ వాస్వాని రూపొందించిన లోగో ఎంపికైంది. బోసి నవ్వుల చిన్నారిని ప్రేమతో చేతుల్లోకి తీసుకున్న మదర్‌ బొమ్మతో లోగోను తీర్చిదిద్దారు. 2016 సెప్టెంబరు 4న జరిగే ఈ కార్యక్రమానికి పోప్‌ ఫ్రాన్సిస్‌ థెరిసాకు సెయింట్‌ (మత గురువు) హోదా ఇవ్వనున్నారు.

ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌గా ఈఎస్‌ఆర్‌ మూర్తి

ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌గా తెలుగు వ్యక్తి ఈఎస్‌ఆర్‌ మూర్తి బాధ్యతలు స్వీకరించారు. మూర్తి ఆంధ్రా విశ్వవిద్యాయంలో ఎంఎస్‌సీ విద్యాభ్యాసం చేసి గోల్డ్‌మెడల్‌ సాధించారు. 

కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన ఆసియాలో కెల్లా అతిచిన్న వయస్కురాలు నర్సమ్మ


మెదక్‌ జిల్లా కొల్చారం మండలం రంగంపేటకు చెందిన విద్యార్థిని దామని నర్సమ్మ (11) ఆఫ్రికా ఖండంలోనే ఎత్తయిన పర్వతాన్ని 160 మందితో అధిరోహించి ఆసియాలోనే ఈ ఘనత సాధించిన అతి చిన్న వయస్కురాలిగా రికార్డు నమోదు చేసింది. మెదక్‌ జిల్లాలోని కేజీబీవీల్లో చదువుతున్న 9 మంది విద్యార్థినులతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ సంక్షేమ వసతి గృహాలకు చెందిన 12 మంది బృందం 2016 ఆగస్టు 8న టాంజానియాలోని కిలిమంజారో పర్వతారోహణకు బయలుదేరి వెళ్లి, ఆగస్టు 14న ఈ పర్వతాన్ని అధిరోహించారు. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అక్కడే భారత పతాకాన్ని ఎగరేశారు. ఆ బృందంలో నర్సమ్మ కూడా ఉంది. ఈ బృందంలో అతి చిన్న వయస్కురాలుగా నర్సమ్మ మరో రికార్డు దక్కించుకుంది. కిలిమంజారో పర్వతాన్ని 2006లో 10 ఏళ్ల 11 రోజుల వయసులో కాలిఫోర్నియాకు చెందిన బాలిక జోర్డాన్‌ రొమెరో అధిరోహించింది. ప్రపంచంలోనే అతి చిన్న వయసులో ఆ పర్వతాన్ని అధిరోహించిన రికార్డు సొంతం చేసుకుంది. 2014 అక్టోబరు 2న  హైదరాబాద్‌కు చెందిన జాహ్నవి 12 ఏళ్ల 11 నెల ల వయసులో ఈ పర్వతాన్ని అధిరోహించి ఆసియాలోనే అతి చిన్న వయస్కురాలిగా రికార్డు సొంతం చేసుకొంది. 2004 ఆగస్టు 22న జన్మించిన నర్సమ్మ 11 ఏళ్ల 11 నెలల వయసులో ఈ రికార్డును తిరగరాసింది.

యూఎన్‌ఓ సర్వప్రతినిధి సభలో ఏఆర్‌ రెహమాన్‌ సంగీత విభావరి


భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యూయార్క్‌లోని యూఎన్‌ఓ సర్వప్రతినిధి సభలో ఆస్కార్‌ విజేత, సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ తన బృందంతో సంగీత విభావరి నిర్వహించారు. విశ్వవిఖ్యాత కర్ణాటక సంగీత విదుషీమణి దివంగత ఎంఎస్‌ సుబ్బలక్ష్మి నాడు ఆలపించిన రాగాలను ఏఆర్‌ రెహమాన్‌ ఆలపించారు. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభా ప్రాంగణంలో కచేరి నిర్వహించిన తొలి భారత సంగీత ద్రష్టగా చరిత్రలో నిలిచిపోయిన ఎం.ఎస్‌.సుబ్బలక్ష్మి శత జయంతి సంవత్సరం ఇది. ఆమె ఆ వేదికపై కచేరి చేసిన వజ్రోత్సవం కూడా. 1996లో అప్పటి యూఎన్‌ఓ సెక్రటరీ జనరల్‌ యూథాంట్‌ ఆహ్వానం మేరకు ఎంఎస్‌ అక్కడ కచేరి నిర్వహించారు. ఎంఎస్‌ శత జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకొని యూఎన్‌ఓ జనరల్‌ అసెంబ్లీలో ఆమె జీవితంలోని వివిధ ఘట్టాలను ప్రతిబింబించే ఫొటో ప్రదర్శనలను ప్రారంభించారు. ఇన్ని ప్రత్యేకతల నేపథ్యంలో ఆమెకు ఘన నివాళిగా రెహమాన్‌ తన సంగీత విభావరి నిర్వహించారు. ఎంఎస్‌ తర్వాత యూఎన్‌ఓలో కచేరి చేసిన రెండో వ్యక్తిగా రెహమాన్‌ గౌరవాన్ని పొందారు

ఫిడేల్‌ క్యాస్ట్రో 90వ జన్మదిన వేడుకలు


క్యూబా పోరాట యోధుడు, మాజీ అధ్యక్షుడు ఫిడేల్‌ క్యాస్ట్రో 90వ పుట్టిన రోజును 2016 ఆగస్టు 13న ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్యూబావాసి జోస్‌ క్యాసెలార్‌ 90 మీటర్ల (80 కేజీు) అతిపెద్ద చుట్టను తయారుచేసి క్యాస్ట్రోపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన, పెద్ద సిగార్‌గా ఇది గిన్నిస్‌ రికార్డుకెక్కింది. ఫిడేల్‌ క్యాస్ట్రో 1926 ఆగస్టు 13న జన్మించాడు.

అరుణాచల్‌ప్రదేశ్‌ మాజీ సీఎం అనుమానాస్పద మృతి


అరుణాచల్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కలిఖోపుల్‌ 2016 ఆగస్టు 7న అనుమానాస్పద స్థితిలో ఇటానగర్‌లోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో మృతి చెందారు. కాంగ్రెస్‌ తిరుగుబాటు నేత అయిన పుల్‌ 2016  ఫిబ్రవరి 19 నుంచి జులై 13 వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని జులైలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆయన సీఎం పదవి నుంచి తప్పుకున్నారు.

నయీం హతం


హత్యలు, దోపిడీలు, బెదిరింపులు, భూదందాలతో కరడుగట్టిన నరహంతకుడు, సూడో నక్సలైట్‌  నయీం మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లో పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు. ఐపీఎస్‌ అధికారి వ్యాస్‌, మాజీ నక్సలైట్లు ఈదన్న, బెల్లి లలిత, పటోళ్ల గోవర్థన్‌రెడ్డి, పౌర హక్కుల సంఘం నేతలు పురుషోత్తం, అజీం అలీ తదితరులు హత్యల్లో నయీం నిందితుడుగా ఉన్నాడు.

ఐఓసీలో సభ్యత్వం పొందిన తొలి భారత మహిళ నీతా అంబానీ


రియన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం (ఐఓసీ) సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఐఓసీలో సభ్యత్వం పొందిన తొలి భారత మహిళగా 52 ఏళ్ల నీతా ఘనత సాధించారు. 70 ఏళ్ల వయసు వరకు ఆమె ఐఓసీ సభ్యురాలిగా ఉంటారు.

మైక్రోసాఫ్ట్‌ ఇండియా అధ్యక్షుడిగా అనంత్‌ మహేశ్వరి


మైక్రోసాఫ్ట్‌ ఇండియా అధ్యక్షుడిగా అనంత్‌ మహేశ్వరి నియమితులయ్యారు. అనంత్‌ మహేశ్వరి 2017 జనవరి 1న ప్రస్తుత అధ్యక్షుడు భాస్కర్‌ ప్రామాణిక్‌ నుంచి బాధ్యతలు చేపడతారు. దేశవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌ ఉత్పత్తులు, సేవలు, అనుబంధ సమర్పణలకు మహేశ్వరి ఆధ్వర్యం వహిస్తారు. 

సివిల్స్‌ పరీక్షల్లో గరిష్ట వయో పరిమితిని తగ్గించాలని సిఫార్సు


ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ తదితర సర్వీసుల్లో అధికారుల నియామకానికి నిర్వహించే సివిల్‌ సర్వీసు పరీక్షల్లో అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని తగ్గించాలని నిపుణుల సంఘం సిఫార్సు చేసింది. కేంద్ర విద్యాశాఖ మాజీ కార్యదర్శి బి.ఎస్‌.బస్వాన్‌ నేతృత్వంలోని ఈ సంఘం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌(యూపీఎస్‌సీ)కి నివేదిక సమర్పించింది. 1960ల్లో గరిష్ట వయోపరిమితి 26 సంవత్సరాలుగా ఉండేది. 1980ల్లో దాన్ని 28కి పెంచారు. ఇపుడు 32 ఏళ్లుగా ఉంది. రాజకీయంగా సున్నితమైన అంశం కావడం వల్లే వివిధ ప్రభుత్వాలు వయోపరిమితిని పెంచుకుంటూ వచ్చాయి.

ఎంసీఐ రద్దునకు నీతి ఆయోగ్‌ కమిటీ సిఫార్సు


దేశంలో వైద్య విద్యలను ఇప్పటివరకు నియంత్రిస్తూ వస్తున్న మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఐ)ని రద్దు చేయాలని నీతి ఆయోగ్‌ కమిటీ సిఫార్సు చేసింది. దాని స్థానంలో కొత్తగా నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని సూచించింది. ఎంసీఐ చట్టం-1956ను సమీక్షించి, అందులో చేపట్టాల్సిన సంస్కరణ గురించి సిఫార్సు చేయడానికి నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగరియా నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 2016 మార్చి 28న కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తాజాగా కేంద్ర ప్రభుత్వానికి మధ్యంతర నివేదికను సమర్పిచింది.

లోక్‌సభ మీడియా సలహా కమిటీ ఛైర్మన్‌గా డీపీ కామత్‌


 2016-17 సం॥నికి లోక్‌సభ మీడియా సలహా కమిటీని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ నియమించారు. మీడియాలో సుదీర్ఘ అనుభవం ఉన్న పాత్రికేయులు డీపీ కామత్‌ కమిటీకి ఛైర్మన్‌గా, యూఎన్‌ఐ (యునైటెడ్‌ న్యూస్‌ ఆఫ్‌ ఇండియా) వార్తాసంస్థలకు చెందిన నీరజ్‌ వాజ్‌పేయి వైస్‌  ఛైర్మన్‌గా నియమితుయ్యారు. కమిటీలో 29 మంది సభ్యులుంటారు.

విశ్వనాథ గోపాలకృష్ణకు రాష్ట్రపతి పురస్కారం


సంస్కృత భాషా వికాసానికి ఎనలేని కృషిచేసిన మహా మహోపాధ్యాయ శాస్త్రనిధి విశ్వనాథ గోపాలకృష్ణకు రాష్ట్రపతి పురస్కారం లభించింది. విశ్వనాథ గోపాలకృష్ణ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం. తిరుపతి సంస్కృత విద్యాపీఠం నుంచి గతంలో మహా మహోపాధ్యాయ బిరుదు అందుకున్నారు. 

ఏపీకి రూ.1176.50 కోట్ల కేంద్ర సాయం


విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు మరికొంత సాయం చేసింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఏర్పడిన రెవెన్యూ లోటు కింద తాజాగా రూ.1176.50 కోట్లు విడుదల చేసింది. రాయసీమ, ఉత్తరాంధ్రలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు రూ.50 కోట్లు చొప్పున రూ.350 కోట్లు ఇచ్చింది. రాజధాని నిర్మాణానికి రూ.450 కోట్లు కేటాయించింది. దీంతో 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.1976.50 కోట్లు ఇచ్చినట్లుయింది. విభజన చట్టంలోని సెక్షన్‌ 46(2) ప్రకారం 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు ఏర్పడ్డ రెవెన్యూ లోటును కేంద్రమే భర్తీ చేయాల్సి ఉంది. ఆడిట్‌ లెక్కల ప్రకారం ఆ ఏడాదికి రూ.16,079 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడగా కేంద్రం గత రెండేళ్లలో రూ.2803 కోట్లు ఇచ్చింది. తాజాగా విడుదల చేసిన రూ.1176.50 కోట్లతో ఇది రూ.3979.50 కోట్లకు చేరింది. విభజన చట్టంలోని సెక్షన్‌ 94(3) ప్రకారం నూతన రాజధాని అమరావతిలో నిర్మించే రాజభవన్‌ హైకోర్టు, సచివాయం, అసెంబ్లీ ఉభయ సభలతో పాటు అవసరమైన మౌలిక వసతులు నిర్మాణానికి కేంద్రం ఆర్థిక సాయం చేయాల్సి ఉంది. విభజన చట్టంలో చెప్పిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.8,379.50 కోట్లు ఇచ్చినట్లయ్యింది. 

మిషన్‌ భగీరథలో 7 బ్యాంకుల భాగస్వామ్యం


తెలంగాణ ప్రలజ దాహార్తిని తీర్చే మిషన్‌ భగీరథలో భాగమయ్యేందుకు ఆంధ్రాబ్యాంకు నేతృత్వంలో కన్సార్టియంగా ఏర్పడిన 7 బ్యాంకులు రూ.6750 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించడానికి అంగీకరించాయి.

గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు


చారిత్రక గోల్కొండ కోటలో తెంగాణ ప్రభుత్వం 2016 ఆగస్టు 15న 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఎగురవేసి ప్రసంగించారు. హరితహారంలో నిజామాబాద్‌ను ప్రథమ స్థానంలో నిలిపిన కలెక్టర్‌ యోగితా రాణాకు సీఎం కేసీఆర్‌ పతకాన్ని ప్రదానం చేశారు.