Saturday, September 17, 2016

ప్రపంచంలోనే అత్యంత వినాశకర పురుగు ఖప్రా బీటెల్‌


ధాన్యాలను పాడు చేయడంలో ప్రపంచంలోనే అత్యంత వినాశకర ఖప్రా బీటెల్‌ అనే పురుగును మరోసారి అమెరికాలో గుర్తించారు. పాకిస్థాన్‌ నుంచి అమెరికా వర్జీనియాలోని నోర్‌ఫోక్‌ నౌకాశ్రయానికి వచ్చిన బియ్యం కంటెయినర్లలో ఇవి కనిపించాయి. వీటిని గుర్తించి వెంటనే సరుకును వెనక్కు పంపించేశారు. పురుగు లార్వాను సేకరించి వాటిని అమెరికా వ్యవసాయ విభాగానికి పరీక్ష కోసం పంపగా అవి ఖప్రా బీటెల్‌లేనని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ ఏడాది ఖప్రా బీటెల్‌ను గుర్తించడం ఇది రెండోసారి. గతేడాది మూడుసార్లు ఈ పురుగును గుర్తించారు.

No comments:

Post a Comment