Showing posts with label రికార్డులు. Show all posts
Showing posts with label రికార్డులు. Show all posts

Tuesday, August 15, 2023

Ashriya Goswami : 8 ఏళ్ల వయసులో 62 కిలోల బరువెత్తి గిన్నిస్‌ రికార్డ్‌ సాధించిన అశ్రియా గోస్వామి ఏ రాష్ట్రానికి చెందినవారు?

 

Ashriya Goswami-successsecret

  • హరియాణాకు చెందిన 8 ఏళ్ల అశ్రియా గోస్వామి 62 కేజీల బరువెత్తి ఔరా అనిపించింది. 30 సెకన్లలో 17 సార్లు క్లీన్‌ అండ్‌ జర్క్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చేసి గిన్నిస్‌ రికార్డ్‌ నెలకొల్పింది. 
  • పంచ్‌కుల జిల్లాకు చెందిన ఈ చిన్నారి తండ్రి అవినాష్‌కుమార్‌ స్థానికంగా ఓ జిమ్‌ సెంటర్‌ నడుపుతున్నారు. అశ్రియా మొదట్లో తండ్రి దగ్గరే వెయిట్‌లిఫ్టింగ్‌ శిక్షణ తీసుకునేది. ఆమెలోని శక్తిని గుర్తించిన అవినాష్‌ కుమార్తెను మరింత ప్రోత్సహించారు.
  • జులైలో జరిగిన ప్రముఖ టీవీ కార్యక్రమం ‘‘ఇండియాస్‌ గాట్‌ టాలెంట్‌’’ షోలో ఈమె ఏకంగా 62 కేజీల బరువును ఎత్తి గిన్నిస్‌ రికార్డ్‌ నెలకొల్పింది. 

Ashriya Goswami, who won the Guinness World Record by lifting 62 kg at the age of 8, belongs to which state?

  • 8-year-old Ashriya Goswami from Haryana weighed 62 kg and felt aura. 17 clean and jerk weightlifting in 30 seconds and set a Guinness record.
  • The child's father, Avinash Kumar, who hails from Panchkula district, runs a gym center locally. Ashriya initially took weightlifting training from her father. Recognizing her potential, Avinash encouraged her daughter further.
  • She lifted a single weight of 62 kg and set a Guinness record on the famous TV program "India's Got Talent" in July.

Guinness World Record : అత్యంత పొడవైన గడ్డం కలిగిన మహిళగా గిన్నిస్‌ రికార్డు సాధించినవారు ఎవరు?

 

Guinness World Record-successsecret

  • అమెరికాకు చెందిన హనీకట్‌ (38) అత్యంత పొడవైన గడ్డం (11.8 అంగుళాలు) కలిగిన మహిళగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్స్‌లో చోటు దక్కించుకున్నారు. 
  • గతంలో ఇదే దేశానికి చెందిన వివాన్‌ వీలర్‌ అనే మహిళ పేరిట ఉన్న రికార్డును (10.04 అంగుళాలు) తాజాగా ఎరిన్‌ హనీకట్‌ అధిగమించారు. మిషిగాన్‌కు చెందిన హనీకట్‌కు బాల్యం నుంచే జన్యుపరమైన సమస్యలు ఉండేవి. 
  • 13 ఏళ్లు వచ్చేసరికి  క్రమంగా గడ్డం రావడం మొదలైంది. తొలుత ఆందోళన చెందిన ఆమె రోజుకు మూడు నాలుగుసార్లు షేవింగు చేసుకునేవారు. అవాంఛిత రోమాల తొలగింపు లేపనాలను వాడినా ప్రయోజనం లేకపోయింది. 
  • కొన్నాళ్ల తర్వాత విపరీతమైన రక్తపోటుతో పాక్షికంగా దృష్టిని కోల్పోయారు. అక్కడి నుంచి షేవ్‌ చేయడం, హెయిర్‌ రిమూవల్స్‌ వాడటం మానేశారు. మరోవైపు బాక్టీరియా సోకి ఓ కాలును కూడా కోల్పోవాల్సి వచ్చింది. క్రమంగా ఆందోళన వీడిన ఆమె.. గడ్డం పెంచడంపై దృష్టి పెట్టారు. అదే ఈ రోజు ప్రపంచ రికార్డు సాధించేలా చేసింది.

Who holds the Guinness World Record for the woman with the longest beard?

  • America's Honeycutt (38) has entered the Guinness Book of Records as the woman with the longest beard (11.8 inches).
  • Erin Honeycutt recently broke the previous record (10.04 inches) held by a woman named Vivian Wheeler from the same country. Hailing from Michigan, Honeycutt had genetic problems from childhood.
  • At the age of 13, the beard started growing gradually. She used to shave three to four times a day when she was worried at first. Using unwanted hair removal creams has not helped.
  • After some years he lost his sight partially due to high blood pressure. From there, they stopped shaving and using hair removals. On the other hand, he also had to lose a leg due to bacterial infection. She gradually got rid of her anxiety and focused on growing her beard. That is what made the world record possible today.


Saturday, August 12, 2023

July 2023 : అత్యంత వేడి నెలగా 2023-జులై రికార్డు

 


  • భూమిపై అత్యంత వేడి మాసంగా ‘2023-జులై’ రికార్డు నమోదు చేసిందని ఐరోపా సంఘానికి చెందిన వాతావరణ పర్యవేక్షణ సంస్థ కోపర్నికస్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ సర్వీస్‌ 2023 ఆగస్టు 8న ప్రకటించింది. 
  • 2023 జులై నెలలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 16.95 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. ఇది 2019-జులైలో నమోదైన రికార్డును అధిగమించినట్లు కోపర్నికస్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ సర్వీస్‌ వెల్లడిరచింది.


World Record : గుండెకు 3 సార్లు బైపాస్‌ శస్త్రచికిత్సలు చేయించుకొని అత్యధిక కాలం జీవించిన వ్యక్తి కోలిన్‌ హాంకాక్‌


  • గుండెకు మూడు సార్లు బైపాస్‌ శస్త్రచికిత్సలు చేయించుకొని అత్యధిక కాలం జీవించిన వ్యక్తిగా బ్రిటన్‌కు చెందిన 77 ఏళ్ల కోలిన్‌ హాంకాక్‌ గిన్నిస్‌ పుస్తకంలో స్థానం సంపాదించారు. ఈ క్రమంలో పాత రికార్డును ఆయన బద్దలు కొట్టారు. 
  • వంశపారంపర్యంగా సంక్రమించే హైపర్‌ కొలెస్టెరోలేమియా అనే సమస్యతో కోలిన్‌ బాధపడుతున్నారు. ఇది శరీరంలో కొవ్వులు పెరగడంతో పాటు కరోనరీ హార్ట్‌ డిసీజ్‌కు కారణమవుతుంది. దీని వల్ల 30 ఏళ్ల వయసులో అతడికి గుండె పోటు వచ్చింది. 
  • ఆ తర్వాత ఏడాదిలో మూడు సార్లు బైపాస్‌ శస్త్రచికిత్సలు చేశారు. ఈ శస్త్రచికిత్సలు జరిగి 45 సంవత్సరాల 361 రోజులు గడిచింది. ఈ కాలంలో ఆయనకు మరో శస్త్రచికిత్స జరగలేదు. ఇప్పటికీ కోలిన్‌ ఆరోగ్యంగా ఉన్నారు. దీంతో గిన్నిస్‌ పుస్తకంలో చోటు సంపాదించారు. 
  • గతంలో ఈ రికార్డు అమెరికాకు చెందిన డెల్బర్ట్‌ డేల్‌ మెక్‌బీ పేరిట ఉంది. ఆయన మూడుసార్లు బైపాస్‌ శస్త్రచికిత్స చేయించుకుని 41 సంవత్సరాల 63 రోజులు జీవించారు. 2015లో 90వ  ఏట ప్రాణాలు కోల్పోయారు.

Aditi Gopichand Swamy : భారత ఆర్చర్‌ అదితి గోపీచంద్‌ స్వామి ప్రపంచ రికార్డు


  • భారత మహిళా ఆర్చర్‌ అదితి గోపీచంద్‌ స్వామి చరిత్ర సృష్టించింది. వరల్డ్‌ ఛాంపియన్‌గా నిలిచిన అతి పిన్న వయస్కురాలిగా (17) ప్రపంచ రికార్డు నెలక్పొంది. 
  • బెర్లిన్‌లో జరిగిన వరల్డ్‌ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌ కాంపౌండ్‌ మహిళల విభాగంలో స్వర్ణం గెలవడం ద్వారా ఈ ఘనత సాధించింది.
  • ఆర్చరీలో భారత్‌ తరఫున మొదటి వ్యక్తిగత ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. 2023 ఆగస్టు 5న జరిగిన ఫైనల్లో మెక్సికోకు చెందిన ఆండ్రియా బెకెర్రాను ఓడిరచింది.

Thursday, August 3, 2023

వరల్డ్‌ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో 16 స్వర్ణ పతాకాలు సాధించి, ప్రపంచ రికార్డు నెలకొల్పిన మహిళా స్విమ్మర్‌ ఎవరు?


  • 26 ఏళ్ల అమెరికా మహిళా స్విమ్మర్‌ కేటీ లెడెకీ చరిత్ర సృష్టించింది. జపాన్‌ వేదికగా జరిగిన వరల్డ్‌ స్విమ్మింగ్‌  ఛాంపియన్‌షిప్స్‌లో 16 స్వర్ణ పతాకాలు సాధించి, ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 
  • గతంలో వరల్డ్‌ స్విమ్మింగ్‌  ఛాంపియన్‌షిప్స్‌లో అత్యధిక స్వర్ణ పతకాలు సాధించిన రికార్డు దిగ్గజ స్విమ్మర్‌ మైఖేల్‌ ఫెల్ప్స్‌ (15) పేరిట ఉండేది.
  • ప్రస్తుత వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో కేటీ.. ఫెల్ప్స్‌ రికార్డు బద్దలు కొట్టి వరల్డ్‌ రికార్డు నమోదు చేసింది. జులై 30 జరిగిన 800 మీటర్ల ఫ్రీస్టైల్‌ ఫైనల్‌లో స్వర్ణం గెలవడం ద్వారా లెడెకీ ఈ ఘనత సాధించింది. 
  • 800 మీటర్ల ఈవెంట్‌లో స్వర్ణం కైవసం చేసుకున్న లెడెకీ మరో రికార్డును కూడా బద్దలు కొట్టింది. వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ మహిళల 800 మీటర్ల ఫ్రీస్టైల్‌ ఈవెంట్స్‌లో అత్యధిక స్వర్ణ పతకాలు (6) సాధించిన  స్విమ్మర్‌గా రికార్డు నెలకొల్పింది.
  • ఒకే ఈవెంట్‌లో అత్యధిక ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ బంగారు పతకాలు (6) సాధించిన స్విమ్మర్‌గానూ రికార్డుల్లోకెక్కింది.

Tuesday, July 18, 2023

ప్రపంచంలోనే అతిపెద్దదైన అనంత శేషశయన శ్రీ మహా విష్ణుమూర్తి ఏకాండి దారు శిల్పం



హైదరాబాద్‌ న్యూబోయినపల్లిలోని అనూరాధ టింబర్‌ ఎస్టేట్స్‌ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ప్రపంచంలోనే అతిపెద్దదైన అనంత శేషశయన శ్రీ మహా విష్ణుమూర్తి ఏకాండి దారు శిల్పాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 2023 జులై 1న ఆవిష్కరించారు. 

Saturday, October 8, 2016

బుర్జ్‌ ఖలీఫాలో ఎక్కువ ఫ్లాట్లు కలిగిన వ్యక్తిగా భారత వ్యాపారి రికార్డు


ప్రపంచంలోనే ఎత్తైన నిర్మాణమైన దుబాయిలోని ప్రఖ్యాత బుర్జ్‌ ఖలీఫాలో భారతీయ వ్యాపారి, కేరళకు చెందిన జార్జ్‌ వీ నెరియపరంబిల్‌ 22 ఫ్లాట్లను సొంతం చేసుకుని వార్తల్లో నిలిచారు. దీంతో ఆయన బుర్జ్‌ ఖలీఫాలో ఎక్కువ భాగం కలిగిన ప్రైవేటు వ్యక్తిగా రికార్డుకెక్కారు.

పొడవైన గడ్డం పెంచిన తొలి మహిళగా హర్మాన్‌ కౌర్‌ గిన్నిస్‌ రికార్డు


బ్రిటన్‌కు చెందిన సిక్కు మోడల్‌ హర్మాన్‌ కౌర్‌ 6 అంగుళాల పొడవైన గడ్డం పెంచిన తొలి మహిళగా గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. హర్మాన్‌ కౌర్‌కు అండాశయాల్లో నీటి తిత్తుల సమస్య (పాలీసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌) ఉంది. దీని కారణంగా మీసం, గడ్డం వస్తుంది. ఇటీవల తలపాగా, గడ్డంతో లండన్‌ ఫ్యాషన్‌ వీక్‌లో పాల్గొంది. అలా గడ్డంతో ర్యాంప్‌ మీద నడిచిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది.

Thursday, October 6, 2016

తాపేశ్వరం లడ్డూకు గిన్నిస్‌ రికార్డు


వినాయక చవితి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరం సురుచి ఫుడ్స్‌ సంస్థ తయారు చేసిన 29,465 కిలోల (సుమారు 30 టన్నులు) మహాలడ్డూకు గిన్నిస్‌ రికార్డు దక్కింది. ఇప్పటివరకు గుజరాత్‌లోని అంబాజిపట్నంలో తయారు చేసిన 11,115 కిలోల వినాయక లడ్డూకు ఉన్న గిన్నిస్‌ రికార్డును తాపేశ్వరం లడ్డూ అధిగమించింది

Wednesday, October 5, 2016

నరేంద్రమోడి జన్మదినోత్సవం రోజు 3 ప్రపంచ రికార్డులు


ప్రధాని నరేంద్రమోడి తన 66వ జన్మ దినోత్సవాన్ని సొంత రాష్ట్రం గుజరాత్‌లో దాహోద్‌ జిల్లాలోని లిమ్‌ఖేడాలో గిరిజనులతో, నవ్‌సరిలో దివ్యాంగులతో జరుపుకున్నారు. నీటి ఎద్దడి ఉండే దాహోద్‌ జిల్లా నీటి అవసరాలు తీర్చడానికి రూ.4817 కోట్లతో గుజరాత్‌ సర్కారు నిర్మించిన సాగు, తాగునీటి ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ప్రధాని నరేంద్రమోడి పుట్టినరోజు సందర్భంగా దక్షిణ గుజరాత్‌లోని నవ్‌సరిలో ఒకే వేదికపై మూడు ప్రపంచ రికార్డు నమోదయ్యాయి. అవి:
1. 989 మంది చిన్నాయి మట్టి ప్రమిదల్లో 30 సెకన్ల వ్యవధిలో ఒకేసారి దీపాు వెలిగించారు.
2. వెయ్యి మంది దివ్యాంగులైన చిన్నారులు చక్రాల కుర్చీల్లో కూచుని అతిపెద్ద చక్రాల కుర్చీ లోగోను ఏర్పరిచారు. చక్రాల కుర్చీకే పరిమితమైన ఈ వెయ్యి మంది కాషాయ, ధవళ వర్ణపు వస్త్రాల ధరించి ‘హ్యాపీ బర్త్‌డే పీఎం’ అనే అక్షరా రూపంగా కూడా ఏర్పడ్డారు.
3. 1700 మంది బధిరులకు 3,400 వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు. 

Monday, September 12, 2016

సుగారు జసంధిని ఈదిన అత్యంత పెద్ద వయస్కుడిగా తోషియో తొమినాగా రికార్డు


జపాన్‌కు చెందిన తోషియో తొమినాగా (73) జపాన్‌లోని సుగారు జలసంధిని ఈదిన అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించారు. ఉత్తర జపాన్‌లోని సుగారు జలసంధి ఈతకు ప్రపంచంలోనే అత్యంత కష్టసాధ్యమైన వాటిలో ఒకటిగా గుర్తింపు పొందింది.  https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

Sunday, September 11, 2016

అతి పెద్ద నదీ ద్వీపంగా మాజులీ రికార్డు




అసోంలోని మాజులీ ద్వీపాన్ని అతి పెద్ద నదీ ద్వీపంగా గిన్నిస్‌ బుక్‌ గుర్తించింది. ఇది బ్రహ్మపుత్ర నదీ మధ్యలో ఉన్న ద్వీపం. దీని విస్తీర్ణం 880 చదరపు కిలోమీటర్లు. అంటే విస్తీర్ణంలో హైదరాబాద్‌ నగరం కంటే పెద్దది. మాజులీ ద్వీపంలో 144 గ్రామాలున్నాయి. అక్కడి ప్రజల్లో ఎక్కువ మంది అరుణాచల్‌ప్రదేశ్‌ నుంచి వలస వచ్చిన గని కార్మికులే. మాజులీ శాసనసభ నియోజకవర్గం కూడా. అసోం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్‌ ఇక్కడి నుంచే ఎన్నికయ్యారు. https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg



చిన్మయ్‌ కుమార్‌ ఘోష్‌ అనుచరుల రికార్డు


భారత ఆధ్యాత్మిక గురువు చిన్మయ్‌ కుమార్‌ ఘోష్‌ 85వ జయంతి సందరంగా ఆయన అనుచరులు 2016 ఆగస్టులో న్యూయార్క్‌లో 45 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు  గల కేకుపై 72,000 కొవ్వొత్తులు వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించారు. 

Saturday, September 3, 2016

సింగరేణికి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు


2016 జూన్‌ 21అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు కంపెనీవ్యాప్తంగా నిర్వహించిన సామూహిక యోగాకు గాను సింగరేణికి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో చోటు దక్కింది. యోగా దినోత్సవాన్ని సద్వినియోగం చేసుకొని కార్మికులకు యోగా ప్రాముఖ్యత తెలియజేయడానికి ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. కంపెనీ విస్తరించిన ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో ఉన్న 11 ఏరియాల్లో 176 సెంటర్లలో ఒకేసారి యోగా ప్రదర్శనలు నిర్వహించగా 60,369 మంది పాల్గొన్నారు.


Friday, September 2, 2016

నరేంద్రమోడి సూటు గిన్నిస్‌ రికార్డు


భారత ప్రధాని నరేంద్రమోడి ధరించిన సూటు గిన్నిస్‌ ప్రపంచ రికార్డు సాధించింది. డిల్లీలో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాను కలిసినపుడు మోడి వేసుకున్న ఈ సూటు అప్పట్లో వివాదాకు దారితీసింది. అదే వేలంలో అమ్ముడైన అత్యంత ఖరీదైన సూటుగా (రూ.4.31 కోట్లు) రికార్డుకెక్కింది. దీన్ని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి లాల్జీభాయ్‌ తుల్సీభాయ్‌ పటేల్‌ 2015 ఫిబ్రవరి 20న దక్కించుకున్నారు. సూటుపై నరేంద్ర దామోదరదాస్‌ మోదీ అనే బంగారు అక్షరాలను సైతం అమర్చారు. ఈ సూటు ద్వారా లభించిన మొత్తాన్ని గంగా ప్రక్షాళన కార్యక్రమానికి విరాళంగా ఇచ్చారు.


లాల్జీభాయ్‌ తుల్సీభాయ్‌ పటేల్‌



Saturday, August 27, 2016

కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన ఆసియాలో కెల్లా అతిచిన్న వయస్కురాలు నర్సమ్మ


మెదక్‌ జిల్లా కొల్చారం మండలం రంగంపేటకు చెందిన విద్యార్థిని దామని నర్సమ్మ (11) ఆఫ్రికా ఖండంలోనే ఎత్తయిన పర్వతాన్ని 160 మందితో అధిరోహించి ఆసియాలోనే ఈ ఘనత సాధించిన అతి చిన్న వయస్కురాలిగా రికార్డు నమోదు చేసింది. మెదక్‌ జిల్లాలోని కేజీబీవీల్లో చదువుతున్న 9 మంది విద్యార్థినులతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ సంక్షేమ వసతి గృహాలకు చెందిన 12 మంది బృందం 2016 ఆగస్టు 8న టాంజానియాలోని కిలిమంజారో పర్వతారోహణకు బయలుదేరి వెళ్లి, ఆగస్టు 14న ఈ పర్వతాన్ని అధిరోహించారు. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అక్కడే భారత పతాకాన్ని ఎగరేశారు. ఆ బృందంలో నర్సమ్మ కూడా ఉంది. ఈ బృందంలో అతి చిన్న వయస్కురాలుగా నర్సమ్మ మరో రికార్డు దక్కించుకుంది. కిలిమంజారో పర్వతాన్ని 2006లో 10 ఏళ్ల 11 రోజుల వయసులో కాలిఫోర్నియాకు చెందిన బాలిక జోర్డాన్‌ రొమెరో అధిరోహించింది. ప్రపంచంలోనే అతి చిన్న వయసులో ఆ పర్వతాన్ని అధిరోహించిన రికార్డు సొంతం చేసుకుంది. 2014 అక్టోబరు 2న  హైదరాబాద్‌కు చెందిన జాహ్నవి 12 ఏళ్ల 11 నెల ల వయసులో ఈ పర్వతాన్ని అధిరోహించి ఆసియాలోనే అతి చిన్న వయస్కురాలిగా రికార్డు సొంతం చేసుకొంది. 2004 ఆగస్టు 22న జన్మించిన నర్సమ్మ 11 ఏళ్ల 11 నెలల వయసులో ఈ రికార్డును తిరగరాసింది.

Tuesday, August 23, 2016

25 వే అడుగు ఎత్తు నుంచి దూకి రికార్డు


అమెరికన్‌ స్కై డైవర్‌ లూర్యక్‌ ఐకిన్స్‌ ప్యారాచూట్‌ లేకుండా ఆకాశం నుంచి 25 వేల అడుగు ఎత్తు(7.6 కి.మీ.)లో ఉన్న విమానం నుంచి కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వలలో దూకి చరిత్ర సృష్టించాడు. 42 ఏళ్ల లూర్యక్‌కి 18వేల జంప్‌లు చేసిన అనుభవం ఉంది. కాలిఫోర్నియా సమీపంలోని సిమీవ్యాలీ ఈ అరుదైన రికార్డుకు వేదికైంది.