Showing posts with label నివేదికలు. Show all posts
Showing posts with label నివేదికలు. Show all posts

Saturday, August 12, 2023

Unemployment : నిరుద్యోగం భయపెడుతోంది

 


  • మనదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలు ఏమిటి? అవినీతి, నేరాలు, ఆర్థిక స్థితిగతులపై వారి అభిప్రాయం ఎలా ఉంది? ఏది అతిపెద్ద సమస్య అని ఎక్కువ మంది భావిస్తున్నారు?.. ఈ ప్రశ్నలకు పారిస్‌ కేంద్రంగా పనిచేసే ఇప్సాస్‌ గ్రూపు ‘ప్రపంచాన్ని కలవరపెడుతున్న సమస్యలు ఏమిటి?’ అనే పేరుతో రూపొందించిన నివేదికలో సమాధానాలు చెబుతోంది. మార్కెట్‌ పరిశోధన, కన్సల్టింగ్‌ సేవల సంస్థ అయిన ఇప్సాస్‌ గ్రూపు మనదేశంతో సహా వివిధ దేశాల్లోని తాజా సమస్యలు, సవాళ్లపై అధ్యయనం చేసింది. దీని ప్రకారం..
  • మనదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ద్రవ్యోల్బణం మొదటి స్థానంలో ఉంది. కొంతకాలంగా అన్ని రకాల వస్తు, సేవల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం విదితమే. పెరిగిన ధరలతో.. పేద, మధ్యతరగతి ప్రజలు తల్లడిల్లిపోతున్నారు.  ‘కొవిడ్‌’ కాలంలో అమలు చేసిన ఉద్దీపనా పథకాలు, తదనంతర పరిణామాలతో ద్రవ్యోల్బణం బాగా పెరిగింది. ఇది ఇంకా పూర్తిగా దిగిరానందున, ప్రజలకు ధరాభారం తప్పడం లేదు.
  • ఇదే విషయాన్ని ఇప్సాస్‌ అధ్యయనం నిర్థారించింది.
  • నిరుద్యోగం మనదేశంలో రెండో అతిపెద్ద సమస్యగా ప్రజలు భావిస్తున్నారు. ఆర్థిక- రాజకీయ అవినీతి, నేరాలు- హింస, పేదరికం- సాంఘిక అసమానతలు..  తదుపరి స్థానాల్లో ఉన్నాయి. సంఘటిత రంగాల్లో ఉద్యోగాలు తగినన్ని లభించడం లేదు. అసంఘటిత రంగాల్లోనూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గతంతో పోలిస్తే తగ్గాయి. అదే సమయంలో ఏటా ఉద్యోగాల విపణి (జాబ్‌ మార్కెట్‌) లోకి వచ్చే యువతీ, యువకుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రభుత్వం, పైవేటు రంగ సంస్థలు కల్పించే ఉద్యోగాల సంఖ్య పరిమితంగానే ఉంటోంది.

గతంతో పోలిస్తే మెరుగే

  • ద్రవ్యోల్బణం, నిరుద్యోగం కొంతకాలం నాటి పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ, ఈ సమస్యలను ప్రజలు తీవ్రమైనవిగానే పరిగణిస్తున్నట్లు ఇప్సాస్‌ ఇండియా సీఈఓ అమిత్‌ అదార్కర్‌ వివరించారు. ప్రపంచ వ్యాప్త పరిణామాలు, ఆర్థిక స్థితిగతులు, ఉక్రెయిన్‌ యుద్ధం.. అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగానికి ప్రధాన కారణాలని ఆయన తెలిపారు. ఇటీవల దేశాన్ని వరదలు- భారీ వర్షాలు ముంచెత్తడం వల్ల కొన్ని వస్తువులు, వ్యవసాయ దిగుబడుల ధరలు మళ్లీ పెరిగినట్లు పేర్కొన్నారు. వచ్చే త్రైమాసికంలో ఈ సమస్యలు కొంత తగ్గుముఖం పట్టొచ్చని అభిప్రాయపడ్డారు.

ప్రపంచ సమస్యలూ అవే

  • ఫ్రాన్స్‌లో నేరాలు- హింస అతిపెద్ద సమస్యగా ప్రజలు భావిస్తున్నారు.
  • కొన్ని దేశాల్లో పర్యావరణ మార్పులపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కెనడాలో ఇటువంటి ఆందోళన అధికంగా ఉంది. ప్రపంచ ప్రజల దృష్టిలో ఇది ఇప్పుడు ఏడో అతిపెద్ద సమస్య.
  • ఎక్కువ దేశాల్లో ద్రవ్యోల్బణం అతిపెద్ద సమస్యగా ఉంది. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, బ్రిటన్‌, భారత్‌, పోలెండ్‌, సింగపూర్‌, టర్కీ, యూఎస్‌లలో ధరల పెరుగుదల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.  
  • ప్రపంచ దేశాలను ఇబ్బంది పెడుతున్న 5 అతిపెద్ద సమస్యల్లో (ప్రాధాన్యతా క్రమంలో) ద్రవ్యోల్బణం, నేరాలు- హింస, పేదరికం-  సాంఘిక అసమానతలు, నిరుద్యోగం, ఆర్థిక- రాజకీయ అవినీతి ఉన్నాయి.
  • ‘కొవిడ్‌’ ముప్పును ఇప్పుడు పెద్ద సమస్యగా ప్రజలు భావించడం లేదు. అందువల్ల ప్రాధాన్యతా క్రమంలో ఇది వెనక్కి వెళ్లిపోయింది.

ఆర్థిక వ్యవస్థ బాగానే ఉందా?

  • తమ దేశాలు ఆర్థికంగా సరైన దారిలోనే పయనిస్తున్నాయనే అభిప్రాయం 29 దేశాల్లో వ్యక్తమైంది. ఆర్థిక వ్యవస్థపై ప్రజలు ఎక్కువ నమ్మకాన్ని ప్రదర్శించిన దేశాల్లో సింగపూర్‌, భారతదేశం, ఇండోనేషియా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో అట్టడుగున జపాన్‌, దక్షిణ కొరియా దేశాలు కనిపిస్తున్నాయి. కొలంబియా, అమెరికా, స్పెయిన్‌ దేశాల్లో గతంతో పోల్చితే పరిస్థితి కొంత మెరుగుపడగా, టర్కీ, నెదర్లాండ్స్‌ ఇంకా కిందకు దిగిపోయాయి.

PMJAY : పీఎంజేఏవై కాగ్‌ నివేదిక

 


  • ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన కింద ఆంధ్రప్రదేశ్‌లో ఎంప్యానల్‌ అయిన 1,421 ఆసుపత్రుల్లో 524 ఆసుపత్రులు ఎలాంటి సేవలూ అందించడం లేదని కాగ్‌ పేర్కొంది. వాటి నుంచి ఒక్క క్లెయిమ్‌ కూడా రాలేదని తెలిపింది. 
  • మరో 81 ఆసుపత్రుల నుంచి 5 వరకు మాత్రమే క్లెయిమ్‌లు వచ్చినట్లు వెల్లడిరచింది. దీన్ని బట్టి ఇక్కడ ఎంప్యానల్డ్‌ ఆసుపత్రులు పూర్తిస్థాయిలో పనిచేయడంలేదని తెలుస్తున్నట్లు కాగ్‌ అభిప్రాయపడిరది. 
  • 2018 నుంచి 2021 మార్చి వరకు ఈ పథకం అమలు తీరు గురించి అధ్యయనం చేసి పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కాగ్‌ ఈ విషయాన్ని వెల్లడిరచింది. ఆంధ్రప్రదేశ్‌లోని 6 జిల్లాల్లోని 48 ఆసుపత్రుల నుంచి నమూనాలు సేకరించి పరిస్థితిని విశ్లేషించినట్లు పేర్కొంది.
  • ఆంధ్రప్రదేశ్‌లో ఆసుపత్రులకు రూ. 19.12 కోట్లు అధికంగా చెల్లించారు. ఇక్కడ స్టేట్‌ హెల్త్‌ అథారిటీ (ఎస్‌హెచ్‌ఏ) నెట్‌వర్క్‌ ఆసుపత్రుల ద్వారా ఉచిత వైద్యసేవలు అందిస్తోంది. ప్రతి ప్యాకేజీ రేట్లు ముందే ఖరారయ్యాయి. అయితే క్లెయిమ్స్‌ డేటా పరిశీలిస్తే 20,354 క్లెయిమ్‌లను అధిక ప్యాకేజీ రేట్లతో ఎస్‌హెచ్‌ఏ ఆమోదించినట్లు కనిపించింది. తద్వారా ఆసుపత్రులకు రూ. 19.12 కోట్లు అధికంగా చెల్లించారు. మరోవైపు సర్జికల్‌, మెడికల్‌ ప్యాకేజీలను ఒకేసమయంలో బుకింగ్‌ చేసుకోవడానికి పీఎంజేఏవై మార్గదర్శకాలు అనుమతించవు. అయినప్పటికీ సర్జికల్‌ ప్రొసీజర్స్‌తోపాటు, మెడికల్‌ ప్రొసీజర్స్‌కు రూ. 4.63 కోట్లు చెల్లించారు. ఇందుకు ఎస్‌హెచ్‌ఏ ఆమోదముద్ర వేసింది.
  • జాతీయ వైద్య ప్రాధికార సంస్థతో పంచుకున్న డేటాలో కీలకమైన తేదీలు లేవు.  
  • 2 కేసుల్లో డిశ్చార్జి చేసిన తర్వాత సర్జరీ చేసినట్లు తేదీ చూపారు. ఇలాంటి క్లెయిమ్‌లకు రూ. 28,602 చెల్లించారు.
  • 37,602 కేసుల వయసు జీరోగా, ఏడుగురి రోగుల వయసు 100 నుంచి 139 వరకు చూపారు.
  • నేషనల్‌ హెల్త్‌ అథారిటీ 2020 జనవరి 1 నుంచి డిసెంబరు 31వ తేదీలోపు ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ హెల్త్‌ అథారిటీకి రూ. 8.37 కోట్ల గ్రాంట్‌ అధికంగా చెల్లించింది.
  • ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ హెల్త్‌ అథారిటీలో మానవ వనరుల కొరత ఉంది. ఇక్కడ 230 పోస్టులకుగాను 178 మందే పనిచేస్తున్నారు.  
  • ఈ పథకం కింద ఎంప్యానల్‌ అయిన ఆసుపత్రులు ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి లక్షమంది జనాభాకు 12.4 మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

Girl Eductaion : ‘గ్రామీణ భారతంలో ప్రాథమిక విద్య స్థితిగతులు-2023’

 


  • తమ అమ్మాయి ఉన్నత విద్య అభ్యసించాలని ఊర్లలోనూ అత్యధిక శాతం తల్లిదండ్రులు ఆకాంక్షిస్తున్నట్లు తాజా సర్వే ఒకటి తేల్చింది. ఆడపిల్లల్ని కనీసం గ్రాడ్యుయేషన్‌ చదివించాలని గ్రామీణ భారత్‌లో కనీసం 78% తల్లిదండ్రులు కోరుకుంటున్నట్లు నిర్ధారించింది. 
  • 20 రాష్ట్రాల్లో 6,629 గ్రామీణ కుటుంబాలపై ట్రాన్స్‌ఫార్మింగ్‌ రూరల్‌ ఇండియా ఫౌండేషన్‌ (టీఆర్‌ఎఫ్‌ఐ) నిర్వహించిన సర్వే నివేదికను ‘గ్రామీణ భారతంలో ప్రాథమిక విద్య స్థితిగతులు-2023’ పేరుతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ 2023 ఆగస్టు 8న విడుదల చేశారు.

నివేదికలోని ముఖ్యాంశాలు..

  • పిల్లల ఉన్నత చదువులకు సంబంధించి తల్లిదండ్రుల ఆలోచనా ధోరణిలో పెద్దగా వ్యత్యాసమేమీ లేదు. బాలుర తల్లిదండ్రుల్లో 82% మంది తమ పిల్లాడిని కనీసం డిగ్రీ, వీలైతే అంతకంటే ఎక్కువ చదివించాలని కోరుకుంటున్నారు. బాలికల తల్లిదండ్రుల్లో 78% మంది అలా ఆకాంక్షిస్తున్నారు.
  • బాలుర డ్రాపవుట్లలో నాలుగో వంతు.. ప్రాథమిక విద్య సమయంలోనే చోటుచేసుకుంటున్నాయి. ఆ దశలో బాలికల డ్రాపవుట్లు 35% వరకూ ఉంటున్నాయి.
  • ప్రాథమిక విద్య ముగిశాక చదువు మానేసేవారి సంఖ్య బాలురలో 75%, బాలికల్లో 65% దాకా కనిపించింది. సొంత ఊర్లలో, వాటికి చేరువలో అంతకంటే ఎక్కువ చదువుకునేందుకు విద్యాసంస్థలు అందుబాటులో లేకపోవడం అందుకు ఓ కారణం.
  • 62.5% చిన్నారులు ఇంటికొచ్చాక వారి తల్లి పర్యవేక్షణలో చదువుకుంటున్నారు.
  • 38% పైగా తల్లిదండ్రులు ప్రైవేటు ట్యూటర్లనూ ఏర్పాటుచేసేందుకు మొగ్గుచూపుతున్నారు.
  • దాదాపు 73% పిల్లలు రోజుకు రెండు కంటల కంటే తక్కువ సమయం స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తున్నారు. 1-3 తరగతుల చిన్నారుల్లో 16.8% మంది ప్రతిరోజు 2-4 గంటలపాటు స్మార్ట్‌ఫోన్‌ చూస్తుండగా.. 8వ తరగతి, ఆపైన చదువుకుంటున్నవారిలో అంతసేపు స్మార్ట్‌ఫోన్‌ వాడేవారు 25.4% దాకా ఉన్నారు.

Elnino, Lanina : ఎల్‌ నినో, లా నినాల ప్రభావం ఉత్తర భారత్‌పైనే ఎక్కువ

 


  • ఉత్తర భారతంలో వర్షపాతంపై ఎల్‌ నినో, లా నినాల ప్రభావం చాలా బలంగా ఉంటుందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. మధ్య భారత్‌లో వానల రాకను మాత్రం అవి అంతగా ప్రభావితం చేయడం లేదని నిర్ధారించింది. 
  • ఎల్‌ నినో, లా నినా అనేవి రెండు పరస్పర విరుద్ధ దృగ్విషయాలు. ఎల్‌ నినో వల్ల దక్షిణ అమెరికా సమీపంలో పసిఫిక్‌ మహాసముద్ర జలాలు వేడెక్కుతాయి. రుతుపవనాలు బలహీనపడతాయి. భారత్‌లో వర్షపాతం తగ్గుతుంది. 
  • లా నినాతో మన దేశంలో వానలు సమృద్ధిగా కురుస్తాయి. వీటిపై పుణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటీరియాలజీ శాస్త్రవేత్తల నేతృత్వంలోని బృందం తాజాగా ఓ అధ్యయనాన్ని నిర్వహించింది. 
  • అందులో తేలిన అంశాల ప్రకారం- వర్షపాతంపై ఎల్‌ నినో, లా నినాల ప్రభావం 1901 నుంచి 1940 వరకు గణనీయంగా పెరిగింది. 1941-80 మధ్య అది నిలకడగా ఉంది. 1981 తర్వాత బలహీనపడిరది. అయితే భారత్‌ అంతటా పరిస్థితి ఒకేలా మాత్రం లేదు. ఉత్తర భారత్‌పై ఎల్‌ నినో, లా నినాల ప్రభావం గత కొన్ని దశాబ్దాల్లో బాగా పెరిగింది. మధ్య భారత్‌పై తగ్గింది. దక్షిణ భారత్‌ విషయంలో మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో మార్పులు చోటుచేసుకోలేదు.

TB : సరైన పోషణతో క్షయ వ్యాప్తికి స్వస్తి


  • క్షయ వ్యాధి బాధితుల కుటుంబాల్లో ఇతరులకూ ఆ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది. అటువంటి వారికి సరైన పోషకాహారం అందిస్తే క్షయ వచ్చే ప్రమాదం సగానికి సగం తగ్గిపోతుందని ఓ అధ్యయనం తెలిపింది. 
  • మంగళూరులోని యెనెపోయా వైద్య కళాశాలతోపాటు పలు జాతీయ సంస్థలు ఈ అధ్యయనంలో పాల్గొన్నాయి. కెనడాకు చెందిన మెగిల్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులూ పాలు పంచుకున్నారు. 
  • రaార్ఖండ్‌లోని నాలుగు జిల్లాల్లో 2,800 మంది క్షయ రోగుల కుటుంబ సభ్యులపై అధ్యయనం చేశారు. ప్రతి క్షయ రోగికి నెలకు సరిపడా బియ్యం, పప్పులు, నూనె, పాల పొడితో కూడిన 10 కిలోల సంచీని అందించారు. 
  • రోగి కుటుంబ సభ్యులకు తలా 5 కిలోల బియ్యం, ఒకటిన్నర కిలోల పప్పుల చొప్పున ఇచ్చారు. వారెవరికీ క్షయ లేదని ముందే నిర్ధారించుకున్నారు. అధ్యయనానికి ఎంచుకున్న వారిలో మూడిరట రెండొంతుల మంది రaార్ఖండ్‌ గిరిజన తెగలకు చెందినవారే. 
  • అధ్యయనం చేసిన మొత్తం కుటుంబీకుల్లో 34 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఊపిరితిత్తుల క్షయతో బాధపడుతున్న రోగుల కుటుంబ సభ్యులకు బలమైన ఆహారం అందించినప్పుడు వారికి అన్ని రకాల క్షయ సోకే ప్రమాదం 40 శాతం, అంటువ్యాధిలా వ్యాపించే క్షయ 50 శాతం తగ్గిపోయింది. 
  • అసలు సగం మంది క్షయ రోగులకు పోషకాహార లోపంవల్లే వ్యాధి వచ్చింది. సరైన  పోషణ లభించి మొదటి రెండు నెలల్లో బరువు పెరిగిన రోగుల్లో 60 శాతం మందికి మృత్యు ప్రమాదం తప్పింది. చికిత్స ప్రారంభమైనప్పుడు 3 శాతం మంది రోగులే పని చేయగల స్థితిలో ఉండగా, చికిత్స పూర్తయ్యాక 75 శాతం మంది పని చేయడానికి సత్తువ సంపాదించగలిగారు. 
  • బలమైన ఆహారం క్షయ చికిత్సలో అంతర్భాగం. 2021లో భారతదేశంలో 30 లక్షల మంది క్షయ రోగులు ఉండగా, వారిలో హెచ్‌ఐవీ లేని రోగులు 4,94,000 మంది మరణించారు. 2025కల్లా క్షయ మరణాలను 90 శాతం తగ్గించాలని భారత్‌ లక్షిస్తోంది.

Justice : ఉన్నత న్యాయస్థానాల్లో బలహీనవర్గాలకు ప్రాతినిధ్యం లభించాలి


  • సుప్రీంకోర్టు, హైకోర్టు ఉన్నత న్యాయమూర్తుల పదవుల్లో వైవిధ్యం లోపించిందనీ, షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు, ఓబీసీలు, మహిళలు, మైనారిటీలకు ఆ పదవుల్లో సముచిత ప్రాతినిధ్యం లభించడం లేదని పార్లమెంటరీ సంఘం అభిప్రాయపడిరది. 
  • న్యాయ, సిబ్బంది వ్యవహారాలపై ఏర్పడిన ఈ పార్లమెంటరీ స్థాయీ సంఘానికి భాజపా సభ్యుడు సుశీల్‌ కుమార్‌ మోదీ నేతృత్వం వహిస్తున్నారు. న్యాయ ప్రక్రియలు, సంస్కరణలపై ఈ సంఘం నివేదిక సమర్పించింది. ఉన్నతస్థాయి న్యాయస్థానాలలో బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం రానురానూ తగ్గిపోతోందని విచారం వ్యక్తం చేసింది. 
  • సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో రిజర్వేషన్‌ పద్ధతి లేకపోయినా, భారతీయ సమాజంలోని వివిధ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తే ప్రజల్లో న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం మరింత పెరుగుతుందని పేర్కొంది. న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలకు పాటించాల్సిన మార్గదర్శకాల్లో ఈ అంశాన్ని పొందుపరచాలని సూచించింది.

Fat Persons : ఊబకాయుల్లో ఆకలి నియంత్రణ భిన్నం

 


  • ఆకలి నియంత్రణలో కీలక పాత్ర పోషించే మెదడు భాగం హైపోథాలమస్‌.. ఊబకాయుల్లో విభిన్నంగా ఉంటుందని బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. 
  • బరువు నియంత్రణ, ఆహార వినియోగం వంటి అంశాల్లో ఈ భాగం పాత్రపై సరికొత్త ఆధారాలు లభించినట్లయిందని  పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 190 కోట్ల మంది.. ఆరోగ్యకర స్థాయిని మించి బరువు కలిగి ఉండటమో, ఊబకాయం బారినపడటమో జరిగిందని తాజా అంచనాలు చెబుతున్నాయి. 
  • ‘‘మనం ఎంత తినాలన్నది నిర్దేశించేది హైపోథాలమస్‌ అని ఇప్పటికే వెల్లడైంది. మానవులకు సంబంధించి ఈ భాగం గురించి ప్రత్యక్ష సమాచారం పెద్దగా లేదు. హైపోథాలమస్‌ చాలా చిన్నగా ఉండటం, సాధారణ ఎమ్మారై బ్రెయిన్‌ స్కాన్‌లో దాన్ని నిర్దిష్టంగా గుర్తించడం కష్టం కావడమే ఇందుకు కారణం’’ అని పరిశోధనకు నాయకత్వం వహించిన స్టిఫానీ బ్రౌన్‌ పేర్కొన్నారు.

Air Pollution : వాయు కాలుష్యంతో మొండి బ్యాక్టీరియా

  • వాయు కాలుష్యం కారణంగా యాంటీబయాటిక్‌ నిరోధకత కూడా పెరుగుతోందని తాజా అధ్యయనం తేల్చింది. దీనివల్ల వ్యాధికారక బ్యాక్టీరియా మొండిగా తయారవుతున్నట్లు పేర్కొంది. 
  • ఫలితంగా ఆ జీవులు యాంటీబయాటిక్‌ మందులను తట్టుకొని జీవించే సామర్థ్యాన్ని సాధిస్తున్నాయని వెల్లడిరచింది. 2000 నుంచి 2018 మధ్య 116 దేశాలకు సంబంధించిన డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. 
  • వాతావరణంలో సూక్ష్మంగా ఉండే పీఎం2.5 రేణువుల సంఖ్య పెరిగితే యాంటీ బయాటిక్‌ నిరోధకత పెరుగుతున్నట్లు గుర్తించారు. పరిశ్రమలు, రవాణా రంగం, బొగ్గును మండిరచినప్పుడు ఈ రేణువులు వెలువడుతుంటాయి. 
  • ప్రపంచంలో 730 కోట్ల మంది ప్రజలు సురక్షిత స్థాయిని మించి పీఎం2.5 రేణువులు కలిగిన వాతావరణంలో ఉంటున్నారు. యాంటీబయాటిక్‌ నిరోధకతలో సరాసరిన 11 శాతం మార్పులకు ఈ రేణువులు కారణమవుతున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

India Economy : ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌


  • వచ్చే నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ జీఎస్‌డీపీ ఏకంగా రూ.20 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు ‘ఎస్‌బీఐ రీసెర్చ్‌’ నివేదిక వెల్లడిరచింది.
  • 2022 సంవత్సరం నుంచి ఏపీ వేగవంతమైన వృద్ధి నమోదు చేస్తున్నట్లు నివేదిక తెలిపింది. 2027 నాటికి దేశ ఆర్థిక పరిస్థితితోపాటు ఏపీ సహా 15 రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల తీరు తెన్నులపై ‘ఎస్‌బీఐ రీసెర్చ్‌’ నివేదికను విడుదల చేసింది. 2027 నాటికి తెలంగాణను అధిగమించి ఆంధ్రప్రదేశ్‌ స్థూల ఉత్పత్తి పెరుగుతుందని నివేదిక స్పష్టం చేసింది. 

ఎస్‌బీఐ రీసెర్చ్‌’ ముఖ్యాంశాలు..

  • దేశంలో 2022 నుంచి వృద్ధి వేగం పుంజుకుంది. 2027 నాటికి భారత్‌ ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. 
  • దేశ ప్రస్తుత వృద్ధి రేటును పరిగణలోకి తీసు కుంటే 2027 నాటికి జపాన్‌, జర్మనీలను అధిగమిస్తుంది. ప్రపంచ జీడీపీలో భారత్‌ వాటా నాలుగు శాతాన్ని దాటుతుంది. ప్రపంచ దేశాల జీడీపీలో భారత్‌ 2014లో పదో ర్యాంకులో ఉండగా 2015లో 7వ ర్యాంకులో నిలిచింది. 2019లో ఆరో ర్యాంకులో ఉంది. 2022లో ఐదో ర్యాంకులో ఉండగా 2027 నాటికి మూడో ర్యాంకులో నిలిచే అవకాశం ఉంది. 
  • 2027 నాటికి భారత్‌ జీడీపీ రూ.420.24 లక్షల కోట్లకు చేరుతుంది. ఇందులో 15 రాష్ట్రాల నుంచే దేశ జీడీపీకి రూ.358.40 లక్షల కోట్లు సమకూరనుండటం గమనార్హం. దీనికి సంబంధించి అత్యధికంగా 13 శాతం వాటాతో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలవనుంది. ఉత్తర్‌ప్రదేశ్‌ 10 శాతం వాటాతో రెండో స్థానంలో, ఐదు శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్‌ ఏడో స్థానంలో నిలవనున్నాయి.
  • 2027 నాటికి భారత్‌లో కొన్ని రాష్ట్రాలు ఏకంగా కొన్ని దేశాలకు మించి వృద్ధి నమోదు చేస్తాయి. 
  • ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రూ.11 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నమోదు కాగా 2027 నాటికి రూ.20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. అంటే నాలుగేళ్లలో ఏపీ స్థూల ఉత్పత్తి దాదాపు రెట్టింపు కానుంది.

Tuesday, August 8, 2023

Sub-classification of OBCs : ఓబీసీల ఉప వర్గీకరణపై రాష్ట్రపతికి నివేదిక

Justice Rohini

  • ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీ) ఉప వర్గీకరణ అంశాన్ని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన జస్టిస్‌ రోహిణి కమిషన్‌ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు తన నివేదికను అందజేసింది. 
  • 2017 అక్టోబరులో జారీ చేసిన నోటిఫికేషను ఆధారంగా దిల్లీ హైకోర్టు రిటైర్డ్‌ సీజే జస్టిస్‌ జి.రోహిణి అధ్యక్షతన ఈ కమిషన్‌ను నియమించారు. 
  • 13 సార్లు గడువు పొడిగించిన తర్వాత.. 2023 జులై 31న ఈ కమిషన్‌ రాష్ట్రపతికి నివేదికను అందజేసినట్లు సామాజిక న్యాయ మంత్రిత్వశాఖ వెల్లడిరచింది. 
  • ఓబీసీ కేంద్ర జాబితాలోని వివిధ దరఖాస్తులను కమిషన్‌ పరిశీలించింది.

Thursday, August 3, 2023

బాలికలు, మహిళలు మిస్సింగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది?


  • దేశంలో 2019-21 సంవత్సరాల మధ్య 13.13 లక్షల మంది బాలికలు, మహిళలు కనిపించకుండాపోయారని కేంద్రం తెలిపింది. ఇందులో మధ్యప్రదేశ్‌ నుంచి అత్యధికంగా సుమారు 2 లక్షల మంది ఉన్నారని, ఆ తర్వాతి స్థానంలో పశ్చిమ బెంగాల్‌ ఉందని పేర్కొంది. 
  • పార్లమెంట్‌లో కేంద్ర హోం శాఖ ఇందుకు సంబంధించి నేషనల్‌ క్క్రెం రికార్డ్స్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) నమోదు చేసిన గణాంకాలను వెల్లడిరచింది. మూడేళ్ల కాలంలో మిస్సయిన మొత్తం 13.13 లక్షల మందిలో బాలికలు 2,51,430 మంది కాగా, 18 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 10,61,648 అని వివరించింది.
  • 2019-2021 మధ్య మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 1,60,180 మహిళలు, 38,234 మంది బాలికలు అదృశ్యమయినట్లు ఆ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లో 1,56,905 మంది మహిళలు, 36,606 మంది బాలికలు మిస్సయ్యారని తెలిపింది. ఇదే సమయంలో మహారాష్ట్రలో 1,78,400 మంది మహిళలు, 13,033 మంది బాలికలు.. ఒడిశాలో 70,222 మంది మహిళలు, 16,649 మంది బాలికలు..ఛత్తీస్‌గఢ్‌లో 49,116 మంది మహిళలు, 10,817 మంది బాలికలు కనిపించకుండాపోయారు. 2019-21 మధ్య ఢల్లీిలో 61,054 మంది మహిళలు, 22,919 మంది బాలికలు కనిపించకుండాపోయారు.

Wednesday, August 2, 2023

తీవ్ర శారీరక శ్రమ కొద్ది నిమిషాలైనా మేలే


  • రోజువారీ పనుల్లో భాగంగా ఆయాసపడే స్థాయిలో 4-5 నిమిషాల పాటు చేసే తీవ్ర శారీరక శ్రమ వల్ల క్యాన్సర్ల ముప్పు 32 శాతం తగ్గుతుందని తాజా అధ్యయనం పేర్కొంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. 
  • వ్యాయామాలు చేయని 22వేల మంది రోజువారీ కార్యకలాపాలను.. శరీరంపై ధరించే వేరబుల్‌ సాధనాల డేటా ఆధారంగా వీరు పరిశీలించారు. ఏడేళ్ల పాటు పరీక్షార్థుల ఆరోగ్య రికార్డులను విశ్లేషించారు. వారికి క్యాన్సర్‌ వచ్చిందా అన్నది పరిశీలించారు. ఏమాత్రం శారీరక శ్రమ చేయనివారితో పోలిస్తే.. దైనందిన జీవనశైలిలో భాగంగా నిమిషం నిడివి ఉండే తీవ్రస్థాయి శారీరక శ్రమను రోజులో 4-5 నిమిషాల పాటు చేసినా.. అన్నిరకాల క్యాన్సర్ల ముప్పు 18 శాతం మేర తగ్గుతుందని వెల్లడైంది. 
  • శారీరక శ్రమతో ముడిపడ్డ క్యాన్సర్ల విషయంలో ఇది 32 శాతంగా ఉందని తేలింది. ఇంటిపని, సరకుల దుకాణంలో చురుగ్గా షాపింగ్‌ చేయడం, వేగంగా నడవడం, పిల్లలతో కలిసి తీవ్రస్థాయి శారీరక శ్రమతో కూడిన ఆటలు వంటివి కొద్దిసేపు సాగించినా ప్రయోజనం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. రోజువారీ పనిలో భాగంగా చేసే తీవ్ర శ్రమను కొలిచే సాధనాలు ఇటీవలి వరకూ లేదు. వేరబుల్‌ ఎలక్ట్రానిక్‌ సాధనాలు రావడంతో పరిస్థితి మారిందని పరిశోధకులు తెలిపారు.

Tuesday, July 18, 2023

ఒడిశా రైలు ప్రమాదంపై రైల్వే భద్రత కమిషనర్‌ నివేదిక


  • ఒడిశాలోని బాలేశ్వర్‌ వద్ద 2023 జూన్‌ 3న 12841 షాలీమార్‌-చెన్నై కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు జరిగిన ఘోర రైలు ప్రమాదానికి ప్రధాన కారణం తప్పుడు సిగ్నలేనని ‘రైల్వే భద్రత కమిషనర్‌’(సీఆర్‌ఎస్‌) దర్యాప్తు నివేదిక స్పష్టంచేసింది. దీంతోపాటు వేర్వేరు స్థాయిల్లో వైఫల్యాలు ఉన్నాయని తేల్చింది. ఈ మేరకు రైల్వేబోర్డుకు నివేదిక సమర్పించింది.
  • రైలు దుర్ఘటనకు దారితీసిన కారణాలను దానిలో విశ్లేషించింది. తప్పుడు వైరింగ్‌, తప్పుడు కేబుల్‌ అనుసంధానత వల్ల 2022 మే 16న ఆగ్నేయరైల్వే ఖరగ్‌పుర్‌ డివిజన్లో ఇదే తరహాలో జరిగిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకొని, లోపాన్ని సరిచేసి ఉంటే కోరమండల్‌ ప్రమాదం తప్పేదని అభిప్రాయపడిరది. సిగ్నలింగ్‌, సర్క్యూట్‌ మార్పులో లోపాలే ఈ ప్రమాదానికి కారణమని తేల్చింది. ఆగిఉన్న గూడ్సు రైలును బహానగాబజార్‌ రైల్వేస్టేషన్‌ వద్ద కోరమండల్‌ ఢీకొని పట్టాలు తప్పడం, ఆ పెట్టెలు ఎగిరిపడి, పక్కనున్న మార్గంలో వస్తున్న యశ్వంతపుర్‌ రైలులో చివరి పెట్టెలను ఢీకొట్టడం తెలిసిందే. ఆ ప్రమాదంలో 292 మంది ప్రాణాలు కోల్పోగా వెయ్యిమందికి పైగా గాయపడ్డారు. యావద్దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటనపై సీఆర్‌ఎస్‌తో పాటు సీబీఐ విచారణ చేపట్టింది.

సీఆర్‌ఎస్‌ నివేదికలో కొన్ని అంశాలు

  • సిగ్నల్‌ వ్యవస్థలో లోపాలున్నాయి. రెండు సమాంతర మార్గాలను అనుసంధానించే స్విచ్‌లు పలుమార్లు అసాధారణంగా పనిచేస్తున్నాయని బహానగాబజార్‌ స్టేషన్‌ మేనేజర్‌ చేసిన ఫిర్యాదుపై సిగ్నల్‌-టెలికాం సిబ్బంది తగిన చర్యలు తీసుకుని ఉండాల్సింది.
  • బహానగాబజార్‌ స్టేషన్‌ సమీపంలోని లెవెల్‌ క్రాసింగ్‌ గేట్‌ 94 వద్ద ‘ఎలక్ట్రిక్‌ లిఫ్టింగ్‌ బ్యారియర్‌’ను మార్చే పనుల ఆమోదానికి నిర్దిష్ట సర్క్యూట్‌ డయాగ్రమ్‌ను సరఫరా చేయకపోవడం తప్పు.దానివల్లనే తప్పుడు వైరింగ్‌ జరిగింది. కొందరు క్షేత్రస్థాయి పర్యవేక్షకులు వైరింగ్‌ డయాగ్రమ్‌ను మార్చినా దానిని అమలు చేయడంలో విఫలమయ్యారు.
  • ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ స్పందన వేగంగా ఉండాలి. రైల్వే జోన్లకు, విపత్తు యాజమాన్య బృందాలకు మధ్య సమన్వయంపై సమీక్ష జరగాలి.
  • ఉత్తర సిగ్నల్‌ గూమ్టీ వద్ద గతంలో జరిగిన సిగ్నలింగ్‌లో తప్పిదం వల్లనే గూడ్సు రైలును వెనకవైపు నుంచి కోరమండల్‌ ఢీకొట్టింది. సిగ్నల్‌ వైరింగ్‌ చిత్రాలను, ఇతర పత్రాలను, సర్క్యూట్లను తాజాపరిచే కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలి.
  • సిగ్నల్‌ ఆధునికీకరణ పనులు చేపట్టడానికి ప్రామాణిక నిర్వహణ అభ్యాసాలను అనుసరించాలి. సిగ్నల్‌ సర్క్యూట్లలో ఎలాంటి మార్పు చేయాలన్నా ఆమోదిత చిత్రం ఉండాలి. మార్పులు చేసిన సిగ్నల్‌ సర్క్యూట్ల పనితీరును పరీక్షించి, మార్గాన్ని పునరుద్ధరించేముందు తనిఖీ చేయడానికి విడిగా ఒక బృందాన్ని నియమించాలి.

Saturday, October 1, 2016

ఫార్చ్యూన్‌ శక్తివంతమైన మహిళల్లో ముగ్గురు భారతీయులు



ఫార్చ్యూన్‌ తాజాగా రూపొందించిన అమెరికాకు వెలుపల అత్యంత శక్తివంతమైన 50 మంది మహిళల జాబితాలో అరుంధతీ భట్టాచార్య చందా కొచర్‌, శిఖాశర్మ స్థానం పొందారు. ఎస్‌బీఐ చీఫ్‌ అరుంధతీ భట్టాచార్య జాబితాలో రెండో స్థానాన్ని కైవసం చేసుకోగా, ఐసీఐసీఐ బ్యాంక్‌ హెడ్‌ చందా కొచర్‌ 5వ స్థానంలో నిలిచారు. యాక్సిస్‌ బ్యాంక్‌ సీఈవో శిఖాశర్మ 19వ స్థానంలో ఉన్నారు. మార్కెట్‌ విలువ పరంగా యూరో జోన్‌లోనే అతిపెద్ద బ్యాంక్‌ అయిన బ్యాంకో శాన్‌టండర్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ అనబాటిన్‌ ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు.

Friday, September 30, 2016

గ్రామీణ పారిశుధ్యంలో సిక్కింకు ప్రథమ స్థానం


గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితులపై నిర్వహించిన జాతీయ శాంపిల్‌ సర్వేలో స్వచ్ఛ రాష్ట్రంగా సిక్కిం మొదటి స్థానాన్ని దక్కించుకుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ న్యూఢల్లీలో 2016 సెప్టెంబర్‌ 8న ఎన్‌ఎస్‌ఎస్‌వో సర్వే నివేదికను విడుదల చేశారు. ఇందులో 98.2 శాతంతో సిక్కిం మొదటి స్థానాన్ని దక్కించుకోగా, జార్ఖండ్‌ చివరి స్థానంలో నిలిచింది. గుజరాత్‌ 14వ స్థానంలో, ఏపీ 16వ స్థానంలో తెలంగాణ 22వ స్థానంలో నిలిచాయి. 2015 మే-జూన్‌ మధ్య 26 రాష్ట్రాల్లోని 3,788 గ్రామాలు, 73,716 నివాసాల్లో సర్వే నిర్వహించారు. మరుగుదొడ్లను కలిగి ఉన్న ఇండ్ల శాతం, వాటి వినియోగం ఆధారంగా ఈ ర్యాంకును ఖరారు చేశారు

5 కోట్ల మంది చిన్నారులు నిరాశ్రయులు


యుద్ధం, హింస, అంతర్గత తిరుగుబాట్ల వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 కోట్ల మంది చిన్నారులు  నిరాశ్రయులయ్యారని యూనిసెఫ్‌ వెల్లడించింది. యునిసెఫ్‌ అంచనా ప్రకారం వివిధ దేశాల్లో చెలరేగుతున్న హింస కారణంగా 2.8 కోట్లచిన్నారులు నిరాశ్రయులవగా దాదాపు 1.7 కోట్ల మంది స్వదేశంలోనే నిరాదరణకు గురవుతున్నారు. అంతర్గత యుద్ధాలు, పేదరికం కారణంగా 2 కోట్ల మంది చిన్నారులు ఇళ్లు వదిలి
వెళ్తున్నారు. 2015లో యునిసెఫ్‌ చేరదీసిన పిల్లల్లో 45 శాతం మంది సిరియా, అస్థానిస్తాన్‌ నుంచే ఉన్నారు.

Wednesday, September 21, 2016

ఉద్యోగం చేసే మహిళలకు అనుకూలమైన రాష్ట్రాలలో సిక్కిం కు ప్రథమ స్థానం


ఉద్యోగం చేసే మహిళలకు దేశంలో ఈశాన్య రాష్ట్రమైన సిక్కిం బెస్ట్‌ అని అమెరికాకు చెందిన ప్రతిష్ఠాత్మక సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజిక్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌(సీఎస్‌ఐఎస్‌), నాథన్‌ అసోసియేట్స్‌ ఎకనమిక్‌ కన్సల్టింగ్‌ కంపెనీ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ జాబితాలో తెలంగాణ  2వ స్థానంలో ఉంది.  దేశ రాజధాని అయిన డిల్లీ నగరం పరమ వేస్టని నివేదిక స్పష్టంచేసింది. వీరి సర్వే ప్రకారం మహిళలు పనిచేయడానికి అత్యంత అనుకూలమైన ప్రాంతంగా సిక్కింను గుర్తించారు. ఈ అంశానికి సంబంధించి అత్యధికంగా సిక్కింకు 40 పాయింట్లు రాగా, తెలంగాణకు 28.5 పాయింట్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ 24 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. డిల్లీకి అత్యల్పంగా 8.5 పాయింట్లు మాత్రమే వచ్చాయి.

ఫ్యాక్టరీలు, రిటైల్‌, ఐటీ రంగాల్లో మహిళలకు పని గంటల్లో నిబంధనలు, ఉద్యోగినుల భద్రతకు తీసుకుంటున్న చర్యలు, మహిళా ఉద్యోగుల సంఖ్య, మహిళా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం, వారి స్టార్టప్స్‌కు చేస్తున్న సహాయం.. ఈ నాలుగు ప్రధాన అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాలకు రేటింగ్‌ ఇచ్చారు. 
జాబితా 
  1. సిక్కిం
  2. తెలంగాణ 
  3. పుదుచ్చేరి
  4. కర్ణాటక
  5. ఆంధ్రప్రదేశ్‌
  6. కేరళ
  7. మహారాష్ట్ర
  8. తమిళనాడు
  9. ఛత్తీస్‌గఢ్‌ 

  • సిక్కిం, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు నాలుగు రాష్ట్రాలు ఫ్యాక్టరీలు, రిటైల్‌, ఐటీ రంగాల్లో రాత్రి వేళల్లో మహిళల పనిపై అన్ని నిబంధనలు తొలగించాయని నివేదిక వెల్లడించింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలు కోర్టు ఆదేశాలతో నిబంధనలు తొలగించాయి. 

  • అయితే మహారాష్ట్రలో రాత్రి పది గంటల వరకు మహిళలను పనికి అనుమతిస్తారు. కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏ రంగాల్లోనూ మహిళలను రాత్రివేళ పనికి అనుమతించడంలేదని నివేదిక తెలిపింది.

Saturday, September 17, 2016

ప్రతి 10 మందిలో 9 మంది కలుషిత గాలి బాధితులు


వాయు కాలుష్య మరణాల కారణంగా ప్రపంచం విలువైన మానవ వనరులను కోల్పోతున్నట్లు ప్రపంచ బ్యాంకు, ఆరోగ్య ప్రమాణాల, మూల్యాంకన సంస్థ(IHME) సంయుక్త అధ్యయనంలో తేలింది. అల్పాదాయ, మధ్యాదాయ దేశాల్లో ప్రతి 10 మందిలో 9 మంది కలుషిత గాలే పీల్చుతున్నారు. ప్రపంచ ఖజానాలో 1 శాతానికి (సుమారు రూ.48 క్ష కోట్లు) సమానమైన ఆదాయ నష్టం వాయు కాలుష్యం ద్వారా కలుగుతోంది. 2013 గణాంకాల ప్రకారం వాయు కాలుష్య మరణాల కారణంగా ఆదాయ నష్టం, వైద్య ఖర్చు, వ్యవసాయ ఉత్పాదకత తగ్గుదల అన్నీ కలిపి అప్పటి సగటు విలువ ప్రకారం సుమారు రూ.300 లక్షల కోట్లు (5 లక్షల కోట్ల డాలర్లు) మేర ప్రపంచం నష్టపోయినట్లు అంచనా.
IHME-Institute for Health Metrics and Evaluation 

Monday, September 12, 2016

అంతర్జాతీయ బానిసత్వ సూచీ-2016


ఆస్ట్రేలియాకు చెందిన వాక్‌ ఫ్రీ ఫౌండేషన్‌ అంతర్జాతీయ బానిసత్వ సూచీ-2016 పేరిట ఓ నివేదికను వెలువరించింది. వెట్టిచాకిరీలో మగ్గుతున్నవారు ప్రపంచవ్యాప్తంగా 4.58 కోట్ల మంది ఉండగా అందులో 40 శాతం భారత్‌లోనే ఉన్నారని వెల్లడించింది. మొత్తం 167 దేశాల్లో బానిసత్వం ఉన్నట్లు గుర్తించారు. ఉత్తర కొరియాలో అత్యధికంగా 4.37 శాతం ఉన్నారు. ఆసియా దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ప్రపంచంలోని మొత్తం వెట్టిచాకిరీ పనివారు, నిర్బంధ కూలీల్లో భారత్‌, చైనా, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఉజ్బెకిస్థాన్‌ల్లోనే 58 శాతం మంది ఉన్నారు. జనాభాతో పోలిస్తే నిర్బంధ కూలీల శాతం ఎక్కువగా ఉన్న దేశాలు ఉత్తర కొరియా, ఉజ్బెకిస్థాన్‌, కంబోడియా, ఖతార్‌. 124 దేశాల్లో ఐక్యరాజ్యసమితి మార్గదర్శకాల ప్రకారం మానవ అక్రమ రవాణా నిరోధక చట్టాలు అమలవుతున్నాయి.
2014 నుంచి 2016 మధ్య సుమారు 40 లక్షల మంది నిర్బంధ కూలీలు పెరిగారు. సగటున రోజుకి 5,616 మంది కొత్తగా వెట్టిచాకిరీ, నిర్బంధ శ్రమ దోపిడీలో చిక్కుకుంటున్నారు.
దేశంలో మొత్తం 43,53,247 మంది బాల కార్మికులు (5 నుంచి 14 ఏళ్ల లోపు) ఉన్నారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 8,96,301 మంది, తెలుగు  రాష్ట్రాల్లో 4,04,851 మంది ఉన్నారు.
        దేశం                      నిర్బంధ కూలీలు జనాభాలో శాతం
భారత్‌                 1,83,54,700 1.4
చైనా                         33,88,400 0.247
పాకిస్థాన్‌                  21,34,900 1.13
బంగ్లాదేశ్‌                  15,31,300 0.9512
ఉజ్బెకిస్థాన్‌           1,23,660 3.973
ఉత్తర కొరియా           11,00,000 4.373
రష్యా                           10,48,500 0.732
నైజీరియా                    8,75,500 0.481
కాంగో                     8,73,100 1.130
ఇండోనేషియా            7,36,100 0.286
https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg










ఉన్నత విద్యావంతులు వ్యవసాయానికి దూరం


ఉన్నత విద్యావంతులు  వ్యవసాయానికి దూరంగా ఉంటున్నట్లు వ్యవసాయ శాఖ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ రంగంలోకి వచ్చినవారిలో స్నాతకోత్తర పట్టభద్రులు కేవలం 2%గా తేలింది. వ్యవసాయదారుల్లో ఉన్నత పాఠశాల, ఆపై స్థాయి చదువుకున్నవారు 10% లోపేనని తేలింది.

  • దేశవ్యాప్తంగా వ్యవసాయం చేస్తున్న 13 కోట్ల మందిలో 30.7% మంది నిరక్షరాస్యులే
  • 5వ తరగతి లోపు చదువుకున్నవారు 22.5% ఉన్నారు
  • వ్యవసాయం చేస్తున్న వ్యక్తుల సగటు వయసు 50 సం॥లు
  • వ్యవసాయం చేస్తున్న 30 ఏళ్ల లోపు వయస్కుల సంఖ్య కేవం 3.5% 
  • దేశవ్యాప్తంగా వ్యవసాయ కమతాల విస్తీర్ణం పడిపోతోంది
  • 2006-07లో కమతాల సంఖ్య - 22.33 కోట్లు 
  • 2011-12లో కమతాల సంఖ్య - 27.73 కోట్లకు పెరిగింది
  • వీటి సగటు వీస్తీర్ణం 0.59 హెక్టార్ల నుంచి 0.57 హెక్టార్లకు తగ్గిపోయింది
  • 6.4 కోట్ల హెక్టార్లకు సాగునీటి సౌకర్యం ఉండగా అందులో 2.9 కోట్ల హెక్టార్లలో (45.25%) ఒక పంటే పండుతుంది
  • 3.3 కోట్ల హెక్టార్లలో (52.22%) రెండు పంటలు  పండిస్తున్నారు
  • 39.41% భూముల్లోనే ధ్రువీకృత విత్తనాలు  వాడుతున్నారు
  • https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg