Showing posts with label ఒప్పందాలు. Show all posts
Showing posts with label ఒప్పందాలు. Show all posts

Friday, September 30, 2016

కేంద్రం, నాబార్ట్‌, ఎన్‌డబ్ల్యూడీఏ మధ్య కీలక ఒప్పందం


సాగునీటి ప్రాజెక్టును పూర్తిచేసేందుకు అవసరమైన నిధులకు సంబంధించి 2016 సెప్టెంబర్‌ 6న కేంద్ర జల వనరుల శాఖ, నాబార్డ్‌, జాతీయ వాటర్‌ డెవప్‌మెంట్‌ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన(పీఎంకేఎ)లో భాగంగా నాబార్డ్‌ నిధులతో దేశవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న 99 (గుర్తించిన) సాగునీటి ప్రాజెక్టులను 2019-20 లోపు పూర్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కొత్తగా 76.03 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది.

పారిస్‌ ఒప్పందానికి అమెరికా, చైనా ఆమోదం



పారిస్‌ వాతావరణ మార్పు ఒప్పందానికి అమెరికా, చైనాలు అమోదం తెలిపాయి. దీనికి సంబంధించిన ఆమోద పత్రాలను 2016 సెప్టెంబర్‌ 3న చైనాలోని హాంగ్జౌలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌ కీ మూన్‌కు అందించాయి. పారిస్‌ ఒప్పందం 2016 చివరి నాటికి అమల్లోకి రావాల్సి ఉంది. దీని కోసం ఒప్పందానికి అంగీకరించిన 195 దేశాల్లో కనీసం 55 దేశాలు ఆమోదించాల్సి ఉంటుంది.