Showing posts with label కమిటీలు - కమిషన్లు. Show all posts
Showing posts with label కమిటీలు - కమిషన్లు. Show all posts

Tuesday, August 15, 2023

NMC : నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ నూతన నిబంధనలు

 

NMC-successsecret

  • రోగులకు చికిత్స సందర్భంగా అందించే మందుల చీటీలో జనరిక్‌ ఔషధాలనే రాయాలని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) స్పష్టం చేసింది. ఒకవేళ అలా రాయని పక్షంలో సంబంధిత వైద్యుడిపై కఠిన చర్యలు చేపడతామని, అవసరమైతే కొంతకాలం పాటు ప్రాక్టీస్‌ చేయకుండా అతని లైసెన్స్‌ను సైతం నిలిపివేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ‘రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్ల వృత్తిపరమైన ప్రవర్తనకు సంబంధించిన నిబంధనలు’ను ఎన్‌ఎంసీ జారీచేసింది. 
  • బ్రాండెడ్‌ జనరిక్‌ ఔషధాలను సైతం సూచించడం మానుకోవాలని అందులో వైద్యులకు సూచించింది. వైద్యులు ప్రస్తుతం జనరిక్‌ ఔషధాలను రాయాల్సి ఉన్నప్పటికీ, ఆ నిబంధనను ఉల్లంఘిస్తే తీసుకోవాల్సిన చర్యలను 2002లో భారతీయ వైద్య మండలి(ఐఎంసీ) జారీచేసిన నియమావళిలో ప్రస్తావించలేదు. 
  • ‘‘బ్రాండెడ్‌ ఔషధాలతో పోల్చితే జనరిక్‌ ఔషధాలు 30 శాతం నుంచి 80 శాతం చౌకగా లభిస్తాయి. అందువల్ల జనరిక్‌ ఔషధాలను సూచిస్తే ఆరోగ్య సంరక్షణ భారాన్ని తగ్గించడంతోపాటు, నాణ్యమైన సంరక్షణ పొందేందుకు వీలు కలుగుతుంది’’ అని ఆగస్టు రెండో తేదీన నోటిఫై చేసిన నిబంధనల్లో ఎన్‌ఎంసీ పేర్కొంది. మందుల చీటీలో సూచించిన పేర్లను స్పష్టంగా చదవగలిగేలా పొడి అక్షరాల్లోనే రాయాలని, వీలైతే మందుల చీటీని టైప్‌ చేసి ప్రింట్‌ తీసి ఇవ్వాలని పేర్కొంది. 
  • తాజా నిబంధనలను ఉల్లంఘించిన వైద్యులకు తొలుత హెచ్చరికలు జారీ చేస్తామని, అవసరమైతే వర్క్‌షాప్‌లకు హాజరవ్వాల్సిందిగా కోరతామని ఎన్‌ఎంసీ తెలిపింది. పదేపదే ఉల్లంఘనలకు పాల్పడే వైద్యుల లైసెన్స్‌ను కొంతకాలం పాటు సస్పెండ్‌ చేస్తామని ఉద్ఘాటించింది.

ఈ జబ్బుల మందులకు చీటీ అక్కర్లేదు

చిన్నచిన్న అనారోగ్య సమస్యలకు మందుల దుకాణానికి వెళ్లి వైద్యుడి చీటీ లేకున్నా ఔషధాలు తీసుకునే వెసులుబాటును తొలిసారిగా ఎన్‌ఎంసీ కల్పించింది. ఈ మేరకు తాజా నిబంధనల్లో కొన్ని రకాల చికిత్సలకు సంబంధించిన జాబితాను రూపొందించింది.  అవి..

1) మొలలు తగ్గించే ఔషధాలు

2) టాపికల్‌ యాంటిబయాటిక్స్‌

3) దగ్గు తగ్గించే మందులు (కాఫ్‌ సప్రెసెంట్స్‌)

4) నొప్పి తగ్గించే మందులు

5) తలనొప్పి తగ్గించే ఔషధాలు

6) ముక్కుదిబ్బడ తగ్గించేవి

7) ఆస్ప్రిన్‌

8) రక్తనాళాలను విప్పార్చేవి

9) ఛాతీలో మంట తగ్గించే ఔషధాలు

10) దగ్గు మందులు (ఎక్స్‌పెక్టోరెంట్స్‌)

11) ఫంగస్‌ను తగ్గించేవి

12) అలర్జీని తగ్గించేవి

13) గ్యాస్‌ తగ్గించేవి

14) పొగతాగే అలవాటును మాన్పించే మందులు

  • సాధారణ జబ్బులకు పై కేటగిరీ ఔషధాలను ఎలాంటి వైద్య నిపుణుడి వద్ద చికిత్స తీసుకోకుండా, నేరుగా మందుల దుకాణంలో కొనుక్కొని వాడే వీలుందని ఎన్‌ఎంసీ తెలిపింది. అదే సమయంలో షెడ్యూల్‌ ‘హెచ్‌’ ఔషధాలకు మాత్రం వైద్యుడి చీటీ తప్పనిసరని స్పష్టం చేసింది.


National Medical Commission New Regulations

  • The National Medical Commission (NMC) has made it clear that only generic medicines should be written in the medicine slips given to patients during treatment. It has warned that strict action will be taken against the concerned doctor if he does not do so, and if necessary, his license will be suspended from practicing for some time. To this extent, the NMC has issued 'Regulations for the Professional Conduct of Registered Medical Practitioners'.
  • It also advised doctors to avoid prescribing branded generic medicines. Although doctors are currently required to prescribe generic drugs, the Indian Medical Council (IMC) regulations issued in 2002 did not mention the action to be taken in case of violation of that rule.
  • Generic drugs are available 30 percent to 80 percent cheaper than branded drugs. Therefore, prescribing generic drugs will reduce the healthcare burden and provide quality care," the NMC said in the regulations notified on August 2. It is stated that the names indicated in the medicine slip should be written in dry letters so that it can be read clearly, and if possible, the medicine slip should be typed and printed.
  • The NMC said that doctors who violate the latest rules will be issued warnings and if necessary they will be asked to attend workshops. It emphasized that the license of doctors who commit repeated violations will be suspended for a period of time.

Medicines for these diseases do not require a prescription

For the first time, NMC has made it possible for people to go to the drug store for minor ailments and take medicines without a doctor's note. To this end, a list of some types of treatment has been prepared in the latest regulations. They are..

1) Anti-inflammatory drugs

2) Topical antibiotics

3) Cough suppressants

4) Pain relievers

5) Medicines that relieve headache

6) Decongestants

7) Aspirin

8) Vasodilators

9) Medicines that reduce inflammation in the chest

10) Cough Medicines (Expectorants)

11) Antifungal

12) Reduce allergies

13) Gas reducers

14) Smoking cessation drugs

  • The NMC said that the above category of medicines for common diseases can be bought and used directly from the drug store without seeking treatment from any medical specialist. At the same time, it has been clarified that a doctor's note is required for Schedule 'H' drugs.

NCERT : నేషనల్‌ సిలబస్‌, టీచింగ్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌ కమిటీ (ఎన్‌ఎస్‌టీసీ) ఛైర్మన్‌ ఎవరు?

 

NCERT-successsecret

  • నూతన పాఠ్యప్రణాళికకు అనుగుణంగా 3 నుంచి 12 తరగతుల వరకూ ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలను సవరించేందుకు 19 మందితో ఎన్‌సీఈఆర్‌టీ ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడిరచాయి. 
  • వీరిలో ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ సుధామూర్తి, ప్రముఖ సంగీత దర్శకుడు శంకర్‌ మహదేవన్‌, ఆర్థికవేత్త సంజీవ్‌ సన్యాల్‌, భారతీయ భాషా సమితి ఛైర్‌పర్సన్‌ చాము కృష్ణశాస్త్రితో పాటు పలువురు నిపుణులు ఉన్నారు. 
  • నేషనల్‌ సిలబస్‌, టీచింగ్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌ కమిటీ (ఎన్‌ఎస్‌టీసీ) అని పిలిచే దీనికి జాతీయ విద్యా ప్రణాళిక, పరిపాలన (ఎన్‌ఐఈపీఏ) ఛైర్మన్‌ ఎం.సి.పంత్‌ నేతృత్వం వహిస్తారు. 
  • పాఠ్యపుస్తకాలను, ఇతర విద్యాసంబంధ సమాచారాన్ని సిద్ధం చేయడం ఈ కమిటీ ముఖ్య విధి. నిబంధనలకు అనుగుణంగా వీటిని ఎన్‌సీఈఆర్‌టీ పరిశీలించి పాఠ్యపుస్తకాలను సిద్ధం చేస్తుంది.


Who is the Chairman of National Syllabus and Teaching Learning Materials Committee (NSTC)?

  • Authorities have revealed that NCERT has formed a committee with 19 members to revise the NCERT textbooks from classes 3 to 12 in accordance with the new curriculum.
  • Among them are Infosys Foundation Chairperson Sudhamurthy, renowned music director Shankar Mahadevan, economist Sanjeev Sanyal, Bharatiya Bhasha Samithi Chairperson Chamu Krishna Shastri and many other experts.
  • Called the National Syllabus and Teaching Learning Materials Committee (NSTC), it is headed by National Education Planning and Administration (NIEPA) Chairman MC Pant. The main function of this committee is to prepare textbooks and other educational information. NCERT examines these as per the rules and prepares the textbooks.

Wednesday, August 2, 2023

OBCల ఉప వర్గీకరణపై రాష్ట్రపతికి నివేదిక సమర్పించిన కమిషన్‌ అధ్యక్షులు ఎవరు?


  • ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీ) ఉప వర్గీకరణ అంశాన్ని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన జస్టిస్‌ రోహిణి కమిషన్‌ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు తన నివేదికను అందజేసింది. 
  • 2017 అక్టోబరులో జారీ చేసిన నోటిఫికేషను ఆధారంగా దిల్లీ హైకోర్టు రిటైర్డ్‌ సీజే జస్టిస్‌ జి.రోహిణి అధ్యక్షతన ఈ కమిషన్‌ను నియమించారు. 
  • 13 సార్లు గడువు పొడిగించిన తర్వాత.. 2023 జులై 31న ఈ కమిషన్‌ రాష్ట్రపతికి నివేదికను అందజేసినట్లు సామాజిక న్యాయ మంత్రిత్వశాఖ వెల్లడిరచింది. ఓబీసీ కేంద్ర జాబితాలోని వివిధ దరఖాస్తులను కమిషన్‌ పరిశీలించింది.

Saturday, October 8, 2016

ఎంపీసీలో ముగ్గురు సభ్యుల నియామకం


వడ్డీ రేట్లను నిర్ణయించే పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) లో ముగ్గురు సభ్యులను ప్రభుత్వం నియమించింది. ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రొఫెసర్లు చేతన్‌ ఘటే, దిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ డైరెక్టర్‌ పమి దువా, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అహ్మదాబాద్‌ ప్రొఫెసర్‌  రవీంద్ర హెచ్‌ ధోలాకియాను ఈ కమిటీలో నియమించారు. ఎంపీసీలో మొత్తం ఆరుగురు సభ్యులుంటారు. వీరిలో ముగ్గురిని ప్రభుత్వం మరో ముగ్గురిని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నియమించాని నిర్ణయించారు. వీరు 4 సం॥ల పాటు పదవిలో ఉంటారు. ఆర్‌బీఐ తరపున ఆర్‌బీఐ గవర్నరు, ఒక డిప్యూటీ గవర్నరుతో పాటు, బ్యాంకు నియమించే మరో సభ్యుడు/ సభ్యురాలు ఈ కమిటీలో ఉంటారు. ఎంపీసీకి ఆర్‌బీఐ గవర్నరు ఉర్జిత్‌ పటేల్‌ అధ్యక్షత వహిస్తారు.

Friday, October 7, 2016

భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేయాని అత్యున్నత స్థాయి కమిటీ సిఫార్సు


భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలన్న అత్యున్నత స్థాయి కమిటీ సిఫార్సును కేంద్రం ఆమోదించింది. సరిహద్దుల్లో భద్రతను పెంచడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని, నదులు ఉన్నచోట గస్తీ పెంచాలని సూచించింది. కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి మధుకర్‌గుప్తా నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. 2016 జనవరిలో పఠాన్‌కోట్‌లోని వైమానిక స్థావరంపై దాడి నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. గుజరాత్‌ నుంచి జమ్మూ ప్రాంతం వరకూ అంతర్జాతీయ సరిహద్దు వద్ద పరిస్థితులను మదింపు చేసి కమిటీ ఈ సూచనను చేసింది. భారత్‌-పాక్‌ మధ్య ఉన్న 3323 కి.మీ. సరిహద్దుల్లో 1225 కి.మీ. జమ్మూకశ్మీర్‌ ప్రాంతంలో (నియంత్రణ రేఖ సహా) ఉంది. పంజాబ్‌లో 533, రాజస్థాన్‌లో 1037, గుజరాత్‌లో 508 కి.మీ. సరిహద్దు ఉంది.

దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ శత జయంతి స్మారకోత్సవాలకు రెండు కమిటీలు


దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ శత జయంతి స్మారకోత్సవాలకు గాను ప్రధాని నరేంద్రమోడి రెండు కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రధాని అధ్యక్షతన 149 మంది సభ్యుల జాతీయ కమిటీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని 23 మంది సభ్యుల కార్యనిర్వాహక కమిటీలు ఏర్పాటు చేశారు. జాతీయ కమిటీలో మాజీ ప్రధానులు అటల్‌ బిహారీ వాజ్‌పేయి, హెచ్‌డీ దేవెగౌడ, మాజీ ఉపప్రధాని ఎల్‌కే అద్వానీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌, సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీ, మనోహర్‌ పారికర్‌, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఉన్నారు. కేంద్ర మంత్రి మహేష్‌ శర్మ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. జనసంఫ్‌లు సిద్ధాంతకర్త దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ 1916 సెప్టెంబరు 25న జన్మించారు

షీలా ఖిడే కమిటీ గడువు పొడిగింపు


ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9వ షెడ్యూల్‌లో ఉన్న సంస్థ విభజన కోసం ఏర్పాటైన షీలా ఖిడే కమిటీ గడువును కేంద్ర హోంశాఖ 2017 ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. ఆ షెడ్యూల్‌లోని సంస్థలు, కార్పొరేషన్ల ఆస్తులు, అప్పును ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీ చేయడం ఈ కమిటీ ప్రధాన విధి. ఇప్పటివరకు 59 సంస్థల విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మిగిలిన 30 సంస్థల విభజన పూర్తిచేయాల్సి ఉంది. ఈ పని పూర్తిచేయడానికి వీలుగా కమిటీ గడువును ఫిబ్రవరి వరకు కేంద్ర హోంశాఖ పొడిగించింది. 2014 మే 30న కమిటీ ఏర్పాటైనప్పుడు నిర్దేశించిన విధివిధానాలే యధావిధిగా కొనసాగుతాయి. 

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధి మార్గదర్శకాలకు కమిటీ


కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధి, నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలపై సిఫార్సు చేసేందుకు కేంద్ర జవనరుల మంత్రిత్వ శాఖ ఐదుగురు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది. 90 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని కోరింది. ప్రముఖ నీటిపారుదల రంగంలో నిపుణుడు, అంతర్జాతీయ స్థాయిలో  కమిటీల్లో పని చేసిన కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్‌ ఎ.డి.మొహిలే కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. జల సంఘం మాజీ సభ్యులు ఎం.గోపాకృష్ణన్‌, హైడ్రాజీ విభాగం డైరెక్టర్‌ నిత్యానందరాయ్‌, రూర్కీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాజీ శాస్త్రవేత్త ఎం.కె.గోయల్‌తోపాటు కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ నుంచి ఒకరు సభ్యులుగా ఉంటారు.

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధి మార్గదర్శకాలకు కమిటీ


కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధి, నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలపై సిఫార్సు చేసేందుకు కేంద్ర జవనరుల మంత్రిత్వ శాఖ ఐదుగురు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది. 90 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని కోరింది. ప్రముఖ నీటిపారుదల రంగంలో నిపుణుడు, అంతర్జాతీయ స్థాయిలో  కమిటీల్లో పని చేసిన కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్‌ ఎ.డి.మొహిలే కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. జల సంఘం మాజీ సభ్యులు ఎం.గోపాకృష్ణన్‌, హైడ్రాజీ విభాగం డైరెక్టర్‌ నిత్యానందరాయ్‌, రూర్కీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాజీ శాస్త్రవేత్త ఎం.కె.గోయల్‌తోపాటు కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ నుంచి ఒకరు సభ్యులుగా ఉంటారు.

Thursday, October 6, 2016

హోం వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్‌గా చిదంబరం


 హోం వ్యవహారాలపై పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్‌గా కేంద్ర మాజీ హోంమంత్రి పి.చిదంబరం నియమితుయ్యారు. ఆయన పి.భట్టాచార్య స్థానంలో బాధ్యతలు చేపడతారు.
ఇతర పార్లమెంటరీ కమిటీలు`ఛైర్మన్‌లు
1. చట్టం, న్యాయం ప్రజా ఫిర్యాదు, సిబ్బంది      ఆనంద్‌శర్మ                 కాంగ్రెస్‌
2. రవాణా, పర్యాటకం, సంస్కృతి కమిటీ            ముకుల్‌రాయ్‌                 టీఎంసీ
3. రైల్వేస్‌పై కమిటీ                                             సుదీప్‌ బందోపాధ్యాయ్‌  టీఎంసీ
4. ఇంధనంపై కమిటీ                                     వీరేంద్ర కుమార్‌
5. కార్మికులపై కమిటీ                                     సోమయ్య
6. సైన్స్‌ కమిటీ                                                     రేణుకా చౌదరి కాంగ్రెస్‌
7. ఆహార వినియోగదారుల వ్యవహారాల కమిటీ దివాకర్‌రెడ్డి                   టీడీపీ

Saturday, September 17, 2016

సివిల్స్‌ వయో పరిమితి పెంచాలని బీఎస్‌ బాస్వాన్‌ కమిటీ నివేదిక


సివిల్స్‌ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల వయో పరిమితిని 32 ఏళ్లకు పెంచాలంటూ యూపీఎస్సీ ఏర్పాటు చేసిన బీఎస్‌ బాస్వాన్‌ కమిటీ నివేదిక ఇచ్చింది. సివిల్స్‌ పరీక్ష విధానంలో మార్పు కోసం యూపీఎస్సీ 2015లో మాజీ ఐఏఎస్‌ అధికారి బీఎస్‌ బాస్వాన్‌ నేత ృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

Sunday, September 11, 2016

లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ అధ్యక్షుడిగా ఎల్‌.కె.అద్వానీ



లోక్‌సభ నైతిక  విలువల  సంఘం(ఎథిక్స్‌ కమిటీ) అధ్యక్షుడిగా మరోసారి బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌.కె.అద్వానీని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ 2016 సెప్టెంబర్‌ 7న నియమించారు. నైతిక విలువల  సంఘంలో కొత్తగా రాకేష్‌సింగ్‌, అక్షయ్‌ యాదవ్‌కు చోటు దక్కింది. మిగతా సభ్యులం తా పునర్నియమితులు కాగా వీరిలో మల్లారెడ్డి సహా 12 మంది ఉన్నారు. సభ్యుల అనైతిక ప్రవర్తనకు సంబంధించి వచ్చే ప్రతి ఫిర్యాదునూ ఈ సంఘం పరిశీలిస్తుంది. నైతిక విలువలకు సంబంధించి సుమోటోగా విచారణ చేపట్టే అధికారం ఉంది. మరికొన్ని సంఘాలకు కూడా స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అధ్యక్షులను నియమించారు.

సభ్యుల గైర్హాజరు సంబంధిత అంశాలు       పి.కరుణాకరన్‌
ప్రభుత్వ హామీలు                                               రమేష్‌ పోక్రియాల్‌ నిశాంక్‌
పత్రాల సమర్పణ                                               చంద్రకాంత్‌ బీ ఖైరే
అనుషంగిక శాసనాలు                                       దీలీప్‌ కుమార్‌ మున్సఖ్‌లాల్‌ గాంధీ 

Friday, September 2, 2016

కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం


కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం 2016 ఆగస్టు 26న హైదరాబాద్‌లో జరిగింది. బోర్డు ఛైర్మన్‌ రామ్‌శరణ్‌ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ ఏడాది అందుబాటులో ఉండే కృష్ణా జలాలను 63 : 37 నిష్పత్తిలోనే పంచుకోవాలని భావిస్తూ ఇందులో భాగంగా చిన్న నీటిపారుదల కింద నీటి వినియోగాన్ని ఎలా లెక్కించాలనే విషయాన్ని తేల్చేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారు. ఆ నిష్పత్తి ప్రకారమే ఈ ఏడాది నీటిని పంచుకుంటారు. ఇందులో చిన్న నీటి పారుదల కింద తెలంగాణకు 89 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 22 టీఎంసీలు కేటాయింపులు ఉన్నాయి. ఈ వినియోగాన్ని ఎలా లెక్కించాలనేది తేల్చాల్సి ఉంది. దీన్ని తేల్చాడానికి రెండు రాష్ట్రాల అంతర్‌రాష్ట్ర విభాగం చీఫ్‌ ఇంజినీర్లు, బోర్డు సభ్య కార్యదర్శి ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేశారు. కృష్ణా నదీ జలాల్లో సెప్టెంబరు నెలాఖరు వరకు ఆంధ్రప్రదేశ్‌ 36 టీఎంసీలు, తెలంగాణ 15 టీఎంసీలు వినియోగించుకునేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అంగీకరించింది. బోర్డు త్రిసభ్య కమిటీ హైదరాబాద్‌లో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Saturday, August 27, 2016

సివిల్స్‌ పరీక్షల్లో గరిష్ట వయో పరిమితిని తగ్గించాలని సిఫార్సు


ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ తదితర సర్వీసుల్లో అధికారుల నియామకానికి నిర్వహించే సివిల్‌ సర్వీసు పరీక్షల్లో అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని తగ్గించాలని నిపుణుల సంఘం సిఫార్సు చేసింది. కేంద్ర విద్యాశాఖ మాజీ కార్యదర్శి బి.ఎస్‌.బస్వాన్‌ నేతృత్వంలోని ఈ సంఘం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌(యూపీఎస్‌సీ)కి నివేదిక సమర్పించింది. 1960ల్లో గరిష్ట వయోపరిమితి 26 సంవత్సరాలుగా ఉండేది. 1980ల్లో దాన్ని 28కి పెంచారు. ఇపుడు 32 ఏళ్లుగా ఉంది. రాజకీయంగా సున్నితమైన అంశం కావడం వల్లే వివిధ ప్రభుత్వాలు వయోపరిమితిని పెంచుకుంటూ వచ్చాయి.

ఎంసీఐ రద్దునకు నీతి ఆయోగ్‌ కమిటీ సిఫార్సు


దేశంలో వైద్య విద్యలను ఇప్పటివరకు నియంత్రిస్తూ వస్తున్న మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఐ)ని రద్దు చేయాలని నీతి ఆయోగ్‌ కమిటీ సిఫార్సు చేసింది. దాని స్థానంలో కొత్తగా నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని సూచించింది. ఎంసీఐ చట్టం-1956ను సమీక్షించి, అందులో చేపట్టాల్సిన సంస్కరణ గురించి సిఫార్సు చేయడానికి నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగరియా నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 2016 మార్చి 28న కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తాజాగా కేంద్ర ప్రభుత్వానికి మధ్యంతర నివేదికను సమర్పిచింది.

లోక్‌సభ మీడియా సలహా కమిటీ ఛైర్మన్‌గా డీపీ కామత్‌


 2016-17 సం॥నికి లోక్‌సభ మీడియా సలహా కమిటీని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ నియమించారు. మీడియాలో సుదీర్ఘ అనుభవం ఉన్న పాత్రికేయులు డీపీ కామత్‌ కమిటీకి ఛైర్మన్‌గా, యూఎన్‌ఐ (యునైటెడ్‌ న్యూస్‌ ఆఫ్‌ ఇండియా) వార్తాసంస్థలకు చెందిన నీరజ్‌ వాజ్‌పేయి వైస్‌  ఛైర్మన్‌గా నియమితుయ్యారు. కమిటీలో 29 మంది సభ్యులుంటారు.