Thursday, April 18, 2019

మానసిక రుగ్మతలుంటే మరణశిక్ష వద్దు : సుప్రీంకోర్టు


మరణశిక్ష పడ్డ నిందితులు దానిని అమలు చేసేలోగా తీవ్రమైన మానసిక రుగ్మతకు లోనయితే వారిని ఉరి తీయొద్దంటూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. 1999లో మహారాష్ట్రలో ఇద్దరు మైనర్‌ బాలికలపై అత్యాచారం చేసి, హతమార్చిన వ్యక్తికి ఉరిశిక్ష పడగా, ప్రస్తుతం అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఈమేరకు తీర్పు చెప్పింది. జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆధ్వర్యంలోని జస్టిస్‌ శంతనగౌండర్‌, జస్టిస్‌ ఇందిరా బెనర్జీతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. నేరం చేసినట్టు కోర్టు నిర్ధరించిన తరువాత నిందితుడు మానసిక రుగ్మతకు లోనయితే కేసును ఎలా చూడాలన్న సంక్ష్లిష్ట ప్రశ్నలకు ధర్మాసనం సమాధానాలు ఇచ్చింది. అలాంటి సందర్భాల్లో మరణశిక్షను అమలు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది.

No comments:

Post a Comment