Saturday, August 24, 2019

24 ఆగస్టు 2019 : సక్సెస్ సీక్రెట్ డైలీ కరెంట్ అఫైర్స్ II Daily Current ...

కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో ప్రవేశాలకు ఆహ్వానం


విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో 2020-21 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పించేందుకు జనవరి 5న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్‌ కల్నల్‌ అరుణ్‌కులకర్ణి తెలిపారు. ఆరో తరగతిలో 60, తొమ్మిదో తరగతిలో 20 సీట్లు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబరు 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. వివరాలకు ‌www.sainikschoolkorukonda.org వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

అరుణ్ జైట్లీ మృతి



BJP సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ (66) తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా మూత్రపిండాలు, అంతుబట్టని క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కన్నుమూశారు. కొద్దిరోజులుగా వెంటిలేటర్‌పై ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించిందని వైద్యులు తెలిపారు. 
  • 2014 మే నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జైట్లీ.. మోదీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిగా పని చేశారు. 2017లో అప్పటి రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లడంతో ఆ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. 
  • 2016లో సమాచార ప్రసారశాఖ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.
  • ఈ ఏడాది కేంద్రంలో మళ్లీ BJP   విజయ ఢంకా మోగించినా, ఆరోగ్య పరిస్థితి కారణంగా కేంద్ర మంత్రివర్గంలోకి ఆయన చేరలేదు. అమెరికా వెళ్లి చికిత్స తీసుకున్న ఆయన కొత్త ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకొనేందుకు వెనుకడుగు వేశారు. 
  • ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూనే ఇంటికే పరిమితమయ్యారు. అయితే, ఇటీవల జైట్లీ ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన ఎయిమ్స్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు.
దిల్లీలో విద్యాభ్యాసం
  • అరుణ్‌జైట్లీ విద్యాభ్యాసం 1960-1969 మధ్య సెయింట్‌ జేవియర్స్‌ పాఠశాల (దిల్లీ)లో సాగింది. 1973లో కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. 1974లో విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 
  • 1977లో దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. ఇదే సమయంలో ఏబీవీపీ ఉద్యమకారుడిగా పనిచేశారు. 
  • 1982 మే 24న సంగీత డోగ్రీని పెళ్లి చేసుకున్నారు. కుమారుడు రోహన్‌, కుమార్తె సోనాలి అంటే ఆయనకు ఎంతో ఇష్టం.
న్యాయవాదిగా.. రాజకీయ వేత్తగా..
  • న్యాయ విద్య పూర్తయ్యాక 1977 నుంచి జైట్లీ సుప్రీంకోర్టు, కొన్ని హైకోర్టుల్లో లా ప్రాక్టీస్‌ చేశారు. 
  • 1989లో అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా ఎంపికయ్యారు. 
  • 1990లో దిల్లీ హైకోర్టులో సీనియర్‌ అడ్వకేట్‌ హోదా లభించింది.  1991 నుంచి BJP జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. 
  • 1998లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు భారత ప్రతినిధిగా వెళ్లారు. 
  • 1999 అక్టోబరు 13న వాజ్‌పేయీ ప్రభుత్వంలో సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రిగా (స్వతంత్ర హోదా) పనిచేశారు. 
  • 2000 జులై 23న సామాజిక, న్యాయశాఖ సహాయ మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. అదే ఏడాది నవంబరులో జైట్లీకి కేబినెట్‌ హోదా దక్కింది. 
  • 2009 జూన్‌ 3న రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. 
  • దిల్లీ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా, బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.
రాజ్యసభకు ఎంపికై..
  • నరేంద్ర మోదీ హవా కొనసాగినప్పటికీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో జైట్లీ లోక్‌సభకు పోటీచేసి ఓటమి పాలయ్యారు. అయితే అదే ఏడాది మేలో రాజ్యసభకు ఎంపికయ్యారు. 
  • మోదీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిగా పని చేశారు. 
  • 2016లో సమాచార ప్రసారశాఖ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. 
  • 2017లో అప్పటి రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లడంతో ఆ బాధ్యతలు చేపట్టారు.
అత్యయిక స్థితిలో..
  • ఇందిరా గాంధీ దేశంలో అత్యయిక స్థితి విధించినప్పుడు (1975-77) అరుణ్‌ జైట్లీని ముందస్తుగా అరెస్టు చేశారు. అంబాలా జైల్లో ఉంచారు. ఆ తర్వాత తిహార్‌ జైలుకు తరలించారు. అక్కడ 19 నెలలు ఉన్నారు. అక్కడే ఆయనకు జీవితం అంటే ఏంటో తెలిసింది. వేర్వేరు నేపథ్యాలు ఉన్న వారితో పరిచయం ఏర్పడింది. ఇతరులతో కలిసి ఎలా పనిచేయాలో తెలుసుకున్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జైట్లీ తన గళాన్ని బలంగా వినిపించారు. 1975, జూన్‌ 26న అరెస్టు నుంచి తప్పించుకున్నారు. 

ఇండియన్ హిస్టరి Quiz