Showing posts with label వార్తల్లో వ్యక్తులు. Show all posts
Showing posts with label వార్తల్లో వ్యక్తులు. Show all posts

Tuesday, August 22, 2023

first 3D printed post office : దేశంలో తొలి 3డీ ప్రింటెడ్‌ పోస్టాఫీసు

first 3D printed post office2-#successsecret

  • దేశంలోనే మొట్ట మొదటి త్రీడీ ప్రింటెడ్‌ పోస్టాఫీసు బెంగళూరులో రూపుదిద్దుకుంది. కంప్యూటరైజ్డ్‌ 3డీ మోడల్‌ డ్రాయింగ్‌ ఇన్‌పుట్‌ ఆధారంగా కాంక్రీట్‌ను ఒక్కో పొరగా వేసే 3డీ ప్రింటింగ్‌ టెక్నాలజీని ఉపయోగించి రోబోటిక్‌ ప్రింటర్‌తో ఇది నిర్మితమైంది. 
  • నగరంలోని కేంబ్రిడ్జి లేఔట్‌లో 1,021 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.40 లక్షలతో దీనిని నిర్మించారు. ఈ కొత్త పోస్టాఫీసును కేంద్ర రైల్వేలు, కమ్యూనికేషన్లు, ఎల్రక్టానిక్స్‌ ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ 2023 ఆగస్టు 18న ప్రారంభించారు. 
  • సంప్రదాయ విధానంలో ఇటువంటి భవన నిర్మాణానికి ఆరు నుంచి 8 నెలలవరకు పడుతుంది. కానీ, ఆధునాతన పద్ధతిలో అంతా కలిపి కేవలం 45 రోజుల్లోనే నిర్మాణం పూర్తి చేసుకుంది. మద్రాస్‌ ఐఐటీ సాంకేతిక మార్గదర్శకంలో నిర్మాణ సంస్థ లార్సెన్‌ అండ్‌ టూబ్రో లిమిటెడ్‌ దీనిని నిర్మించింది. 
  • కంప్యూటరైజ్డ్‌ 3డీ మోడల్‌ డ్రాయింగ్‌ ఇన్‌పుట్‌ ఆధారంగా కాంక్రీట్‌ను ఒక్కో పొరగా వేసే 3డీ ప్రింటింగ్‌ టెక్నాలజీని ఉపయోగించి రోబోటిక్‌ ప్రింటర్‌తో ఇది నిర్మితమైంది. నగరంలోని కేంబ్రిడ్జి లేఔట్‌లో 1,021 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.40 లక్షలతో దీనిని నిర్మించారు. ఈ కొత్త పోస్టాఫీసును కేంద్ర రైల్వేలు, కమ్యూనికేషన్లు, ఎల్రక్టానిక్స్‌ ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ శుక్రవారం ప్రారంభించారు. సంప్రదాయ విధానంలో ఇటువంటి భవన నిర్మాణానికి ఆరు నుంచి 8 నెలలవరకు పడుతుంది. కానీ, ఆధునాతన పద్ధతిలో అంతా కలిపి కేవలం 45 రోజుల్లోనే నిర్మాణం పూర్తి చేసుకుంది. మద్రాస్‌ ఐఐటీ సాంకేతిక మార్గదర్శకంలో నిర్మాణ సంస్థ లార్సెన్‌ అండ్‌ టూబ్రో లిమిటెడ్‌ దీనిని నిర్మించింది. 

Tulip Garden : ఆసియాలో అతిపెద్ద గార్డెన్‌గా వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న తులిప్‌ గార్డెన్‌ ఎక్కడ ఉంది?

The first 3D printed post office in the country

  • The first 3D printed post office in the country has taken shape in Bangalore. It was built with a robotic printer using 3D printing technology that casts concrete layer by layer based on computerized 3D model drawing input.
  • It was built at a cost of Rs 40 lakh on an area of 1,021 square feet in the city's Cambridge layout. This new post office was inaugurated on 18th August 2023 by Union Minister of Railways, Communications and Electronics IT Ashwini Vaishnav.
  • Construction of such a building takes six to eight months in the traditional way. But, the construction was completed in just 45 days with modern methods. It was built by Larsen and Toubro Limited, an architectural firm, under the technical guidance of IIT Madras.
  • It was built with a robotic printer using 3D printing technology that casts concrete layer by layer based on computerized 3D model drawing input. It was built at a cost of Rs 40 lakh on an area of 1,021 square feet in the city's Cambridge layout. The new post office was inaugurated on Friday by Union Minister of Railways, Communications and Electronics IT Ashwini Vaishnav. Construction of such a building takes six to eight months in the traditional way. But, the construction was completed in just 45 days with modern methods. It was built by Larsen and Toubro Limited, an architectural firm, under the technical guidance of IIT Madras.

Friday, August 18, 2023

Andhra Pradesh State Agnikulakshatriya Corporation : ఇటీవల మృతి చెందిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అగ్నికులక్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఎవరు?

 

Bandana Hari-successsecret

  • ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బందన హరి(64) 2023 ఆగస్టు 18న మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 
  • 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఆయన కాకినాడ స్టీల్‌ బార్జి అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. 2019లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా కాకినాడ నగర నియోజకవర్గం నుంచి పోటీచేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అనంతరం వైకాపాలో చేరి రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.


Who is the Chairman of Andhra Pradesh State Agnikulakshatriya Corporation who passed away recently?

  • Andhra Pradesh State Agnikula Kshatriya Corporation Chairman Bandana Hari (64) passed away on August 18, 2023. He has a wife, two sons and three daughters.
  • He has been in politics for 40 years and served as the President of Kakinada Steel Barge Association. In 2019, he contested from Kakinada city constituency as a Praja Rajyam Party candidate and was defeated by a narrow margin. Later, he joined Vaikapa and was appointed as the Chairman of State Agnikula Kshatriya Corporation.

Indian Institute of Health and Family Welfare : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ (ఐఐహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ) గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎవరు?

Indian Institute of Health and Family Welfare-successsecert

  • హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ (ఐఐహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ) గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా నిజామాబాద్‌ జిల్లాకు చెందిన వైద్యుడు మధుశేఖర్‌ బద్దం నియమితులయ్యారు. 
  • ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్‌.ఎ.ఎం.రిజ్వీ 2023 ఆగస్టు 17న ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించినప్పటినుంచి రెండేళ్లపాటు మధుశేఖర్‌ ఆ పదవిలో కొనసాగుతారని పేర్కొన్నారు. గవర్నింగ్‌ కౌన్సిల్‌ వైస్‌ ఛైర్మన్‌గా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి కొనసాగనుండగా సభ్యులను నియమించనున్నారు.


Who is the Chairman of the Governing Council of Indian Institute of Health and Family Welfare (IIHFW)?

  • Madhusekhar Baddam, a doctor from Nizamabad district, has been appointed as the Chairman of the Governing Council of the Indian Institute of Health and Family Welfare (IIHFW), Hyderabad.
  • To this extent, State Medical and Health Department Secretary SAM Rizvi issued an order on August 17, 2023. It has been stated that Madhusekhar will continue in that position for two years from the time of assumption of responsibility. The members will be appointed while the Secretary of Health and Family Welfare Department will continue as the Vice Chairman of the Governing Council.

Power Finance Corporation : పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ తొలి మహిళా చైర్మన్‌ ఎవరు?

 

Power Finance Corporation-successsecert

  • దేశంలోనే అతిపెద్ద ఎన్‌బీఎఫ్‌సీ, ప్రభుత్వరంగ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ) చైర్మన్‌, ఎండీగా (సీఎండీ) పర్మిందర్‌ చోప్రా బాధ్యతలు స్వీకరించారు.
  • సంస్థకు పర్మిందర్‌ చోప్రా తొలి పూర్తి స్థాయి మహిళా చైర్మన్‌ అని పీఎఫ్‌సీ తెలిపింది. జూన్‌ 1 నుంచి పీఎఫ్‌సీ సీఎండీగా అదనపు బాధ్యతలను ఆమె నిర్వహిస్తుండగా, ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆ బాధ్యతల్లోకి వచ్చారు. 
  • అంతక్రితం వరకు పీఎఫ్‌సీ డైరెక్టర్‌ (ఫైనాన్స్‌)గా పనిచేశారు. డైరెక్టర్‌ (ఫైనాన్స్‌)గా పర్మిందర్‌ చోప్రా ఎన్‌పీఏలను కనిష్టానికి తగ్గించి, సంస్థ లాభదాయకతను పెంచడంలో, మహారత్న హోదా పొందడంలో కీలకంగా పనిచేశారు.


Who is the first woman chairman of Power Finance Corporation?

  • Parminder Chopra has taken charge as the Chairman and MD (CMD) of the country's largest NBFC, the state-run Power Finance Corporation (PFC).
  • Parminder Chopra is the first full-time woman chairman of the company, PFC said. Since June 1, she has been holding additional responsibilities as PFC CMD, but now she has assumed full responsibilities.
  • Until recently worked as PFC Director (Finance). As Director (Finance), Parminder Chopra was instrumental in minimizing NPAs, increasing the company's profitability and achieving Maharatna status.

Tuesday, August 15, 2023

LIC : ఎల్‌ఐసీ ఎండీగా ఎవరు నియమితులయ్యారు?

 

LIC-successsecret

  • లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) మేనేజింగ్‌ డైరెక్టరుగా ఆర్‌.దొరైస్వామిని ప్రభుత్వం 2023 ఆగస్టు 14న నియమించింది. 
  • ప్రస్తుతం ముంబయిలోని ఎల్‌ఐసీ కేంద్ర కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరుగా దొరైస్వామి ఉన్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 1 లేదా ఆ తరవాత బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దొరైస్వామి నియామకం అమల్లోకి వస్తుంది. 
  • దొరైస్వామి పదవీ విరమణ తేదీ అయిన 2026 ఆగస్టు 31 లేదా, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆయన ఎల్‌ఐసీ ఎండీ పదవిలో ఉంటారు.

Who has been appointed as LIC MD?

  • The government has appointed R. Doraiswamy as the Managing Director of Life Insurance Corporation of India (LIC) on 14 August 2023.
  • Currently, Doraiswamy is the Executive Director at LIC's head office in Mumbai. Doraiswamy's appointment will take effect on or after September 1 this year.
  • Doraiswamy will hold the post of LIC MD on August 31, 2026, the date of his retirement or until further orders.

TANA : తానా బోర్డు ఛైర్మన్‌గా నాగేంద్ర శ్రీనివాస్‌


  • ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్‌ (తానా) బోర్డు ఛైర్మన్‌గా డా.నాగేంద్ర శ్రీనివాస్‌ కొడాలి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన టెక్సాస్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌లో వైద్యుడిగా పనిచేస్తున్నారు. 
  • బోర్డు కార్యదర్శిగా లక్ష్మి దేవినేని, కోశాధికారిగా జనార్దన్‌ నిమ్మలపూడిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Nagendra Srinivas as the Chairman of TANA Board

  • Dr. Nagendra Srinivas Kodali was unanimously elected as the chairman of the board of Telugu Association of North America (TANA). He works as a doctor at Texas Children's Hospital.
  • Lakshmi Devineni as the secretary of the board and Janardhan Nimmalapudi as the treasurer were unanimously elected.

Saturday, August 12, 2023

Debabrata Kanta : మాజీ ఐఏఎస్‌ అధికారి దేబబ్రత కంఠ మృతి

 


  • ఉమ్మడి రాష్ట్రంలో ఐఏఎస్‌గా సేవలు అందించిన దేబబ్రత కంఠ(58) అనారోగ్యంతో 2023 ఆగస్టు 8న తన సొంత రాష్ట్రమైన ఒడిశాలో మరణించారు. 
  • ఆయన భార్య సౌమ్యామిశ్రా తెలంగాణలో అదనపు డీజీ(పర్సనల్‌)గా పనిచేస్తున్నారు. 1987 బ్యాచ్‌కు చెందిన దేబబ్రత కంఠ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2008 వరకు వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. కరీంనగర్‌ కలెక్టరుగా(1998-2001) పనిచేసిన సమయంలో కుటుంబ నియంత్రణ(కు.ని.)కు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. రెండేళ్లలో లక్ష కు.ని. ఆపరేషన్లు చేయించి రికార్డు సృష్టించారు. 
  • ఉమ్మడి రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలను ప్రారంభించడంలోనూ ఆయన కీలకపాత్ర పోషించారు. 2008లో తన పదవికి రాజీనామా చేసి ఒడిశా వెళ్లిపోయారు. అనంతరం అక్కడ స్వచ్ఛంద సేవాసంస్థ ప్రారంభించి రాజకీయాల్లోకి దిగారు. అప్పటి నుంచి ఒడిశాలోనే ఉంటున్నారు. ఆయన భార్య సౌమ్యామిశ్రా తెలంగాణ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి. 

Star Miss teen India Intelligent : స్టార్‌ మిస్‌ టీన్‌ ఇండియా ఇంటెలిజెంట్‌ 2023గా ధనూషసాయి దుర్గాచౌదరి

  • అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన వక్కల గడ్డ విష్ణు చౌదరి, ఉత్తరల కుమార్తె ధనూషసాయి దుర్గాచౌదరి స్టార్‌ మిస్‌ టీన్‌ ఇండియా ఇంటెలిజెంట్‌ 2023కు విజేతగా నిలిచింది.
  • ధనూషసాయి దుర్గాచౌదరి(15) విజయవాడ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. రాజస్థాన్‌లో జరిగిన స్టార్‌ మిస్‌ టీన్‌ ఇండియా ఇంటెలిజెంట్‌లో పలు రాష్ట్రాల నుంచి పాల్గొన్న ఎంతో మందిని దుర్గా ఓడిరచింది.

Jochen Goetz : దైమ్లర్‌ ట్రక్‌ ఫైనాన్స్‌ అధిపతి జోషెన్‌ గోట్జ్‌ మృతి

 


  • మెర్సిడెజ్‌-బెంజ్‌ కార్ల తయారీ సంస్థ అయిన దైమ్లర్‌ గ్రూప్‌ నుంచి దైమ్లర్‌ ట్రక్‌ను విడదీయడంలో కీలక పాత్ర పోషించిన జోషెన్‌ గోట్జ్‌ మృతి చెందారు. 
  • దైమ్లర్‌ ట్రక్‌కు చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా వ్యవహరించిన గోట్జ్‌(52) 2023 ఆగస్టు 7న ఒక దుర్ఘటనలో మరణించారని కంపెనీ పేర్కొంది. అయితే పూర్తి వివరాలను ఇవ్వలేదు. ‘దైమ్లర్‌ ట్రక్‌కు జోషెన్‌ మరణం వ్యక్తిగతంగా, వృతిగతంగా పూడ్చలేని నష్టమ’ని కంపెనీ ఛైర్మన్‌ మార్టిన్‌ డామ్‌ పేర్కొన్నారు.

Vaibhav Taneja : టెస్లా సీఎఫ్‌ఓగా వైభవ్‌ తనేజా

 


  • టెస్లా కొత్త చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌ఓ)గా భారత సంతతికి చెందిన వైభవ్‌ తనేజా నియమితులయ్యారు. 
  • సీఎఫ్‌ఓ జాచరీ కిర్కాన్‌ వైదొలగుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు 2023 ఆగస్టు 7న టెస్లా పేర్కొంది. 
  • అమెరికాకు చెందిన ఈ విద్యుత్‌ కార్ల దిగ్గజ కంపెనీలోనే ప్రస్తుతం చీఫ్‌ అకౌంటింగ్‌ ఆఫీసర్‌(సీఏఓ)గా పనిచేస్తున్న తనేజా(45) అదనంగా సీఎఫ్‌ఓ బాధ్యతలనూ నిర్వర్తిస్తారు. 2016 మార్చిలో టెస్లాలో చేరిన తనేజా వివిధ హోదాల్లో పనిచేశారు. 2019 మార్చిలో సీఏఓగా మారారు. ఎలాన్‌ మస్క్‌కు చెందిన ఈ కంపెనీలో కిర్కాన్‌ 13 ఏళ్లుగా పనిచేస్తున్నారు. 
  • టెస్లాకు ముందు తనేజా భారత్‌, అమెరికాలో 1999 జులై నుంచి 2016 మార్చి వరకు ప్రైస్‌వాటర్‌హౌస్‌ కూపర్స్‌లో పనిచేశారు.

Zaheeruddin Ali Khan : గద్దర్‌ అంతిమ యాత్రలో ‘సియాసత్‌’ మేనేజింగ్‌ ఎడిటర్‌ జహీరుద్దీన్‌ అలీఖాన్‌ మృతి


  • ప్రజా గాయకుడు గద్దర్‌ అంతిమయాత్రలో 2023 ఆగస్టు 7న విషాదం చోటుచేసుకుంది. గద్దర్‌కు అత్యంత సన్నిహితుడు, ప్రముఖ ఉర్దూ దినపత్రిక ‘ది సియాసత్‌ డైలీ’ మేనేజింగ్‌ ఎడిటర్‌ జహీరుద్దీన్‌ అలీఖాన్‌ (63) గుండెపోటుతో మరణించారు. 
  • 1960 ఏప్రిల్‌ 13న జన్మించిన జహీరుద్దీన్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. నగరంలోని మీరాలం ట్యాంకు సమీపంలోని మీర్‌మోమిన్‌ పహాడీలో నివసిస్తున్నారు. 

Monday, August 7, 2023

Gaddar : ప్రజా యుద్ధనౌక గద్దర్ మృతి

Gaddar

  • ఉద్యమ గళం మూగబోయింది. తన పాటతో.. ఆటతో చైతన్యం నింపిన ప్రజాయుద్ధ నౌక నింగికేగింది. ప్రజాగాయకుడు గద్దర్‌(76)  హైదరాబాద్‌లో 2023 ఆగస్టు 6న మృతి చెందారు. 
  • గద్దర్‌ 1947 ఆగస్టు 4న మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో జన్మించారు. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్‌రావ్‌. 
  • నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌లలో ప్రాథమిక, ఉన్నత, ఇంజినీరింగ్‌ విద్య పూర్తి చేశారు. 1975లో కెనరా బ్యాంకులో ఉద్యోగం చేశారు. తర్వాత ఆ ఉద్యోగం వదులుకున్నారు. 
  • ఆయనకు భార్య విమల, ముగ్గురు పిల్లలు సూర్యుడు, చంద్రుడు, వెన్నెల. రెండో కుమారుడు చంద్రుడు 2003లో అనారోగ్యంతో మృతి చెందారు. 
  • జన నాట్యమండలి వ్యవస్థాపకుల్లో గద్దర్‌ కూడా ఒకరు. ఎన్నో ప్రజా ఉద్యమాలను ఆయన ముందుండి నడిపించారు. 
  • తెలంగాణ ఉద్యమంలో ఆయన తన ఆట, పాటతో ప్రజలను ఉత్తేజపరిచారు. పలు సినిమాల్లో పాటలు రాయడంతో పాటు నటించి మెప్పించారు. 
  • పీపుల్స్‌వార్‌ ఉద్యమం ఉద్ధృతంగా ఉన్న రోజుల్లో నకిలీ ఎన్‌కౌంటర్లను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో 1997 ఏప్రిల్‌ 6న గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. ఆ రోజు తగిలిన తూటా ఇంకా ఆయన శరీరంలోనే ఉంది. 
  • గద్దర్‌ రాసిన ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా... పోరు తెలంగాణమా...’ పాట తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే పాటల్లో ఒకటి. ఉద్యమం ఉవ్వెత్తున ఎదిగేందుకు దోహదం చేసింది.

మర్లవడ్డ గానం... మరపురాని గళం

  • నడుముకు తెల్లటిపంచె, ఒంటిపై నల్లటి గొంగడి, చేతికి కడియాలు, కాళ్లకు గజ్జెలు, తలకు ఎర్రటి వస్త్రంతో గద్దర్‌ ఎక్కడికి వెళ్లినా ప్రత్యేకంగా కనిపించేవారు. 
  • తర్వాత వస్త్రధారణ మార్చినా తనదైన శైలిని మాత్రం కొనసాగించారు. విద్యార్థి దశ నుంచే ప్రజాజీవితంలో సాగారు. తల్లి నుంచి జానపదాన్ని వారసత్వంగా అందిపుచ్చుకున్నారు. 
  • అనంతర కాలంలో తన ఆటపాటలతో తెలుగు గడ్డను అలరించారు. ప్రజల ఆత్మీయ బంధువుగా మారారు. వివిధ సామాజిక రుగ్మతలపై పోరాడారు. 
  • ఉస్మానియా ఇంజినీరింగ్‌ కళాశాలలో విప్లవపంథాను ఎంచుకుని పాటలతో చైతన్య దీప్తిని వెలిగించిన గద్దర్‌ కొంత కాలానికి జనజీవనన స్రవంతిలోకి వచ్చినా... తుదిశ్వాస విడిచేవరకు తనపాటతో చైతన్యవంతంగా జీవించారు. 
  • తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో ప్రత్యేకంగా నిలిచారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన  రాసిన పాటలు ఉద్యమానికి కొత్త రూపుని ఇచ్చి ముందుకు తీసుకెళ్లాయి. ఉద్యమ సమయంలో గద్దర్‌ రాసిన పాటలు లేని కార్యక్రమం ఉండేది కాదంటే అతిశయోక్తికాదు.

ఆయన ఓ సామాజిక ఇంజినీరు

  • మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో గద్దర్‌ జన్మించారు. తల్లిదండ్రులు గుమ్మడి లచ్చుమమ్మ, శేషయ్యల ఐదో సంతానం. ఉన్నత పాఠశాల విద్య వరకు తూప్రాన్‌, నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో సాగింది. గణితంలో 77% మార్కులు సాధించిన గద్దర్‌ హైదరాబాద్‌లోని ఉస్మానియా ఇంజినీరింగ్‌ కాలేజీలో ఇంజినీరింగ్‌ చేశారు. తండ్రి శేషయ్య మేస్త్రీ. మహారాష్ట్రలో మిలింద విశ్వవిద్యాలయం నిర్మాణ సమయంలో తన తండ్రి  శేషయ్య.. అంబేడ్కర్‌ను చాలా దగ్గరగా చూశారని, ఆయన ప్రభావంతోనే పేదరికంలో ఉన్నా తమను పట్టుదలగా చదివించారని గద్దర్‌ ఒక సందర్భంలో వెల్లడిరచారు. ఇంజినీరింగ్‌ చేస్తున్నప్పుడు గద్దర్‌ మొజాంజాహీ మార్కెట్‌ నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం వరకు ప్రతిరోజూ నడుచుకుంటూ వెళ్లి చదువుకునేవారు. అదే సమయంలో హైదరాబాద్‌లోని డిల్లీ దర్బార్‌ హోటల్‌లో ప్రతిరోజూ రెండు గంటలపాటు సర్వర్‌గా పని చేసేవారు. దళిత్‌ పాంథర్‌, నక్సల్‌బరీ ఉద్యమాల ప్రభావం గద్దర్‌ను ఇంజినీరింగ్‌ను విడిచిపెట్టేలా చేసింది. 1969 తెలంగాణ ఉద్యమంలో విద్యార్థిగా పాల్గొని జైలుకు వెళ్లారు. మొదట కెనరాబ్యాంకులో క్లర్క్‌గా చేరిన గద్దర్‌ 1984లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆరంభంలో అంబేడ్కర్‌పై, తర్వాత అల్లూరి సీతారామరాజుపై బుర్రకథలు చెప్పారు. మొదట ఆర్ట్‌ లవర్స్‌ అసోసియేషన్‌లో చేరి   అనంతరం ఉద్యమంలోకి వెళ్లారు.

గద్దర్‌కు ఆ పేరెలా వచ్చిందంటే...

  • గద్దర్‌ అసలు పేరు గుమ్మడి విఠల్‌రావ్‌. కొంతకాలానికి రావ్‌ని తొలగించుకుని గుమ్మడి విఠల్‌గా మారారు. 
  • బి.నరసింగరావు ప్రోత్సాహంతో 1971లో మొదటి పాట ‘ఆపర రిక్షా’ అని రాశారు. ఉద్యమంలో ఉన్నప్పుడు రచనల సందర్భంగా తాను రాసిన పాట కింద పేరు రాయాల్సి వచ్చినప్పుడు గుమ్మడి విఠల్‌ కాకుండా వేరే పేరు రాయాలని భావించారు. 
  • స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ఒక వెలుగు వెలిగిన గదర్‌ (తిరుగుబాటు) పార్టీ పేరును స్ఫూర్తిగా తీసుకొని తన పేరును గదర్‌గా మార్చుకున్నారు. ప్రింటింగ్‌లో పొరపాటుగా గద్దర్‌గా ప్రచురితమైంది. నాటి నుంచి గద్దర్‌గానే ప్రాచుర్యంలోకి వచ్చింది.

ఆ కర్ర... తండ్రి ఇచ్చిందే

  • గద్దర్‌ ఎక్కడికి వెళ్లినా పట్టుకెళ్లే కర్ర తన తండ్రిది. మొదట దానికి బుద్ధుడి జెండా ఉండేది. ఇంజినీరింగ్‌ కాలేజీలో చేరాక ఎర్రజెండా చేరింది. జ్యోతిబాఫులేకు గుర్తుగా నీలం రంగును కూడా జత చేశారు. ప్రపంచాన్ని పీడన నుంచి విముక్తి చేయడానికే కారల్‌మార్క్స్‌ జ్ఞాన సిద్ధాంతాన్ని తెచ్చారని, అందుకే ఎర్ర జెండా కట్టినట్లు చెప్పేవారు. ‘మార్క్స్‌ జ్ఞాన సిద్ధాంతం, ఫులే, అంబేడ్కర్‌ భావాలను కలపాలనేది’ తన వాదన అని పలుమార్లు తెలిపారు.

పుట్టిన ఊరికి ఎత్తిపోతల పథకం

  • తాను పుట్టిన ఊరంటే గద్దర్‌కు వల్లమాలిన ప్రేమ. తన సొంతూరుకు ఏదో ఒకటి గొప్పగా చేయాలనే తపించారు. కిష్టాపూర్‌ హల్దీవాగుపై ఎత్తిపోతల పథకాన్ని నిర్మింపజేసి, తూప్రాన్‌ పెద్దచెరువును ఎప్పటికీ కళకళలాడేలా ఉంచాలని భావించారు.ఈ విషయాన్ని తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావుల దృష్టికి తీసుకెళ్లగా ఎత్తిపోతల నిర్మాణానికి రూ.3.50 కోట్లు విడుదల చేశారు. పనుల పూర్తికి గద్దర్‌ ఒక కమిటీని ఏర్పాటు చేసి, తన స్నేహితులు పసుల కిష్టయ్య, మోహన్‌రెడ్డితో కలిసి స్వయంగా పర్యవేక్షించారు. పథకాన్ని 2016 మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. మరుసటి ఏడాది నుంచే హల్దీవాగు నీరు ఎత్తిపోతల ద్వారా పెద్ద చెరువులోకి చేరేలా చొరవ తీసుకున్నారు. ప్రస్తుతం తూప్రాన్‌ చెరువు కింద వేయి ఎకరాల ఆయకట్టుకు నీరందుతోంది.

మై విలేజ్‌ ఆఫ్‌ 60 ఇయర్స్‌’ పుస్తకం ఆవిష్కరించకుండానే...

  • గద్దర్‌ తను పుట్టిన ఊరిపై ఒక పుస్తకాన్ని రచించాలని భావించారు. 2015లో నెల రోజులపాటు తూప్రాన్‌లోనే ఉండి పుస్తకం రాసేందుకు కార్యాచరణ మొదలుపెట్టారు. 
  • గ్రామంలో ప్రజల జీవన విధానంపై వీడియో చిత్రీకరిస్తూ సమాచారం సేకరించారు. పూర్వం కులవృత్తుల వారు ప్రజలకు ఎలా సేవలు అందించే వారో ఆ తరహాలోనే పనులు చేయించి వీడియో చిత్రీకరించారు. 
  • ‘మై విలేజ్‌ ఆఫ్‌ 60 ఇయర్స్‌’ పుస్తకం రాయడం దాదాపుగా పూర్తయిందని, త్వరలోనే ఆవిష్కరిస్తానన్నారు. ఇంతలోనే ఆయన మృతి చెందారు.

కొండపల్లి సీతారామయ్య పొలిటికల్‌ క్లాస్‌తో

  • సినిమాలంటే తనకు ఇష్టమని అప్పట్లో ఒకసారి బి.నర్సింగరావు చెప్పగా... ఒక పెద్ద డైరెక్టర్‌ వస్తున్నారని గద్దర్‌ను తీసుకెళ్లారు. వచ్చింది ఎవరో కాదు మావోయిస్టు ఉద్యమనేత కొండపల్లి సీతారామయ్య. ఆయన పొలిటికల్‌ క్లాస్‌ విన్న తర్వాత గద్దర్‌ జననాట్య మండలిని స్థాపించి ఉద్యమంలోకి వెళ్లారు. ఎమర్జెన్సీ సమయంలో నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో అజ్ఞాతంలో గడిపారు. ఆ సందర్భంగానే నాటి నక్సల్‌ నాయకుడు    పరిటాల శ్రీరాములుతో కలసి ఉన్నారు. ఎమర్జెన్సీ తర్వాత 45 రోజులు పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఎమర్జెన్సీలో 1985 వరకు సాంస్కృతిక ఉద్యమం నడిపించి, 1990 దాకా అండర్‌గ్రౌండ్‌ ఉద్యమంలో పోరు సాగించారు. 1990 ఫిబ్రవరి 19న ఆరేళ్ల అజ్ఞాత జీవితాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. 1996లో భువనగిరిలో ‘తెలంగాణ జనసభ’లో పాల్గొన్నారు. 1997 ఏప్రిల్‌ 6న ఆయనపై తూటాల వర్షం కురిసింది. తీవ్రంగా గాయపడినా కోలుకున్నారు. 2002లో నక్సల్స్‌తో ప్రభుత్వం జరిపిన చర్చలో  నక్సలైట్ల ప్రతినిధులుగా వరవరరావుతో కలిసి గద్దర్‌ పాల్గొన్నారు. 2010 అక్టోబరు తొమ్మిదో తేదీన దాదాపు 107 ప్రజా సంఘాలతో కలిసి తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ను స్థాపించారు. రెండేళ్లు అధ్యక్షుడిగా కొనసాగారు.

తల్లి లచ్చుమమ్మపై ఎనలేని ప్రేమ

  • ‘సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మో... నీవు చిన్నబోయి కూసున్నా వెందుకమ్మో ఎందుకమ్మా... నెత్తంతా మాసింది... రైకంతా చినిగింది.. కొత్తది కొననికి కైకిలే దొరకదు... కుంచి పేలుకలు కట్టి లచ్చుమమ్మో లచ్చుమమ్మ... నీవు కూలీకే పోయినావా... లచ్చుమమ్మో లచ్చుమమ్మ’... అంటూ గద్దర్‌ తన తల్లి కోసం పాడిన పాట అత్యంత ప్రాచుర్యం పొందింది. తన తల్లి అంటే ఆయనకు ఎక్కువ ప్రేమాభిమానాలు. ఇంజినీరింగ్‌ చదివిన కొడుకు తమను బాగా చూసుకుంటాడని భావిస్తే అజ్ఞాత వాసానికి వెళ్లడంతో ఆమె ఓ చెట్టుకింద కూర్చుని బాధపడేదట. విషయాన్ని గద్దర్‌ స్నేహితుడి ద్వారా తెలుసుకొని... తన తల్లి కోసం పాటకు ప్రాణం పోశారు. ఆ పాటను ప్రతి కొడుకు.. తన తల్లిపడిన బాధలకు ఆపాదించుకుని ఆదరించారు. అమ్మానాన్నలిద్దరూ మరణించాక వారి సమాధులను తూప్రాన్‌ పెద్ద చెరువు కట్ట సమీపంలో నిర్మించారు. చిన్న కొడుకు చంద్రకిరణ్‌(చంద్రుడు), అన్న నర్సింగరావ్‌ సమాధులనూ అక్కడే నిర్మించారు. ఎప్పుడు తూప్రాన్‌కు వచ్చినా... వాటి వద్దకు వెళ్లి నివాళి అర్పించేవారు.

మంగళపర్తిలో ‘మాభూమి’ చిత్రీకరణ



  • జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 45 ఏళ్ల క్రితం చరిత్ర సృష్టించిన మాభూమి సినిమాలో గద్దర్‌ నటించారు. 
  • అందులోని ‘బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి’ పాటలో యువకుడిగా గద్దర్‌ ఆడుతూ పాడిన పాట ఇప్పటికీ సంచలనమే. ఆ సినిమాను మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తిలో దాదాపు 50% చిత్రీకరించారు.
  • ఒగ్గుకథ, బుర్రకథ, ఎల్లమ్మ కథలను ప్రజలకు చెప్పే కళాకారుడిగా సాంస్కృతిక చైతన్యాన్ని ప్రారంభించిన గద్దర్‌ క్రమంగా ప్రజలు ఇతివృత్తంగా ఉండే సమస్యలు, వివక్షపై కలం రaళిపించారు. కుటుంబ నియంత్రణ, కుల వివక్ష, అస్పృశ్యత, దోపిడీ, ప్రపంచీకరణ ప్రభావం, వెనుకబాటు తనం, పల్లెల అమాయకత్వంపై అనేక రూపాల్లో దాదాపు 600పైగా పాటలు పాడారు.

గద్దర్‌ ప్రజాపార్టీ

  • వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈ ఏడాది జూన్‌లో ‘గద్దర్‌ ప్రజా పార్టీని (జీపీపీ)’ స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. దిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు.

ప్రజా యుద్ధనౌకగా ఇలా... 

  • గద్దర్‌ను ప్రజా యుద్ధనౌక(పీపుల్స్‌ వార్‌షిప్‌) అని 1989లో ఒక సంపాదకుడు సంబోధించగా... అదే ఆయనకు బిరుదుగా మారింది.


CBIC : సీబీఐసీ ఛైర్మన్‌గా సంజయ్‌ కుమార్‌

CBIC Chairman

  • కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు(సీబీఐసీ) ఛైర్మన్‌గా సంజయ్‌ కుమార్‌ అగర్వాల్‌ను 2023 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం నియమించింది. 
  • మే 31న పదవీ విరమణ చేసిన వివేక్‌ జోహ్రి స్థానంలో సంజయ్‌ కుమార్‌ అగర్వాల్‌ నియమితులయ్యారు. 
  • ప్రస్తుతం సీబీఐసీ సభ్యుడిగా అగర్వాల్‌ ఉన్నారు. మరో వైపు, డీజీజీఐ ప్రధాన డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్న సుర్జీత్‌ భుజబల్‌ను సీబీఐసీ సభ్యుడిగా నియమిస్తున్నట్లు మరో ఆదేశంలో ఆర్థిక శాఖ తెలిపింది.

CBIC-Central Board of Indirect Taxes and Customs 

Bhumana Karunakar Reddy : తితిదే ఛైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి

TTD Chairman Bhumana Karunakar Reddy

  • తిరుమల, తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 2023 ఆగస్టు 5న ఉత్తర్వులిచ్చింది. వైవీ సుబ్బారెడ్డి స్థానంలో భూమన కరుణాకర్‌రెడ్డి నియమితులయ్యారు.
  • భూమన గతంలోనూ 2006 నుంచి 2008 వరకు తితిదే బోర్డు ఛైర్మన్‌గా పనిచేశారు. తాజాగా రెండో పర్యాయంలో రెండేళ్లపాటు కొనసాగనున్నారు. 
  • ఈయన గతంలో పేద వధూవరుల కోసం కల్యాణమస్తు, వెనుకబడిన ప్రాంతాల్లో శ్రీవారి కల్యాణాలు చేయించేందుకు దళిత గోవిందం వంటి కార్యక్రమాలను అమలుచేశారు. 
  • బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవం రోజున శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల తాకిడి పెరిగిన దృష్ట్యా.. ప్రతి పౌర్ణమికి తిరుమలలో గరుడ వాహన సేవను ప్రారంభించారు. 
  • వైయస్‌ఆర్‌ జిల్లా నందలూరు మండలం ఈదరపల్లెలో జన్మించిన కరుణాకర్‌రెడ్డి.. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివారు. 

Anant Maheshwari : హానీవెల్‌లోకి మైక్రోసాఫ్ట్‌ ఇండియా మాజీ ప్రెసిడెంట్‌

Anant Maheshwari-successsecret

మైక్రోసాఫ్ట్‌ ఇండియా మాజీ ప్రెసిడెంట్‌ అనంత్‌ మహేశ్వరి హనీవెల్‌లో చేరారు. బెన్‌ డ్రిగ్స్‌ స్థానంలో హైగ్రోత్‌ రీజియన్‌ పోర్ట్‌ఫోలియోకు ప్రెసిడెంట్‌, సీఈఓగా ఆయన నియమితులయ్యారు. 

హనీవెల్‌ సీఈఓ విమల్‌ కపూర్‌కు నేరుగా రిపోర్ట్‌ చేసే కార్పొరేట్‌ ఆఫీసర్‌గా అనంత్‌ మహేశ్వరి వ్యవహరిస్తారు. దుబాయ్‌, యూఏఈలలో మహేశ్వరి పనిచేయాల్సి ఉంటుంది.

హనీవెల్‌కు చెందిన చైనా, భారత్‌, ఆగ్నేయాసియా, మధ్య-తూర్పు ఐరోపా, మధ్య ప్రాచ్యం, మధ్య ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా వ్యాపారాలను అనంత్‌ మహేశ్వరి పర్యవేక్షిస్తారు. బెన్‌ డ్రిగ్స్‌ ఇదే కంపెనీలో ఇతర నాయకత్వ హోదాకు మారనున్నారు.

Wednesday, August 2, 2023

ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఎండీ, సీఈఓ విశ్వనాథ గౌడ్‌ రాజీనామా


ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఎండీ, సీఈఓ వై.విశ్వనాథ గౌడ్‌ తన పదవికి రాజీనామా చేశారు. జులై 31న వ్యాపార వేళలు ముగిసిన అనంతరం, కంపెనీ డైరెక్టర్ల బోర్డు నుంచి కూడా ఆయన వైదొలగుతున్నట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందింది. 

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా నుంచి సూపర్‌ యాన్యుయేషన్‌ (పదవీ విరమణ) ప్రయోజనం పొందిన తర్వాత, గౌడ్‌ తన రాజీనామా సమర్పించినట్లు కంపెనీ వెల్లడిరచింది. ఎండీ, సీఈఓ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ బోర్డు డైరెక్టర్లకు ఆయన లేఖ రాశారు.

68వ అంతస్తు నుంచి పడి ఫ్రాన్స్‌ సాహసికుడి మృతి


  • అత్యంత ఎత్తైన భవనాలను అధిరోహించి భారీ సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న ఫ్రాన్స్‌ సాహసికుడు రెమీ లుసిడి(30) ప్రమాదవశాత్తు మృతి చెందాడు. 
  • హాంకాంగ్‌లోని ట్రెగంటెర్‌ టవర్‌ కాంప్లెక్స్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

Tuesday, July 18, 2023

సాహితీవేత్త మల్లెమాల వేణుగోపాల్‌రెడ్డి మృతి



ప్రముఖ సాహితీవేత్త, వైయస్‌ఆర్‌ జిల్లా కడప నగరంలో పేరొందిన పేదల వైద్యుడు మల్లెమాల వేణుగోపాల్‌రెడ్డి (88) 2023 జులై 2న మృతి చెందారు. 
వేణుగోపాల్‌రెడ్డి స్వస్థలం నెల్లూరు జిల్లా అయినా కడప నగరానికి చెందిన వరలక్ష్మిని వివాహం చేసుకుని అక్కడే సర్జన్‌గా స్థిరపడ్డారు. తక్కువ ఫీజుతో వైద్యం అందిస్తూ పేరొందారు. ఆయన భార్య వరలక్ష్మి కట్టమంచి రామలింగారెడ్డి మేనకోడలు. 
ప్రముఖ సినిమా నిర్మాత మల్లెమాల సుందరరామిరెడ్డి (ఎంఎస్‌ రెడ్డి) ఆయనకు సొంత సోదరుడు. 
మల్లెమాల 1960లోనే తన పెద్ద కుమార్తె శిరీష పేరుతో కథలు రాయడం మొదలుపెట్టి ఇప్పటి వరకు దాదాపు 100 కథలు (5 సంపుటాలుగా వచ్చాయి) రాశారు. ‘ఆవలి గట్టు’ నవలా రాశారు. ఆయన జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు (1970లో) శ్రీశ్రీ, కొడవటిగంటి వంటి సాహితీ దిగ్గజాలను కడపకు రప్పించి, ఏటా గొప్ప సాహిత్య సభలు నిర్వహించారు. 2009 నుంచి ‘మల్లెమాల సాహిత్య పురస్కారం’ ఏర్పాటు చేసి సాహితీవేత్తలకు పురస్కారాలు అందిస్తున్నారు.

Saturday, October 8, 2016

ఐఎన్‌ఎస్‌ అధ్యక్షుడిగా సోమేష్‌ శర్మ


ది ఇండియన్‌ న్యూస్‌ పేపర్‌ సొసైటీ (ఐఎన్‌ఎస్‌) అధ్యక్షుడిగా 2016-17 సం॥నికి రాష్ట్రదూత్‌ సప్తాహిక్‌కు చెందిన సోమేష్‌ శర్మ ఎన్నికయ్యారు. పీవీ చంద్రన్‌ స్థానాన్ని ఆయన భర్తీ చేస్తారు. ఉపాధ్యక్షురాలిగా అఖిలా ఉరాంకర్‌, ఉపాధ్యక్షుడిగా కె.బాలాజీ, గౌరవ కోశాధికారిగా శరద్‌ సక్సేనా ఎన్నికయ్యారు. ఐఎన్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శిగా వి.శంకరన్‌ కొనసాగనున్నారు.

కొలంబియా శాంతి ఒప్పంద కార్యక్రమానికి రవిశంకర్‌కు ఆహ్వానం


కొలంబియా ప్రజా సైన్యం(తిరుగుబాటు సైనిక బలగాలు- ఎఫ్‌ఏఆర్‌సీ), ప్రభుత్వానికి మధ్య శాంతి ఒప్పందంపై సంతకాల కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ను ఎఫ్‌ఏఆర్‌సీ, కొలంబియా అధ్యక్షుడు జువాన్‌ మాన్యుయేల్‌ శాంటోస్‌ ఆహ్వానించారు.  సుమారు 15 మంది దేశాధినేతలు హాజరు కావొచ్చని భావిస్తున్న ఈ కార్యక్రమానికి తూర్పు దేశాల నుంచి వెళ్తున్న ఏకైక ఆధ్యాత్మిక గురువు రవిశంకరే. ఆగస్టు 24న శాంతి ఒప్పందం కుదరడంలో రవిశంకర్‌ చేసిన కృషి ఎనలేనిదని కొలంబియా అధ్యక్షుడు కొనియాడారు. రవిశంకర్‌ 2015 జూన్‌లో అధ్యక్షుడు జువాన్‌ను కలుసుకుని శాంతి నెలకొనడానికి అన్ని విధాలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం హవానాకు వెళ్లి ఎఫ్‌ఏఆర్‌సీ కమాండర్లతో చర్చించారు. గాంధీజీ సిద్ధాంతాల ప్రకారం అహింసా విధానంలో పోరాడేలా ఒప్పించారు.