Sunday, September 11, 2016

చాలా ముందే భూమిపై జీవం



మనం ఊహించిన దానికంటే చాలా ముందే భూమిపై జీవం ఆవిర్భవించిందని తాజా పరిశోధనలో తేలింది. అత్యంత పురాతనమైందిగా భావిస్తున్న 370 కోట్ల (3.7 బిలియన్‌) ఏళ్ల నాటి శిలాజం గ్రీన్‌లాండ్‌లో వెలుగు చూసింది. దీంతో జీవం పుట్టుకపై ఇప్పటివరకూ ఉన్న అంచనాలు  తలకిందులయ్యాయి. మంచుతో కూడిన ఇసువా గ్రీన్‌స్టోన్‌ తీరంలో వోల్లాన్‌ గాంగ్‌ వర్సిటీ పరిశోధకుడు ఎలెన్‌ నూట్మాన్‌ బృందం తాజా అన్వేషణ చేపట్టింది. ప్రపంచంలోనే పురాతనమైన అవక్షేప శిలల్లో వారు తాజా స్ట్రోమటోలైట్‌ శిలాజాన్ని గుర్తించారు. కొన్ని రకాల బ్యాక్టీరియా ఒకే చోట పొరగా ఏర్పడే నిర్మాణాలను స్ట్రోమటోలైట్స్‌ అంటారు. ఇవే ఏళ్లు గడుస్తున్న కొద్దీ పటిష్టమైన శిలలుగా మారిపోతాయి. ఇప్పటివరకు శాస్త్రవేత్తలు ఊహించిన దానికంటే 22 కోట్ల ఏళ్లకు పూర్వమే జీవం పుట్టినట్లు తాజా శిలాజ అధ్యయనంలో తేలింది. తొలి నాటి భూమిపై జీవ వైవిధ్యాన్ని అవగతం చేసుకోవడంలో తాజా శిలాజం ఎంతగానో సహకరించే వీలుంది. https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

No comments:

Post a Comment