Showing posts with label భారత్ & ప్రపంచం. Show all posts
Showing posts with label భారత్ & ప్రపంచం. Show all posts

Friday, August 18, 2023

Mission Life : ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌లు మిషన్‌ లైఫ్‌ ను ఎప్పుడు ప్రారంభించారు?

 

Mission Life-successsecert

  • సుస్థిర జీవనాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌లు 2022లో ప్రారంభించిన మిషన్‌ లైఫ్‌ (పర్యావరణం కోసం జీవనశైలి)పై అమెరికాలోని ఐరాస ప్రధాన కార్యాలయంలో భారత్‌ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసింది. 2023 ఆగస్టు 16, 17 తేదీల్లో ఈ ప్రదర్శనను నిర్వహించారు. వివిధ దేశాల దౌత్యవేత్తలు, సమితి ప్రతినిధులు హాజరయ్యారు. 
  • ఈ సందర్భంగా ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ మాట్లాడుతూ.. మిషన్‌ లైఫ్‌ ప్రయాణానికి సంబంధించి మేం ఉమ్మడిగా ఓ స్ఫూర్తిమంతమైన ప్రయాణాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. ‘‘మిషన్‌ లైఫ్‌ అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు. ఇది ప్రతి ఒక్కరితో మొదలయ్యే సమష్టి నిబద్ధత. మన రోజువారి జీవితాల్లో చోటుచేసుకునే చిన్నచిన్న మార్పులతో పర్యావరణంపై చూపే అద్భుత మార్పును తేవడమే మిషన్‌ లైఫ్‌. పర్యావరణ అనుకూల విధానాలతో మనం రోజువారీ వ్యవహారాలను మార్చుకోవడమే కాదు.. మన భూగ్రహానికి సంబంధించి కొత్త విధిని రూపొందించడం’’ అని ఆమె వివరించారు.


When did Prime Minister Narendra Modi and UN Secretary General Antonio Guterres launch Mission Life?

  • India organized a special exhibition at the United Nations headquarters in the United States on Mission Life (Lifestyle for the Environment) launched in 2022 by Prime Minister Narendra Modi and UN Secretary General Antonio Guterres to promote sustainable living. This exhibition was held on August 16 and 17, 2023. Diplomats of various countries and representatives of the Samiti were present.
  • On this occasion, India's Permanent Representative to the United Nations Ruchira Kamboj said, "We have started an inspiring journey together with regard to the journey of mission life." Mission Life is not just a government program. It is a collective commitment that starts with everyone. Mission Life is to bring about a miraculous change in the environment with small changes that take place in our daily lives. "We are not only changing our day-to-day affairs with eco-friendly policies.. we are creating a new destiny for our planet," she explained.

Monday, August 7, 2023

Skull of Alum Bheg :166 ఏళ్ల తర్వాత మాతృభూమికి.. సిపాయిల తిరుగుబాటు వీరుడి పుర్రె

Skull of Alum Bheg

  • బ్రిటిష్‌ ఇండియా సైన్యంలో హవల్దారుగా పనిచేసిన భారత వీరుడు ఆలం బేగ్‌ పుర్రె 166 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత లండన్‌ నుంచి స్వదేశానికి చేరుకొంది. 
  • 1857 నాటి సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న ఆలం బేగ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌ వాసి. ఈయన 46వ బెంగాల్‌ రెజిమెంటులో పదాతిదళ సైనికుడిగా పనిచేసేవారు. 
  • ఆంగ్లేయుల ప్రభుత్వంపై తిరుగుబాటులో చురుగ్గా పాల్గొన్న కారణంగా ఆలం బేగ్‌ను దారుణంగా చంపి, పుర్రెను బ్రిటిష్‌ రాణికి కానుకగా లండన్‌కు పంపారు. ఇన్నాళ్లూ లండన్‌లోని ఓ పబ్‌ స్టోర్‌రూంలో పడున్న ఆలం బేగ్‌ పుర్రెను భారత్‌కు తీసుకురావడానికి చండీగఢ్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ జె.ఎస్‌.సహరావత్‌ నిరంతర ప్రయత్నాలు చేశారు. 
  • ప్రస్తుతం పంజాబ్‌ పోలీసులకు అప్పగించిన ఈ పుర్రెను దిల్లీలో ఉంటున్న ఆలం బేగ్‌ వారసులకు అందజేస్తారు. 
  • బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ జ్ఞానేశ్వర్‌ చౌబే సైతం పుర్రెను అధ్యయనం చేస్తారు. 2014 మార్చిలో పంజాబ్‌లోని అజ్‌నాలా బావిలో దొరికిన 200 పుర్రెలపై అధ్యయనం చేసిన అనుభవం ఈయనకు ఉంది.
  • 1963లో లండన్‌కు చెందిన ఓ జంట ఆలం బేగ్‌ పుర్రెను, దానితోపాటు ఉన్న ఓ లేఖను అక్కడి పబ్‌లో గుర్తించింది. ఆ లేఖలో ఆలం బేగ్‌ వివరాలన్నీ రాసి ఉన్నాయి. 
  • భారతదేశ చరిత్రపై పలు పరిశోధన గ్రంథాలు రాసిన లండన్‌ చరిత్రకారుడు ప్రొఫెసర్‌ ఎ.కె.వాగ్నర్‌ అది ఆలం బేగ్‌ పుర్రేనంటూ నిర్ధారించారు. దీంతో ప్రొఫెసర్‌ సహరావత్‌ ఇటు కేంద్ర ప్రభుత్వానికి, అటు బ్రిటిష్‌ సర్కారుకు లేఖలు రాశారు. ప్రొఫెసర్‌ ఎ.కె.వాగ్నర్‌ను కూడా సంప్రదించారు. 

Wednesday, October 5, 2016

భారత్‌, మయన్మార్‌ సరిహద్దు వెంబడి బంగ్లాదేశ్‌ కంచె


భారత్‌, మయన్మార్‌తో తమ దేశ సరిహద్దు పొడవునా కంచెను ఏర్పాటు చేయనున్నట్లు బంగ్లాదేశ్‌ సైన్యం ప్రకటించింది. అసోంలోని భారత్‌-బంగ్లా సరిహద్దును 2017 జూన్‌కు పూర్తిగా మూసివేస్తామని భారత్‌ ఇప్పటికే ప్రకటించింది. భారత్‌తో 4,096 కి.మీ., మయన్మార్‌తో 271 కి.మీ. పొడవునా బంగ్లాదేశ్‌కు సరిహద్దులు ఉన్నాయి. భారత్‌ తరహాలో సైన్యం కార్యకలాపాలకు వీలుగా సరిహద్దు వెంబడి రహదారులను కూడా వేయనున్నట్లు బంగ్లాదేశ్‌ సైన్యం వెల్లడించింది. 

Tuesday, September 20, 2016

ఆస్ట్రేలియాలో ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా


భారత్‌-ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు బలోపేతం చేయడానికి ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆస్ట్రేలియాలోని 6 నగరాల్లో 10 వారాల పాటు నిర్వహించే ఈ ఉత్సవంలో భారత్‌, ఆస్ట్రేలియా దేశా నృత్య, సంగీత, క్రీడలు ప్రదర్శిస్తారు.

Monday, September 19, 2016

2050నాటికి ప్రపంచ జనాభా దాదాపు 980 కోట్లు


2050 నాటికి ప్రపంచ జనాభా దాదాపు 980 కోట్లకు చేరుతుందని పాపులేషన్‌ రిఫరెన్స్‌ బ్యూరో (పీఆర్టి) పేర్కొంది. ఈ మేరకు 2016 ఆగస్టు చివరి వారంలో విడుదల చేసిన 2016 వరల్డ్‌ పాపులేషన్‌ డేటాషీట్‌లో తెలిపింది. మానవ అవసరాలు, సుస్థిర వనరులనే ఇతివృత్తంతో డేటాను రూపొందించారు. యూరప్‌లో జననాల రేటు బాగా క్షీణించి జనాభా భారీగా తగ్గిపోనుండగా, ఆఫ్రికా దేశాల్లో రెట్టింపు అవుతుందని నివేదిక పేర్కొంది.

Saturday, September 17, 2016

రాజకీయ ప్రయోజనాలు కాపాడుకునే విధంగానే మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గత కాంగ్రెస్‌ ప్రభుత్వాులు రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునే విధంగానే మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేశాయని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడిరచింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధిహామీ పథకం అమలు విజయవంతమైనట్లు జాతీయ స్థాయిలో ప్రచారం చేసుకున్నప్పటికీ ఆ రాష్ట్రంలో దానిపై పూర్తిగా రాజకీయ ప్రభావం ఉన్నట్లు పేర్కొంది. క్షేత్రస్థాయి అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మండలావారీగా వచ్చిన ఓటింగ్‌ సరళికి అనుగుణంగా ఈ పథకం కింద నిధులను ఖర్చు చేసినట్లు నివేదిక తెలిపింది. 

WTOలో అమెరికాపై భారత్‌ కేసు


పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రపంచ వాణిజ్య నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందుకు గాను అమెరికాపై ప్రపంచ వాణిజ్య సంస్థ(WTO)లో భారత్‌ కేసు దాఖలు చేసింది. అమెరికాలోని వాషింగ్టన్‌, కాలిఫోర్నియా తదితర 8 రాష్ట్రాులు నిబంధనలకు విరుద్ధంగా రాయితీ కల్పిస్తున్నాయని భారత్‌ ఆరోపించింది.
WTO-World Trade Organization 

నేపియర్‌ రకం గడ్డి దిగుమతికి కేంద్రం నిర్ణయం


దేశంలో పశుగ్రాసానికి పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా నేపియర్‌ రకం గడ్డిని దిగుమతి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇండో-ఆఫ్రికన్‌ ఫోరమ్‌ సదస్సులో పాల్గొనేందుకు 2015లో ఉగాండా అధ్యక్షుడు వ్కె.ముసెవెని ఢల్లీికి వచ్చిన సందర్భంగా ఆ దేశం నుంచి నేపియర్‌ను దిగుమతి చేసుకునే అంశంపై చర్చ జరిగింది. అనంతరం ఢిల్లీలోని పూసా వ్యవసాయ పరిశోధన సంస్థ మన దేశ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నేపియర్‌ దేశవాళీ రకాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా 16 రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో 38 లక్షల హెక్టార్లు ఇందుకు అనువుగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. 

బర్డ్‌ ఫ్లూ రహిత దేశంగా భారత్‌


వేగంగా సంక్రమించే బర్డ్‌ఫ్లూ (ఏవియాన్‌ ఇన్‌ఫ్లూయెంజా లేదా హెచ్‌5ఎన్‌1) ను దేశం నుంచి తరిమికొట్టినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2016 సెప్టెంబరు 5న జంతు ఆరోగ్య సంరక్షణ ప్రపంచ సంస్థ ఈ విషయాన్ని గుర్తించినట్లు ప్రభుత్వం వెల్లడిరచింది. దేశీయ కోళ్ల పరిశ్రమను బర్డ్‌ఫ్లూ విపరీతంగా పీడిరచింది.

Monday, September 12, 2016

ఆసియాలో తొలి 75 అత్యంత నవ్యపథ విశ్వవిద్యాయాల జాబితా


రాయిటర్స్‌ ఆసియాలో తొలి 75 అత్యంత నవ్యపథ విశ్వవిద్యాలయాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో జపాన్‌, దక్షిణకొరియా విద్యాసంస్థలు అగ్రస్థానంలో నిలిచాయి. భారత్‌లోని ఐఐటీలు  సంయుక్తంగా 72వ స్థానంలో నిలవగా, బెంగళూరు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ 73వ స్థానం దక్కించుకుంది. తొలి 20 స్థానాల్లో నిలిచిన విద్యా సంస్థల్లో 17 దక్షిణ కొరియా, జపాన్‌కు చెందినవే ఉన్నాయి. ఆధునిక శాస్త్రాలపై ఎక్కువగా ద్రుష్టి పెట్టడం, అధునాతన సాంకేతిక పరిశోధనలు, ప్రపంచ ఆర్థిక రంగాల్ని నడిపించడానికి దోహదపడే విద్య, తదితర అంశాల ప్రాతిపదికన ఈ విద్యా సంస్థల జాబితాను రూపొందించారు. కొరియా అడ్వాన్స్‌డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ప్రథమ స్థానం దక్కించుకోగా జపాన్‌కు చెందిన టోక్యో విశ్వవిద్యాలయం రెండో స్థానంలో నిలిచింది. ఇలా మొదటి 10 స్థానాలనూ దక్షిణ కొరియా, జపాన్‌లే దక్కించుకున్నాయి. సింగపూర్‌ జాతీయ విశ్వవిద్యాయం 11వ స్థానంలో నిలిచింది. https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

యూఎస్‌లో విదేశీ విద్యార్థు సంఖ్యలో భారత్‌కు 2వ స్థానం


2016 జులై నాటికి అమెరికాలో చదువుతున్న భారత విద్యార్థుల సంఖ్య 1,92,723 కి పెరిగింది. యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌, కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తాజాగా విడుదలు చేసిన నివేదిక ఈ అంశాలను వెల్లడించింది. 2015లో ఈ సంఖ్య 1,37,797 మాత్రమే. ఒక్క ఏడాది కాలంలోనే 28.5 శాతం పెరుగుద నమోదైంది. యూఎస్‌లో విదేశీ విద్యార్థు సంఖ్య పరంగా ఇప్పటికీ చైనా మొదటి స్థానంలో ఉంది. సంఖ్యాపరంగా భారత్‌ ద్వితీయ స్థానంలో ఉంది. దక్షిణ కొరియా 3వ స్థానంలో ఉంది. https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg
1. చైనా
2. భారత్‌
3. దక్షిణ కొరియా

73 వేల కోట్లు కుటుంబ సభ్యులకు పంపిన ఎన్నారైలు


విదేశాల్లో ఉంటున్న భారతీయులు దేశంలో ఉంటున్న తమ కుటుంబ సభ్యుల కోసం 2015 సంవత్సరంలో 11 బిలియన్‌ డాలర్లు (రూ.73 వేల కోట్లు) పంపించారని అమెరికన్‌ రిసెర్చ్‌ సెంటర్‌ నివేదికలో వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా గతేడాది మొత్తంగా 582 బిలియన్‌ డాలర్లను వలస వెళ్లినవారు తమవారికి పంపించారు.
https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg
1. చైనా
2. మెక్సికో
3. భారత్‌
NRI-Non-Resident Indian

ప్రపంచంలోని 400 అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో భారత విద్యాసంస్థలు


ప్రపంచంలోని 400 అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో భారత్‌కు చెందిన విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి. క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ 2016లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) 152వ స్థానంలో నిలిచింది. ఐఐఎస్‌సీ గతేడాది 147వ స్థానంలో నిలిచింది. 2015లో 179గా ఉన్న ఢిల్లీ ఐఐటీ ఈసారి 185వ స్థానానికి దిగజారింది. https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg
జాబితా
1 మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాజీ
2 స్టాన్‌ఫోర్డ్‌
3 హార్వర్డ్‌
152 ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌
185 ఢిల్లీ  ఐఐటీ
219 ముంబయి ఐఐటీ
249 మద్రాస్‌ ఐఐటీ
302 కాన్పూర్‌ ఐఐటీ
313 ఖరగ్‌పూర్‌ ఐఐటీ
399 రూర్కీ ఐఐటీ
IISc-Indian Institute of Science 

Friday, September 9, 2016

యూఎన్‌ఓ సెక్రటరీ జనరల్‌కు నవాజ్‌ షరీఫ్‌ లేఖ


కశ్మీరులో మానవ హక్కుల ఉల్లంఘనపై నిజ నిర్ధారణకు ప్రత్యేక బృందాన్ని పంపాలని కోరుతూ పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ బాన్‌కీ మూన్‌కు లేఖ రాశారు. గత నెల రోజుల వ్యవధిలో ఇది రెండో లేఖ.
https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

పాక్‌లో భారత టీవీ ఛానళ్ల నిషేధం



పాకిస్థాన్‌ తమ దేశంలో భారత టీవీ ఛానళ్ల ప్రసారాలను నిలిపివేసింది. పాక్‌లోని పలు ప్రాంతాల్లో ఆకాశవాణి ప్రసారాలు స్పష్టంగా వినిపించేటట్లు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో ఈ చర్యకు ప్రతిస్పందనగా తమ దేశంలో భారత టీవీ ఛానెళ్ల ప్రసారాలను పాక్‌ నిషేధించింది. పాకిస్థాన్‌ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌(PoJK), పాక్‌లోని పంజాబ్‌ ప్రావిన్సులో ప్రసారాలు స్పష్టంగా వినిపించేలా ఆకాశవాణి ప్రసార సంకేతాల సామర్థ్యాన్ని కేంద్రం ఇటీవల గణనీయంగా పెంచింది. బలూచిస్థాన్‌ ప్రజలకు మద్దతుగా బూలూచి భాషలోనూ సేవలు మెరుగుపర్చేలా కూడా ఆకాశవాణిని కేంద్రం అనుమతించింది.
https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

PoJK-Pak occupied Jammu and Kashmir 

బ్రిటన్‌ ప్రాధాన్య దేశాల జాబితాలో భారత్‌



బ్రిటన్‌ తన ప్రాధాన్య దేశాల జాబితాలో భారత్‌ను చేర్చింది. యురోపియన్‌ యూనియన్‌ నుంచి బయటికొచ్చిన బ్రెగ్జిట్‌ ఉదంతం తర్వాత వాణిజ్య ఒప్పందాలు చేసుకునే విషయంలో భారత్‌కు కూడా ప్రాధాన్యం కల్పించింది. లండన్‌లోని బ్రిటన్‌ సర్వ ప్రతినిధుల సభలో బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే ఈ అంశాన్ని వెల్లడించారు. బ్రిటన్‌తో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి ఆసక్తి వ్యక్తీకరించిన దేశాల్లో భారత్‌ కూడా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈయూను బ్రిటన్‌ వీడిన నేపథ్యంలో తమ దేశం సొంత వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాల్సి ఉందని ఆమె వెల్లడించారు.
https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg




భారత్‌లో మాతా, నవజాత శిశు ధనుర్వాతం నిర్మూలన


మాతా, నవజాత శిశు ధనుర్వాతాన్ని భారత్‌ విజయవంతంగా నిర్మూలించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ధ్రువీకరించింది. సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ మార్గరెట్‌ చాన్‌ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జె.పి.నడ్డాకు అందజేశారు. కొన్ని దశాబ్దాల కిందట భారత్‌లో ఏటా 1.5 లక్షల నుంచి 2 లక్షల నవజాత ధనుర్వాత కేసులు నమోదయ్యేవి. ఇప్పుడు ఆ సంఖ్య 1000 జననాలకు ఒకటి కంటే తక్కువగానే నమోదవుతున్నాయి.
WHO-World Health Organization https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ వాడిన కారుకు ఆడి మరమ్మతులు


నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ వాడిన కారుకు మరమ్మతులు చేసే బాధ్యతను ప్రముఖ జర్మనీ కార్ల కంపెనీ ఆడి చేపట్టింది. 1941లో గృహ నిర్బంధంలో ఉన్న నేతాజీ చాకచక్యంగా కోల్‌కతా నుంచి తప్పించుకుని పోయేందుకు ఈ కారే ఉపయోగపడిరది. కోల్‌కతాలోని నేతాజీ పూర్వీకుల నివాస ప్రాంతంలో ఈ కారు పార్క్‌ చేసి ఉంది.
https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg




సంస్కృత భాషలో ఐక్యరాజ్యసమితి అధికార పత్రం


శాన్‌ఫ్రాన్సిస్కోలో 1945 జూన్‌ 26న సంతకాలు చేసిన ఐక్యరాజ్యసమితి అధికార పత్రం ఇప్పుడు సంస్కృత భాషలో కూడా అందుబాటులోకి వచ్చింది. ఐక్యరాజ్యసమితి అధికార చట్టం సంస్కృతానువాదం ముఖచిత్రం ఫొటోను యూఎన్‌ఓలో భారత శాశ్వత ప్రతినిధి సయీద్‌ అక్బరుద్దీన్‌ ట్విట్టర్‌లో ఉంచారు. 1945 జూన్‌ 26న సంతకాలైన యూఎన్‌ఓ అధికార పత్రం అదే ఏడాది అక్టోబరు 24 నుంచి అమలులోకి వచ్చింది. సంస్కృతంలో అనువాదానికి మూల కారకుడైన త్రిపాఠీ లక్నోలోని అఖిల భారతీయ సంస్కృత పరిషద్‌ కార్యదర్శిగా ఉన్నారు.
https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg


Saturday, September 3, 2016

ప్రపంచంలోని టాప్-10 సంపన్న దేశాల్లో భారత్ ఏ స్థానంలో ఉంది?


ప్రపంచంలోని టాప్‌-10 సంపన్న దేశాల్లో భారత్‌ 7వ స్థానంలో నిలిచింది. న్యూ వరల్డ్‌ వెల్త్‌ నివేదిక ప్రకారం భారత్‌ 5,600 బిలియన్‌ డాలర్ల (మొత్తం వ్యక్తుది) సంపదతో ఈ స్థానం సంపాదించుకుంది. అమెరికా 48,900 బిలియన్‌ డాలర్ల సంపదతో జాబితాలో అగ్రస్థానంలో ఉంది. 2వ స్థానంలో చైనా (17,400 బిలియన్‌ డార్లు), 3వ స్థానంలో జపాన్‌ (15,100 బిలియన్‌ డార్లు) ఉన్నాయి. న్యూ వరల్డ్‌ వెల్త్‌’ సంస్థ వ్యక్తి నికర ఆస్తులను సంపదగా పరిగణనలోకి తీసుకుంది. మనకు జాబితాలో చోటు దక్కడానికి ప్రధాన కారణం మన దేశ జనాభానే. కాగా, కేవలం 2.2 కోట్ల మంది జనాభాతో ఆస్ట్రేలియా జాబితాలో చోటు పొందడం విశేషం.
టాప్‌-10 సంపన్న దేశాలు
దేశం సంపద విలువ (బిలియన్‌ డార్లలో)
అమెరికా 48,900
చైనా 17,400
జపాన్‌ 15,100
యునైటెడ్‌ కింగ్‌డమ్‌ 9,200
జర్మనీ 9,100
ఫ్రాన్స్‌ 6,000
భారత్‌ 5,600
కెనడా 4,700
ఆస్ట్రేలియా 4,500
ఇటలీ 4,400