Showing posts with label Notifications. Show all posts
Showing posts with label Notifications. Show all posts

Saturday, August 24, 2019

కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో ప్రవేశాలకు ఆహ్వానం


విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో 2020-21 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పించేందుకు జనవరి 5న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్‌ కల్నల్‌ అరుణ్‌కులకర్ణి తెలిపారు. ఆరో తరగతిలో 60, తొమ్మిదో తరగతిలో 20 సీట్లు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబరు 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. వివరాలకు ‌www.sainikschoolkorukonda.org వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

Tuesday, April 23, 2019

CIMFRలో ప్రాజెక్టు అసిస్టెంట్లు


ధన్‌బాద్‌ (ఝార్ఖండ్‌)లోని CSIR - సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మైనింగ్‌ అండ్‌ ఫ్యూయల్‌ రిసెర్చ్‌ (CIMFR) తాత్కాలిక కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ పర్సనల్‌ ఖాళీల భర్తీకి వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

పోస్టు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ (లెవెల్‌ 1/ లెవెల్‌ 2)
ఖాళీలు: 49 స్టైపెండ్‌: లెవెల్‌ 1 పోస్టులకు నెలకు రూ.15,000; లెవెల్‌ 2 పోస్టులకు నెలకు రూ.25,000
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ, మాస్టర్‌ డిగ్రీ, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.
వయసు: లెవెల్‌ 1 పోస్టులకు 28 ఏళ్లు, లెవెల్‌ 2 పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.
వాక్‌ఇన్‌ తేది: ఏప్రిల్‌ 30 నుంచి మే 3 వరకు.
వేదిక: CSIR -CIMFR, రాంచీ రిసెర్చ్‌ సెంటర్‌, నామ్‌కుమ్‌, రాంచీ.
వెబ్‌సైట్‌: http://cimfr.nic.in/

ఎయిర్‌ ఇండియాలో అకౌంట్స్‌ క్లర్కులు


ఎయిర్‌ ఇండియా లిమిటెడ్‌ ఫిక్స్‌డ్‌ టర్మ్‌ కాంట్రాక్టు ప్రాతిపదికన అకౌంట్స్‌ విభాగంలో పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

పోస్టులు-ఖాళీలు: అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌-25, అకౌంట్స్‌ క్లర్క్‌-36
కాంట్రాక్టు కాలవ్యవధి: ఐదేళ్లు
అర్హత: సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ ఫైనాన్స్‌, బీకాం, రెండేళ్ల అనుభవం.
వయసు: 01.04.2019 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా.
వాక్‌ఇన్‌ తేది: మే 3, 4, 10, 11
వేదిక: న్యూదిల్లీ, ముంబయి.
వెబ్‌సైట్‌: http://www.airindia.in/

పబ్లిక్‌ హెల్త్‌లో PG కోర్సు


పుదుచ్చేరిలోని ICMR - వెక్టార్‌ కంట్రోల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (VCRC) పబ్లిక్‌ హెల్త్‌లో PG కోర్సును అందిస్తోంది.

కోర్సు: పీజీ ఇన్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఎంటమాలజీ (ఎంఎస్సీ పీహెచ్‌ఈ)
కాలవ్యవధి: రెండేళ్లు సీట్ల సంఖ్య: 12
స్కాలర్‌షిప్‌: నెలకు రూ.6000
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ/ బీవీఎస్సీ/ ఎంబీబీఎస్‌/ బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.
ఎంపిక: కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
పరీక్ష తేది: జూన్‌ 16
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ చివరితేది: మే 10
వెబ్‌సైట్‌: http://vcrc.res.in/

న్యూక్లియర్‌ మెడిసిన్‌లో PG



లక్నోలోని డాక్టర్‌ రామ్‌ మనోహర్‌ లోహియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ 2019 సంవత్సరానికిగానూ PG కోర్సు ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

కోర్సు: M.Sc న్యూక్లియర్‌ మెడిసిన్‌ (రెండేళ్లు)
సీట్ల సంఖ్య: 06
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో B.Sc ఉత్తీర్ణత.
వయసు: 01.07.2019 నాటికి 17-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: మే 15
వెబ్‌సైట్‌: http://www.drrmlims.com/

జడ్జిమెంట్‌ ట్రాన్స్‌లేటర్లు


అలహాబాద్‌ హైకోర్టు కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: జడ్జిమెంట్‌ ట్రాన్స్‌లేటర్‌
ఖాళీలు: 05
అర్హత: మూడేళ్ల  బ్యాచిలర్‌ లా డిగ్రీ లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ లా కోర్సు ఉత్తీర్ణత.
వయసు: 01.07.2019 నాటికి 21-35  సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: డిస్క్రిప్టివ్‌ ట్రాన్స్‌లేషన్‌ టెస్ట్‌, హిందీ టైపింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: ఏప్రిల్‌ 25
వెబ్‌సైట్‌: http://ahcjt.cbtexam.in/