Tuesday, April 23, 2019

ధ్యానం


ధీ + యానం = ధ్యానం
ధీ = సూక్ష్మశరీరాది సముదాయం
అంటే, "ఆస్ట్రల్ బాడీ కాంప్లెక్స్" అన్నమాట
యానం = ప్రయాణం

"ధ్యానం" అంటే "సూక్ష్మశరీరాది సముదాయంతో చేసే ప్రయాణం"
దీనినే "ఆస్ట్రల్ ట్రావెల్" అంటాం.

ధ్యానం ద్వారానే సర్వలోకాలూ తిరగగలుగుతాం
ధ్యానం ద్వారానే సర్వలోకవాసులనూ కలుసుకోగలుగుతాం
ధ్యానం ద్వారానే సర్వలోక రహస్యాలనూ తెలుసుకోగలుగుతాం
ధ్యానం ద్వారానే సర్వలోక ఆనందాలూ పొందగలుగుతాం.

ఆనాపానసతి


ఆనాపానసతి ... అన్నది గౌతమబుద్ధుడు సుమారు 2500 సం|| క్రితం ఉపయోగించిన పాళీ భాష పదం. పాళీ భాషలో... "ఆనాపానసతి" అంటే "మన శ్వాసతో మనం కూడుకుని వుండడం" ... మరి దీనినే మనం "శ్వాస మీద ధ్యాస" అని చెప్పుకుంటున్నాం. ఆనాపానసతి అన్నదే ప్రపంచానికి … సకల ఋషులు, సకల యోగులు .. అందరూ కలిసికట్టుగా ఇచ్చిన  అద్భుతమైన వరం.

'ఆన' అంటే 'ఉచ్ఛ్వాస'
'అపాన' అంటే 'నిశ్వాస'
'సతి' అంటే 'కూడుకుని వుండడం'

సహజంగానే ప్రతి ఒక్కళ్ళూ  "సత్యాన్ని కనుక్కోవాలి" అన్నప్పుడు చివరిగా  చేరే స్థితే ఆనాపానసతి .. చివరికి కనుక్కునే ఉపాయమే ఆనాపానసతి.

ధ్యానం చేసే పద్ధతి 

  • సుఖాసనంలో హాయిగా కూర్చుని చేతులు రెండూ కలిపి, కళ్ళు రెండూ మూసుకుని ప్రకృతి సహజంగా జరుగుతూన్న ఉచ్ఛ్వాస నిశ్వాసలనే  ఏకధారగా గమనిస్తూ వుండాలి. 
  • ఏ దేవతారూపాన్నీ, ఏ గురు రూపాన్నీ ప్రత్యేకంగా ఊహించుకోరాదు. ఏ దైవ నామస్మరణా  వుండరాదు.
  • ఈ విధమైన ఆలోచనారహిత-స్థితిలో కలిగే అనేకానేక శారీరక, నాడీమండల, అత్మానుభవాలను శ్రద్ధగా గమనిస్తూ వుండాలి. ఆ స్థితిలో శరీరం వెలుపల వున్న విశ్వమయ ప్రాణశక్తి .. అపారంగా శరీరంలోకి  ప్రవేశించి .. నాడీమండలాన్ని  శుద్ధి చేస్తూ వుంటుంది. 
  • ఎవరి వయస్సు ఎంత వుంటుందో .. కనీసం  అన్ని నిమిషాలు .. తప్పనిసరిగా .. రోజుకి రెండు సార్లుగా .. ధ్యానం  చెయ్యాలి.  ఈ విధంగా ప్రతి రోజూ నియమబద్ధంగా ధ్యాన అభ్యాసాన్ని అలవాటు చేసుకోవాలి.


ధ్యానం వల్ల లాభాలు


  • ధ్యాన సాధన ద్వారా శారీరక, మానసిక అనారోగ్యాలైన బి.పి, షుగరు, చర్మ వ్యాధులు, డిప్రెషన్, వెన్నునొప్పి, కాన్సరు, గుండెనొప్పి వంటి సమస్త వ్యాధులు తగ్గుతాయి మరియు దుర్గుణాలు, దురలవాట్లు కూడా పోగొట్టుకోవచ్చు.
  • మానసిక ఆందోళనలు, ఒత్తిడిని జయించి మానసిక ప్రశాంతతను పొందవచ్చు.
  • జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, బుద్ధికుశలత మొదలైనవి పెరుగుతాయి.
  • ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరిగి జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను, లాభ నష్టాలను సమబుద్ధితో స్వీకరించగలరు.
  • మూఢ నమ్మకాలు, భయాలు పోయి చావు-పుట్టుకల జ్ఞానం ద్వారా మరణభయాన్ని కూడా జయించగలరు.
  • ధ్యానం మనిషిని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి, హింస నుండి అహింస వైపు, అజ్ఞానం నుండి ఆత్మజ్ఞానం వైపు, మానవత్వం నుండి దైవత్వం వైపు నడిపిస్తుంది.

మెడిటేషన్ వల్ల లాభాలు


మెడిటేషన్ అనేది ఒక పురుషులకు లేదా ఆధ్యాత్మిక గురువులకు మాత్రమే అనుకుంటారు. అయితే ధ్యానం కేవలం ఒక మతపరమైన అనుభవం కాదు. మీరు ఇది ఆధ్మాత్మికత అని చెప్పవచ్చు కానీ ఇది ప్రధానంగా మీ ఆరోగ్యాన్నిక మెరుగుపరుచుకోవడానికి ఒక మార్గం అని చెప్పవచ్చు . 
  • మెడిటేషన్ వల్ల మీకు తెలియని అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. మెడిటేషన్ వల్ల మానసిక మరియు భావోద్వేగ ఆరోగ్యం మెరుగుపచడం మాత్రేమే కాదు, మెడిటేషన్ వల్ల భౌతిక ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే మీ భావోద్వేగ ఆరోగ్యం మీ భౌతిక ఆరోగ్యం ఫిట్ నెస్ మీద ప్రభావం చూపుతుంది. 
  • మెడిటేషన్ వల్ల ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు. ప్రస్తుత రోజుల్లో ఒత్తిడి తగ్గించుకోవడానికి మెడిటేషన్ ఒక అత్యవసర మార్గంగా ఏర్పడింది. 
  • ఒక్క మానసిక, భౌతిక ఆరోగ్యంకోసం మాత్రమే కాదు, బరువు తగ్గించుకోవడానికి, ఒత్తిడి మరియు ఆందోళన రుగ్మతలను నివారించుకోవడం కోసం మెడిటేషన్ అద్భుతంగా సహాయపడుతుంది. 
  • అయితే మెడిటేషన్ ను సరిగా ఎలా చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కరెక్టైన పద్దతిలో, కరెక్టైన సమయంలో మెడిటేషన్ చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. లేదంటే, ఈ వ్యాయామం వల్ల ఇది వ్యర్థం అవుతుంది. 
  • అంటే మెడిటేషన్ చేసే సమయంలో మీ ఏకాగ్రత వేరే ఎక్కడా ఉండకూడదు, మనస్సు నిలకడగా ఉంచుకోవాలి. మెడిటేషన్ చేసే సమయంలో ఇతర ఆలోచనలు కట్టిపెట్టాలి. ఫోన్ కాల్స్ చూడటం, మెయిల్స్ చెక్ చేయడం వంటి పనులు చేయకూడదు . మెడిటేషన్ చేయడానికి మీరు పూర్తిగా సమయాన్ని వెచ్చించాలి. 
  • మెడిటేషన్ వల్ల నిద్రలేమి మరియు డిప్రెషన్ వంటి సమస్యలు నేచురల్ గా మరియు ఎఫెక్టివ్ గా నివారించబడుతాయి. 
మెడిటేషన్ వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ... 
స్ట్రెస్ రిలీఫ్

నిద్రపట్టేందుకు సహాయపడుతుంది 


కోపాన్ని కంట్రోల్ చేస్తుంది 


బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది 


భావోద్వేగాలను స్థిరంగా ఉంచుతుంది 



శ్వాస సంబంధిత సమస్యలకు నివారిస్తుంది 


వ్యాధినిరోధకతను మెరుగుపరుస్తుంది

కండరాల తిమ్మెర్లను నివారిస్తుంది

జ్ఝాపకశక్తిని మెరుగుపరుస్తుంది


Thursday, April 18, 2019

మానసిక రుగ్మతలుంటే మరణశిక్ష వద్దు : సుప్రీంకోర్టు


మరణశిక్ష పడ్డ నిందితులు దానిని అమలు చేసేలోగా తీవ్రమైన మానసిక రుగ్మతకు లోనయితే వారిని ఉరి తీయొద్దంటూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. 1999లో మహారాష్ట్రలో ఇద్దరు మైనర్‌ బాలికలపై అత్యాచారం చేసి, హతమార్చిన వ్యక్తికి ఉరిశిక్ష పడగా, ప్రస్తుతం అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఈమేరకు తీర్పు చెప్పింది. జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆధ్వర్యంలోని జస్టిస్‌ శంతనగౌండర్‌, జస్టిస్‌ ఇందిరా బెనర్జీతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. నేరం చేసినట్టు కోర్టు నిర్ధరించిన తరువాత నిందితుడు మానసిక రుగ్మతకు లోనయితే కేసును ఎలా చూడాలన్న సంక్ష్లిష్ట ప్రశ్నలకు ధర్మాసనం సమాధానాలు ఇచ్చింది. అలాంటి సందర్భాల్లో మరణశిక్షను అమలు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది.

సిప్లా ఛైర్మన్‌ హమీద్‌కు బ్రిటన్‌ రాయల్‌ సొసైటీ గౌరవం


ప్రముఖ శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త, ఔషధ రంగ దిగ్గజ సంస్థ సిప్లా ఛైర్మన్‌ యూసుఫ్‌ హమీద్‌(82)కు బ్రిటన్‌ రాయల్‌ సొసైటీ గౌరవం దక్కింది. ప్రపంచంలోని ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కూడిన రాయల్‌ సొసైటీ గౌరవ ఫెలోగా హమీద్‌ 2019 సంవత్సరానికి ఎంపికయ్యారు. ఆయనతోపాటు 51 మందికి ఈ పురస్కారం దక్కింది. భారత సంతతి శాస్త్రవేత్తల్లో ప్రొఫెసర్‌ గురుదయాళ్‌ బెస్రా, ప్రొఫెసర్‌ మంజుల్‌ భార్గవ, ప్రొఫెసర్‌ అనంత్‌ పరేఖ్‌, ప్రొఫెసర్‌ అక్షయ్‌ వెంకటేష్‌లు  పురస్కారానికి ఎంపికయ్యారు. 
  • బ్రిటన్‌ రాయల్‌సొసైటీ ఫెలోగా ఎంపికైన భారత తొలి మహిళా శాస్త్రవేత్తగా ప్రొఫెసర్‌ గగన్‌దీప్‌ కాంగ్‌ రికార్డు సృష్టించారు. కాంగ్‌ ఫరీదాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సైన్స్‌, టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు  నిర్వర్తిస్తున్నారు. చిన్నారుల్లో వైరల్‌ ఇన్‌ఫెక్షన్లపై ఆమె పరిశోధనలు  నిర్వహించారు.