- పద్దెనిమిది ఏళ్లలోపు వారు సహజీవనం చేయడం చట్ట విరుద్ధం, అనైతికమని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. సహజీవనాన్ని వివాహపరమైన సంబంధంగా పరిగణించేందుకు కొన్ని పరిమితులు ఉన్నాయని కోర్టు అభిప్రాయపడిరది.
- 18 ఏళ్లలోపు ఉన్న అబ్బాయి.. వయస్సులో తన కంటే పెద్దదైన అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడనే కారణంతో నేర విచారణ నుంచి రక్షణ పొందలేడని, వారి చర్యలు చట్టపరమైనవి కాదని జస్టిస్ వివేక్ కుమార్ బిర్లా, జస్టిస్ రాజేంద్ర కుమార్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
- కొద్దిరోజుల క్రితం ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల అమ్మాయి, 17 ఏళ్ల అబ్బాయి ఇంట్లోంచి పారిపోయి ప్రయాగ్‌రాజ్‌లో సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో అమ్మాయి కనిపించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారి ఆచూకీ తెలియడంతో అమ్మాయి కుటుంబసభ్యులు ఇద్దరిని బలవంతంగా వారి గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి తప్పించుకున్న అమ్మాయి.. జరిగిన ఘటన మొత్తాన్ని అబ్బాయి తండ్రికి తెలియజేసింది.
- దీంతో ఆయన అబ్బాయి తరఫున కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతోపాటు అబ్బాయిపై క్రిమినల్ చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని అమ్మాయి మరో పిటిషన్ దాఖలు చేసింది. వీటిపై విచారణ జరిపిన అలహాబాద్ న్యాయస్థానం 18 ఏళ్లలోపు వారు సహజీవనం చేయడం అనైతికమని వ్యాఖ్యానించింది.
- ఇద్దరు వ్యక్తులు తమ ఇష్టపూర్వకంగా జీవించేందుకు హక్కు ఉంటుందని, అయితే.. వారు మేజర్లు అయి ఉండాలని ధర్మాసనం అభిప్రాయపడిరది. అమ్మాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నమోదైన కేసులో అబ్బాయిపై మోపిన నేరానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు కోర్టుకు సమర్పించని కారణంగా, నేరం జరిగిందనే అభిప్రాయానికి రాలేమని కోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై సమగ్ర విచారణ చేయాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది.
Showing posts with label కోర్టులు - తీర్పులు. Show all posts
Showing posts with label కోర్టులు - తీర్పులు. Show all posts
Thursday, August 3, 2023
18 ఏళ్లలోపు వారి సహజీవనం చట్ట విరుద్ధమని పేర్కొన్న కోర్టు ఏది?
చైనా సంస్థకు బీహెచ్‌ఈఎల్ ఇచ్చిన అనుమతుల రద్దు చేసిన కోర్టు ఏది?
- ప్రజాహితం కన్నా దేశ భద్రతే ముఖ్యమని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణలో యాదాద్రి థర్మల్ విద్యుదుత్పాదన కేంద్రం ఏర్పాటు టెండర్‌ను చైనాకు చెందిన ఫుజియాన్ లాంగ్‌కింగ్ కంపెనీకి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ మాకావ్బర్ బీకే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది.
- ఈ అర్జీని ఏకసభ్య ధర్మాసనం 2022 నవంబరు 2న తోసిపుచ్చినప్పటికీ.. మరోసారి ద్విసభ్య ధర్మాసనం ముందు అప్పీలుకు వెళ్లింది. జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాళె, జస్టిస్ ఎంజీఎస్ కమల్ ధర్మాసనం 2023 ఆగస్టు 2న విచారణ చేపట్టింది.
- భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్(బీహెచ్‌ఈఎల్) బెంగళూరు సంస్థ చైనా సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుని టెండరు కట్టబెట్టడంలో పలు నిబంధనలు ఉల్లంఘించినట్లు ధర్మాసనం గుర్తించింది. ఈ మేరకు చైనా సంస్థకు 2022 సెప్టెంబరు 29న ఇచ్చిన అనుమతుల లేఖను రద్దు చేసింది.
Wednesday, August 2, 2023
ఏ ఆలయంలో హిందువులు కాని వారికి ప్రవేశం లేదని మదురై ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది?
- పళని మురుగన్ ఆలయంలో ‘హిందువులు కాని వారికి ప్రవేశం లేదు’ అనే ప్రకటన బోర్డును మళ్లీ ఏర్పాటు చేయాలని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.
- పళనికి చెందిన సెంథిల్‌కుమార్ దాఖలుచేసిన పిటిషన్‌లో... ‘హిందూ మతానికి చెందని వారు ఆలయం లోపలికి ప్రవేశించకూడదు’ అని దేవాలయ ప్రవేశ నియమాల్లో ఉందని పేర్కొన్నారు. దీని ప్రకారమే గతంలో బోర్డు ఏర్పాటు చేసి, ఆ తరువాత అకస్మాత్తుగా తొలగించారని తెలిపారు. ఈ చర్య హిందువుల నమ్మకానికి భంగం కలిగించేలా ఉందన్నారు. పిటిషన్‌ను జస్టిస్ ఎస్.శ్రీమతి విచారించారు.
Tuesday, July 18, 2023
తమిళనాడు ఎంపీ రవీంద్రనాథ్ ఎన్నిక చెల్లదు
తమిళనాడులోని తేని నియోజకవర్గ ఎంపీగా ఓపీ రవీంద్రనాథ్ ఎన్నిక చెల్లదని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. రవీంద్రనాథ్ 2019 ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున పోటీ చేసి 76,319 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ఆస్తి విషయాలు దాచి, ఓటర్లకు నగదు, బహుమతులు ఇచ్చి ఆయన గెలుపొందారని, ఆ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని మిలాని అనే స్థానిక ఓటరు హైకోర్టులో ఎన్నికల కేసు దాఖలు చేశారు. ఈ కేసు విచారించకూడదని రవీంద్రనాథ్ తరఫున పిటిషన్ వేసినా.. హైకోర్టు దాన్ని కొట్టివేసింది. రవీంద్రనాథ్ మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం కుమారుడు.
Subscribe to:
Posts (Atom)


