Showing posts with label ఆంధ్రప్రదేశ్ అంశాలు. Show all posts
Showing posts with label ఆంధ్రప్రదేశ్ అంశాలు. Show all posts

Friday, August 18, 2023

Edex : ఎడెక్స్‌తో ఏపీ సర్కార్‌ ఒప్పందం

Edex-successsecret

  • ప్రఖ్యాత మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌  కంపెనీ ఎడెక్స్‌తో ఏపీ సర్కార్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఆగస్టు 17న తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ఎడెక్స్‌ సీఈవో, ‘పద్మశ్రీ’ అనంత్‌ అగర్వాల్‌ ఈ ఒప్పందంపై స్వయంగా సంతకం చేశారు. 
  • ఈ ఒప్పందంలో భాగంగా.. హార్వర్డ్‌, ఎంఐటీ, ఆక్స్‌ఫర్డ్‌, క్రేంబ్రిడ్జి సహా పలు ప్రపంచ అత్యుత్తమ వర్శిటీల నుంచి సంయుక్త సర్టిఫికెట్లను విద్యార్థులకు అందిస్తారు. 
  • ఈ ఒప్పందం ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థికి ప్రపంచప్రఖ్యాత యూనివర్శిటీల కోర్సులను నేర్చుకునే అవకాశం ఉంటుంది. కోర్సులు చేసిన విద్యార్థులకు హార్వర్డ్‌, ఎంఐటీ, క్రేంబ్రిడ్జి, ఆక్స్‌ఫర్డ్‌ లాంటి యూనివర్శిటీలతో ఎడెక్స్‌ సంయుక్త సర్టిఫికేషన్‌ విద్యార్థులకు లభిస్తుంది. 
  • శాస్త్ర, సాంకేతిక, సామాజిక, సాంఘిక శాస్త్రాలకు సంబంధించిన వివిధ రకాల సబ్జెక్టులు, ఈ ఒప్పందం ద్వారా అందుబాటులోకి వస్తాయి. మన దేశంలో లభ్యంకాని ఎన్నోకోర్సులను కూడా నేర్చుకునే అవకాశం వస్తుంది. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ లాంటి కోర్సులే కాదు, ఆర్ట్స్‌, కామర్స్‌లో పలురకాల సబ్జెక్టులకు చెందిన కోర్సులు ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. 


AP Govt  agreement with Edex

  • AP Govt has entered into an agreement with the famous massive open online company Edex. On August 17, EDEX CEO, 'Padmashri' Ananth Agarwal personally signed the agreement at the camp office in Tadepalli.
  • As part of this agreement, joint certificates from many of the world's best universities including Harvard, MIT, Oxford and Cambridge will be provided to the students.
  • This agreement will enable a student pursuing higher education to study courses from world-renowned universities. The students who have completed the courses will get joint certification of EDEX with universities like Harvard, MIT, Cambridge and Oxford.
  • A variety of subjects related to science, technology, social and social sciences, will be made available through this agreement. You will also get a chance to learn many courses which are not available in our country. Not only courses like engineering and medicine, but courses of various subjects in arts and commerce will be made available to students through this agreement.

APRTAcitizen : ఏపీలో డ్రైవింగ్‌ లైసెన్సు, ఆర్‌సీ కార్డులకు సెలవు

APRTAcitizen : ఏపీలో డ్రైవింగ్‌ లైసెన్సు, ఆర్‌సీ కార్డులకు సెలవు

  • వాహన చోదకులకు రవాణా శాఖ జారీ చేసే డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్‌సీలు ఇక కార్డు రూపంలో ఉండవు. సంబంధిత యాప్‌లో డౌన్‌లోడ్‌ చేసిన పత్రాలే దీనికి సరిపోతాయని రవాణాశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 
  • లైసెన్సులు, ఆర్సీలకు ఇప్పటి వరకు కార్డుకు రూ.200, పోస్టల్‌ సర్వీస్‌కు రూ.25 మొత్తం రూ.225 చలానాతో కలిపి వసూలు చేసేవారు. ఇప్పుడు ఆ ఛార్జీలను వసూలు చేయడం లేదు. ఇప్పటికే డబ్బులు చెల్లించిన చోదకులకు మాత్రం త్వరలో కార్డులను అందజేయనున్నారు. 
  • రవాణా శాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ‘వాహన్‌ పరివార్‌’తో సేవలన్నీ ఆన్‌లైన్‌ చేయడంతో చాలా రాష్ట్రాల్లో కార్డులను తొలగించి, డిజిటల్‌ రూపంలోనే పత్రాలు తీసుకొచ్చారు. ఇప్పుడు ఏపీలో కూడా దీన్ని అమల్లోకి తెచ్చారు.
  • రవాణాశాఖ వెబ్‌సైట్‌ హెచ్‌టీటీపీఎస్‌//ఏపీఆర్‌టీఎసిటిజన్‌.ఈప్రగతి.ఓఆర్జీలో ఫారం 6 లేదా 23ని డౌన్‌లోడ్‌ చేసుకొని ధ్రువపత్రాన్ని తీసుకోవాలి. లేదా ‘ఏపీఆర్‌టీఏసిటిజన్‌’ ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ద్వారా యాప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
  • వాహనాల్ని తనిఖీలు చేసే పోలీసు, రవాణాశాఖ అధికారులకు డౌన్‌లోడ్‌ చేసిన పత్రాలను చూపిస్తే సరిపోతుంది. వీటిని అనుమతించాలని తనిఖీలు చేసే పోలీసు, రవాణా తదితర శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


Holiday for driving license and RC cards in AP

  • The driving licenses and RCs issued by the transport department to the vehicle drivers will no longer be in the form of cards. The Transport Commissioner has issued an order that the documents downloaded in the relevant app will be sufficient.
  • Until now, for licenses and RCs, Rs.200 per card and Rs.25 for postal service were charged along with a total of Rs.225 challan. Now those charges are not collected. The drivers who have already paid will be given cards soon.
  • With regard to the transport department, as the central government has made all services online with the 'Vahan Parivar', cards have been removed in many states and documents have been brought in digital form. Now it has been implemented in AP as well.
  • Download Form 6 or 23 from the Transport Department website http://aprtacitizen.epragati.org and take the certificate. Or 'APRTAcitizen' can be downloaded through the app through Android mobile.
  • Just show the downloaded documents to the police and transport officials who inspect the vehicles. Instructions have been issued to the officials of the police, transport and other departments who conduct inspections to allow these.

APPSC : ఏపీపీఎస్సీ రాత పరీక్షలకు తేదీలు ఖరారు

  • ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 11 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల రాత పరీక్షల  తేదీలను 2023 ఆగస్టు 17న ప్రకటించింది. 
  • ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు రాత పరీక్షలు సెప్టెంబరు 25 నుంచి 27వ తేదీ వరకు జరుగుతాయి. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ (భూగర్భ నీటిపారుదల శాఖ), అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌, ఇండస్ట్రీయల్‌ ప్రమోషన్‌ ఆఫీసర్‌, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌, గ్రూపు-4 (లిమిటెడ్‌), జూనియర్‌ ట్రాన్సలేటర్‌ తెలుగు, టెక్నికల్‌ అసిస్టెంట్‌ (మైన్స్‌), డిస్ట్రిక్ట్‌ ప్రొబెషన్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-2 (జువైనల్‌ వెల్ఫేర్‌) ఉద్యోగాలకు జనరల్‌ స్టడీస్‌, మెంటల్‌ ఎబిలిటీ పరీక్ష అక్టోబరు 3న జరగనుంది. 
  • ఈ ఉద్యోగాలకు సంబంధించి సబ్జెక్టు రాత పరీక్షలు వేర్వేరు తేదీల్లో ఆన్‌లైన్‌లో జరుగుతాయి.


Dates for APPSC written exams are finalised

  • Andhra Pradesh Public Service Commission has announced the dates of written examination for 11 posts recruitment notification on 17th August 2023.
  • The written examination for the posts of Forest Range Officer will be held from September 25 to 27. Civil Assistant Surgeon, Technical Assistant (Ground Irrigation Department), Assistant Inspector of Fisheries, Industrial Promotion Officer, Food Safety Officer, Group-4 (Limited), Junior Translator Telugu, Technical Assistant (Mines), District Probation Officer Grade-2 (Juvenile the General Studies and Mental Ability Test for Welfare) Jobs will be held on October 3.
  • Subject wise written tests for these jobs will be conducted online on different dates.

APPSC : గ్రూప్‌-1 ఫలితాలు

  • గ్రూప్‌-1 (28/2022 నోటిఫికేషన్‌) ఉద్యోగాలకు ఎంపిక చేసిన అభ్యర్థులను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది. 111 ఉద్యోగాల భర్తీకి ఎంపిక చేసిన వారిలో 33 మంది మహిళలు ఉన్నారు. ఈ వివరాలను ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతం సవాంగ్‌ 2023 ఆగస్టు 17న వెల్లడిరచారు. 

రాష్ట్ర పోస్టులకు ఎంపికైన 14 మంది మహిళలు

  • ఎంపిక జరిగిన 111 పోస్టుల్లో రాష్ట్ర కేడర్‌కు చెందిన డిప్యూటీ కలెక్టర్‌ 13, సీటీఓ-13, డీఎస్పీ-(సివిల్‌) 13, డీఎస్పీ (జైళ్లు) 2, డిస్ట్రిక్ట్‌ ఫైర్‌ ఆఫీసర్‌-2, ఏటీఓ (టీ అండ్‌ ఏ సర్వీస్‌) పోస్టులు 11 ఉన్నాయి. డీఎస్పీ (జైళ్లు), డిస్ట్రిక్ట్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టుల మినహా మిగిలిన పోస్టులకు ఎంపికైన వారిలో 14 మంది మహిళలు ఉన్నారు.

గ్రూప్‌`1 ఉద్యోగాలకు ఎంపికైన వారిలో తొలి అయిదుగురు అభ్యర్థులు

అభ్యర్థి పేరు విద్యార్హత వర్సీటీ

1. భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష బీఏ పొలిటికల్‌ సైన్స్‌, ఎకనామిక్స్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఢల్లీి

2. భూమిరెడ్డి పావని బీటెక్‌ ఈసీఈ జేఎన్‌టీయూ, అనంతపురం

3. కె.లక్ష్మీప్రసన్న బీటెక్‌ ఐటీ జేఎన్‌టీయూ, అనంతపురం

4. కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి బీటెక్‌ ఈఈఈ జేఎన్‌టీయూ, అనంతపురం

5. ఎం.భానుప్రకాష్‌రెడ్డి బీఏ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఉస్మానియా యూనివర్సిటీ


APPSC Group-1 Results

  • Andhra Pradesh Public Service Commission announced the selected candidates for Group-1 (Notification 28/2022). Out of the 111 posts selected, 33 are women. These details were disclosed by APPSC Chairman Gautam Sawang on 17th August 2023.

14 women selected for state posts

  • - Among the 111 posts selected are Deputy Collector 13, CTO-13, DSP (Civil) 13, DSP (Prisons) 2, District Fire Officer-2, ATO (T&A Service) 11 posts of the state cadre. Apart from the posts of DSP (Jails) and District Fire Officer, there are 14 women selected for the remaining posts.

The first five candidates are selected for Group `1 posts

Name of Candidate Qualification Varsity

1. Bhanushree Lakshmi Annapurna Pratyusha BA Political Science, Economics University of Delhi

2. Bhumi Reddy Pavani B.Tech ECE JNTU, Anantapur

3. K. Lakshmiprasanna B.Tech IT JNTU, Anantapur

4. K. Praveenkumar Reddy B.Tech EEE JNTU, Anantapur

5. M.Bhanuprakash Reddy BA Public Administration Osmania University

STEMI project : స్టెమీ ప్రాజెక్టుతో గుండెకు రక్ష

  • రాష్ట్ర ప్రజల ఆరోగ్య రక్షణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరణ సహా అనేక కార్యక్రమాలు చేపట్టింది. గుండె జబ్బులు, కేన్సర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది.
  • కార్డియాలజీ, కార్డియోవాస్క్యులర్‌ సేవలను మరింతగా విస్తృతం చేసి, ప్రజలకు చేరువ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో గుండె జబ్బులతో బాధపడే గ్రామీ­ణుల­కు సత్వర వైద్య సేవలందించి, వారిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు.
  • ఎస్‌టీ ఎలివేషన్‌ మయోకార్డియల్‌ ఇన్‌ఫార్‌క్షన్‌ (స్టెమి)గా పిలిచే ఈ కార్యక్రమం ద్వారా గుండెపోటు బాధితులకు గోల్డెన్‌ అవర్‌లో 40 నిమిషాల్లోనే చికిత్స అందిస్తారు. తద్వారా బాధితులు ప్రాణాపాయం నుంచి బయటపడటానికి వీలుంటుంది. ఇప్పటికే తిరుపతి రుయా ఆస్పత్రిలో దీనిని పైలెట్‌ ప్రాజెక్టుగా వైద్య, ఆరోగ్య శాఖ అమలులో పెట్టింది.
  • రెండో దశ పైలెట్‌ ప్రాజెక్టును సెప్టెంబర్‌ 29 నుంచి కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం కేంద్రంగా ప్రాజెక్టును అమలు చేస్తారు. జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తారు. ఈలోగా పాత 11 బోధనాస్పత్రుల్లో కార్డియాలజీ, కార్డియో వాస్క్యులర్‌ (సీటీవీఎస్‌) విభాగాలను బలోపేతం చేస్తారు. ఇందుకోసం కార్డియాలజీ, క్యాథ్‌లాబ్‌, సీటీవీఎస్‌ విభాగాల్లో 94 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వివిధ ఆస్పత్రుల్లో రూ.120 కోట్లతో క్యాథ్‌లాబ్స్‌ను సమకూర్చింది.

గుండె సంబంధిత వ్యాధులతోనే 32.4 శాతం మరణాలు 

  • రాష్ట్రంలో సంభవిస్తున్న మరణాల్లో 32.4 శాతం గుండె సంబంధిత వ్యాధుల కారణంగానే ఉంటున్నాయి. రాష్ట్రంలో 38 లక్షల మందికి పైగా గుండె జబ్బుల బాధితులున్నారు. నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌సీడీ)లో గుండె జబ్బులదే అగ్రస్థానం. 
  • ఫ్యామిలీ డాక్టర్‌ విధానం ద్వారా బీపీ, షుగర్‌, ఇతర ఎన్‌సీడీ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యంపై నిరంతర ఫాలోఅప్‌ ఉంచుతున్నారు. ముఖ్యంగా గుండె జబ్బులు, క్యాన్సర్‌ వ్యాధులపై ఫోకస్‌ పెట్టారు. సత్వరమే నాణ్యమైన చికిత్సను అందించడం ద్వారా మరణాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా స్టెమీ ప్రాజెక్టు చేపట్టారు.


Protect the heart with the STEMI project

  • As part of the health protection of the people of the state, the government of Andhra Pradesh has undertaken many programs including the modernization of government hospitals from the village level to the state level. Special focus on heart disease and cancer.
  • Andhra Pradesh Chief Minister YS Jagan has issued orders to expand cardiology and cardiovascular services and make them accessible to the people. In this order, a special program has been designed to provide prompt medical services to villagers suffering from heart diseases and save them from life-threatening condition.
  • Called ST Elevation Myocardial Infarction (STEMI), heart attack victims are treated within 40 minutes of the golden hour. So that the victims can get out of danger. The Medical and Health Department has already implemented this as a pilot project in Tirupati Ruya Hospital.
  • The second phase of the pilot project will be implemented from September 29 in Kurnool, Guntur and Visakhapatnam. It will be spread across the state from January. In the meantime, Cardiology and Cardio Vascular (CTVS) departments will be strengthened in the old 11 teaching hospitals. For this, the government has sanctioned 94 posts in cardiology, cathlab and CTVS departments. It has provided cath labs at a cost of Rs.120 crores in various hospitals.

32.4 percent deaths are due to heart related diseases

  • 32.4 percent of the deaths occurring in the state are due to heart related diseases. More than 38 lakh people are suffering from heart diseases in the state. Heart disease is the leading non-communicable disease (NCD).
  • Continuous follow-up on the health of BP, sugar and other NCD patients is being done through family doctor system. Especially focused on heart diseases and cancer diseases. Measures are being taken to reduce mortality by providing prompt and quality treatment. As a part of this, STEMI project was undertaken.

Saturday, August 12, 2023

APERC : ఏపీఈఆర్‌సీ సభ్యుల ఎంపికకు కమిటీ ఏర్పాటు


  • రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) సభ్యుల ఎంపిక కోసం ముగ్గురు సభ్యులతో సెలక్షన్‌ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2023 ఆగస్టు 11న గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. 
  • కమిటీ ఛైర్మన్‌గా హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌. ఆనందరెడ్డి, సభ్యులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీఈఆర్‌సీ ఛైర్మన్‌లు వ్యవహరిస్తారని పేర్కొంది. ఇద్దరు సభ్యులను కమిటీ ఎంపిక చేస్తుందని, కమిటీ కన్వీనర్‌గా సీఎస్‌ వ్యవహరిస్తారని ప్రభుత్వం తెలిపింది.

PACS : ఆర్‌బీకే వారీగా పీఏసీఎస్‌ ఓటరు జాబితాలు


  • రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్‌), జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకుల్లో సభ్యుల నియామకం, ఓటరు జాబితాల తయారీకి సంబంధించి చట్ట సవరణ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. 
  • సంఘాల పాలకవర్గాల్లో వివిధ రంగాలనుంచి నిపుణుల నియామకం, సీఈఓల ఎంపికకు సంబంధించిన అంశాలనూ ఇందులో పొందుపరిచారు. ఒక ప్రాథమిక సహకార పరపతి సంఘం పరిధిలో ఉండే ఓటర్లను రైతు భరోసా కేంద్రాలవారీగా విభజించి ఓటర్ల జాబితాలను తయారుచేస్తారు. 
  • పాలకవర్గాల్లో వ్యవసాయ, డెయిరీ, పశుసంవర్థక, బ్యాంకింగ్‌, చార్టర్డ్‌ అకౌంటెంట్‌, ఉద్యాన, మత్స్య తదితర రంగాల నిపుణులను నియమిస్తారు. వారికి ఓటింగ్‌ హక్కులు ఉండవు. ఆయా ప్రాంతాల్లోని గ్రామసచివాలయాల్లో పనిచేసే వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పశుసంవర్థక సహాయకుల్ని కోఆప్టెడ్‌ సభ్యులుగా నియమిస్తారు. 
  • ఆప్కాబ్‌ సీఈఓ ఎంపిక కమిటీలో ఆప్కాబ్‌ అధ్యక్షుడు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ సహకారశాఖ ముఖ్య కార్యదర్శులు ఉంటారు. సహకార కేంద్ర బ్యాంకుల సీఈఓల నియామక కమిటీల్లో ఆప్కాబ్‌ అధ్యక్షులతోపాటు ఎండీ, రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్‌, నాబార్డు సీజీఎం ఉంటారు.

AP Sachivalayam : సచివాలయాల స్థాయిలో సమాచార హక్కు చట్టం అమలు


  • గ్రామ సచివాలయాల స్థాయిలోనూ సమాచార హక్కు చట్టం అమలు చేసేందుకు ప్రభుత్వం 2023 ఆగస్టు 9న ఆదేశాలు జారీ చేసింది. 
  • సచివాలయాల్లోని డిజిటల్‌ అసిస్టెంట్లను సహాయ సమాచార అధికారులుగా నియమించింది. ప్రజా సమాచార అధికారి(పీఐఓ)గా పంచాయతీ కార్యదర్శులు వ్యవహరిస్తారు.

AP Revenue : ఆలయాల ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు

 


  • దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 2023 ఆగస్టు 9న ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 
  • 2023 జులై 12 నుంచి ఇది వర్తిస్తుందని, దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే నెల రోజుల్లో తెలపాలని పేర్కొంటూ రెవెన్యూ (దేవాదాయశాఖ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌.కరికాల్‌ వలవన్‌ ఉత్తర్వు జారీచేశారు.

Formative Exams : పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశాలు


  • ఫార్మెటివ్‌, సమ్మెటివ్‌ పరీక్షలు పూర్తయిన తర్వాత ఎప్పటికప్పుడు తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాలని ఏపీ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 
  • ఫార్మెటివ్‌-1 పరీక్షలు పూర్తయినందున 2023 ఆగస్టు 10న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో సమావేశం నిర్వహించాలని సూచించింది. 
  • ‘ఫార్మెటివ్‌-2 పరీక్షలు అక్టోబరు 3-6 వరకు నిర్వహించిన తర్వాత 13న, సమ్మెటివ్‌-1 పరీక్షలు నవంబరు 4 నుంచి 10 వరకు నిర్వహించిన తర్వాత నవంబరు 11న తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలి. 
  • ఫార్మెటివ్‌-3 పరీక్షలు జనవరి 3-6 వరకు 8న తల్లిదండ్రుల సమావేశం, ఫార్మెటివ్‌-4 ఫిబ్రవరి 23-27 వరకు, మార్చి 6న తల్లిదండ్రుల సమావేశం, ఏప్రిల్‌ 11-20 వరకు సమ్మెటివ్‌-2 పరీక్షలు, 23న తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలని ఆదేశించింది.

Tuesday, August 8, 2023

Annavaram : అన్నవరంలో ఒకసారి గది తీసుకుంటే మళ్లీ 3 నెలల తర్వాతే

Annavaram


అన్నవరం దేవస్థానంలో వసతిగదిని ఒకసారి తీసుకుంటే మళ్లీ మూడు నెలల వరకు తీసుకునే అవకాశం లేకుండా అధికారులు నిబంధన పెట్టారు. 

వసతిగదిని తీసుకునే సమయంలో భక్తుడి ఆధార్‌ నంబరును సిబ్బంది నమోదు చేస్తారు. ఇలా ఒక ఆధార్‌ నంబరుపై గదిని పొందిన తర్వాత మళ్లీ 90 రోజుల వరకూ కేటాయింపునకు అవకాశం లేకుండా సాఫ్ట్‌వేర్‌ను తీర్చిదిద్దారు. దీంతో పాటు భక్తులు గది తీసుకునే సమయంలో, ఖాళీ చేసే సమయంలో వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. 

ఏయే వసతి సముదాయం వద్ద ఎన్ని గదులు ఉన్నాయి, ఇందులో ఎన్ని బుక్‌ అయ్యాయి, ఎన్ని ఖాళీగా ఉన్నాయన్న వివరాలతో కొండ దిగువున సీఆర్వో కార్యాలయం వద్ద బోర్డులు ఏర్పాటు చేశారు. దళారీ వ్యవస్థను అరికట్టేందుకు ఈ విధానం అమలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

Thursday, August 3, 2023

గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి చేసే పరిశ్రమలకు ఆర్థిక తోడ్పాటునందించడానికి ప్రారంభించిన పథకం ఏది?


  • గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తికి అనుకూలమైన రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్‌ ఎంపికైంది. ప్రకృతి పరిరక్షణకు ప్రపంచ దేశాలు చేసుకున్న ఒప్పందంలో భాగంగా మన దేశంలో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కొత్త పథకాలు, పాలసీలు తెస్తున్నాయి. వాటి ద్వారా ఈ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నాయి.
  • ఇందులో భాగంగా దేశంలో 4.5 లక్షల టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర పభుత్వం టెండర్లు పిలిచింది. ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఏపీ సహా 10 రాష్ట్రాలు అనుకూలమని  తేల్చింది. దీంతో త్వరలోనే రాష్ట్రంలో గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది.

‘సైట్‌’తో ప్రోత్సాహకాలు..

  • ఏటా 125 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనంతో పాటు 5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి సాధించాలనే లక్ష్యంతో నేషనల్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌ని కేంద్రం తీసుకువచ్చింది. ఇందులో భాగంగా, గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి చేసే పరిశ్రమలకు ఆర్థిక తోడ్పాటునందించడానికి స్ట్రాటజిక్‌ ఇంటర్వెన్షన్‌ ఫర్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ ట్రాన్సిషన్‌ ప్రోగ్రామ్‌ (సైట్‌) పథకాన్ని 2023 జులైలో ప్రవేశపెట్టింది.
  • ఉత్పత్తిదారులకు ఆర్థికంగా చేయూతనందించేందుకు రూ.19,744 కోట్లు కేటాయించింది. 2029-30 వరకు ఈ పథకం అమలులో ఉంటుంది. తొలి ఏడాది రూ.4,440 కోట్లు, రెండో ఏడాది రూ.3,700 కోట్లు, మూడో ఏడాది రూ.2,960 కోట్లు, నాలుగో ఏడాది రూ.2,220 కోట్లు, ఐదో ఏడాది రూ.1,480 కోట్లు చొప్పున ఆర్ధిక ప్రోత్సాహాన్ని అందిస్తుంది. 

SIGHT- Strategic Intervention for Green Hydrogen Transition 

Friday, October 7, 2016

తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధికి కమిటీ


తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన కార్యచరణలకు సంబంధించి అధ్యయనం చేసేందుకు ఏపీ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి రాష్ట్ర భాష, సాంస్కృతిక, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.  డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌, ప్రభుత్వ సహాదారుల పరకా ప్రభాకర్‌, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌, పురావస్తుశాఖ సంచాకు జీవీ రామకృష్ణారావు, సాంస్కృతిక శాఖ సంచాకు డి.విజయభాస్కర్‌ సభ్యులుగా ఉంటారు.

Thursday, October 6, 2016

ఏపీకి ఉత్తమ రాష్ట్ర లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ అవార్డు


దేశంలోనే ఉత్తమ రాష్ట్ర లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌(ఎస్‌ఎల్‌డీసీ)గా ఆంధ్రప్రదేశ్‌ పురస్కారం పొందింది. భారత స్వతంత్ర విద్యుత్తు ఉత్పత్తిదారు సంఘం (ఐపీపీఏఐ) నుంచి ఈ పురస్కారం లభించింది. దశాబ్ద కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత వేగంగా విద్యుదీకరణ సాధించిన సంస్థగా తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌) ను ఐపీపీఏఐ ఎంపిక చేసింది. గోవాలో జరిగిన సమావేశంలో ఈ పురస్కారాలు ప్రదానం చేశారు. 

జాతీయ క్రీడా పోటీ నిర్వహణకు రూ.వెయ్యి కోట్లు


ఆంధ్రప్రదేశ్‌లో 2018లో జరిగే జాతీయ క్రీడా పోటీ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. ప్రధాన నగరాల్లో ఇందుకు అవసరమైన ఏర్పాట్లు కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించింది.

ఏపీకి 2 కొత్త రకం రైళ్లు


ఆంధ్రప్రదేశ్‌కు రెండు కొత్త రకం రైళ్లు ఖరారయ్యాయి. వీటిలో తిరుపతి-జమ్ముతావి మధ్య హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌, విశాఖపట్నం-విజయవాడ మధ్య ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉన్నాయి. ఇవికాకుండా మరో 7 కొత్త రకం రైళ్లు దక్షిణ మధ్యరైల్వే పరిధిలో రాకపోకలు సాగించనున్నాయి. వీటితో కలిపి మొత్తంగా రైల్వేశాఖ దేశవ్యాప్తంగా 23 కొత్త రకం రైళ్లను ప్రకటించింది. ఇందులో 10 హమ్‌సఫర్‌, 3 తేజస్‌, 7 అంత్యోదయ, 3 ఉదయ్‌ రైళ్లు ఉన్నాయి.

దోమపై దండయాత్ర కార్యక్రమం ప్రారంభం


పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దోమపై దండయాత్ర కార్యక్రమాన్ని 2016 సెప్టెంబర్‌ 24న ప్రారంభించారు. దోమ ద్వారా 9 రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని, వీటిని అరికట్టడమే దోమపై దండయాత్ర-పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని సీఎం వెల్లడించారు . 

స్టార్టప్‌ అనుమతులపై ఏపీకి ప్రపంచ బ్యాంక్‌ ప్రశంసలు


రాష్ట్రంలో స్టార్టప్‌కు శీఘ్రగతిన అనుమతులు మంజూరు చేయడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రపంచ బ్యాంకు ప్రశంసలు పొందింది. కేవలం 14 రోజుల్లో అన్ని అనుమతలు జారీ చేసేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్‌ డెస్క్‌ బ్యూరో విధానం సత్ఫలితానిస్తోందని, దేశంలో స్టార్టప్‌కు ఇంత త్వరగా అనుమతులు ఇస్తున్న రాష్ట్రం ఏపీ ఒక్కటే అని ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ అండ్‌ ప్రమోషన్‌ (డీఐపీపీ) తరపున ప్రపంచ బ్యాంకు 2015 సెప్టెంబరులో జరిపిన అధ్యయనంలో వ్యాపారం సుభతరంగా చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ అనువైందని అభిప్రాయపడిరది. 

నెమ్మూరు వద్ద భెల్‌ పరిశ్రమకు శంకుస్థాపన


కృష్ణా జిల్లా నిమ్మకూరు సమీపంలోని నెమ్మూరు వద్ద భెల్‌ పరిశ్రమకు 2016 సెప్టెంబర్‌ 19న శంకుస్థాపన జరిగింది. సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రలు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఏపీలో ఇక తెలుగు తప్పనిసరి


తెలుగు భాష అభివృద్ధిలో భాగంగా దుకాణాలు, వాణిజ్య సముదాయాలపై పేర్లను తప్పనిసరిగా తెలుగులోనే రాయించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఉత్తర్వుల్ని కూడా తెలుగులోనే ఇచ్చారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన శంకుస్థాపనలను, ప్రారంభోత్సవాలకు సంబంధించి శిలాఫలకాలపై వివరాలను తప్పనిసరిగా తెలుగులోనే రాయించాలని అన్ని ప్రభుత్వ శాఖలకు, శాఖాపతులను ప్రభుత్వం ఆదేశించింది.