Sunday, July 16, 2023

చైనాలో ఉపాధ్యాయురాలికి మరణదండన

- చైనాలో 25 మంది పిల్లలకు విషమిచ్చి, ఒకరి మరణానికి కారణమైన ఓ కిండర్‌గార్టెన్‌ టీచర్‌కు మరణశిక్షను అమలు చేశారు. హెనన్‌ ప్రావిన్స్‌ జియావోజువో నగరంలోని నం.1 ఇంటర్మీడియట్‌ కోర్టు 2023 జులై 14న ఈ విషయాన్ని వెల్లడిరచింది. ఉపాధ్యాయురాలు వాంగ్‌ యున్‌ (40)కు మరణదండనను జులై 13న అమలు చేసినట్లు ఓ నోటీసులో తెలిపింది. - ఇందులోని వివరాల ప్రకారం.. 2019 మార్చి 27న మెంగ్‌మెంగ్‌ ప్రీ-స్కూల్‌లో ‘విద్యార్థి యాజమాన్యం’ విషయమై ‘సన్‌’ అనే ఇంటిపేరున్న ఓ సహోద్యోగితో వాంగ్‌ వాగ్వాదానికి దిగింది. ఈ నేపథ్యంలో ఆమె జావలో విష పదార్థాన్ని కలిపి పిల్లలకు ఇచ్చింది. ఇతర విద్యార్థులంతా కోలుకున్నప్పటికీ ఒకరు మాత్రం 10 నెలల చికిత్స అనంతరం మృతిచెందగా.. వాంగ్‌ను కోర్టు దోషిగా నిర్ధరించింది.

Saturday, July 15, 2023

అప్పుడు అడుక్కు తినే వాడి తల్లి..ఇప్పుడు అడిషనల్ ఎస్పీ తల్లి

ఇది కథ కాదు..భిక్షాటన చేసి చదువుకున్న అనంతపురం ఏఎస్పీ హనుమంతు గారి యదార్థగాథ. AGS foundation వారు నిర్వహించిన ప్రభుత్వ స్కూల్ పిల్లలకు పుస్తకాలు, డిజిటల్ slates పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న హనుమంతు తన బాల్యం గురించి వివరించి, పిల్లల్లో స్ఫూర్తి నింపడానికి చేసిన ప్రయత్నం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు అడుక్కుతిని బ్రతిన తాను.. ఈ రోజు అడిషనల్ ఎస్పీగా ఎదిగానంటే అందుకు కారణం చదువే అన్నారు. ఒకప్పుడు తన తల్లిని ఈ సమాజం అడుక్కునే వాడి తల్లి అని అనేదని .. అదే సమాజం ఇప్పుడు తన తల్లిని అడిషనల్ ఎస్పీ తల్లి అంటోందన్నారు. తమ తల్లిదండ్రులను ఈ సమాజం గౌరవించేలా చేసే బాధ్యత పిల్లలపైనే ఉందని, అది చదువు ద్వారానే సాధ్యమవుతుందన్నారు. శోకం నిండిన జీవితాన్ని ఎలా శ్లోకమయ జీవితంగా మార్చగలిగే శక్తి కేవలం చదువుకు మాత్రమే ఉందన్నారు. తన జీవన పోరాటం గురించి హనుమంతు గారు ఆవిష్కరించిన అతని అంతరంగం ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్లు తిరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.. హనుమంతు గారి ప్రసంగాన్ని మీరే ఒక్కసారి వినండి..అప్పుడు మీకే అర్థమవుతుంది. మీరు ఈ వీడియో చూసాక మీ పిల్లలకు కూడా తప్పకుండా చూపిస్తారు. #successsecret #iamproudofpolice #policestory #hearttouchingstory