Showing posts with label Scince & Technology (August 2016). Show all posts
Showing posts with label Scince & Technology (August 2016). Show all posts

Monday, January 29, 2024

క్రూజ్‌ క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా


  • ఉత్తర కొరియా పలు క్రూజ్‌ క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం 2024 జనవరి 28న పేర్కొంది. తూర్పు మిలటరీ బేస్‌ అధీనంలోని పోర్టు నుంచి ఈ ప్రయోగాలను నిర్వహించినట్లు తెలిపింది. 
  • జపాన్‌, అమెరికా, దక్షిణ కొరియాలతో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో.. ఉత్తర కొరియా ఈ నెలలో మూడు సార్లు క్షిపణి ప్రయోగాలను నిర్వహించింది.

Thursday, August 18, 2016

బిగ్‌బ్యాంగ్‌ సిద్ధాంతానికి పోటీగా మరో సిద్ధాంతం


విశ్వం పుట్టుకపై మరో సిద్ధాంతాన్ని శాస్త్రవేత్తలు  వివరిస్తున్నారు. వినాశన స్థితిలోని పాత విశ్వం నుంచే తిరిగి పుంజుకునే బిగ్‌బౌన్స్‌ ప్రక్రియ ద్వారా మనుగడలోకి వచ్చినట్లు చెబుతున్నారు. తాజా అధ్యయనం ప్రకారం మన విశ్వం ఆవిర్భావం బిగ్‌బౌన్స్‌ సిద్ధాంతంపై ఆధారపడిందని వివరిస్తున్నారు. మామూలుగా అత్యున్నత సాంద్రత స్థాయికి చేరిన, ఉష్ణ పదార్థం దశ నుంచి పేలడం ద్వారా మన విశ్వం ఏర్పడిరదని బిగ్‌బ్యాంగ్‌ సిద్ధాంతం చెబుతోంది. దీనిపై భౌతిక శాస్త్రవేత్తల్లో భిన్న వాదనలున్నాయి. విశ్వం వ్యాకోచం, సంకోచం దశ మధ్య సాగుతోందనీ, ప్రస్తుతం వ్యాకోచదశలో ఉందనేది కొంతమంది శాస్త్రవేత్తల భావన. బిగ్‌బౌన్స్‌గా వ్యవహరిస్తున్న ఈ సిద్ధాంతం 1922 నుంచి ఉన్నా వెలుగులోకి రాలేదు.