Showing posts with label క్రీడా అంశాలు. Show all posts
Showing posts with label క్రీడా అంశాలు. Show all posts

Tuesday, August 22, 2023

Vrithi Agarwal : జాతీయ సబ్‌జూనియర్‌, జూనియర్‌ అక్వాటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు 14 పతకాలు

  • జాతీయ సబ్‌జూనియర్‌, జూనియర్‌ అక్వాటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు 14 పతకాలు సాధించారు. 2023 ఆగస్టు 20న జరిగిన ఈ టోర్నీలో తెలంగాణ స్విమ్మర్లు 6 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్యాలు గెలిచారు.
  • హైదరాబాద్‌ అమ్మాయి వ్రిత్తి అగర్వాల్‌ గ్రూప్‌-1 బాలికల విభాగంలో వ్యక్తిగత చాంపియన్‌షిప్‌ప్‌ టైటిల్‌ను సాధించింది. వ్రిత్తి ఈ టోర్నీలో నాలుగు స్వర్ణాలు, ఒక రజతం సాధించింది. 

small grains : చిరుధాన్యాల ఎగుమతుల్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?

Telangana swimmers bag 14 medals in National Sub-Junior, Junior Aquatics Championship

  • Telangana swimmers won 14 medals in National Sub-Junior and Junior Aquatics Championship. Telangana swimmers won 6 gold, 5 silver and 3 bronze medals in this tournament held on 20 August 2023.
  • Hyderabad girl Vrithi Agarwal bagged the individual championship title in the Group-1 girls category. Vritti won four golds and one silver in this tournament.


Anahat Singh : ఆసియా జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో స్క్వాష్‌ టైటిల్‌ విజేతగా అనాహత్‌ సింగ్‌

Anahat Singh-#successsecret

  • భారత స్క్వాష్‌ రైజింగ్‌ స్టార్‌ అనాహత్‌ సింగ్‌ ఆసియా జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. అండర్‌-17 బాలికల సింగిల్స్‌ విభాగంలో ఆసియా చాంపియన్‌గా అవతరించింది. 
  • 15 ఏళ్ల అనాహత్‌ ఫైనల్లో 3-1తో ఇనా క్వాంగ్‌ (హాంకాంగ్‌)పై విజయం సాధించింది. ఈ టోర్నిలో భారత్‌కు మూడు కాంస్య పతకాలు కూడా లభించాయి. 
  • అండర్‌-19 బాలుర సింగిల్స్‌లో శౌర్య, అండర్‌-19 బాలికల సింగిల్స్‌లో పూజ ఆర్తి, అండర్‌-15 బాలుర సింగిల్స్‌లో ఆర్యవీర్‌ సింగ్‌ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు గెలిచారు .

digital currency : ప్రభుత్వ రంగ - ప్రైవేటు రంగ బ్యాంకుల్లో డిజిటల్‌ కరెన్సీకి మొబైల్‌ యాప్‌ తీసుకొచ్చిన తొలి బ్యాంక్‌ ఏది?

Anahat Singh wins squash title in Asian Junior Championship

  • Indian squash rising star Anahat Singh performed brilliantly in the Asian Junior Championship. Became the Asian Champion in the Under-17 Girls' Singles category.
  • 15-year-old Anahat defeated Ina Kwong (Hong Kong) 3-1 in the final. India also won three bronze medals in this tournament.
  • In under-19 boys' singles, Shaurya, Pooja Aarti in under-19 girls' singles, Aryaveer Singh in under-15 boys' singles finished third and won bronze medals.


Women's World Cup Football : మహిళల ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ విజేత ఏ దేశం?

Women's World Cup Football2-#successsecret

  • ఏమాత్రం అంచనాలు లేకుండా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన స్పెయిన్‌ మహిళల ఫుట్‌బాల్‌ జట్టు చివరకు అందర్నీ ఆశ్చర్యపరుస్తూ విశ్వవిజేతగా అవతరించింది.
  • 2023 ఆగస్టు 20న జరిగిన మహిళల ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ ఫైనల్లో స్పెయిన్‌ 1%--%0 గోల్‌ తేడాతో ఇంగ్లండ్‌ జట్టును ఓడిరచింది. ఆట 29వ నిమిషంలో ఓల్గా కర్మోనా చేసిన గోల్‌తో స్పెయిన్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. 
  • స్వీడన్‌తో జరిగిన సెమీఫైనల్లో స్పెయిన్‌ తరఫున 89వ నిమిషంలో ఓల్గా కర్మోనా రెండో గోల్‌ చేసి తమ జట్టును ఫైనల్‌కు చేర్చింది. 2015లో కర్లీలాయిడ్‌ (అమెరికా) తర్వాత ఒకే ప్రపంచకప్‌లో సెమీఫైనల్లో, ఫైనల్లో గోల్‌ చేసిన ప్లేయర్‌గా ఓల్గాకర్మోనా గుర్తింపు పొందింది.
  • చాంపియన్‌గా నిలిచిన స్పెయిన్‌ జట్టుకు మొత్తం ఒక కోటీ 5 లక్షల డాలర్ల (రూ. 87 కోట్ల 30 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. ఇందులో 42 లక్షల 90 వేల డాలర్లు స్పెయిన్‌ ఫుట్‌బాల్‌ సమాఖ్యకు... 62 లక్షల 10 వేల డాలర్లు జట్టులోని సభ్యులకు (23 మందికి 2 లక్షల 70 వేల డాలర్ల చొప్పున) లభించాయి.
  • ఈ విజయంతో పురుషుల, మహిళల ప్రపంచకప్‌ టైటిల్‌ గెలిచిన దేశంగా స్పెయిన్‌ గుర్తింపు పొందింది. స్పెయిన్‌ పురుషుల జట్టు 2010 ప్రపంచ కప్‌లో విజేతగా నిలిచింది.

Not using google account...? : గూగుల్‌ అకౌంట్‌ వాడట్లేదా...?

Which country won the Women's World Cup Football?

  • The Spanish women's football team, which arrived in Australia without any expectations, finally surprised everyone and became the world champion.
  • In the final of the Women's World Cup football tournament held on August 20, 2023, Spain defeated the England team by 1%-%0 goal difference. Spain took the lead in the 29th minute with Olga Carmona's goal.
  • Olga Carmona scored the second goal in the 89th minute for Spain in the semi-finals against Sweden to send their team to the final. In 2015, Olga Karmona became the first player to score a goal in both the semifinals and the final of the same World Cup after Curley Lloyd (USA) in 2015.
  • The champion Spanish team got a total of one crore 5 lakh dollars (Rs. 87 crores 30 lakhs) prize money. Of this, 42 lakh 90 thousand dollars were given to the Spanish Football Federation... 62 lakh 10 thousand dollars were given to the members of the team (at the rate of 2 lakh 70 thousand dollars per 23 people).
  • With this victory, Spain became recognized as the country that won the men's and women's World Cup title. Spain's men's team won the 2010 World Cup.


NADA : నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ(నాడా) ఎవరిపై నాలుగేళ్లపాటు నిషేధం విధించింది?

India's star sprinter Duti Chand2-#successsecret

  • భారత స్టార్‌ స్ప్రింటర్‌ ద్యుతీ చంద్‌కు భారీ షాక్‌ తగిలింది. డోపింగ్‌ టెస్టులో విఫలమైన ఆమెపై నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ(నాడా) నాలుగేళ్లపాటు  నిషేధం విధించింది. 
  • 2022 డిసెంబరు 5, 26 తేదీల్లో భువనేశ్వర్‌లో నాడాకు చెందిన అధికారులు ద్యుతీ నుంచి రెండుసార్లు శాంపిళ్లు సేకరించారు. 
  • ఈ క్రమంలో ఆమె శరీరంలో నిషేధిత ఉత్ప్రేరకాల ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో జనవరి 3, 2023 నుంచే ద్యుతీపై నిషేధం అమల్లోకి వస్తుందని నాడా పేర్కొంది. ఈ నేపథ్యంలో ద్యుతీ చంద్‌ గెలిచిన పతకాలన్నీ వెనక్కి తీసుకోనున్నారు. 
  • 27 ఏళ్ల ద్యుతీ చంద్‌ ఆసియా క్రీడల్లో రెండుసార్లు రజతాలు గెలిచింది. 100 మీటర్ల పరుగు పందెంలో ఇప్పటికీ నేషనల్‌ రికార్డు తన పేరిటే ఉంది. 2011లో ఇండియన్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌లో 11.17 సెకన్లలో పరుగు పూర్తి చేసింది ద్యుతీ.

Rajiv Sadbhavana Award : 2020-21వ సంవత్సరానికి రాజీవ్‌ సద్భావన అవార్డు ఎవరికి లభించింది?

The National Anti-Doping Agency (NADA) has imposed a four-year ban on whom?

  • India's star sprinter Duti Chand got a huge shock. The National Anti-Doping Agency (NADA) banned her for four years after failing the doping test.
  • On December 5 and 26, 2022, NADA officials collected samples twice from Duti in Bhubaneswar.
  • In the process, it was found that there were traces of banned stimulants in her body. In this context, NADA said that the ban on duty will come into effect from January 3, 2023. In this background, all the medals won by Duti Chand will be taken back.
  • 27-year-old Dutee Chand has won silver twice in the Asian Games. He still holds the national record in the 100 meter race. Duthi completed the run in 11.17 seconds at the Indian Grand Prix in 2011.

Panghal : ప్రపంచ అండర్‌-20 చాంపియన్‌షిప్‌లో విశ్వవిజేతగా పంఘాల్‌

  • భారత యువ మహిళా రెజ్లర్లు 2023 ఆగస్టు 21న కొత్త చరిత్రను లిఖించారు. తొలిసారి ప్రపంచ అండర్‌-20 చాంపియన్‌షిప్‌లో టీమ్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. 
  • హరియాణా అమ్మాయి అంతిమ్‌ పంఘాల్‌ వరుసగా రెండో ఏడాది 53 కేజీల విభాగంలో విశ్వవిజేతగా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ రెజ్లర్‌గా గుర్తింపు పొందింది. ఫైనల్లో అంతిమ్‌ 4-0తో మరియా యెఫ్రెమోవా (ఉక్రెయిన్‌)పై గెలిచింది. 
  • సవితా దలాల్‌ (62 కేజీలు) కూడా ప్రపంచ చాంపియన్‌ అయ్యింది. ఫైనల్లో సవిత 10-0తో చిరినోస్‌ (వెనిజులా)పై గెలిచింది. అంతిమ్‌ కుందు (65 కేజీలు) రజతం నెగ్గగా... రీనా (57 కేజీలు), ఆర్జూ (68 కేజీలు), హర్షిత (72 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. ఓవరాల్‌గా భారత్‌ ఏడు పతకాలు నెగ్గి 140 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

Panghal is the world champion in the World Under-20 Championship

  • Indian young women wrestlers will write a new history on August 21, 2023. For the first time, they won the team title in the World Under-20 Championship.
  • Haryana girl Antim Panghal became the first Indian wrestler to win the 53 kg category for the second year in a row. In the final she won 4-0 against Maria Yefremova (Ukraine).
  • Savita Dalal (62 kg) also became the world champion. Savita won 10-0 against Chirinos (Venezuela) in the final. In the end, Kundu (65 kg) won silver, Reena (57 kg), Arju (68 kg), Harshita (72 kg) won bronze medals. Overall, India won seven medals and stood at the top with 140 points.

Monday, August 21, 2023

ODI World Cup mascots : వన్డే ప్రపంచకప్‌ మస్కట్లు

ODI World Cup mascots-#successsecret

  • వన్డే ప్రపంచకప్‌ మస్కట్‌ జోడీని 2023 ఆగస్టు 19న గుర్‌గ్రామ్‌లో ఆవిష్కరించారు. బౌలర్‌ (అమ్మాయి), బ్యాటర్‌ (అబ్బాయి)లను ప్రతిబింబిస్తూ ఈ మస్కట్లు ఉన్నాయి. 
  • పురుషులు, మహిళలకు సమాన హక్కుల ప్రాతిపదికన ప్రపంచకప్‌ కోసం ఆకట్టుకునే మస్కట్‌ జోడీని ఐసీసీ తయారు చేసిందిీ. అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన జట్ల కెప్టెన్లు యశ్‌ ధుల్‌, షెఫాలీవర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
  • మస్కట్లకు పేరు పెట్టే అవకాశాన్ని కూడా ఐసీసీ.. అభిమానులకే ఇచ్చింది. ఇందుకోసం ఐసీసీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అక్కడ ఉన్న ఆప్షన్లలో ఒక దానికి ఓటు వేయాలి.

ఏ రాష్ట్ర రాజ్‌భవన్‌లో ఇటీవల అవినీతి నిరోధక సెల్‌ ఏర్పాటు చేసారు?

ODI World Cup mascots

  • The ODI World Cup mascot pair was unveiled on August 19, 2023 in Gurgram. These mascots represent bowler (girl) and batter (boy).
  • ICC has made an impressive pair of mascots for the World Cup on the basis of equal rights for men and women. The captains of the Under-19 World Cup winning teams, Yash Dhul and Shefali Verma, participated in this event.
  • ICC also gave fans the opportunity to name the mascots. For this one has to go to the ICC website and vote for one of the options there.
  • Telangana topics

Friday, August 18, 2023

Antim Fungal : ప్రపంచ అండర్‌-20 టోర్నమెంట్ టైటిల్‌ విజేత అంతిమ్‌ ఫంగాల్‌

Antim Fungal-4a-successsecret

  • భారత యువ రెజ్లర్‌ అంతిమ్‌ ఫంగాల్‌ ప్రపంచ అండర్‌-20 టోర్నమెంట్లో టైటిల్‌ నిలబెట్టుకుని ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది. 53 కేజీల విభాగం ఫైనల్లో అంతిమ్‌ 4-0తో మరియా ఎఫ్రిమోవా (ఉక్రెయిన్‌)ను ఓడిరచింది. 
  • అంతిమ్‌ కుందు (65 కేజీ) రజతం గెలుచుకుంది. ఆమె 2-9తో ఇనికో ఎల్కెస్‌ (జోర్డాన్‌) చేతిలో ఓడిరది. 
  • 57 కేజీల కేటగిరిలో రీనా కాంస్యం సొంతం చేసుకుంది. ఆమె 9-4తో ఒమిర్‌బెక్‌ (కజకిస్థాన్‌)ను ఓడిరచింది. అర్జూ (68 కేజీ), హర్షిత (72 కేజీ) కూడా కాంస్యాలు నెగ్గారు.


World Under-20 tournament title winner Antim Fungal

  • Indian young wrestler Antim Fungal created history by becoming the first Indian woman wrestler to achieve this feat by retaining the title in the World Under-20 tournament. In the final of the 53 kg category, she defeated Maria Efrimova (Ukraine) 4-0.
  • The final Kundu (65 kg) won the silver. She lost 2-9 to Iniko Elkes (Jordan).
  • Reena won bronze in 57 kg category. She defeated Omirbek (Kazakhstan) 9-4. Arju (68 kg) and Harshita (72 kg) also won bronze medals.

World Athletics : ప్రపంచ అథ్లెటిక్స్‌ (డబ్ల్యూఏ) ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన భారతీయుడు ఎవరు?

Adil Sumariwala-successsecert

  • భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) అధ్యక్షుడు ఆదిల్‌ సుమరివాలాకు అరుదైన గౌరవం దక్కింది. అతడు 2023 ఆగస్టు 17న ప్రపంచ అథ్లెటిక్స్‌ (డబ్ల్యూఏ) ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 
  • ప్రపంచ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో అత్యంత శక్తిమంతమైన సమాఖ్యలో ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన మొదటి భారతీయుడు సుమరివాలానే. 
  • 2012 నుంచి ఏఎఫ్‌ఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్న 65 ఏళ్ల సుమరివాలా..ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడో అత్యధిక ఓట్లు సంపాదించాడు. 
  • నలుగురు ఉపాధ్యక్షుల్లో సుమరివాలా ఒకరు. నాలుగేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగుతాడు. 
  • 100 మీటర్ల అథ్లెట్‌గా ఒలింపిక్స్‌లో పాల్గొన్న సుమరివాలా.. 2015 నుంచి డబ్ల్యూఏ కౌన్సిల్‌లో సభ్యుడిగా ఉన్నాడు. సెబాస్టియన్‌ కో ప్రపంచ అథ్లెటిక్స్‌ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యాడు.


Who is the Indian who has been elected as the Vice-President of World Athletics (WA)?

  • Athletics Federation of India (AFI) President Adil Sumariwala has received a rare honour. He was elected as the Vice President of World Athletics (WA) on 17 August 2023.
  • Sumariwala is the first Indian to hold the post of vice-president of the world's most powerful federation of track and field.
  • 65-year-old Sumariwala, who has been the president of AFI since 2012, got the third highest number of votes in the recent elections.
  • Sumariwala is one of the four vice-presidents. He will continue in office for four years.
  • Sumariwala, who participated in the Olympics as a 100m athlete, has been a member of the WA Council since 2015. Sebastian Coe was re-elected as World Athletics President.

Wahab Riaz : వాహబ్‌ రియాజ్‌ వీడ్కోలు

  • పాకిస్థాన్‌ ఎడమచేతి  వాటం ఫాస్ట్‌ బౌలర్‌ వాహబ్‌ రియాజ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లపై ఎక్కువ దృష్టిసారించడం కోసం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు 2023 ఆగస్టు 16న వెల్లడిరచాడు. 
  • 2008 నుంచి 2020 వరకు వాహబ్‌ 27 టెస్టులు, 91 వన్డేలు, 36 టీ20ల్లో పాక్‌ తరఫున బరిలో దిగాడు. మూడు ఫార్మాట్లలో వరుసగా 83, 120, 34 వికెట్లు తీశాడు. టెస్టు క్రికెట్లో అరంగేట్ర మ్యాచ్‌లోనే అయిదు వికెట్లు తీసిన తొమ్మిదో పాక్‌ బౌలర్‌గా వాహబ్‌ ఘనత సాధించాడు. 2011 ప్రపంచకప్‌లో పాక్‌.. భారత్‌ చేతిలో ఓడిన సెమీస్‌లో వాహబ్‌ అయిదు వికెట్లు పడగొట్టాడు.

Farewell to Wahab Riaz

  • Pakistan's left-arm fast bowler Wahab Riaz has announced his retirement from international cricket. He announced on 16th August 2023 that he will bid farewell to international cricket to focus more on T20 leagues around the world.
  • From 2008 to 2020, Wahab played 27 Tests, 91 ODIs and 36 T20Is for Pakistan. He took 83, 120 and 34 wickets respectively in three formats. Wahab became the ninth Pakistani bowler to take five wickets in his debut match in Test cricket. In the 2011 World Cup, Wahab took five wickets in the semis when Pakistan lost to India.

Tuesday, August 15, 2023

Steven Finn : ఇటీవల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టీవెన్‌ ఫిన్‌ ఏ దేశ క్రీడాకారుడు?


  • ఇంగ్లాండ్‌ పేసర్‌ స్టీవెన్‌ ఫిన్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మోకాలి గాయంతో బాధపడుతున్న 34 ఏళ్ల ఫిన్‌.. మూడు ఫార్మాట్ల నుంచి రిటైరవుతున్నట్లు 2023 ఆగస్టు 14న ప్రకటించాడు. ఏడాది కిందట మోకాలికి గాయమవడంతో అతను ఆటకు దూరమయ్యాడు. 
  • 36 టెస్టుల్లో ఇంగ్లాండ్‌ తరఫున బరిలో దిగిన ఫిన్‌ 125 వికెట్లు తీశాడు. 69 వన్డేల్లో 102 వికెట్లు పడగొట్టాడు. 21 టీ20ల్లో 27 వికెట్లు తీశాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో 164 మ్యాచ్‌ల్లో 570 వికెట్లు కైవసం చేసుకున్నాడు.

Steven Finn, who recently bid farewell to cricket, is a player of which country?

  • England pacer Steven Finn bid farewell to cricket. Suffering from a knee injury, the 34-year-old Finn has announced his retirement from all three formats on August 14, 2023. Less than a year ago, he was sidelined with a knee injury.
  • Finn, who played for England in 36 Tests, took 125 wickets. He took 102 wickets in 69 ODIs. He took 27 wickets in 21 T20Is. He took 570 wickets in 164 matches in first class cricket.

Seema Bisla : జాతీయ డోపింగ్‌ నిరోధక క్రమశిక్షణ ప్యానల్‌ ఏడాది పాటు నిషేధించిన సీమా బిస్లా ఏ క్రీడాకారిణి?

 


  • ఒలింపియన్‌, రెజ్లర్‌ సీమా బిస్లాపై జాతీయ డోపింగ్‌ నిరోధక క్రమశిక్షణ ప్యానల్‌ (ఏడీడీపీ) ఏడాది నిషేధం విధించింది. వాడా 
  • నిబంధనలను అనుసరించి ఆమెపై చర్యలు తీసుకుంది. 
  • ఏడాదిలో మూడుసార్లు డోప్‌ పరీక్షకు హాజరుకాకపోవడం లేదా తాను ఎప్పుడు ఎక్కడ ఉందన్న సమాచారం ఇవ్వకుండా నిబంధనలను ఉల్లంఘించడంతో ఆమెపై ఏడీడీపీ చర్యలు తీసుకుంది. 
  • ఈ ఏడాది మే 12 నుంచి ఆమెపై నిషేధం అమల్లోకి వచ్చింది. 
  • 30 ఏళ్ల సీమా బిస్లా 2021 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో 50 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గింది. టోక్యో ఒలింపిక్స్‌లో ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది.


Seema Bisla was banned for a year by the National Anti-Doping Disciplinary Panel which sports person?

  • Olympian and wrestler Seema Bisla has been banned for one year by the National Anti-Doping Disciplinary Panel (ADDP). Action was taken against her as per WADA norms.
  • The ADDP took action against her for violating the rules by not appearing for dope test thrice in a year or not giving information about her whereabouts.
  • The ban on her came into effect from May 12 this year. 30-year-old Seema Bisla won bronze in the 50 kg category at the 2021 Asian Championships. In the pre-quarters of the Tokyo Olympics, she turned her back.

Asia Champions Hockey Trophy : ఆసియా ఛాంపియన్స్‌ హాకీ ట్రోఫీ 2023ని గెలుచుకున్న దేశం ఏది?

 


  • ఆసియా ఛాంపియన్స్‌ హాకీ ట్రోఫీని భారత్‌ గెలుచుకుంది. 
  • 2023 ఆగస్టు 12న ఫైనల్లో భారత్‌ 4-3 గోల్స్‌తో మలేసియాను ఓడిరచింది. 
  • జట్టుకు ఇది నాలుగో ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ.

Which country won the Asia Champions Hockey Trophy-2023?

  • India won the Asia Champions Hockey Trophy. India defeated Malaysia by 4-3 goals in the final on 12 August 2023. This is the fourth Asian Champions Trophy for the team.

Saturday, August 12, 2023

ఇన్‌స్టాగ్రామ్‌లో ఖరీదైన మూడో అథ్లెట్‌గా కోహ్లి

 


  • ఇన్‌స్టాగ్రామ్‌లో  ఖరీదైన అథ్లెట్ల జాబితాలో విరాట్‌ కోహి మూడో స్థానంలో నిలిచాడని సామాజిక మాధ్యమాల వ్యాపార నిర్వహణ వేదిక హాపర్‌ హెచ్‌క్యూ వెల్లడిరచింది. 
  • ఒక్కో పోస్టుకు కోహ్లి రూ.11.45 కోట్ల చొప్పున తీసుకుంటున్నాడని తెలిపింది. 
  • ఈ జాబితాలో టాప్‌-25లో ఉన్న ఏకైక భారతీయుడు కోహ్లీనే. 
  • ఫుట్‌బాల్‌ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో (599 మిలియన్‌), మెస్సి (482 మిలియన్‌) మాత్రమే కోహ్లి కంటే ముందున్నారు. 
  • ఒక్కో పోస్టు కోసం రొనాల్డో రూ.26.76 కోట్లు, మెస్సి రూ.21.49 కోట్లు వసూలు చేస్తున్నారు. 
  • ఇటీవల స్పోర్టికో వెల్లడిరచిన అత్యధిక జీతం పొందే ప్రపంచంలోని టాప్‌-100 అథ్లెట్ల జాబితాలోనూ కోహ్లీకి స్థానం దక్కింది. కోహ్లి నికర విలువ   రూ.1000 కోట్లకు పైనే ఉంది.

Tuesday, August 8, 2023

Junior Bulgaria Title : రక్షకు జూనియర్‌ బల్గేరియా టైటిల్‌

 

Junior Bulgaria Title winner Raksha

  • జూనియర్‌ బల్గేరియా ఓపెన్‌ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీలో తెలంగాణ అమ్మాయి రక్ష కందసామి విజేతగా నిలిచింది. 
  • 2023 ఆగస్టు 6న జరిగిన ఫైనల్లో రక్ష 21-11, 21-9తో నైషాపై విజయం సాధించింది. ఇటీవల జూనియర్‌ ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌లో రక్ష రజతం నెగ్గింది.

Deodhar Trophy : దేవధర్‌ ట్రోఫీ టైటిల్‌ విజేత సౌత్‌జోన్‌

Southzone is the winner of Deodhar Trophy title

  • దేశవాళీ జోనల్‌ వన్డే క్రికెట్‌ టోర్నీలో మయాంక్‌ అగర్వాల్‌ సారథ్యంలోని సౌత్‌జోన్‌ జట్టు అజేయ విజేతగా నిలిచింది.
  • పుదుచ్చేరిలో 2023 ఆగస్టు 3న జరిగిన ఫైనల్లో సౌత్‌జోన్‌ 45 పరుగుల తేడాతో ఈస్ట్‌జోన్‌ జట్టును ఓడిరచి తొమ్మిదోసారి దేవధర్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది.
  • టోర్నీలో 354 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు తీసిన రియాన్‌ పరాగ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. 

Tuesday, July 18, 2023

గ్లోబల్‌ చెస్‌ లీగ్‌ తొలి సీజన్‌ విజేత త్రివేణి కింగ్స్‌


  • గ్లోబల్‌ చెస్‌ లీగ్‌ తొలి సీజన్‌లో త్రివేణి కాంటినెంటల్‌ కింగ్స్‌ విజేతగా నిలిచింది. 2023 జులై 2న జరిగిన ఫైనల్లో ఆ జట్టు సడెన్‌తో అప్డ్‌ ముంబా మాస్టర్‌ను ఓడిరచింది.