Showing posts with label Books-Writers. Show all posts
Showing posts with label Books-Writers. Show all posts

Tuesday, September 6, 2016

నో ఈజీడే పుస్తక విక్రయా సొమ్ము అమెరికా ప్రభుత్వానికి స్వాధీనం


పాక్‌లోని అబోటాబాద్‌లోని బిన్‌లాడెన్‌ స్థావరంపై అమెరికా దాడిచేసి అతడిని అంతమొందించిన ప్రక్రియపై నో ఈజీడే అనే పుస్తకం రాసిన మాథ్యూ బిస్సోన్నెట్టే (అమెరికా నౌకాదళ మాజీ సీల్‌) ఆ పుస్తక విక్రయాలపై వచ్చిన సుమారు 70 లక్షల డాలర్ల మొత్తాన్ని ప్రభుత్వానికి స్వాధీనపరచేందుకు అంగీకరించారు. పుస్తకం ప్రచురణకు ముందు అనుమతి తీసుకునేందుకు ఈయనపై అమెరికా న్యాయశాఖ కేసు వేసింది. ఈ క్రమంలో న్యాయస్థానం విచారణను తప్పించుకునేందుకు రచయిత ఆ పుస్తక విక్రయాలపై వచ్చిన మొత్తాన్ని స్వాధీనపరచేందుకు అంగీకరించారు.

Saturday, September 3, 2016

భారతీయ విద్యార్థుల కోసం మిషిన్‌ మిలియన్‌ బుక్స్‌



భారతీయ విద్యార్థుల కోసం ప్రముఖ ఈ`కామర్స్‌ సంస్థ అలీబాబా మిషన్‌ మిలియన్‌ బుక్స్‌ కార్యక్రమాన్ని చేపట్టింది. నిరూపయోగంగా ఉన్న పుస్తకాలను సేకరించి, అవసరమైన విద్యార్థులకు వాటిని అందజేసేందుకు మిషన్‌ మిలియన్‌ బుక్స్‌ కార్యక్రమాన్ని చేపట్టారు.

‘ది జిహాదిస్ట్‌ త్రెట్‌ టు ఇండియా’ పుస్తకం ఆవిష్కరణ


ప్రముఖ రచయిత, అమెరికాకు చెందిన ప్రవాస భారతీయుడు తుఫైల్‌ అహ్మద్‌ రచించిన ది జిహాదిస్ట్‌ త్రెట్‌ టు ఇండియా పుస్తకాన్ని సోషల్‌ కాజ్‌ సంస్థ ఆధ్వర్యంలో 2016 ఆగస్టు 14న ఆవిష్కరించారు.