Showing posts with label ఇతర రాష్ట్రాల సమాచారం. Show all posts
Showing posts with label ఇతర రాష్ట్రాల సమాచారం. Show all posts

Monday, August 14, 2023

Assam : అస్సాంలో నియోజకవర్గాల పునర్విభజన తుది నివేదిక విడుదల

 


  • అస్సాంలోని శాసనసభ (116), లోక్‌సభ (14) నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి తుది నివేదికను భారత ఎన్నికల సంఘం 2023 ఆగస్టు 11న విడుదల చేసింది. 
  • తాజా పరిణామంతో ఆయా నియోజకవర్గాల సంఖ్యలో ఎటువంటి మార్పు రాలేదు. అయితే ఓ ఎంపీ, 19 అసెంబ్లీ స్థానాల పేర్లు మార్చారు. అలాగే 19 శాసనసభ, 2 లోక్‌సభ స్థానాలను షెడ్యూల్డ్‌ తెగలకు రిజర్వు చేశారు. 
  • ఓ ఎంపీ స్థానం, తొమ్మిది ఎమ్మెల్యే స్థానాలను షెడ్యూల్డ్‌ కులాలకు కేటాయించారు. దీంతో కొత్తగా ఎస్టీలకు మూడు, ఎస్సీలకు ఓ శాసనసభ స్థానం పెరిగాయి. 2001 జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగింది.


Kerala : మా రాష్ట్రం పేరును కేరళం అని మార్చండి

 


  • తమ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి కేరళ శాసనసభ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఓ తీర్మానాన్ని 2023 ఆగస్టు 9న పార్టీలకతీతంగా ఏకగ్రీవంగా ఆమోదించింది. 
  • పేరు మార్పునకు సంబంధించిన తీర్మానాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళ పేరును అన్ని భాషల్లో కేరళంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 
  • తమ రాష్ట్రం పేరును పూర్వం నుంచే మలయాళంలో ‘కేరళం’ అని పిలిచేవారని గుర్తు చేశారు. కానీ, ఇతర భాషల్లో మాత్రం కేరళ అని పిలుస్తున్నారని ఆయన చెప్పారు. 
  • ‘‘రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో మా రాష్ట్రం పేరును కేరళ అని రాశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ప్రకారం దానిని ‘కేరళం’గా సవరించాలి. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో పేర్కొన్న అన్ని భాషల్లో తక్షణమే మార్పులు చేయాలి. రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తోంది’’అని సీఎం విజయన్‌ అన్నారు. 
  • ఈ తీర్మానానికి ఎటువంటి సవరణలు ప్రతిపాదించకుండా కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ ఆమోదించింది. అనంతరం స్పీకర్‌ ఎ.ఎన్‌.షంషీర్‌ ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు.

Thursday, August 3, 2023

ఏ రాష్ట్ర రాజ్‌భవన్‌లో ఇటీవల అవినీతి నిరోధక సెల్‌ ఏర్పాటు చేసారు?


  • పశ్చిమ బెంగాల్‌లో గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వం మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గవర్నర్‌ సి.వి.ఆనంద బోస్‌ కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో 2023 ఆగస్టు 2న ‘అవినీతి నిరోధక సెల్‌’ను ప్రారంభించారు. అవినీతి, ప్రజా సమస్యల గురించి అందులో ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు వాటిని తాము పంపిస్తామని పేర్కొన్నారు. 
  • ఈ పరిణామంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌ ప్రభుత్వ పరిపాలనా కార్యకలాపాల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. భాజపా ఆదేశాలకు అనుగుణంగానే ఆయన పనిచేస్తున్నారని ఆరోపించారు.

Tuesday, July 18, 2023

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీలో చీలిక


  • మహారాష్ట్రలో రాజకీయ ఉద్ధండుడు శరద్‌ పవార్‌ నేతృత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) 2023 జులై 2న నిట్టనిలువునా చీలిపోయింది. ఏడాది కిందట శివసేనలో చీలిక వచ్చినట్లుగానే ఇప్పుడు ఎన్సీపీ ముక్కలైంది. 
  • పార్టీ సీనియర్‌ నేత, పవార్కు స్వయానా అన్న కుమారుడైన అజిత్‌ పవారే పార్టీని చీల్చారు. ఆ వెంటనే ప్రభుత్వంలో చేరిపోయారు. ఏక్నాథ్‌ శిందే ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా, మరో 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 
  • అజిత్‌ పవార్‌ ప్రభుత్వంలో చేరడంతో జితేంద్ర అవధను ప్రతిపక్ష నేతగా ఎన్సీపీ నియమించింది. 

Thursday, October 6, 2016

బిహార్‌లో మద్యం నిషేధం ఉత్తర్వు కొట్టివేత


బిహార్‌లో మద్య నిషేధం విధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను పట్నా హైకోర్టు కొట్టివేసింది. మద్యం వినియోగం, అమ్మకాలపై నిషేధం విధిస్తూ 2016 ఏప్రిల్‌ 5న రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వు రాజ్యాంగ విరుద్ధమని, అమలు చేయరాదని పేర్కొంది. 

Wednesday, October 5, 2016

ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా నదీజలాల ట్రైబ్యునల్‌ కాపరిమితి పొడిగింపు


ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా మధ్య నదీజల వివాద పరిష్కారానికి ఏర్పాటైన ట్రైబ్యునల్‌ కాపరిమితిని కేంద్ర ప్రభుత్వం 2017 సెప్టెంబరు 17 వరకు పెంచింది. 2010 ఫిబ్రవరి 24న ఏర్పాటైన ఈ ట్రైబ్యునల్‌ 2013 ఫిబ్రవరి 23 నాటికల్లా తీర్పు వెలువరించాల్సి ఉంది. అయితే ఈ ట్రైబ్యునల్‌ 2012 సెప్టెంబరు 17న ఏర్పాటైనట్లు పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ ఒడిశా ప్రభుత్వం 2013లో కోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీంకోర్టు ఒడిశా వాదనను సమర్థిస్తూ 2013 డిసెంబరు 13న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ట్రైబ్యునల్‌ ఏర్పాటు తేదీని 2012 సెప్టెంబరు 17గా నిర్ధారిస్తూ 2014 మార్చి 14న నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ రోజు నుంచి మూడేళ్ల లోపు నివేదిక ఇవ్వాని నిర్దేశించింది. ఆ గడువు 2015 సెప్టెంబరు 17తో ముగిసిపోయినప్పటికీ దాన్ని మరో ఏడాది పొడిగించాలని ట్రైబ్యునల్‌ కోరడంతో 2016 వరకు పెంచింది. ఇప్పుడు రెండోసారి చేసిన విజ్ఞప్తి మేరకు మరో ఏడాది పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 

అరుణాచల్‌ప్రదేశ్‌లో ఒకే ఒక్క కాంగ్రెస్‌ ఎమ్మెల్యే


అరుణాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 43 మంది శాసనసభ్యులు ముఖ్యమంత్రి పెమా ఖండు నేతృత్వంలో ఒకేసారిగా పార్టీ ఫిరాయించారు. వీరంతా బీజేపీ నేతృత్వంలోని కూటమికి సంబంధించిన పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ అరుణాచల్‌ (పీపీఏ)లో పార్టీని విలీనం చేశారు. కాంగ్రెస్‌కు అరుణాచల్‌ప్రదేశ్‌లో ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యేనే మిగిలాడు.

Friday, September 30, 2016

కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరి జల వివాదం


కావేరి నదీ జలాల పంపిణీపై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదం ముదిరి హింసాత్మకంగా మారింది. దీంతో రెండు రాష్ట్రాల్లోను పౌరులు, ఆస్తులపై పెద్దఎత్తున దాడులు జరిగాయి. తమిళనాడుకు రోజుకు 12 వేల క్యూసెక్కుల చొప్పన 10 రోజుల పాటు కావేరి జలాలు విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు 2016 సెప్టెంబర్‌ 12న ఆదేశాలిచ్చింది. దీంతో ఒక్కసారిగా అల్లర్లు చెలరేగి హింసాత్మకంగా మారడంతో వందల సంఖ్యలో ప్రభుత్వ ప్రైవేటు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. 

Saturday, September 17, 2016

కశ్మీర్‌లో ఆపరేషన్‌ కామ్‌ డౌన్‌


కశ్మీర్‌లో శాంతిని నెకొల్పే ఉద్దేశ్యంతో భారత సైన్యం ఆపరేషన్‌ కామ్‌ డౌన్‌ను ప్రారంభించింది. ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులను ఏరివేసి సాధారణ పరిస్థితులు కల్పించడానికి దక్షిణ కశ్మీర్‌లో 4 వేల మంది అదనపు జవాన్లను రంగంలోకి దింపింది. 

Saturday, September 10, 2016

సౌనీ తొలి దశ ప్రారంభం



నర్మదా నది మిగులు జలాలను 115 జలాశయాలకు మళ్లించడానికి రూ.12,000 కోట్లతో ప్రతిపాదించిన సౌరాష్ట్ర నర్మదా అవతరణ్‌ సాగునీటి పారుదల పథకం (సౌనీ) తొలి దశను గుజరాత్‌లోని జామ్‌నగర్‌ జిల్లాలోని సనోసరా గ్రామంలో ప్రధాని నరేంద్రమోడి 2016 ఆగస్టు 30న ప్రారంభించారు.

https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

తమిళనాడు గవర్నర్‌గా చెన్నమనేని విద్యాసాగర్‌రావు


తమిళనాడులో 5 సం॥ల పాటు గవర్నర్‌గా కొనసాగిన కొణిజేటి రోశయ్య పదవీకాలం  2016 ఆగస్టు 31న ముగిసింది. దీంతో మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగరరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు.



Friday, September 9, 2016

తమిళనాడు క్రీడాకారులకు అమ్మ వ్యాయామశాలలు


తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలిత అమ్మ పథకాల పరంపరను కొనసాగిస్తూ మరో పథకాన్ని ప్రకటించారు. క్రీడాకారులకు ఊతమిచ్చేలా రాష్ట్రమంతటా అమ్మ వ్యాయామశాలలు ఏర్పాటు చేయనున్నట్లు శాసనసభలో ప్రకటించారు. https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

Saturday, September 3, 2016

యూపీ చలనచిత్ర అభివృద్ధి మండలి సీనియర్‌ వైస్‌ ఛైర్మన్‌గా జయప్రద


మాజీ ఎంపీ, సీనీనటి జయప్రద ఉత్తర్ ప్రదేశ్‌ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి మండలి సీనియర్‌ వైస్‌ చైర్‌పర్సన్‌గా నియమితుయ్యారు. గతంలో రాంపూర్‌ నియోజక వర్గం నుంచి ఆమె రెండు పర్యాయాలు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీగా గెలుపొందారు. యూపీ చలనచిత్ర అభివృద్ధి మండలి ఛైర్మన్‌గా గోపాల్‌దాస్‌ నీరజ్‌ నియమితుయ్యారు.

గుజరాత్‌ నూతన ముఖ్యమంత్రి ఎవరు?


గుజరాత్‌ ముఖ్యమంత్రిగా విజయ్‌ రూపానీ 2016 ఆగస్టు 7న ప్రమాణస్వీకారం చేశారు. విజయ్‌ రూపానీ 2006 నుంచి 2012 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. మాజీ సీఎం ఆనందిబెన్‌ పటేల్‌ కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు.

గుజరాత్‌ సీఎం అనందిబెన్‌ రాజీనామా


గుజరాత్‌ తొలి మహిళా ముఖ్యమంత్రి ఆనందిబెన్‌ పటేల్‌ 2016 ఆగస్టు 3న తన పదవికి రాజీనామా చేశారు.

Friday, September 2, 2016

త్రిపుర సుందరి ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం


త్రిపుర రాజధాని అగర్తల  నుంచి డిల్లీ వెళ్లే త్రిపుర సుందరి ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు 2016 జూలై 31న ప్రారంభించారు. దీంతో  త్రిపురలో తొలిసారి బ్రాడ్‌గేజ్‌ లైన్‌ కూడా అందుబాటులోకి వచ్చింది.

హర్యానా అసెంబ్లీలో జైన దిగంబర మత గురువు ధార్మిక ప్రసంగం



 జైన దిగంబర మత గురువు తరుణ్‌సాగర్‌ తొలిసారిగా హర్యానా శాసనసభలో కద్వే వచన్‌ పేరిట ధార్మిక ప్రసంగం చేశారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా 40 నిమిషాల పాటు ప్రసంగించారు. రాజకీయాలపై ధర్మం నియంత్రణ తప్పనిసరి అని తరుణ్‌సాగర్‌ పేర్కొన్నారు. ఆడశిశువును గర్భంలోనే చంపేసే భ్రూణహత్యలు పెద్దసమస్య అనీ, సమాజంలో సమతౌల్యాన్ని దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారు.


బెంగాలీ శ్రోతలకు ఆకాశవాణి మైత్రి రేడియో ఛానల్‌


బెంగాలీ శ్రోతల కోసం ఆకాశవాణి మైత్రి రేడియో ఛానల్‌ను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో 2016 ఆగస్టు 23న ప్రారంభించారు. బెంగాలీ సంస్క తిని ప్రతిబింబిస్తూ భారత్‌ - బంగ్లాదేశ్‌ సమ్మిళిత సమాచారంతో ఈ ఛానల్‌ కార్యక్రమాలను అందిస్తుంది.

కశ్మీర్‌లో బీఎస్‌ఎఫ్‌ మోహరింపు


కశ్మీర్‌లో 12 ఏళ్ల తర్వాత తొలిసారిగా సరిహద్దు భద్రతాదళం (BSF)  మోహరించింది. శ్రీనగర్‌లోని ప్రముఖ వాణిజ్యప్రాంతం లాల్‌చౌక్‌, ఆ పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతలు పర్యవేక్షణ బాధ్యతలను BSFకు అప్పగించినట్లు పోలీసు వెల్లడించారు.

BSF - Border Security Force


Saturday, August 27, 2016

అరుణాచల్‌ప్రదేశ్‌ మాజీ సీఎం అనుమానాస్పద మృతి


అరుణాచల్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కలిఖోపుల్‌ 2016 ఆగస్టు 7న అనుమానాస్పద స్థితిలో ఇటానగర్‌లోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో మృతి చెందారు. కాంగ్రెస్‌ తిరుగుబాటు నేత అయిన పుల్‌ 2016  ఫిబ్రవరి 19 నుంచి జులై 13 వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని జులైలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆయన సీఎం పదవి నుంచి తప్పుకున్నారు.