యూరప్ వ్యాప్తంగా చట్ట విరుద్ధంగా పన్ను ప్రయోజనాలు పొందిందనే నెపంతో ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌కు యూరోపియన్ యూనియన్ 13 బిలియన్ యూరోలను (దాదాపు రూ. లక్ష కోట్లు) జరిమానా విధించింది. ఐర్లాండ్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ప్రత్యేక అవగాహన ఆధారంగా యూరప్‌లో దాదాపు తన వ్యాపార లాభాన్నింటిపైనా యాపిల్ పన్నును ఎగ్గొట్టిందని, వెంటనే వాటిని తిరిగిచెల్లించాలిని ఈసీ తన తీర్పులో పేర్కొంది. బహుళజాతి కంపెనీలను ఆకర్షించటం కోసం ఐర్లాండ్ చాలా ఏళ్లుగా పన్ను ప్రోత్సాహకానిస్తోంది. వీటినే స్వీట్‌హార్ట్ డీల్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ డీల్స్ కారణంగా యాపిల్ తన ఇతర వ్యాపారాల్లోని లాభాలపై కూడా పన్ను చెల్లించలేదని ఈసీ తెలిపింది.
Showing posts with label సైన్స్ & టెక్నాలజి. Show all posts
Showing posts with label సైన్స్ & టెక్నాలజి. Show all posts
Monday, September 19, 2016
యాపిల్‌కు లక్ష కోట్ల జరిమానా
యూరప్ వ్యాప్తంగా చట్ట విరుద్ధంగా పన్ను ప్రయోజనాలు పొందిందనే నెపంతో ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌కు యూరోపియన్ యూనియన్ 13 బిలియన్ యూరోలను (దాదాపు రూ. లక్ష కోట్లు) జరిమానా విధించింది. ఐర్లాండ్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ప్రత్యేక అవగాహన ఆధారంగా యూరప్‌లో దాదాపు తన వ్యాపార లాభాన్నింటిపైనా యాపిల్ పన్నును ఎగ్గొట్టిందని, వెంటనే వాటిని తిరిగిచెల్లించాలిని ఈసీ తన తీర్పులో పేర్కొంది. బహుళజాతి కంపెనీలను ఆకర్షించటం కోసం ఐర్లాండ్ చాలా ఏళ్లుగా పన్ను ప్రోత్సాహకానిస్తోంది. వీటినే స్వీట్‌హార్ట్ డీల్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ డీల్స్ కారణంగా యాపిల్ తన ఇతర వ్యాపారాల్లోని లాభాలపై కూడా పన్ను చెల్లించలేదని ఈసీ తెలిపింది.
Saturday, September 17, 2016
ప్రపంచంలోనే అత్యంత వినాశకర పురుగు ఖప్రా బీటెల్
ధాన్యాలను పాడు చేయడంలో ప్రపంచంలోనే అత్యంత వినాశకర ఖప్రా బీటెల్ అనే పురుగును మరోసారి అమెరికాలో గుర్తించారు. పాకిస్థాన్ నుంచి అమెరికా వర్జీనియాలోని నోర్‌ఫోక్ నౌకాశ్రయానికి వచ్చిన బియ్యం కంటెయినర్లలో ఇవి కనిపించాయి. వీటిని గుర్తించి వెంటనే సరుకును వెనక్కు పంపించేశారు. పురుగు లార్వాను సేకరించి వాటిని అమెరికా వ్యవసాయ విభాగానికి పరీక్ష కోసం పంపగా అవి ఖప్రా బీటెల్‌లేనని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ ఏడాది ఖప్రా బీటెల్‌ను గుర్తించడం ఇది రెండోసారి. గతేడాది మూడుసార్లు ఈ పురుగును గుర్తించారు.
Sunday, September 11, 2016
చాలా ముందే భూమిపై జీవం
మనం ఊహించిన దానికంటే చాలా ముందే భూమిపై జీవం ఆవిర్భవించిందని తాజా పరిశోధనలో తేలింది. అత్యంత పురాతనమైందిగా భావిస్తున్న 370 కోట్ల (3.7 బిలియన్) ఏళ్ల నాటి శిలాజం గ్రీన్‌లాండ్‌లో వెలుగు చూసింది. దీంతో జీవం పుట్టుకపై ఇప్పటివరకూ ఉన్న అంచనాలు తలకిందులయ్యాయి. మంచుతో కూడిన ఇసువా గ్రీన్‌స్టోన్ తీరంలో వోల్లాన్ గాంగ్ వర్సిటీ పరిశోధకుడు ఎలెన్ నూట్మాన్ బృందం తాజా అన్వేషణ చేపట్టింది. ప్రపంచంలోనే పురాతనమైన అవక్షేప శిలల్లో వారు తాజా స్ట్రోమటోలైట్ శిలాజాన్ని గుర్తించారు. కొన్ని రకాల బ్యాక్టీరియా ఒకే చోట పొరగా ఏర్పడే నిర్మాణాలను స్ట్రోమటోలైట్స్ అంటారు. ఇవే ఏళ్లు గడుస్తున్న కొద్దీ పటిష్టమైన శిలలుగా మారిపోతాయి. ఇప్పటివరకు శాస్త్రవేత్తలు ఊహించిన దానికంటే 22 కోట్ల ఏళ్లకు పూర్వమే జీవం పుట్టినట్లు తాజా శిలాజ అధ్యయనంలో తేలింది. తొలి నాటి భూమిపై జీవ వైవిధ్యాన్ని అవగతం చేసుకోవడంలో తాజా శిలాజం ఎంతగానో సహకరించే వీలుంది. https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg
Thursday, September 8, 2016
Subscribe to:
Posts (Atom)