Thursday, April 17, 2025
Wednesday, April 16, 2025
రవాణా శాఖకు ప్రత్యేక లోగో
- రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రవాణా శాఖలో కొన్ని సంస్కరణలు చేపట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రవాణా శాఖకు ప్రత్యేక లోగోను రూపొందించారు. తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ (టీజీటీడీ), రోడ్ సెఫ్టీ అవర్ ప్రయార్టీ అనే పేరును లోగోలో పొందుపరిచారు.
- ఈ లోగోను కానిస్టేబుల్, ఎంవీఐ, ఏఎంవీఐ, ఆర్టీవో, డీటీసీ ఇలా యూనిఫాం వేసుకునే సిబ్బంది నుంచి అధికారుల వరకు తప్పనిసరిగా భుజంపై ధరించాల్సి ఉంటుంది. ఆర్టీఏ కార్యాలయాల్లో కూడా దీనిని ప్రదర్శిస్తున్నారు.
-----------
Special logo for the Transport Department
- After the Congress government came to power in the state, it has undertaken some reforms in the Transport Department. A special logo has been designed for the Transport Department like never before. The name Telangana Transport Department (TGTD), Road Safety Our Priority has been incorporated in the logo.
- This logo is mandatory for uniformed personnel like Constable, MVI, AMVI, RTO, DTC and other officers to be worn on their shoulders. It is also being displayed in RTA offices.
లా కమిషన్ ఛైర్మన్‌గా జస్టిస్ దినేశ్ మహేశ్వరి
- న్యాయ కమిషన్ ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జడ్జి జస్టిస్ దినేశ్ మహేశ్వరి నియమితులయ్యారు. కొత్త కమిషన్ నియామకానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదం తెలిపినట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ 2025 ఏప్రిల్ 15న వెల్లడిరచింది.
- 2024 సెప్టెంబరు 3న 23వ లా కమిషన్ మూడేళ్ల కాలపరిమితితో ఏర్పడగా.. తాజాగా ఈ కమిషన్ ఛైర్మన్‌గా జస్టిస్ దినేశ్ మహేశ్వరి, కమిషన్ పూర్తిస్థాయి సభ్యులుగా హితేశ్ జైన్ (న్యాయవాది), ప్రొఫెసర్ డి.పి.వర్మ (లా ప్రొఫెసర్- బీహెచ్‌యూ) మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కమిషన్ పదవీ కాలం 2027 ఆగస్టు 31వరకు కొనసాగనుంది. గత లా కమిషన్‌లో కూడా వర్మ సభ్యుడిగా ఉన్నారు.
- నిబంధనల మేరకు దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిని అమలుపరచవచ్చో లేదో కూడా లా కమిషన్ పరిశీలించనుంది. లా కమిషన్ ఛైర్మన్‌గా నియమితులైన జస్టిస్ మహేశ్వరి 2023 మే నెలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. 2004 సెప్టెంబరు నెలలో రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన జులై 2014లో అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. అనంతరం ఫిబ్రవరి 2016లో మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. అక్కడ నుంచి 2018 ఫిబ్రవరి నెలలో కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. జనవరి 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.
-----------
Justice Dinesh Maheshwari appointed as Chairman of Law Commission
- Retired Supreme Court judge Justice Dinesh Maheshwari has been appointed as the Chairman of the Law Commission. The Union Law Ministry announced on April 15, 2025 that Prime Minister Narendra Modi has approved the appointment of the new commission.
- The 23rd Law Commission was formed on September 3, 2024 for a term of three years. Justice Dinesh Maheshwari took charge as the Chairman of the latest commission, while Hitesh Jain (Advocate) and Professor D.P. Verma (Law Professor-BHU) took charge as full members of the commission on Tuesday. The term of this commission will continue till August 31, 2027. Verma was also a member of the previous Law Commission.
- The Law Commission will also examine whether the Uniform Civil Code can be implemented across the country as per the provisions. Justice Maheshwari, who was appointed as the Chairman of the Law Commission, retired as a Supreme Court judge in May 2023. He was appointed as a judge of the Rajasthan High Court in September 2004 and transferred to the Allahabad High Court in July 2014. Later, he became the Chief Justice of the Meghalaya High Court in February 2016. From there, he was transferred to the Karnataka High Court in February 2018. He took charge as a Supreme Court judge in January 2019.
Monday, April 7, 2025
Saturday, April 5, 2025
Friday, April 4, 2025
Monday, March 31, 2025
Sunday, March 30, 2025
Wednesday, March 26, 2025
Sunday, March 23, 2025
Saturday, March 22, 2025
Subscribe to:
Posts (Atom)