Showing posts with label సైన్స్ & టెక్నాలజీ. Show all posts
Showing posts with label సైన్స్ & టెక్నాలజీ. Show all posts

Tuesday, August 22, 2023

Not using google account...? : గూగుల్‌ అకౌంట్‌ వాడట్లేదా...?

google2-#successsecret

  • మీ జీ మెయిల్‌ అకౌంట్‌ను ఈ మధ్య అసలే వాడటం లేదా? దాని వంక కన్నెత్తి చూసి రెండేళ్లయిందా? అయితే అది ఇక శాశ్వతంగా డిలీట్‌ అయిపోతుంది. ఈ మేరకు కొత్త పాలసీని 2023 డిసెంబర్‌ 1 నుంచి గూగుల్‌ అందుబాటులోకి తెస్తోంది.
  • దీనికి సంబంధించిన వివరాలన్నీ తెలియజేస్తూ గూగుల్‌ తన యూజర్లందరికీ మెయిల్స్‌ పంపింది. తాను అందించే అన్ని సర్వీసులు, ప్రొడక్టులకూ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ‘మా యూజర్లు అకౌంట్‌ను వాడటం మానేసినా వారి డేటా పూర్తిగా గోప్యంగా, సురక్షితంగా ఉండేలా చూడటమే మా లక్ష్యం. అకౌంట్‌ డిలీషన్‌ అందులో భాగమే’’ అని గూగుల్‌ ప్రకటించింది.  

వీటికి వర్తిస్తుంది...  

  • గూగుల్‌ అకౌంట్‌ను రెండేళ్ల పాటు సైన్‌ ఇన్‌ చేయకపోతే, వాడకపోతే.
  • ఒకసారి డిలీట్‌ చేసిన అకౌంట్‌ తాలూకు జీ మెయిల్‌ అడ్రస్‌ను ఇంకెవరికీ కేటాయించబోరు.
  • సేఫ్టీ, సెక్యూరిటీ కారణాల రీత్యా తన పాలసీని ఇలా అప్డేట్‌ చేస్తున్నట్టు గూగుల్‌ తెలిపింది.
  • అయితే అకౌంట్‌ను డిలీట్‌ చేసే ముందు గూగుల్‌ పలుమార్లు రిమైండర్‌ మెయిల్స్‌ పంపుతుంది. అవి సదరు అకౌంట్‌తోపాటు యూజర్‌ తాలూకు రికవరీ అకౌంట్‌కు కూడా వెళ్తాయి.
  • ఏదైనా చర్య తీసుకోవడానికి కనీసం 8 నెలల ముందు నుంచే ఈ మెయిల్స్‌ రావడం మొదలవుతుంది.

మీ గూగుల్‌ అకౌంట్‌ యాక్టివ్‌గా ఉండాలంటే...

  • తరచూ లాగిన్‌ అవుతూ ఉన్నా...
  • కనీసం రెండేళ్లకు ఒకసారైనా లాగిన్‌ అయినా...
  • గూగుల్‌ డ్రైవ్‌ వాడినా...
  • మెయిల్‌ పంపినా, చదివినా...
  • యూట్యూబ్‌లో వీడియో చూసినా...
  • ఏ గూగుల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసినా...
  • థర్డ్‌ పార్టీ యాప్‌, సర్వీస్‌లను గూగుల్‌ ద్వారా సైన్‌ ఇన్‌ చేసినా మీ గూగుల్‌ ఖాతాకు ఎలాంటి ఢోకా ఉండదు.

మినహాయింపులున్నాయ్‌..

  • గూగుల్‌ అకౌంట్‌ డిలీషన్‌ పాలసీకి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. వాటి ప్రకారం రెండేళ్ల పాటు వాడకంలో లేని అకౌంట్లను డిలీట్‌ చేసే కొత్త విధానం ఈ కింది వాటికి వర్తించదు  
  • యూట్యూబ్‌ చానల్స్‌, ఖాతాకు, కామెంట్లున్న గూగుల్‌ అకౌంట్‌
  • డబ్బులతో కూడిన గిఫ్ట్‌ కార్డులున్న జీ మెయిల్‌ అకౌంట్‌
  • పబ్లిషిడ్‌ అప్లికేషన్‌ ఉన్న అకౌంట్‌   

Heavy drop system : హెవీ డ్రాప్‌ వ్యవస్థ ట్రయల్స్‌ సక్సెస్‌

Not using google account...?

  • Not really using your Gmail account lately? Has it been two years since you saw it? But it will be deleted permanently. To this extent, Google is making the new policy available from December 1, 2023.
  • Google has sent mails to all its users giving all the details related to this. It has made it clear that this applies to all the services and products it offers. Our aim is to ensure that our users' data remains completely confidential and secure even if they stop using their account. Google announced that account deletion is part of it.

Applies to...

  • If Google Account has not been signed in or used for two years.
  • Once the account is deleted, the Gmail address will not be assigned to anyone else.
  • Google has said that it is updating its policy for safety and security reasons.
  • But before deleting the account, Google sends reminder mails several times. They will also go to the recovery account of the user Taluk along with that account.
  • These mails start coming at least 8 months before any action is taken.

To keep your google account active...

  • Logging in frequently...
  • Login at least once in two years...
  • Using Google Drive...
  • Whether sending mail or reading...
  • Watch the video on YouTube...
  • Any google app download...
  • Signing in to third party apps and services through Google will not affect your Google account.

There are exceptions..

  • There are some exceptions to the Google Account Deletion Policy. According to them the new policy of deleting accounts that have not been used for two years will not apply to the following
  • Google account with YouTube channels, account and comments
  • Gmail account with cashed gift cards
  • An account with a published application

క్యాన్సర్‌ కారక కొత్త జన్యువుల గుర్తింపు

  • మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌కు కారణమయ్యే కొత్త జన్యువులను కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం (బ్రిటన్‌), లావాల్‌ విశ్వవిద్యాలయాలకు (కెనడా) చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 
  • ఇప్పటిదాకా బీఆర్సీఏ1, బీఆర్సీఏ2, పీఏఎల్బీ2 జన్యువుల్లోని లోపాలే రొమ్ము క్యాన్సర్‌కు దారి తీస్తాయని భావిస్తూ వచ్చారు. ఇప్పుడు వీటికితోడు మరో నాలుగు జన్యువులవల్లా క్యాన్సర్‌ వస్తుందని కనిపెట్టారు. వాటిలో ఎంఏపీ3కే1 ఒకటి. 
  • రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న 26,000 మంది మహిళలతోపాటు  ఆ వ్యాధిలేని 2.17 లక్షల మంది మహిళలపై శాస్త్రవేత్తలు అధ్యయనం జరిపారు. ఈ మహిళలంతా ఐరోపా, ఆసియాల్లోని 8 దేశాలకు చెందినవారు. 
  • శాస్త్రవేత్తలు కొత్తగా గుర్తించిన జన్యువుల లోపాలవల్ల అరుదుగానే క్యాన్సర్‌ వస్తుంది. ఈ జన్యు లోపాలపై మరింత పరిశోధన జరిపి తుది నిర్ధారణకు రావాల్సి ఉందని, ఆ పని పూర్తయితే కొత్త తరహా చికిత్సా విధానాలు అందుబాటులోకి వస్తాయని పరిశోధకులు వివరించారు.


Lander Luna-25 : చంద్రునిపై కూలిన ల్యాండర్‌ లూనా-25 ఏ దేశానికి చెందినది?

 

Lander Luna-25-#successsecert

  • దాదాపు 50 ఏళ్ల విరామం తర్వాత చందమామపై వ్యోమనౌకను దించేందుకు రష్యా చేసిన ప్రయత్నం విఫలమైంది. పుతిన్‌ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన లూనా-25 ల్యాండర్‌.. సాంకేతిక సమస్యతో చంద్రుడి ఉపరితలంపై కుప్పకూలింది. 
  • లూనా-25ని 2023 ఆగస్టు 11న రష్యాలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్‌ నుంచి ప్రయోగించారు. ఆగస్టు 16న అది విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. జాబిల్లి ఫొటోలనూ పంపింది. 
  • ఆగస్టు 19న ఈ వ్యోమనౌకను దీర్ఘవృత్తాకార ప్రీ ల్యాండిరగ్‌ కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు రష్యా అంతరిక్ష సంస్థ ‘రోస్‌కాస్మోస్‌’ ఉపక్రమించింది. అందుకోసం లూనా-25లోని ఇంజిన్‌ను మండిరచింది. అయితే అది నిర్దేశిత పరామితులకు అనుగుణంగా జరగలేదు. దీంతో వ్యోమనౌక ‘అనియంత్రిత కక్ష్య’లోకి ప్రవేశించిందని రష్యా పేర్కొంది. అనంతరం అది కూలిపోయిందని ఆగస్టు 20న వెల్లడిరచింది. వైఫల్యానికి కారణాలను గుర్తించేందుకు ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.

పూర్వవైభవ సాధనకు ప్రయత్నించి..

  • సంక్లిష్టమైన దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఏడాదిపాటు పరిశోధనలు జరిపేందుకు లూనా-25ని రష్యా ప్రయోగించింది. భవిష్యత్‌లో చంద్రుడి వద్ద పూర్తి ఆటోమేటిక్‌ రోదసి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నదీ దాని ప్రణాళికల్లో భాగం. ఈ వ్యోమనౌక ద్వారా చంద్రుడి అంతర్గత నిర్మాణాన్ని శోధించాలని, నీరు సహా సహజవనరులను అన్వేషించాలని భావించింది. 
  • జాబిల్లి ఉపరితలంపై కాస్మిక్‌ కిరణాల ప్రభావం, విద్యుదయస్కాంత రేడియోధార్మికత ప్రభావం వంటి వాటి గురించి శోధించాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది. లూనా-24 పేరుతో 1976లో రష్యా (నాడు సోవియట్‌ యూనియన్‌) చివరిసారిగా చంద్రుడిపైకి ల్యాండర్‌ను ప్రయోగించింది. 
  • ఒకప్పుడు అంతరిక్షంలో ప్రబల శక్తిగా ఉన్న రష్యా తన పూర్వ వైభవాన్ని సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే లూనా-25 ప్రయోగాన్ని చేపట్టింది. భవిష్యత్‌లో చందమామ కక్ష్య, ఉపరితలం కేంద్రంగా విస్తృత కార్యకలాపాలకు ప్రణాళికలు రచించింది.

Common Yet Uncommon : సుధామూర్తి చిన్న పిల్లల పుస్తకం ‘‘కామన్‌ ఎట్‌ అన్‌కామన్‌’’

Lander Luna-25 which crashed on the moon belonged to which country?

  • After a gap of almost 50 years, Russia's attempt to land a spacecraft on Chandamama failed. The Luna-25 lander launched by the Putin government crashed on the surface of the moon due to a technical problem.
  • Luna-25 was launched on August 11, 2023 from the Vostochny Cosmodrome in Russia. It successfully entered lunar orbit on August 16. Jabilli also sent photos.
  • On August 19, the Russian space agency Roscosmos launched the spacecraft into an elliptical pre-Landirog orbit. For that the engine of Luna-25 was fired. However, it did not meet the specified parameters. Russia claimed that the spacecraft had entered an 'uncontrolled orbit'. Later it was revealed on August 20 that it had collapsed. It said that a special commission is being set up to find out the reasons for the failure.

Try to practice pravaybhava..

  • Russia launched Luna-25 to conduct year-long research in the complex South Pole region. Part of its plans is to set up a fully automatic radio station on the moon in the future. Through this spacecraft, it is expected to explore the internal structure of the moon and explore natural resources including water.
  • Zabilli also aims to search for the effect of cosmic rays and electromagnetic radiation on the surface. Russia (then Soviet Union) last launched a lander to the Moon in 1976, named Luna-24.
  • Once the dominant power in space, Russia is desperately trying to regain its former glory. Luna-25 was launched as a part of it. In the future, Chandamama has plans for a wider range of operations centered on orbit and surface.

Monday, August 21, 2023

Heavy drop system : హెవీ డ్రాప్‌ వ్యవస్థ ట్రయల్స్‌ సక్సెస్‌

Heavy drop system-#successsecret

  • భారత వాయుసేన సరకు రవాణా విమానం సాయంతో సరికొత్త ‘హెవీ డ్రాప్‌ సిస్టమ్‌’ను విజయవంతంగా పరీక్షించింది. 2023 ఆగస్టు 19న ఈ మేరకు ఓ ట్వీట్‌ చేసింది.
  • ‘హెవీ డ్రాప్‌ సిస్టమ్‌’ను ఆగ్రాలోని రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)కు చెందిన ‘ఏరియల్‌ డెలివరీ రీసెర్చీ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌’ రూపొందించింది.

Mission Life : ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌లు మిషన్‌ లైఫ్‌ ను ఎప్పుడు ప్రారంభించారు?

Heavy drop system trials success

  • The Indian Air Force has successfully tested the new 'Heavy Drop System' with the help of a cargo plane. On August 19, 2023, she made a tweet to this effect.
  • The 'Heavy Drop System' was designed by the 'Aerial Delivery Research and Development Establishment' of the Defense Research and Development Organization (DRDO) in Agra.

Driverless buses : శాన్‌ఫ్రాన్సిస్కోలో డ్రైవర్‌ లేని బస్సులు


  • అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరం రోబో ట్యాక్సీలు, డ్రైవర్‌ లేని బస్సులతో ప్రయోగాలు మొదలుపెట్టింది. రవాణా, ప్రయాణికుల భద్రతాపరమైన సమస్యలు ఉన్నా నగరంలో రోబో ట్యాక్సీ సేవలను అనుమతించిన వారం రోజులకే అధికారులు డ్రైవర్‌ రహిత స్వయంచాలిత బస్సు సేవలకూ ఆమోదం లభించింది. 
  • ఈ విద్యుత్తు బస్సు శాన్‌ఫ్రాన్సిస్కో నగరం వద్ద సముద్రంలోని ట్రెజర్‌ ఐలాండ్‌లో ప్రయోగాత్మకంగా మొదలైంది. 2,000 మంది నివసించే ఈ దీవిలోని నివాస ప్రాంతాలను మార్కెట్‌ ప్రాంతంతో కలిపే ఈ బస్సులో ప్రయాణాలు ఉచితం. 
  • ఒకేసారి 10 మంది ప్రయాణికులను తీసుకెళ్లే ఈ బస్సు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తిరుగుతుంది. డ్రైవర్‌ కానీ, స్టీరింగ్‌ వీల్‌ కానీ ఉండని ఈ బస్సులో రిమోట్‌ కంట్రోల్‌తో ఒక అటెండెంట్‌ మాత్రం ఉంటారు. అత్యవసర పరిస్థితిలో బస్సును ఆపడమే కాకుండా ప్రయాణికులకు ఆయన భరోసా ఇస్తాడు. 
  • డ్రైవర్‌ రహిత బస్సు కన్నా ముందు కాలిఫోర్నియా అధికారులు శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో క్రూజ్‌, వేమో అనే రెండు రోబో ట్యాక్సీ కంపెనీలను అనుమతించారు. వీటిలో క్రూజ్‌ సంస్థ జనరల్‌ మోటార్స్‌ కంపెనీ అనుబంధ సంస్థ. 

Unemployment : నిరుద్యోగం భయపెడుతోంది

Driverless buses in San Francisco

  • The US city of San Francisco has started experimenting with robot taxis and driverless buses. Despite the safety issues of transport and passengers, within a week of allowing robo-taxi services in the city, the authorities have approved driverless automatic bus services.
  • This electric bus started as an experiment at Treasure Island in the ocean near the city of San Francisco. The bus, which connects the residential areas of the island with a population of 2,000 to the market area, is free.
  • This bus which carries 10 passengers at a time runs from 9 am to 6 pm. There is no driver or steering wheel in this bus, but there is only one attendant with a remote control. He not only stops the bus in case of emergency but also reassures the passengers.
  • Before the driverless bus, California officials allowed two robo-taxi companies, Cruise and Waymo, in the city of San Francisco. Among them, Cruze is a subsidiary of General Motors Company.

Friday, August 18, 2023

saliva sample : లాలాజల నమూనా పరీక్షతో హృద్రోగ ముప్పును పసిగట్టగల విధానాన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు?

 

saliva sample-successsecret

  • గుండె-రక్తనాళాల సంబంధిత వ్యాధుల ముప్పును కేవలం లాలాజల నమూనా పరీక్షతో ముందుగానే పసిగట్టగల సరికొత్త విధానాన్ని కెనడాలోని మౌంట్‌ రాయల్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 
  • సాధారణంగా చిగుళ్ల ఇన్‌ఫ్లమేషన్‌ వల్ల పీరియడాంటైటిస్‌ అనే ఇన్‌ఫెక్షన్‌ తలెత్తుతుంది. దాని బాధితుల్లో ఇన్‌ఫ్లమేటరీ కారకాలు చిగుళ్ల ద్వారా రక్తప్రవాహంలోకి ప్రవేశించి.. రక్తనాళ వ్యవస్థకు హాని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 
  • ఈ నేపథ్యంలో- లాలాజలంలో తెల్ల రక్తకణాల స్థాయులను గుర్తించడం ద్వారా హృదయం-రక్తనాళాల సంబంధిత వ్యాధుల రాక ముప్పును ముందుగానే తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు తాజా పరిశోధనల్లో గుర్తించారు. 
  • పలువురు వ్యక్తులను సెలైన్‌తో పుక్కిలించేలా చేసి.. తద్వారా సేకరించిన లాలాజల నమూనాలను వారు విశ్లేషించారు. లాలాజలంలో తెల్ల రక్తకణాల స్థాయులు ఎక్కువగా ఉన్న వ్యక్తుల్లో.. రక్తనాళాలు బిరుసుగా మారుతున్నాయని, రక్తప్రవాహానికి అనుగుణంగా వ్యాకోచించే సామర్థ్యం వాటికి తక్కువగా ఉంటోందని నిర్ధారించారు. అలాంటి వ్యక్తుల్లో హృద్రోగాల ముప్పు పెరుగుతోందని తేల్చారు.


Which country's scientists have discovered a way to detect the risk of heart disease by testing a saliva sample?

  • Scientists at Mount Royal University in Canada have discovered a new way to detect the risk of cardiovascular diseases by simply testing a saliva sample.
  • An infection called periodontitis is usually caused by inflammation of the gums. In its victims, inflammatory factors are more likely to enter the bloodstream through the gums and damage the vascular system.
  • In this context, scientists have found out in the latest research that by detecting the levels of white blood cells in saliva, the risk of cardiovascular diseases can be detected early.
  • They analyzed the saliva samples collected by having several people gargle with saline. In people with high levels of white blood cells in saliva, it was concluded that the blood vessels become narrower and their ability to dilate according to the blood flow is less. It was concluded that the risk of heart disease is increasing in such people.

యాంటీబయాటిక్‌ అవశేషాల నిర్మూలనకు కొత్త ప్రక్రియ

  • వైద్యుల సలహా లేకుండానే మందుల షాపులకు వెళ్లి యాంటీ బయాటిక్‌ ఔషధాలు కొని వాడటం భారత్‌లో సర్వసాధారణం! దీనికితోడు కొవిడ్‌-19 సమయంలో టెట్రాసైక్లిన్‌, ఎరిథ్రోమైసిన్‌ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. విచ్చలవిడి వాడకం వల్ల రోగకారక బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్‌ను తట్టుకునే శక్తిని సంపాదించాయి. మరోవైపు మానవులు విసర్జించిన యాంటీ బయాటిక్స్‌ నీటి వనరుల్లో చేరిపోతున్నాయి. అవి ఇతర జీవులకు, పర్యావరణానికీ తీరని హాని కలిగిస్తాయి. 
  • పర్యావరణంలో కలసిపోయిన టెట్రాసైక్లిన్‌, ఎరిథ్రోమైసిన్‌ మందుల అవశేషాలను నిర్మూలించే పద్ధతిని ఐఐటీ-రూర్కీ పరిశోధకులు కనుగొన్నారు. నవీన్‌కుమార్‌ నవానీ నాయకత్వంలోని ఈ బృందంలో కిరణ్‌ అంబటిపూడి అనే తెలుగు పరిశోధకుడూ ఉన్నారు. 
  • వీరు కనుగొన్న ప్రక్రియ యాంటీబయాటిక్స్‌తోపాటు రసాయన కాలుష్యాన్నీ నిర్మూలించగలదు. ఈ ప్రక్రియలో మొదట నీటిలో చేరిన యాంటీబయాటిక్స్‌ అవశేషాలను కనిపెట్టడానికి బయోసెన్సర్‌ బ్యాక్టీరియాను ఉపయోగిస్తారు. కార్బన్‌ ఆధారిత నానోట్యూబ్‌లతో నీటిలోని యాంటీబయాటిక్స్‌ను ఆకర్షించి రసాయన ఉత్ప్రేరకం సాయంతో విచ్ఛిన్నం చేస్తారు. 
  • ఈ పద్ధతిలో కేవలం 3-4 గంటల్లోనే 93 శాతం యాంటీబయాటిక్‌ అవశేషాలను నిర్మూలించవచ్చు. నీటిలో కలసిపోయిన ప్రమాదకర రసాయనాలు, ఫార్మా అవశేషాలు, రంగులు, ఇతర యాంటీబయాటిక్స్‌ అవశేషాలను కూడా ఇదే ప్రక్రియతో విచ్ఛిన్నం చేయవచ్చు.

Saturday, August 12, 2023

గగన్‌యాన్‌ పారాచూట్ల పరీక్ష విజయవంతం

 


  • మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ మిషన్‌లో కీలకమైన డ్రోగ్‌ పారాచూట్లపై ఇస్రో నిర్వహించిన వరుస పరీక్షలు విజయవంతమయ్యాయి. యాత్ర ముగించుకొని తిరిగి భూమికి చేరే సమయంలో వ్యోమనౌక వేగాన్ని సురక్షిత స్థాయికి తగ్గించడానికి, దాన్ని స్థిరంగా ఉంచడానికి ఇవి సాయపడతాయి. 
  • చండీగఢ్‌లోని టెర్మినల్‌ బాలిస్టిక్స్‌ రీసెర్చ్‌ ల్యాబొరేటరీలో ఉన్న రైల్‌ ట్రాక్‌ రాకెట్‌ స్లెడ్‌ (ఆర్‌టీఆర్‌ఎస్‌)లో ఈ నెల 8-10 తేదీల్లో ఈ పరీక్షలు జరిగినట్లు ఇస్రో శుక్రవారం పేర్కొంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన ఏరియల్‌ డెలివరీ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఏఆర్‌డీఈ) తోడ్పాటుతో వీటిని నిర్వహించినట్లు వివరించింది. ఈ పారాచూట్లను వ్యోమనౌకలోని మోర్టార్లు అనే సాధనాల్లో ప్యాక్‌ చేసి ఉంచుతారు. ఆదేశం ఇవ్వగానే విచ్చుకునేలా వాటిని తీర్చిదిద్దారు. ఈ పారాచూట్ల వెడల్పు  5.8 మీటర్లు. వ్యోమనౌకను సాఫీగా, నియంత్రిత పద్ధతిలో భూమికి తెచ్చేలా వాటిని రూపొందించారు. అలాగే ఆకస్మికంగా విచ్చుకున్నప్పుడు ఉత్పన్నమయ్యే కుదుపు కూడా తక్కువగా ఉండేలా చూశారు. ఆర్‌టీఆర్‌ఎస్‌ కేంద్రంలో పారాచూట్లను మూడుసార్లు పరీక్షించారు. తద్వారా వీటి విశ్వసనీయత, పనితీరును విశ్లేషించారు.

50 ఏళ్ల తర్వాత ల్యాండర్‌ను ప్రయోగించిన రష్యా


  • దాదాపు 50 ఏళ్ల విరామం తర్వాత చందమామపైకి ఒక ల్యాండర్‌ను రష్యా ప్రయోగించింది. మాస్కోకు తూర్పున 3,450 మైళ్ల దూరంలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్‌ ప్రాంతంలో సోయుజ్‌-2 ఫ్రిగట్‌ రాకెట్‌ ద్వారా ఈ ప్రయోగం జరిగింది. 
  • లూనా-25 అనే ఈ ల్యాండర్‌.. ఈ నెల 23న చందమామ దక్షిణ ధ్రువం వద్ద దిగే అవకాశం ఉంది. భారత్‌ ప్రయోగించిన చంద్రయాన్‌-3 కూడా అదే రోజున సాయంత్రం 5.47 గంటలకు, అదే ప్రాంతానికి చేరువలో ల్యాండ్‌ కాబోతున్న సంగతి తెలిసిందే. చంద్రుడిపై ఇప్పటివరకూ సోవియట్‌ యూనియన్‌, అమెరికా, చైనాలు మాత్రమే విజయవంతంగా వ్యోమనౌకలను దించగలిగాయి. జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద ఇప్పటివరకూ ఒక్క ల్యాండర్‌ కూడా దిగలేదు. దీంతో ఆ ఘనత సాధించే తొలిదేశంగా గుర్తింపు పొందాలని భారత్‌, రష్యాలు ఇప్పుడు పోటీపడుతున్నాయి. లూనా-25 ల్యాండిరగ్‌ తేదీ, సమయం ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు.
  • 1976లో రష్యా (నాడు సోవియట్‌ యూనియన్‌) చివరిసారిగా చందమామపైకి వ్యోమనౌకను పంపింది. తాజాగా నింగిలోకి దూసుకెళ్లిన లూనా-25.. ఐదున్నర రోజుల్లో జాబిల్లికి చేరువవుతుంది. ఆ తర్వాత 3-7 రోజుల పాటు చంద్రుడి 100 కిలోమీటర్ల కక్ష్యలో పరిభ్రమించి.. చివర్లో ఉపరితలంపై ల్యాండిరగ్‌కు సిద్ధమవుతుంది. ఇది చంద్రుడి శిలలు, ధూళి నమూనాలను సేకరించి, పరిశోధించనుంది. ఇందుకోసం అందులో రోబోటిక్‌ చేతులు, డ్రిల్లింగ్‌ హార్డ్‌వేర్‌ను ఏర్పాటు చేశారు.
  • చంద్రుడి పైకి వ్యోమనౌకను పంపగలమన్న సత్తాను చాటేందుకు ఈ ప్రయోగాన్ని చేపట్టినట్లు రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్‌ తాజాగా ప్రకటించింది. వాస్తవానికి లూనా-25లో ఒక చిన్న రోవర్‌ను కూడా పంపాలని రష్యా భావించింది. అయితే వ్యోమనౌక బరువును తగ్గించి, సురక్షితంగా ల్యాండ్‌ చేసే ఉద్దేశంతో ఆ ఆలోచనను విరమించుకుంది. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల వల్ల రష్యా అంతరిక్ష కార్యక్రమాలపై ప్రభావం పడిరది. ఆ దేశాల నుంచి ఆధునిక పరిజ్ఞానాన్ని పొందడం పుతిన్‌ సర్కారుకు కష్టమవుతోంది. మరోవైపు లూనా-25ని విజయవంతంగా ప్రయోగించిన రష్యాకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అభినందనలు తెలిపింది. ‘‘మన అంతరిక్ష ప్రయాణాల్లో మనకు మరో ‘మీటింగ్‌ పాయింట్‌’ (చందమామ) ఉండటం అద్భుతం’’ అని పేర్కొంది.


అంగారకుడిపై కొంతకాలం ఆవాసయోగ్య పరిస్థితులు

  • భూమికి పొరుగునే ఉన్న అంగారకుడిపై ఒకప్పుడు పొడి, తేమతో కూడిన రుతువులు ఉండేవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అక్కడ జీవుల నివాసానికి అనువైన పరిస్థితులు ఉండి ఉంటాయని తెలిపారు. 
  • అమెరికా అంతరిక్ష సంస్థ-నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్‌.. అంగారకుడి నేలపై పగుళ్ల తీరుకు సంబంధించిన చిత్రాలను అందించింది. వాటిని విశ్లేషించిన శాస్త్రవేత్తలు.. అరుణగ్రహంపై కొంతకాలం పాటు నీరు ఉండేదని, ఆ తర్వాత ఆవిరయ్యేదని పేర్కొన్నారు. అక్కడి మట్టిలో పగుళ్లు ఏర్పడేవరకూ ఈ పోకడ కొనసాగిందని తెలిపారు. 
  • ‘‘అంగారకుడిపై నీటికి సంబంధించిన చరిత్రలో కొన్ని అధ్యాయాలపై అస్పష్టత ఉండేది. ఒకప్పుడు వేడి, తేమతో కూడిన ఆ గ్రహం.. శీతలంగా, పొడిగా ఎలా మారిందన్నదానిపై స్పష్టత లేదు. అక్కడి మట్టిలోని పగుళ్లు.. ఆ గ్రహంపైన కొనసాగిన సంధి కాలాన్ని సూచిస్తోంది. ఆ సమయంలో నీరు అంత పుష్కలంగా ఉండేది కాదు. కానీ నీటికి సంబంధించిన అంశాలు క్రియాశీలకంగానే ఉండేవి. భూమి మీద మట్టిలో వచ్చే ఇలాంటి పగుళ్లు తొలుత ఇంగ్లిష్‌లో ‘టి’ ఆకారంలో ఉండేవి. ఆ తర్వాత అక్కడ నీరు చేరడం, మళ్లీ అది ఎండిపోవడం వల్ల ఆ పగుళ్లు ‘వై’ ఆకృతిలోకి మారేవి. అరుణ గ్రహంపై కూడా ఈ వై ఆకృతి పగుళ్లు కనిపించాయి. దీనిని బట్టి అక్కడ కూడా తడి-పొడి సీజన్లు ఉండేవని అర్థమవుతోంది’’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన నినా లాంజా పేర్కొన్నారు. ఈ లెక్కన అంగారకుడిపై ఒకప్పుడు భూమిని పోలిన వాతావరణం ఉండేదని తెలిపారు. నివాసయోగ్య పరిస్థితులూ ఉండేవన్నారు.

తరతరాలకు మేలు చేసే యాపిల్‌, తులసి

  •  గర్భిణిగా ఉన్నప్పుడు ఒక మహిళ తీసుకునే మంచి ఆహారంతో ఆమెకు పుట్టబోయే శిశువుకే కాకుండా మనవళ్లు, మనవరాళ్ల మెదడు ఆరోగ్యానికీ ప్రయోజనం కలుగుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు తేల్చారు. 
  • యాపిళ్లు, కొన్ని రకాల మూలికల్లోని ఒక పదార్థంతో ఈ రక్షణ లభిస్తుందని వారు పేర్కొన్నారు. ఏలిక పాములను జన్యు నమూనాలుగా ఉపయోగించి మోనాష్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు.. ఈ విషయాన్ని గుర్తించారు. 
  • ఆ కీటకాల్లో కనిపించే అనేక జన్యువులు.. మనుషుల్లోనూ ఉండటమే ఇందుకు కారణం. వీటిపై పరిశోధనల ద్వారా మానవ కణాల గురించి లోతైన అవగాహన ఏర్పడుతుంది.
  • మన మెదడు సక్రమంగా పనిచేయడానికి ‘కమ్యూనికేషన్‌ కేబుళ్లు’ దోహదపడుతుంటాయి. వీటిని యాక్సాన్లుగా పేర్కొంటారు. ఇవి నాడీ కణాలను అనుసంధానిస్తాయి. 
  • ఈ నెట్‌వర్క్‌ బలహీనపడటం వల్ల మెదడు పనితీరు దెబ్బతింటుందని, అది నాడీ క్షీణతకు దారితీస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు. యాపిల్స్‌తోపాటు తులసి, రోజ్‌మేరీ వంటి కొన్ని రకాల మూలికల్లో ఉండే ఉర్సోలిక్‌ ఆమ్లం.. ఈ యాక్సాన్లు పెళుసుబారకుండా చూస్తుందని వారు వివరించారు.

మనుషులు వెళ్లలేని చోట.. మంటలార్పే ఫైర్‌ రోబో


  • ఇరుకైన వీధుల్లో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు.. సహాయక చర్యల్లో  సిబ్బందికి  సమయం వృథా అవుతూ ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో అగ్నిమాపక దళాలకు సాయంగా పనిచేసే మినీ రోబోను మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌కు చెందిన మనుజ్‌ జైశ్వాల్‌ (21) తయారుచేశాడు. 
  • రిమోట్‌ కారులా ఉండే ఈ రోబోకు పైన కార్బన్‌ డైఆక్సైడ్‌ సిలిండర్‌ను అమర్చాడు. రిమోట్‌ కంట్రోల్‌తో ఇది పనిచేస్తుంది. ఇలాంటివి భారీఎత్తున తయారుచేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని జైశ్వాల్‌ చెప్పాడు. ఆటోమేషన్‌ రోబోటిక్స్‌లో ఇంజినీరింగు చదువుతున్న ఈ యువకుడు కృత్రిమమేధతో పనిచేసే రోబో తయారుచేసి అగ్నిప్రమాదాలు నివారించడం గురించి ఆలోచిస్తున్నట్లు తెలిపాడు. ఈ రోబోలపై పేటెంటు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని జైశ్వాల్‌ తెలిపాడు.

గూగుల్లో గ్రామర్‌ చెక్‌ ఫీచర్‌


  • గూగుల్‌ ఇప్పుడు తన గూగుల్‌ సెర్చ్‌లో వినియోగదారుల కోసం ‘గ్రామర్‌ చెక్‌ ఫీచర్‌’ తీసుకువచ్చింది. ఇది ప్రస్తుతం ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌కి మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని భాషలకు అందుబాటులో ఉండనుంది. 
  • ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీతో వచ్చిన ఈ ఫీచర్‌ ద్వారా ఒక వాక్యం గ్రామర్‌ పరంగా సరిగ్గా ఉందా లేదా అని చెక్‌ చేసుకోవచ్చు.
  • ఈ కొత్త ఫీచర్‌ ద్వారా నేరుగా గ్రామర్‌ చెక్‌ చేసుకోవచ్చు. అంటే వాక్యాలు సరిగ్గా ఉన్నాయా.. లేదా? అని చెక్‌ చేసుకోవడానికి ప్రత్యేకించి థర్డ్‌ పార్టీ యాప్స్‌ అవసరం లేదు. ఈ ఫీచర్‌ ఉపయోగించడం కూడా చాలా సులభం. నిజానికి ప్రతి సారీ గ్రామర్‌ చెక్‌ కోసం పేజ్‌ ఉపయోగించాల్సిన అవసరం లేదు, అయితే దీనిని మీరు ఉపయోగిస్తున్నప్పుడు గ్రామర్‌ చెక్‌ అనే టూల్‌ పాప్‌ అప్‌ అవుతుంది.
  • దీని ద్వారా మీరు ఒక వాక్యం ఎంటర్‌ చేయగానే అందులో గ్రీన్‌ చెక్‌ మార్క్‌ చూపిస్తుంది, అందులో ఏదైనా తప్పు ఉంటె రెడ్‌ మార్క్‌ చూపిస్తుంది. గ్రామర్‌ మాత్రమే కాకుండా స్పెల్లింగ్‌ మిస్టేక్స్‌ కూడా కరెక్ట్‌ చేస్తుంది. ఈ లేటెస్ట్‌ ఫీచర్‌ కంప్యూటర్లలో, స్మార్ట్‌ఫోన్లలో ఉపయోగించుకోవచ్చు.

వీడియో కాల్స్‌ కోసం వాట్సప్‌ కొత్త ఫీచర్లు

 


  • వీడియో కాల్స్‌ కోసం స్క్రీన్‌ షేరింగ్‌, ల్యాండ్‌స్కేప్‌ మోడ్‌ ఫీచర్లను తీసుకొచ్చినట్లు మెటాకు చెందిన మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ వెల్లడిరచింది. 
  • ఇకపై వాట్సాప్‌ వీడియోకాల్‌ సమయంలో స్క్రీన్‌ను షేర్‌ చేసుకునే సౌలభ్యాన్ని తెచ్చినట్లు మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో తెలిపారు. 
  • వీడియోకాల్‌ సమయంలో ‘షేర్‌’ ఐకాన్‌పై క్లిక్‌ చేయడం ద్వారా ఈ ఫీచర్‌ను పొందొచ్చు. అదేవిధంగా ల్యాండ్‌స్కేప్‌ మోడ్‌లో వెడల్పుగా చిత్రాన్ని తిలకించొచ్చని తెలిపారు.

సైబర్‌ దాడులు తట్టుకొనేందుకు రంగంలోకి ‘మాయ’


  • భారత్‌లోని రక్షణశాఖ వెబ్‌సైట్లు, కంప్యూటర్లపై సైబర్‌ దాడులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆ శాఖ కీలక నిర్ణయం తీసుకొంది. ఇంటర్నెట్‌తో కనెక్ట్‌ అయిన తమ శాఖలోని కంప్యూటర్లలో మైక్రోసాఫ్ట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను.. దేశీయంగా అభివృద్ధి చేసిన ‘మాయ’ ఓఎస్‌తో భర్తీ చేయనుంది. ‘మాయ’ను ఓపెన్‌ సోర్స్‌ ఉబంటు ఆధారంగా రూపొందించారు.
  • ‘‘మాయ ఇంటర్‌ఫేస్‌, పనితీరు పూర్తిగా విండోస్‌ను పోలి ఉంటుంది. కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌లోకి మారినా.. పెద్దగా సమస్యలేమీ ఉండవు. ఆగస్టు 15 నాటికి సౌత్‌ బ్లాక్‌లో ఇంటర్నెట్‌ అనుసంధానం ఉన్న కంప్యూటర్లలో దీనిని ఇన్‌స్టాల్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు’’ అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి పేర్కొన్నారు. దీంతోపాటు ఎండ్‌పాయింట్‌ డిటెక్షన్‌, ప్రొటెక్షన్‌ వ్యవస్థ ‘చక్ర వ్యూప్‌ా’ను కూడా ఇన్‌స్టాల్‌ చేయనున్నట్లు వెల్లడిరచారు.
  • ప్రస్తుతం రక్షణశాఖలో ఇంటర్నెట్‌, త్రివిధ దళాల నెట్‌వర్క్‌తో అనుసంధానించని కంప్యూటర్లలో మాత్రమే మాయ ఓఎస్‌ను వాడుతున్నారు. త్వరలోనే త్రివిధ దళాలకు చెందిన నెట్‌వర్క్‌ వ్యవస్థల్లో ఈ ఓఎస్‌ను వినియోగించే అవకాశం ఉంది. ఇప్పటికే నౌకాదళం దీనికి సంబంధించిన అనుమతులు మంజూరు చేసింది. సైన్యం, వాయుసేన మాత్రం మాయ పనితీరును అంచనా వేస్తున్నాయి.
  • మాయా ఓఎస్‌ను ప్రభుత్వ రంగ ఏజెన్సీలు ఆరునెలల వ్యవధిలో అభివృద్ధి చేశాయి. ఈ ఓఎస్‌ మాల్‌వేర్‌ సహా పలురకాల సైబర్‌ దాడులను కట్టడి చేస్తుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కీలక వ్యవస్థలపై పలు మార్లు మాల్‌వేర్‌, రాన్సమ్‌వేర్‌ దాడులు జరిగాయి. దీంతో మైక్రోసాఫ్ట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను దేశీయంగా అభివృద్ధి చేసిన ఓఎస్‌తో మార్చాలని నిర్ణయించారు.

క్యాన్సర్‌ తొలి సంకేతాలను గుర్తించగల టెంటకిల్‌ రోబో

 


  • శరీరంలోకి ఒడుపుగా చొచ్చుకెళ్లి.. క్యాన్సర్‌కు సంబంధించిన తొలి సంకేతాలను గుర్తించగల వినూత్న రోబోను బ్రిటన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. 
  • అత్యంత మృదువుగా ఉండే ఈ సాధనం శరీరంలోని ఇరుకైన  భాగాల్లో సునాయాసంగా కదులుతూ ఈ రుగ్మతకు చికిత్సలో సాయపడగలదు. అంతేకాదు.. సంక్లిష్ట ఆపరేషన్లలో వైద్యులకు తోడ్పాటు అందిస్తుంది.
  • ఈ సాధనాన్ని టెంటకిల్‌ రోబోగా పిలుస్తున్నారు. దీని వ్యాసం 2 మిల్లీమీటర్లు. ఈ బుల్లి రోబోను సిలికోన్‌తో తయారుచేశారు. ఇది చాలా మృదువుగా ఉంటుంది. శరీరంలోకి వెళ్లాక దీనివల్ల కణజాలానికి నష్టం చాలా తక్కువగా ఉంటుంది.
  • రోగి శరీరం వెలుపలి రోబోటిక్‌ హస్తాలపై ఉండే అయస్కాంతాల ద్వారా దీన్ని నియంత్రిస్తారు. ఈ విధానాన్ని ‘రిమోట్‌ మ్యాగ్నెటిక్‌ యాక్చువేషన్‌’ అని పిలుస్తారు.
  • శరీరంలోని నిర్దిష్ట భాగానికి అనుగుణంగా ఈ సాధనాన్ని ఎంచుకోవచ్చు. అయస్కాంతాల సాయంతో దీని ఆకృతిని ఎప్పటికప్పుడు వెలుపలి నుంచి మార్చుకోవచ్చు. ఈ ప్రత్యేక లక్షణాలు.. శరీరంలోకి వైద్య సాధనాలను ప్రవేశపెట్టే విధానాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కొత్త ఊపిరి..

  • ఊపిరితిత్తుల క్యాన్సర్‌ నిర్ధారణ, చికిత్సకు టెంటకిల్‌ రోబో బాగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. క్యాన్సర్‌ మరణాల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వాటా చాలా ఎక్కువ. అందువల్ల ఆరంభంలోనే ఈ రుగ్మతను గుర్తించి, సత్వరం చికిత్స చేయాల్సిన అవసరం ఉంది.
  • తొలిదశలో ఉన్న ‘నాన్‌ స్మాల్‌ సెల్‌ లంగ్‌ క్యాన్సర్‌’కు శస్త్రచికిత్సే ప్రస్తుతం ప్రామాణిక వైద్యంగా ఉంది. ఇందుకు శరీరానికి భారీగా కోత పెట్టాలి. గణనీయ స్థాయిలో కణజాలాన్ని తొలగించాలి. ఇది రోగులందరికీ అనువైంది కాదు. పైగా దీనివల్ల ఊపిరితిత్తుల పనితీరుపై ప్రభావం పడొచ్చు.
  • టెంటకిల్‌ రోబోతో ఇలాంటి శస్త్రచికిత్సలను మెరుగ్గా నిర్వహించొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది బయాప్సీల సమయంలో ఊపిరితిత్తుల్లోకి మెరుగ్గా చొచ్చుకెళ్లడమే కాకుండా శరీరానికి పెద్దగా కోత పెట్టనవసరంలేని చికిత్సకూ    వీలు కల్పిస్తుందని వివరించారు. అత్యంత  చిన్నగా ఉండే శ్వాసనాళాలనూ ఈ టెంటకిల్‌  చేరగలదని పేర్కొన్నారు.
  • ఈ విధానంలో వైద్యులు.. క్యాన్సర్‌ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకోగలుగుతారు. ఆరోగ్యంగా ఉన్న కణజాలం జోలికి వెళ్లరు. రోగికి నొప్పి, అసౌకర్యం కూడా తక్కువగా ఉంటుంది.
  • మరింత కచ్చితమైన, రోగుల అవసరాలకు తగిన చికిత్సకు ఇది మార్గం సుగమం చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
  • ఇది ప్రామాణిక సాధనాలతో పోలిస్తే 37 శాతం లోతుగా ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకెళ్లగలదని మృతదేహాలపై నిర్వహించిన ప్రయోగాల్లో వెల్లడైంది.

జంటగా పనిచేస్తూ..

  • రెండు స్వతంత్ర రోబోలను నియంత్రించే విధానాలపై కూడా లీడ్స్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. తద్వారా వాటిని మానవ శరీరంలోని ఇరుకైన ప్రాంతంలోకి పంపి, సమన్వయంతో పనిచేయించాలని భావిస్తున్నారు. ఇందులో ఒకటి కెమెరాను కదిలిస్తుంది. రెండోది.. కణితులను నిర్మూలించే లేజర్‌ను నియంత్రిస్తుంది.
  • సాధారణంగా రెండు అయస్కాంతాలను దగ్గరగా పెడితే అవి పరస్పరం ఆకర్షితమవుతాయి. ఇది పరిశోధకులకు ఇబ్బందికరం. అయితే టెంటకిల్‌ రోబోల ఆకృతులను వినూత్న పద్ధతిలో డిజైన్‌ చేయడం ద్వారా పరిశోధకులు దాన్ని అధిగమించారు. అవి నిర్దిష్ట దిశల్లో మాత్రమే వంపునకు గురయ్యేలా చేశారు.
  • కపాలం నమూనాను ఉపయోగించి, రెండు రోబోల వినియోగాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు. నాసికా రంధ్రాల ద్వారా నిర్దిష్ట సాధనాలను ప్రవేశపెట్టి, మెదడు ముందుభాగం, వెన్నెముక పైభాగంలో  శస్త్రచికిత్సలను సిమ్యులేట్‌ చేయగలిగారు. పిట్యూటరీ గ్రంథిపై ఉన్న ఒక ట్యూమర్‌నూ తొలగించగలిగారు.

అంతరిక్ష వ్యర్ధాలతో చిక్కులు

  • మహా నగరాల్లో ట్రాఫిక్‌ జామ్‌ కష్టాలు తరచూ చూస్తూ ఉంటాం. సువిశాలమైన అంతరిక్షంలోనూ ఈ సమస్య తప్పడంలేదు. దీనివల్ల ఉపగ్రహ ప్రయోగాలు ఆలస్యం అవుతున్నాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కూ అలాంటి పరిస్థితే తలెత్తింది. వివిధ దేశాల అంతరిక్ష ప్రయోగాల కారణంగా రోదసిలో భారీ సంఖ్యలో వ్యర్థాలు ఏర్పడ్డాయి. అవి అంతరిక్ష ప్రయోగాలకు ఆటంకం కలిగిస్తున్నాయి.
  • 10 సెంటీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్న మిలియన్ల కొద్దీ అంతరిక్ష వ్యర్థాల వల్ల.. రోదసిలోని ఉపగ్రహాలు, ఇతర కీలక పరికరాలకు తీవ్ర ముప్పు పొంచి ఉంది. ఇలాంటి చిన్న వస్తువులను జాబితాలో చేర్చరు. జాబితాలో చేర్చిన పెద్ద వస్తువులే 27వేలు ఉన్నట్లు ఇస్రో తెలిపింది. వీటిలో 80 శాతం వ్యర్థాలే కావడం గమనార్హం.
  • అంతరిక్షంలో పెద్ద ఎత్తున వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల జులై 30న శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ప్రయోగం ఒక నిమిషం పాటు ఆలస్యమైంది. షెడ్యూల్‌ ప్రకారం ఉదయం ఆరున్నరకు నింగిలోకి వెళ్లాల్సిన పీఎస్‌ఎల్‌వీ.. 6.31 గంటలకు వెళ్లినట్టు ఇస్రో తెలిపింది. 500 కిలోమీటర్ల పైన భూకక్ష్య అంతరిక్ష వస్తువులతో దట్టంగా నిండిపోవడం వల్ల, వాటిని ఢీ కొట్టే ప్రమాదాన్ని తప్పించడానికి ఈ ప్రయోగంలో స్వల్ప జాప్యం చేసింది.

భారత్‌ చొరవ.. 

  • భూ ఉపరితలం నుంచి 500 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూకక్ష్య అత్యంత విలువైంది. ‘వసుధైక కుటుంబం’ స్ఫూర్తితో ఇస్రో స్వచ్ఛందంగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసింది. ప్రయోగించిన రాకెట్ల కక్ష్యను 300 కిలోమీటర్లకు తగ్గించడం వల్ల నాలుగవ దశలోని పీఎస్‌ఎల్‌వీ వ్యర్థాలు భూమికి తిరిగి చేరి కాలిపోతున్నాయి. ఇస్రో ఇలా చేయకపోతే పద్దెనిమిదేళ్లు పైకక్ష్యలోనే ఇవి వ్యర్థాలుగా తిరుగుతూ ఉంటాయి.

పెద్ద పరిమాణంలో 26 వేలు..

  • అమెరికా అంచనా ప్రకారం 10 సెంటీమీటర్ల కన్నా పెద్దవైన వ్యర్థాలు 26,783 ఉన్నాయి. మరింత చిన్న శకలాలు లక్షల సంఖ్యలో ఉన్నట్లు అంచనా. ఇందులో 40 శాతం వాటా అమెరికాదే. రష్యాకు 28 శాతం, చైనాకు 19 శాతం వాటా ఉన్నట్లు ఇస్రో తెలిపింది. భారత్‌ వల్ల ఏర్పడిన అంతరిక్ష వ్యర్థాలు 0.8 శాతమేనని వివరించింది. సంఖ్యాపరంగా చూస్తే అవి 217 వస్తువులు మాత్రమేని వెల్లడిరచింది.

నీలి ఆకుపచ్చ రంగులో చందమామ

  • చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన వీడియోను చంద్రయాన్‌-3 మిషన్‌ 2023 ఆగస్టు 6న చిత్రీకరించింది. ఈ వీడియోను ఇస్రో సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేసింది.
  • చంద్రయాన్‌-3 మిషన్‌ శనివారమే చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ వీడియోలో చందమామ ఉపరితలం నీలి

Tuesday, August 8, 2023

Voyager 2 : వాయేజర్‌-2తో కమ్యూనికేషన్‌ పునరుద్ధరణ

Resumption of communication with Voyager-2

  • అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన వాయేజర్‌-2 వ్యోమనౌకతో భూ కేంద్రానికి తిరిగి కమ్యూనికేషన్‌ పునరుద్ధరణ జరిగింది. ఈ వ్యోమనౌకతో సంబంధాలు తెగిపోవడానికి కారణమైన పొరపాటును ఇంజినీర్లు సరిచేశారు. 
  • భూమికి 19 బిలియన్‌ కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వ్యోమనౌకతో రెండు వారాలుగా కమ్యూనికేషన్లు లేవు. ఇంజినీర్లు పొరపాటున ఇచ్చిన ఒక ఆదేశంతో దాని రేడియో యాంటెన్నా భూమి వైపునకు కాకుండా ఒకింత పక్కకు జరిగింది. 
  • ఇప్పుడు తాజాగా ఆదేశాలు పంపడం ద్వారా ఇంజినీర్లు పరిస్థితిని చక్కదిద్దారు. ఇందుకు.. ఆస్ట్రేలియాలోని ఒక భారీ యాంటెన్నాను ఉపయోగించారు. వాయేజర్‌-2ను 1977లో భూమి నుంచి ప్రయోగించారు.

జాబిల్లి సిగలోకి చంద్రయాన్‌-3

  • చంద్రుడిపై కాలుమోపడమే లక్ష్యంగా రోదసిలో పయనిస్తున్న భారత వ్యోమనౌక చంద్రయాన్‌-3 అనుకున్న లక్ష్యం దిశగా విజయవంతంగా దూసుకెళ్తోంది. 
  • 2023 ఆగస్టు 5న జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించింది. చంద్రుడి ఉపరితలంపై దిగే చరిత్రాత్మక ఘట్టానికి ఈ వ్యోమనౌక మరింత చేరువైంది. ఆ అద్భుతం.. ఈ నెల 23న జరగనుంది. 

సంక్లిష్ట విన్యాసం 

  • చంద్రయాన్‌-3.. రోదసిలో ప్రయాణిస్తున్నప్పుడు చందమామ కూడా భూమి చుట్టూ తిరుగుతుంటుంది. తన కక్ష్యలో కదులుతూ వస్తున్న చంద్రుడిని నిర్దిష్ట సమయంలో వ్యోమనౌక ఎక్కడ కలుసుకోవచ్చన్నది లెక్కించాల్సి ఉంటుంది. ఆ ప్రదేశాన్ని ఎంచుకొని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వ్యూహరచన చేసింది.
  • ఇది అనుకున్నంత తేలిక కాదు. కన్యాకుమారిలో ఉంచిన ఒక రూపాయి నాణేన్ని.. దిల్లీ నుంచి విసిరిన బంతితో ఢీ కొట్టించడం లాంటిదని శాస్త్రవేత్తలు అభివర్ణిస్తుంటారు.
  • పుడమితో పోలిస్తే జాబిల్లి ద్రవ్యరాశి ఆరో వంతు మాత్రమే ఉంటుంది. ఈ లెక్కన చంద్రుడి ఉపరితలం నుంచి 62,630 కిలోమీటర్ల దూరం వరకూ దాని ప్రభావం విస్తరించి ఉంటుంది. ఆ ప్రదేశంలో భూ గురుత్వాకర్షణ శక్తి కన్నా జాబిల్లి గురుత్వాకర్షణ శక్తే అధికం.

ఎలా చేశారు?

  • చంద్రయాన్‌-3ని గత నెల 14న ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌ ద్వారా ఇస్రో.. భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఆ తర్వాత అది భూమి చుట్టూ దశలవారీగా కక్ష్యను పెంచుకొని, ఈ నెల 1న చంద్రుడిని చేరే లూనార్‌ ట్రాన్స్‌ఫర్‌ ట్రాజెక్టరీలోకి ప్రవేశించింది. ఈ మార్గంలో ప్రయాణిస్తూ శనివారం రాత్రి 7 గంటల సమయంలో చందమామకు అత్యంత దగ్గరగా ఉండే బిందువు (పెరిలూన్‌)లోకి ప్రవేశించింది.
  • ఇక్కడ చంద్రయాన్‌-3 వేగాన్ని నిర్దిష్టంగా తగ్గించడం కీలకం. లేకుంటే అది చంద్రుడిని దాటి వెళ్లిపోవడమో లేక జాబిల్లి ఉపరితలాన్ని వేగంగా ఢీకొట్టడమో జరుగుతుంది.
  • తొలుత వ్యోమనౌకలోని చిన్న ఇంజిన్లను మండిరచి, దాని దృక్కోణాన్ని 180 డిగ్రీల మేర మార్చారు. అది నిర్దేశిత రీతిలో రోదసిలో పల్టీ కొట్టగలిగింది. ఫలితంగా అప్పటివరకూ వెనుక భాగంలో ఉన్న ఇంజిన్‌ నాజిల్‌.. ముందువైపునకు వచ్చేసింది.
  • ఈ దశలో.. బెంగళూరులోని ఇస్రో మిషన్‌ ఆపరేషన్స్‌ కాంప్లెక్స్‌ (మాక్స్‌), టెలీమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ (ఇస్ట్రాక్‌) శాస్త్రవేత్తలు.. చంద్రయాన్‌-3కి ఆదేశాలు పంపి, దాని వేగానికి కళ్లెం వేశారు. ఈ విన్యాసాన్ని లూనార్‌ ఆర్బిట్‌ ఇన్సర్షన్‌ (ఎల్‌వోఐ)గా పిలుస్తారు. ఇందులో అనేక దశలు ఉన్నాయి.
  • ఈ స్థితిలో చంద్రయాన్‌-3 ఇంజిన్‌ను దాదాపు అరగంట మండిరచారు. వ్యోమనౌక ప్రయాణమార్గానికి వ్యతిరేక దిశలో ప్రజ్వలన సాగడం వల్ల దాని వేగం నెమ్మదించింది. ఈ తరహా విన్యాసాన్ని ‘రిట్రో ఫైరింగ్‌’ అంటారు.
  • వేగం తగ్గడంతో వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఇప్పుడు అది.. అక్కడి దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతోంది. ‘‘మాక్స్‌, ఇస్ట్రాక్‌..! నేను చంద్రయాన్‌-3ని. జాబిల్లి గురుత్వాకర్షణ శక్తి ప్రభావం నాపై కనపడుతోంది’’ అని చంద్రయాన్‌-3 సందేశం పంపినట్లు ఇస్రో పేర్కొంది.

ఇప్పుడేం జరుగుతుంది?

  • వచ్చే కొద్దిరోజుల్లో చంద్రయాన్‌-3.. జాబిల్లి చుట్టూ అనేక విన్యాసాలు చేస్తుంది. మొదట్లో దీని కక్ష్య.. చంద్రుడికి సమీపంలోని బిందువు వద్ద ఉన్నప్పుడు 120 కిలోమీటర్లు, సుదూర బిందువులో ఉన్నప్పుడు 18వేల కిలోమీటర్లుగా ఉంటుంది.
  • క్రమంగా కక్ష్యను తగ్గిస్తారు. ఈ దిశగా తొలి విన్యాసం ఆదివారం రాత్రి 11 గంటలకు జరగనుంది. ఇందుకోసం చంద్రయాన్‌-3.. చంద్రుడికి దూరంగా ఉన్న బిందువులోకి వెళ్లినప్పుడు మరోసారి ఇంజిన్‌ను మండిస్తారు. ఫలితంగా దాని వేగం, కక్ష్య తగ్గుతాయి. ఆ తర్వాత మూడుసార్లు ఇలాంటి విన్యాసాలను చేపడతారు. అంతిమంగా దానిని 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి చేరుస్తారు.
  • 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి చేరాక వ్యోమనౌకలోని వివిధ వ్యవస్థల పనితీరును ఇస్రో ఒకసారి పరిశీలిస్తుంది. అంతా సవ్యంగా ఉందనుకున్నాక ఈ నెల 17న వ్యోమనౌకలోని ఆర్బిటర్‌-రోవర్‌ మాడ్యూల్‌కు ఆదేశాన్ని పంపుతుంది. ఫలితంగా అది ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విడిపోయి, సొంతంగా చందమామను చుట్టేస్తుంది.
  • ఈ నెల 23 సాయంత్రం 5.47గంటలకు ల్యాండర్‌-రోవర్‌ చంద్రుడిపై ల్యాండిరగ్‌కు ఉపక్రమిస్తుంది. 

జాబిల్లి కక్ష్యలో మరింత దిగువకు చంద్రయాన్‌-3

  • చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తున్న చంద్రయాన్‌-3 తాజాగా మరో విన్యాసాన్ని పూర్తి చేసుకుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు ఆదివారం రాత్రి ఈ వ్యోమనౌకలోని ఇంజిన్‌ను మండిరచడం ద్వారా దీని కక్ష్యను మరింత తగ్గించారు. ఫలితంగా అది జాబిల్లి ఉపరితలానికి మరింత చేరువైంది. 
  • తదుపరి ఇలాంటి విన్యాసాన్ని ఈ నెల 9న మధ్యాహ్నం 1.00 నుంచి 2.00 గంటల మధ్య నిర్వహించనున్నారు. ఆ తర్వాత మరో రెండుసార్లు వీటిని చేపడతారు. ఇలా దశలవారీగా వ్యోమనౌక ఎత్తును తగ్గించి.. అంతిమంగా దాన్ని చంద్రుడి చుట్టూ ఉన్న 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఈ నెల 23న ఈ వ్యోమనౌకను చంద్రుడిపైన దించుతారు. గత నెల 14న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి నింగిలోకి పయనమైన చంద్రయాన్‌-3.. వివిధ దశలు ముగించుకొని శనివారం రాత్రి చందమామ కక్ష్యలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.

Beluga Air Bus : ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం బెలుగా ఎయిర్‌బస్‌

 

Beluga Airbus

  • తిమింగలం ఆకారంలో ఉండే ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఎయిర్‌ బస్‌ బెలుగా రవాణా వాణిజ్య సేవల కోసం తయారుచేయబడిరది.
  • ఎయిర్‌బస్‌ బెలూగా సైనిక, సముద్ర, అంతరిక్షం,ఎనర్జీ,ఏరోనాటిక్స్‌ సహా వివిధ రంగాలకు కార్గో సేవలను అందిస్తుంది. 
  • రష్యన్‌ భాషలో బెలుగా అంటే తెల్లని అని అర్థం. ప్రపంచంలో ఇవి ఐదు మాత్రమే ఉన్నాయి. 
  • బెలుగాను ఎయిర్‌బస్‌ సంస్థ తయారు చేస్తోంది. తొలి ఫ్లయిట్‌ను 1994లో తయారు చేసింది. 
  • 2010లో ఎయిర్‌బస్‌ బెలుగా శూ పేరుతో భారీ విమానంను తయారు చేసింది.  జనవరి 2020లో బెలూగా తొలిసారిగా ఎగిరింది. 
  • బెలుగా విమానాల తయారీలో యూకే, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ ఏరోస్పేస్‌ కంపెనీలు పాలు­పంచుకున్నాయి.

బెలుగా వివరాలు..

  • పొడవు : 56.16 మీటర్లు
  • ఎత్తు : 17.25 మీటర్లు
  • రెక్కల విస్తీర్ణం : 44.84 మీటర్లు
  • కెపాసిటీ : 47,000 కేజీలు
  • ఇంధన సామర్థ్యం : 23,860 లీటర్లు


Inflammatory Bowel Disease : విజృంభిస్తున్న ‘పేగు పూత వ్యాధి’

 

Inflammatory Bowel Disease

  • ఒకప్పుడు అమెరికా, యూరప్‌ దేశాలకు పరిమితమైన పేగు పూత వ్యాధి (ఇన్‌ఫ్లెమేటరీ బౌల్‌ డీసీజ్‌-IBD) మన దేశంలోనూ విజృంభిస్తున్నట్లు తాజాగా తేలింది. 
  • 2006లో 0.1 శాతం ఉన్న కేసులు ప్రస్తుతం 5.4 శాతానికి పెరిగినట్లు హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంట్రాలజీ (ఏఐజీ) వైద్యుల అధ్యయనంలో తేలింది. 
  • ఈ వివరాలు తాజాగా ప్రఖ్యాత మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ రీజినల్‌ హెల్త్‌-ఆగ్నేయాసియాలో ప్రచురితమయ్యాయి. 
  • 2020 నుంచి 2022 మధ్య పట్టణ అవుట్‌ పేషెంట్‌ క్లినిక్‌లు, గ్రామీణ ఆరోగ్య శిబిరాలు, మొబైల్‌ కేంద్రాల ద్వారా 31 వేల మంది రోగులను పరీక్షించారు. 
  • ఉదర అల్ట్రాసౌండ్‌, కొలనోస్కోపీ పరీక్షల్లో ఈ సమస్యను గుర్తించారు. 
  • రోగుల సరాసరి వయసు 44 సంవత్సరాలు. ఇదే సంస్థ 2006లో నిర్వహించిన సర్వేలో 0.1 శాతం ఐబీడీ ఉన్నట్లు గుర్తించింది.

ఐబీడీ ఎందుకంటే..

  • జంక్‌, ప్రాసెస్డ్‌, అల్ట్రా ప్రాసెస్డ్‌ ఆహారం వినియోగం  పెరగడంబీ  అధిక మసాలాలు, వేపుళ్లు, పదేపదే వాడిన నూనెతో వండిన పదార్థాలు తీసుకోవడం వల్ల పేగు పూత సమస్య (ఐబీడీ) వస్తుంది.
  • జంక్‌ ఆహారం మంచి బ్యాక్టీరియాను దెబ్బతీస్తుంది. హాని చేసే బ్యాక్టీరియాలు, ఫంగస్‌ పైచేయి సాధిస్తాయి.
  • బాధితుల్లో రక్త విరేచనాలు, పొత్తి కడుపు నొప్పి, బరువు కోల్పోవడం, తరచూ మలవిసర్జన, జ్వరం, రక్తహీనత, ఆందోళనలాంటి లక్షణాలుంటాయి. ఒకటి, రెండో దశలోనే చికిత్స తీసుకోకుంటే తీవ్ర సమస్యగా మారుతుంది.
  • ఆహార అలవాట్లు మార్చుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు ఇతర పీచు ఉన్న ఆహారం మేలు.