Showing posts with label Biology. Show all posts
Showing posts with label Biology. Show all posts

Wednesday, October 5, 2016

Biology Bits 10

1. లైంగిక ప్రత్యుత్పత్తికి ముఖ్యంగా అవసరమయ్యే పుష్ప భాగాలు?
1)  రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి
2) ఆకర్షణ పత్రావళి, కేసరావళి
3) అండకోశము, పుష్పాసనము
4) అండకోశము, కేసరావళి
2. క్షయకరణ విభజన ఈ క్రింది వాటిలో సరిగ్గా ఏ భాగంలో జరుగుతుంది?
1) కేసరము 2) కేసర విభాగం
3) పరాగ మాతృకణం 4) పరాగ రేణువులు
3. ఫలదీకరణము అయిన తరువాత కూడా ఉపయోగపడే పుష్ప భాగాలు?
1) అండము
2) కేసరావళి
3) కీలము, కీలాగ్రము
4) రక్తకపత్రావళి, ఆకర్షణ పత్రావళి
4. అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జంతువు?
1) అమీబా 2) కప్ప
3) తొండ 4) ఈగ
5. బాహ్య ఫదీకరణము జరిపే జంతువులు?
1) కప్ప, ఎలుక 2) కాకి, చేప
3) పాము, చేప 4) కప్ప, చేప
6. అంతర్‌ ఫలదీకరణము జరిపే జంతువులు?
1) పక్షి, చేప, 2) సరీసృపము, కప్ప
3) క్షీరదము, కప్ప 4) సరీసృపము, క్షీరదము
7. సంయుక్త బీజము జరిపే విభజనలు?
1) క్షీణ విభజన 2) సమవిభజన
3) క్షీణ, సమవిభజనలు 4) సంయోగము
8. ఒకే జంతువులో పురుషు, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు రెండూ ఉండే స్థితి?
1) లైంగిక ద్విరూకత 2) ఉభయ లైంగికత
3) ద్వితీయ లైంగిక క్షణాలు 4) ఏక లైంగికత
9. సంపర్కంలో తోడ్పడే ఏంప్లక్సరి  మెత్తలు కల జంతువు?
1) మొగవానపాము 2) ఆడకప్ప
3) మొగకప్ప 4) ఆడవానపాము
10. కప్ప మిల్ట్‌లో ఉండేవి?
1) అండకణాు
2) శుక్రమాతృకణాలు
3) శుక్రకణాలు
4) శుక్రకణాలు, అండకణాలు
11. అండకణంలోనికి చొచ్చుకొని పోయేందుకు ఉపయోగపడే శుక్రకణ నిర్మాణం?
1) తల 2) మధ్య భాగము
3) తోక 4) ఏక్రోసోమ్‌
12. శుక్రకణానికి ఉండే ఏక్రోసోమ్‌ ఏచర్యలో త్పోడుతుంది?
1) జీర్ణక్రియ 2) చలనక్రియ
3) విసర్జన 4) ఫలదీకరణము
13. స్త్రీలలో ఒక్కొక్కసారి విడుదల అయ్యే అండము సంఖ్య?
1) 4 2) 3
3) 2 4) 1
14. తల్లియొక్క గర్భాశయకుడ్యానికి, భ్రూణాన్ని కలిపే నిర్మాణము?
1) జరాయువు 2) నాభిరజ్జువు
3) పాలోపియన్‌ నాళము 4) ఎపిపిడిమిస్‌
15. కంగారు నివసించే దేశం?
1) ఆస్ట్రేలియా 2) ఆఫ్రికా
3) అమెరికా 4) భారతదేశం
16. అతిపెద్ద గుడ్లు పెట్టే జంతువు?
1) ఆస్ట్రిచ్‌ 2) పిల్లి
3) పాము 4) మొసలి
17. గుడ్లు పెట్టే జంతువులను ఏమంటారు?
1) పేరమీసియం 2) సముద్ర నక్షత్రం
3) హైడ్రా 4) నత్త
18. గుడ్లు పెట్టే జంతువులను ఏమంటారు?
1) అండోత్పాదక జీవులు 2) శిశోత్పాదక జీవులు
3) ఏక లింగ జీవులు 4) ద్విలింగ జీవులు
19. కప్ప లార్వా దీన్ని పోలి వుంటుంది?
1) బొద్దింక 2) పాము
3) చేప 4) తొండ
20. రైబోసోమ్‌ల విధి?
1) ప్రోటీన్‌ సంశ్లేషణం 2) ప్రోటీన్‌ లవిచ్ఛిన్నత
3) శక్తి విడుదల 4) కణ స్రావం
21. స్రావమునకు సహాయపడే కణాంగం?
1) మైటో కాండ్రియా 2) కేంద్రకం
3) లైసోసోము 4) గాల్జీ సంక్లిష్టము
22. శ్వేత రేణువులు?
1) ఆకుపచ్చనివి 2) నీలంవి
3) ఎరుపువి 4) తెల్లవి
23. వృక్ష కణాలలో డి.ఎన్‌.ఎ. ఉండేది?
1) కేంద్రకం
2) కేంద్రకము మరియు హరితరేణువులు
3) కేంద్రకం, మైటోకాండ్రికా, హరిత రేణువులు
4) హరిత రేణువులు, మైటోకాండ్రియాలు
24. సూబరిన్‌ దేనిలోని భాగం?
1) కణకవచము 2) కణత్వచము
3) మైటోకాండ్రియా 4) కేంద్రకము
25. సెంట్రియోల్స్‌ పాల్గొనే చర్య?
1) పొటాన్‌ సంశ్లేషణము 2) కణ విభజన
3) కణ చలనము 4) కణము నాశనము
26. హరిత రేణువు ఉండు భాగము?
1) వేరు
2) ఆకుపచ్చని పత్రాలు
3) ఎండిపోయిన పత్రాలు
4) పుష్పాలు మరియు పలాలు
27. క్షయ కరణ ఫలితంగా ఏర్పడ్డ పిల్ల కణాలు కనిపించే స్థితి?
1) ఏకస్థితికము 2) ద్వయ స్థితికము
3) త్రయ స్థితికము 4) బహుస్థితికము
28. క్షయకరణ విబజన అనంతరం ఏర్పడే పిల్ల కణాలు?
1) 2 2) 4
3) 6 4) 8
29. స్త్రీలో ముఖ్యంగా వచ్చే క్యాన్సర్‌
1) ప్రేగులు 2) ఊపిరితిత్తులు
3) రొమ్ము 4) ఎముక
30. పురుషులో ఎక్కువగా వచ్చే క్యాన్సర్‌
1) ప్రేగులు 2) ఊపిరితిత్తులు
3) రొమ్ము 4) ఎముక
31. ఒక రూపం నుండి మరో రూపంలోకి శక్తి రూపాంతరం చెందినప్పుడు చివరి స్థాయి శక్తి మొదటి స్థాయి శక్తి కన్న?
1) సమానం 2) తక్కువ
3) ఎక్కువ 4) సరిసమానం
32. ఒక జీవి ఆధార క్రియారేటు క్రింది వాటితో మారుతుంది?
1) పరిసరాలు 2) శరీర ఉష్ణోగ్రత
3) హార్మోనులస్థితి 4) పైవన్నీ
33. క్రింది వాటిలో ఒక మొక్క ఇంధనం ఇచ్చే చెట్టుగా బీడులలో నాటడానికి పనికిరాదు?
1) సుబాబుల్‌ 2) యూకలిప్టస్‌
3) అవిసీనియా 4) సంచి
34. సామాజిక అడవులకు దోహదం చేసే కారకాలు?
1) స్థాని ప్రజలు వారి సహాయం
2)  సౌరశక్తి, ఖాళీ స్థలాలు
3) నీటి వనరులు 4) పైవన్నీ
35. సేంద్రియ వ్యర్థ పదార్థాల నుండి కింది విధానం ద్వారా బయోగ్యాస్‌ ఉత్పత్తి చేయవచ్చు?
1) వాయుగత, కిణ్వనక్రియ
2) అవాయుకత కిణ్వనక్రియ
3) వాటిని కాల్చుట వలన
4) నెమ్మదిగా మండించుట వలన
36. హైడ్రోలాజికల్‌ వలయం వేటి మధ్య జరుగుతుంది?
1) నేల`గాలి 2) గాలి`సముద్రము
3) నేల`సముద్రము 4) నేల`సముద్రము`వాతావరణం
37. భూమి పుట్టినప్పుడు వాతావరణంలో లేని వాయువు?
1) మీథేన్‌ 2) హైడ్రోజన్‌
3) ఆక్సిజన్‌ 4) అమ్మోనియా
38. మొట్టమొదట పుట్టిన ప్రాణులుగా గుర్తించబడినవి?
1) శిలీంద్రాలు 2) సైనో బాక్టీరియా
3) ప్రోటోజోవా 4) చిన్న మొక్కలు      
39. ఇది హైడ్రోజన్‌ యొక్క భార ఐసోటోప్‌?
1) బంగారము 2) ఇనుము
3) థోరియమ్‌ 4) డ్యుటీరియమ్‌
40. సముద్రపు కలుపు మొక్కలు దీనిని నిక్షిప్తం చేసుకుంటాయి?
1)  క్లోరిన్‌ 2) బ్రోమిన్‌
3) అయోడిన్‌ 4) థోరియమ్‌
41. కేరళ సముద్ర తీరంలోని ఇసుకలో ఉండేది?
1) డ్యుటీరియమ్‌ 2) బంగారము
3) థోరియమ్‌ 4) యురేనియం
42. చైనా గడ్డి
1) శైవలము 2) శిలీంద్రము
3) చిన్న మొక్క 4) ఒక విధమైన గడ్డి
43. ఆంధ్రప్రదేశ్‌లో బొగ్గు గనులుండు ప్రదేశము?
1) విజయవాడ 2) వైజాగ్‌
3) బెల్లంపల్లి 4) తిరుపతి
44. కందెన నూనె దేని నుండి తయారవుతుంది?
1) రెసిడ్యు ఆల్‌ నూనె 2) డిసిల్‌ నూనె
3) ఇంధనపు నూనె 4) పెట్రోలియం గ్యాస్‌
45. సహజ వాయువు ఈ పదార్థా మిశ్రమము?
1) మీథేను మరియు ఆక్సిజన్‌
2) మీథేన్‌ మరియు ఇథేన్‌
3) మీథేన్‌, ఈథేన్‌ మరియు ప్రొపేన్‌
4) మీథేన్‌, అమోనియా మరియు ఆక్సిజన్‌
46. పక్షుల విసర్జన పదార్థం?
1) యూరియా 2) అమ్మోనియా
3) నత్రితాలు 4) యూరిక్‌ ఆమ్లం
47. గ్రీష్మకాల సుప్తావస్థ జరిగే కాలం?
1) ఎండాకాలం 2) శీతాకాలం
3) వర్షాకాలం 4) శరత్కాలం
48. మంచినీటి, భౌతిక, రసాయనిక, జీవశాస్త్రీయ దృక్పథాలను తెలిపే శాస్త్రం?
1) హైడ్రాలజి 2) ఓషనోగ్రఫి
3) లిమ్నాలజీ 4) జెనిటిక్స్‌
49. శరీరం నుండి నీరు బయటకు పోకుండా, ఉప్పు నీటి జీవులు నిలవచేసుకొను పదార్థం?
1) యూరిక్‌ ఆమ్లం 2) అమ్మోనియా
3) యూరియా 4) గ్లూకోజు
50. సముద్ర గర్భ ప్రాంతం ఎలా ఉంటుంది?
1) చీకటిగా 2) చల్లగా
3) చీకటిగా, చల్లగా 4) చీకటిగా, వెచ్చగా

dŸeÖ<ó‘H\T fÉdt¼ 10
1)  4 2)  3 3)  1 4)  1 5)  4 6)   4 7)  2 8) 2 9) 3 10) 3
11) 4 12) 4 13) 4 14) 2 15) 1 16) 1 17) 3 18) 1 19) 3 20) 1
21) 4 22) 4 23) 3 24) 1 25) 2 26) 2 27) 1 28) 2 29) 1 30) 2
31) 2 32) 4 33) 3 34) 1 35) 2 36) 4 37) 3 38) 2 39) 4 40) 3
41) 3 42) 1 43)  3 44) 1 45) 3 46) 4 47) 1 48) 3 49) 3 50) 3

Biology Bits 9

1. శరీరంలో అతిముఖ్యమైన గ్రంధి?
1) అవటు గ్రంధి 2) అధివృక్క గ్రంధి
3) లాంగర్‌హాన్స్‌ పుటికలు 4) పీయూష గ్రంధి
2. నాడీ మండలానికి అంతస్సావీగ్రంధి వ్యవస్థకు మధ్య వారధిలా పనిచేసే గ్రంధి
1) అధివృక్క గ్రంధి 2) అవటు గ్రంధి
3) ముష్కము 4) పీయూషగ్రంధి
3. ఆక్సిటోసిన్‌, వాసోప్రెస్సిన్‌ హార్మోనులను ఉత్పత్తి చేసే గ్రంధి?
1) స్త్రీ బీజకోశం 2) పార్శ్వ అవటు గ్రంధి
3) ముష్కము 4) పీయూషగ్రంధి
4. వాయు నాళానికి దగ్గరగా ఉండే గ్రంధి?
1) క్లోమము 2) కాలేయము
3) అధివృక్క గ్రంధి 4) అవటు గ్రంధి
5. ఎముకల్లో కాల్షియమ్‌ ఫాస్పేట్‌ ల స్థాయిని నియంత్రణ చేసే హార్మోను?
1) థైరాక్సిన్‌ 2) ప్రోలాక్టిన్‌
3) పేరాథార్మోన్‌ 4) ప్రొజెస్టిరాన్‌
6. శరీరంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీనులు,కొవ్వులు జీవక్రియకు క్రమబద్ధం చేసే హార్మోను?
1) కార్టిసాల్‌ 2) ఇన్‌సులిన్‌
3) ప్రోజెస్టిరాన్‌ 4) వాసోప్రెప్సిన్‌
7. లాంగర్‌ హాన్స్‌ పుటికలు ఎక్కడ ఉంటాయి?
1) మూత్ర పిండము 2) కాలేయం
3) క్లోమం 4) వాయునాళం
8. గ్లైకోజన్‌ను గ్లూకోజుగా మార్చే హార్మోను?
1) ఇన్సులిన్‌ 2) కార్టిస్టాల్‌
3) గ్లూకగాన్‌ 4) ఇన్సులిన్‌
9. ఏ హార్మోను లోపం వల్ల డయాబిటిస్‌ మిల్లిటస్‌ వ్యాధి కలుగుతుంది?
1) టెస్టోస్టీరాన్‌ 2) ఈస్ట్రోజన్‌
3) గ్లూకాగాన్‌ 4) ఇన్సులిన్‌
10. పిండ ప్రతిస్థాపనకు సహాయపడే హార్మోను?
1) టెస్టోస్టీరాన్‌ 2) ఇన్సులిన్‌
3)  ప్రోలాక్టిన్‌ 4) ప్రోజెస్టిరాన్‌
11. శరీరంలో రసాయనిక సమన్వయం జరిపే పదార్థాలు?
1) రక్తం 2) లింఫ్‌
3) ఎంజైములు 4) హార్మోనులు
12. తలభాగంలో ఉండే వినాళ గ్రంధి?
1) అధివృక్క గ్రంధి 2) అవటు గ్రంధి
3) పీయూషగ్రంధి 4) పార్శ్వ అవటు
13. ఏ హార్మోను ఉత్పత్తికి అయోడీన్‌ అవసరం?
1) పేరాథార్మోన్‌ 2) వేసోప్రెస్సిన్‌
3) గ్లూకాగాన్‌ 4) థైరాక్సిన్‌
14. క్రింది వానిలో ఏది మిశ్రమ గ్రంధి?
1) పీయూష గ్రంధి 2) అధివృక్క గ్రంధి
3) క్లోమం 4) స్త్రీ బీజకోశం
15. శరీరంలో జీవక్రియరేటును వృద్ధిపరచి, ఎక్కువ ఉష్ణాన్ని ఉత్పత్తి చెయ్యటంలో తోడ్పడే హార్మోను?
1) పేరాథార్మోన్‌ 2) ఇన్సులిన్‌
3) థైరాక్సిన్‌ 4) కార్టిసాల్‌
16. శరీరానికి లోపల, వెలుప జరిగే మార్పులను గ్రహించే వ్యవస్థ?
1) జీర్ణ వ్యవస్థ 2) వినాళ గ్రంధి వ్యవస్థ
3) నాడీ వ్యవస్థ 4) ప్రసరణ వ్యవస్థ
17. శరీరంలో టెలిఫోన్‌ వైర్లలా పనిచేసే నిర్మాణాలు?
1) సిరలు 2) ధమనులు
3) కండర తంతువులు 4) నాడులు
18. నాడీ కణాలకు పోషకాలను అందచేసే కణాలు?
1) ఎరిత్రోసైట్స్‌ 2) గ్లియల్‌ కణాలు
3) మోనోసైట్స్‌ 4) రక్తఫలకికలు
19. మెదడు లేక వెన్ను పాము నుండి నిర్వాహక అంగాలకు సమాచారాన్ని అందచేసే నాడులు?
1) డెండ్రైట్లు 2) అభివాహినాడులు
3) అపవాహినాడులు 4) జ్ఞాననాడులు
20. జ్ఞానాంగాలు నుండి మెదడు లేక వెన్నుపాముకు వార్తలను కొనిపోయే నాడులు?
1) చాలక నాడులు 2) డెండ్రైట్లు
3) అపవాహిక నాడులు 4) అభివాహినాడులు
21. పోలియో వంటి వ్యాధులలో, వైరస్‌చే నశింపబడే కణాలు?
1) మోనోసైట్లు 2) ఎరిత్రోసైట్లు
3) చాలకనాడీకణాలు 4) జ్ఞాననాడీకణాలు
22. హృదయస్పందనలని నియంత్రించే ముఖ్యమైన కపాలనాడి?
1) పూర్వమహాసిర 2) పరమహాసిర
3) మహాధమని 4) వేగస్‌నాడి
23. మెదడు, వెన్పుఆము నాడీ మండలంలో ఏ విభాగానికి చెందుతాయి?
1) సహానుభూత నాడీ వ్యవస్థ
2) సహానుభూత పరనాడీ వ్యవస్థ
3) పరిధీయ నాడీ వ్యవస్థ
4) కేంద్రీయ నాడీ వ్యవస్థ
24. మెదడులో శరీరము, వివిధ చర్యలని నియంత్రించే ఉన్నత కేంద్రం?
1) మజ్జాముఖము 2) ముస్తిష్కము
3) అనుమస్తిష్కము 4) ద్వారగోర్దము
25. ముందు, మధ్య మెదడులను కలిపే మెదడు భాగము?
1) మజ్జాముఖము 2) మస్తిష్కము
3) ద్వారగోర్థము 4) పాన్స్‌ వెరోలి
26. వెన్నుముక ద్వారా ప్రయాణించి అసంకల్పిత ప్రతీకారచర్యలను నియంత్రించేది?
1) ద్వారగోర్థం 2) మస్తిష్కవల్కము
3)  వెన్నుపాము 4) మజ్జాముఖము
27. వెన్ను పాము అడ్డుకోతలో H ఆకారంలో ఉండే పదార్థం?
1) పరాశిక 2) తెలుపురంగు పదార్థం
3) మృద్వి 4) బూడిద రంగు పదార్థం
28. మానవునిలో  వెన్ను నాడుల జతతెల సంఖ్య?
1) 30 2) 31
3) 32 4) 33
29. మానవునిలో కపా నాడుల జతల సంఖ్య?
1) 10 2) 11
3) 12 4) 13
30. మానవునిలో పరధీయనాడుల జతల సంఖ్య?
1) 41 2) 42
3) 43 4) 44
31. అనుమస్తిష్కము దేనిలోని భాగము?
1) వెనుకమెదడు 2) మెదడు కాండము
3) మధ్యమెదడు 4) ముందుమెదడు
32. అసంకల్పిత ప్రతీకార చర్యలు నాడీ మండంలో దేని ఆధీనంలో ఉంటాయి?
1) మజ్జాముఖము 2) అనుమస్తిష్కము
3) హైపోథలామస్‌ 4) వెన్నుపాము
33. శరీరంల మొత్తం బరువులో మెదడు బరువు సుమారు?
1) 2 శాతం 2) 3 శాతం
3) 4 శాతం 4) 5 శాతం
34. శరీరంలో కవిత్వం మొదలైన వాటిని అనందించే సౌందర్యోపాసన శక్తి గల అంగము?
1) హృదయం 2) మూత్ర పిండం
3) మెదడు 4) పీయూష గ్రంధి
35. 1990 నుండి 2000 దశాబ్దాన్ని దేని యుగంగా పరిగణిస్తారు?
1) హృదయ యుగము
2) శ్రవణేంద్రియ యుగము
3) నేత్ర యుగము
4) మెదడు యుగము
36. సమస్యలని విశ్లేషించడంలో తోడ్పడే మెదడు భాగము?
1) ద్వారగోర్థము 2) అనుమస్తిష్కము
3) మజ్జాముఖము 4) మస్తిష్కము
37. ఐవాన్‌ పావ్‌లావ్‌ జరిపిన ప్రయోగాలు?
1) నిబంధన రహిత ప్రతిచర్యలమీద
2) మస్తిష్క మేరుద్రవం చర్యల మీద
3) నిబంధన సహిత ప్రతిచర్యల మీద
4) పాన్స్‌ వెరోలి చర్యల మీద
38. అశ్రుగ్రంధు స్రవించే ద్రవం?
1) అశ్రువు 2) చెమట
3) లాలాజం 4) ఆమ్లము
39. ఫోవియాలో ఎక్కువ సంఖ్యలో ఉండే కణాలు?
1) దండాలు 2) కోనులు
3) రోమాలు 4) రంధ్రాలు
40. వ్రణనాడి ఏ వార్తలను మోసుకొని పోతుంది?
1) శబ్దం 2) రుచి
3) వాసన 4) ఉష్ణోగ్రత
41. ఘ్రాణ గ్రాహకాలు
1) రసాయన గ్రాహకాలు 2) కాంతి గ్రహకాలు
3) ఉష్ణగ్రాహకాలు4) స్పర్శ గ్రాహకాలు
42. రసాయన గ్రాహకాలు దేనిని గ్రహిస్తాయి?
1) స్పర్శ 2) కాంతి
3) శబ్దం 4) రసాయనాలు
43. నోసీసెప్టారులు గ్రహించే శక్తి?
1) ఉష్ణం 2) పీడనం
3) బాధ 4) కాంతి
44. పాసినియన్‌ కణాలు ఏ శక్తికి స్పందిస్తాయి?
1) ఉష్ణం 2) పీడనం
3) బాధ 4) కాంతి
45. కాండపు ఛేదనములలో కాండముకు ఏటవాలు గాయము చేసే స్థలము?
1) కణువు కింద 2) కణువు మీద
3) కణువుపైన 4) కణువుకు అడ్డంగా
46. వేటివల్ల పరాగ సంపర్కం జరిగే పుష్పాలలో ఎక్కువ పుప్పొడి తయారవుతుంది?
1) నీరు 2) గాలి
3) కీటకాలు 4) పక్షులు
47. దేనిలో వీటివల్ల పరాగ సంపర్కం జరుగుతుంది?
1) పొద్దుతిరుగుడు 2) వాలిన్‌ నేరియా
3) కలువ 4) మల్లి
48. తేనె ఉండే పుష్పం?
1) పిటూనియా 2) మల్లి
3) రంగూన్‌ క్రీపర్‌ 4) దేరాణి
49. క్రింది ఏ భాగంతో ఉంటే అల్లం ముక్క కొత్తమొక్కగా ఏర్పడుతుంది?
1) పొలుసాకులు 2) కణువులు
3) మొగ్గ 4) వేళ్ళు
50. అంటుతొక్కే విధానం ద్వారా వ్యాప్తి చెందే మొక్క?
1) బంతి 2) మల్లి
3) మామిడి 4) బాల్సమ్‌

dŸeÖ<ó‘H\T fÉdt¼ 9 :
1)  2 2)  4 3)  4 4)  4 5)  3 6) 1 7)  3 8) 3 9) 4 10) 3
11) 4 12) 3 13) 4 14) 3 15) 3 16) 3 17) 4 18) 4 19) 3 20) 4
21) 3 22) 4 23) 4 24) 2 25) 3 26) 3 27) 4 28) 2 29) 3 30) 3
31) 1 32) 4 33) 1 34) 3 35) 4 36) 4 37) 4 38) 1 39) 3 40) 1
41) 1 42) 4 43)  3 44) 2 45) 1 46) 2 47) 2 48) 1 49) 3 50) 2

Biology 8

1. ఏకకణ జీవులు ఆక్సిజన్‌ని దేని నుండి తీసుకుంటాయి?
1) గాలి 2) నేల
3) నీరు 4) గాలి, నీరు
2. భూచరజీవులు దేని నుండి ఆక్సిజన్‌ని తీసుకుంటాయి?
1) కుంట 2) నది
3) గాలి 4) సముద్రం
3. బొద్దింకలో శ్వాసేంద్రియాలు?
1) రక్తనాళాలు 2) శ్లేష్మగ్రంథలు
3) మొప్పలు 4) వాయు నాళాలు
4. అమీబాలో శ్వాసక్రియ విధానం?
1) బాష్పీభవనం 2) ఆస్మాసిస్‌
3) విసరణము 4) ఉచ్ఛ్వాసం
5. చర్మశ్వాసక్రియ దేనిలో జరుగుతుంది?
1) బొద్దింక 2) సాలమాండర్‌
3) పీత 4) చిలక
6. ఉభయ జీవి?
1) జలగ 2) వానపాము
3) కప్ప 4) బొద్దింక
7. వాయునాళాలు గల జీవి?
1) మెగాస్కోలెక్స్‌ 2) అస్థిచేప
3) సాలమాండర్‌ 4) సీతాకోక చిలుక
8. వాయుగోణులు దేనిలో ఉంటాయి?
1) చర్మం 2) వాయునాళాలు
3) మొప్పలు 4) ఊపిరితిత్తులు
9. స్వర పేటిక?
1) వాయునాళం కింది భాగం
2) గ్రసని మధ్య భాగం
3) వాయునాళం మొదటి భాగం
4) గ్రసనిపై భాగం
10. మానవునిలో వాయునాళానికి ఆధారాన్ని ఇచ్చే మృదులాస్థి ఉంగరాల ఆకారం?
1) ‘J’ 2) ‘D’
3) ‘O’ 4) ‘C’
11. అప్పుడే జన్మించిన శిశువులో నిమిషానికి శ్వాసక్రియ రేటు?
1) 18 సార్లు 2) 32 సార్లు
3) 26 సార్లు 4) 16 సార్లు
12. పురుషుల్లో శ్వాస వ్యవస్థ కదలికల్లో ప్రముఖ పాత్ర వహించేది?
1) ఉపజిహ్విక 2) అంగిలి
3) వాయునాళం 4) ఉదరవితానం
13. రక్తంలోని హిమోగ్లోబిన్‌ చేరవేసేది?
1) ఆక్సిజన్‌ ఒక్కటే
2) కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఒక్కటే
3) నత్రజని ఒక్కటే
4) ఆక్సిజన్‌, కార్బన్‌డై ఆక్సైడ్‌లు
14. శ్వాసక్రియలో శక్తి దేని నుండి విడుదలవుతుంది?
1) పిండిపదార్థాల సమ్మేళనం
2) కణంలో జరిగే చర్యలు
3) గ్లూకోజు ఆక్సీకరణ
4) ప్రోటీనుల సమ్మేళనం
15. శోషరసం ఏ వ్యవస్థకి చెందుతుంది?
1) జీర్ణ వ్యవస్థ 2) విసర్జన వ్యవస్థ
3) నాడీ మండలం 4) రవాణా వ్యవస్థ
16. ఎఱ్ఱరక్తకణాలు లేని జీవి?
1) కప్ప 2) వానపాము
3) పాము 4) నెమలి
17. మూడు గదుల హృదయం కల జీవులు?
1) తొండ 2) కప్ప
3) కాకి 4) కుక్క
18. తెలుపు రంగు రక్తం కల జంతువు?
1) తొండ 2) వానపాము
3) కప్ప 4) బొద్దింక
19. 13 గదుల హృదయం గల జంతువు?
1) జలగ 2) వానపాము
3) బొద్దింక 4) నత్త
20. 4 గదుల హృదయం కల జీవులు?
1) చేపలు, పక్షులు
2) ఉభయ జీవులు, సరీసృపాలు
3) సరీసృపాలు, క్షీరదాలు
4) పక్షులు, క్షీరదాలు
21. దేనిలో అడ్డంకులేర్పడితే గుండెపోటు సంభవిస్తుంది?
1) పుప్పుసధమని 2) హృదయధమని
3) హృదయ సిర 4) పుప్పుససిర
22. బి.పి.ని కొలిచే పరికరం?
1) గ్వానోమీటర్‌ 2) స్పిగ్మోమానోమీటర్‌
3) బారోమీటర్‌ 4) ధర్మామీటర్‌
23. మానవునిలో సామాన్య రక్తపీడనం?
1) 80/120 2) 100/120
3) 120/100 4) 120/80
24. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూసేది?
1) హిమోగ్లోబిన్‌ 2) హిపారిన్‌
3) థైరాక్సిన్‌ 4) పెప్సిన్‌
25. ఎయిడ్స్‌ వ్యాధిలో నశించే రక్తకణాలు?
1) మోనోసైట్స్‌ 2)  న్యూట్రోఫిల్స్‌
3) లింఫోసైట్స్‌ 4) ఎర్రరక్తకణం
26. రక్తం గట్టకట్టిన తర్వాత లభించే ద్రవం?
1) ప్లాస్మా 2) ఆమ్లజని రహిత రక్తం
3) ఆమ్లజని సహిత రక్తం 4) సీరమ్‌
27. శరీరం యొక్క సూక్ష్మ రక్షకభటులు?
1) ఎరిత్రోసైటులు 2) న్యూట్రోఫిల్స్‌
3) ఎసిడోఫిల్స్‌ 4) ఫలకికలు
28. కేంద్రకం లేని రక్తకణం?
1) లింఫోసైట్‌ 2) బేసోఫిల్‌
3) మోనోసైట్‌ 4) ఎరిత్రోపైట్‌
29. కారల్‌ లాండ్‌స్టీనర్‌ కనిపెట్టినది?
1) రక్తకణాలు 2) రక్తవర్గాలు
3) రక్తనాళాలు 4) రక్తంలోని ప్రోటీనులు
30. ఒక వ్యక్తి రక్తాన్ని మరొక వ్యక్తికి దేని ద్వారా ఎక్కిస్తారు?
1) కండరం 2) వాయునాళం
3) సిర 4) ధమని
31. ప్రతిరక్షకము B కలు వ్యక్తి రక్త వర్గం
1) B 2) O
3) AB 4) A
32. ప్రతి`రక్షకాలుA B లు రెండూ లేని రక్త వర్గం?
1) B 2) AB
3) O 4) A
33. ప్రతి`జనకాలు A,Bలు రెండూ లేని రక్తవర్గం?
1) O 2) A
3) B 4) AB
34. రక్త ప్రసరణ వ్యవస్థలో ముఖ్యమైన అంగము?
1) ఊపిరితిత్తి 2) హృదయము
3) ధమని 4) సిర
35. వ్యర్థ పదార్థాలను రక్తము ఈ అవయవానికి చేరుస్తుంది?
1) ఆహార నాళం 2) ఊపిరితిత్తులు
3) మూత్ర పిండాలు 4) హృదయము
36. ఎర్రరక్తకణాల మారు పేరు?
1) ఎరిత్రోసైటులు 2) త్రాంబోప్లాస్టులు
3) ల్యూకోసైటులు 4) ప్లాస్మా
37. హిమోగ్లోబిన్‌ ఉండు కణాలు?
1) ప్లాస్మా 2) రక్తపకికలు
3) ఎరిత్రోసైటులు 4) ల్యూకోసైటులు
38. నడివయస్సులో ఉండే వారిలో హృదయ స్పందనల సంఖ్య?
1)  85`90 2) 80`85
3) 70`80 4) 60`70
39. వేప ఆకులో ఉన్న ఆల్కలాయిడ్‌?
1)  మార్ఫీన్‌ 2) నింబిన్‌
3) క్వినైన్‌ 4) కేఫీన్‌
40. హీవియా బ్రిజిలియన్సిస్‌ వలన లభించేది?
1) రబ్బరు 2) ఆల్కాలాయిడ్‌
3) తైలము 4) రంజకము
41. జ్వాలా కణాల పని?
1) వ్యర్థ పదార్థాలను కరిగించడం
2) వ్యర్థ పదార్థాలను తయారు చేయడం
3) వ్యర్థ పదార్థాలను విసర్జించటం
4) వ్యర్థ పదార్థాలను మండించటం
42. మూత్రాన్ని వడబోసే మూత్ర పిండ భాగము?
1) మూత్ర నాళికలు 2) మూత్ర కోశం
3) ప్రసేకం 4) వృక్కథమని
43. మాల్ఫీజియన్‌ నాళికలను కలిగి యున్న జీవి?
1) బొద్దింక 2) వానపాము
3) కప్ప 4) పక్షి
44. అగ్రాధిక్యత అంటే?
1) కొనమొగ్గ నిరంతరంగా పెరగటం
2) కొన మొగ్గ పార్శపు మొగ్గలను అదుపు చేయడం
3) కాండపు కొన త్రుంచివేయడం
4) కొన, పార్శ్వపు కొమ్మలు సమానంగా  పెరగడం
45. జిబ్బరెల్లిన్‌లు కింది వాటిని అధికం చేయుటలో ప్రముఖ పాత్ర ఉంది?
1) ఎక్కువ మొగ్గలు
2) పత్రాల పరిమాణం
3) పొట్టి మొక్కలను పొడవుగా చేయడం
4) పొడవు మొక్కలను మరింత పొడవు చేయడం
46. సైటోకైనిన్‌ల ప్రత్యేక చర్య?
1) ఎక్కువ పుష్పాలను అందించడం
2) ఎక్కువ ఆక్సిన్‌లు తయారు చేయడం
3) కణ విభజన
4) కణ నాశనం
47. ద్విదళ బీజపు కలుపు మొక్కలు నాశనం చేసే రసాయనం
1) ఇండోల్‌ ఆసిటిక్‌ ఆమ్లం
2) 2,4 డైక్లోరోఫినాక్సి ఎసిటిక్‌ ఆమ్లం
3) అబ్‌సిసిక్‌ ఆమ్లం
4) నాఫ్తలీన్‌ ఎసిటిక్‌ ఆమ్లం
48. ఆకులు, ఫలాలు రాలుటలో ప్రభావం చూపే హార్మోన్‌ పేరు?
1) ఇండోల్‌ ఆసిటిక్‌ ఆమ్లం
2) నాఫ్త్‌లీన్‌ అసిటిక్‌ ఆమ్లం
3) జిబ్బరెల్లిన్‌లు
4) అబ్‌సిసిక్‌ ఆమ్లం
49. వినాళ గ్రంధులు కల జీవి?
1) అమీబా 2) వానపాము
3) యుగ్లీనా 4) మానవుడు
50. వినాళ గ్రంధులు స్రవించే పదార్థం?
1) రక్తం 2) లింఫ్‌
3) ఎంజైములు 4) హార్మోనులు

dŸeÖ<ó‘H\T fÉdt¼ 8 :
1)  3 2)  3 3)   4 4)  3 5)  2 6) 3 7)  4 8) 4 9) 3 10) 4
11) 2 12) 4 13) 4 14) 3 15) 4 16) 2 17) 2 18) 4 19) 3 20) 4
21) 2 22) 2 23) 4 24) 2 25) 3 26) 4 27) 2 28) 4 29) 2 30) 3
31) 4 32) 2 33) 1 34) 2 35) 3 36) 1 37) 3 38) 3 39) 2 40) 1
41) 3 42) 1 43) 1 44) 2 45) 3 46) 3 47) 2 48) 4 49) 4 50) 4

Biology BITS 7

1. తేనెపట్టులో ఉండే రాణి ఈగల సంఖ్య?
1) 3 2) 2
3) 5 4) 1
2. ఏపిన్‌ ఇండికా దేని శాస్త్రీయ నామం?
1) బంబుల్‌ ఈగ 2) తేనెటీగ
3) బొద్దింక 4) ఈగ
3. డి.డి.టి. దేనికి ఉదాహరణ?
1) ఫంజి సంహారకం
2) కలుపు మొక్కల సంహారం
3) క్రిమి సంహారకం
4) ఎరువు
4. పిరోమోనుల ఉపభాగం?
1) జీర్ణక్రియ 2) శ్వాసక్రియ
3) ఎగరటం 4) ప్రత్యుత్పత్తి
5. ముత్యం తయారయ్యే పదార్థం?
1) సోడియం కార్బోనేట్‌ 2) కాల్షియమ్‌ కార్బోనేట్‌
3) మెగ్నీషియం కార్బోనేట్‌ 4) కాల్షియమ్‌ సిలికేట్‌
6. సైబీరియన్‌ కొంగ అగుపించే సంరక్షణా కేంద్రం?
1) భరత్‌పూర్‌ 2) రాంపూర్‌
3) నాగ్‌పూర్‌ 4) మద్రాసు
7. సర్పాల పార్కు ఉండే చోటు?
1) గిండి 2) ముండి
3) డండి 4) ఢల్లీ
8. స్యొలోజ్‌ ఒక?
1) ఖనిజలవణము 2) ప్రోటీన్‌
3) కొవ్వు 4) కార్బోహైడ్రేట్లు
9. ఎమైనో ఆమ్లాలు దేనిలో ఉంటాయి?
1) కొవ్వులు 2) ప్రోటీనులు
3) నూనెలు 4)  కోలెస్టిరాల్‌
10. జీవశాస్త్రీయంగా పరిపూర్ణ ప్రోటీను  క పదార్థాలు?
1)  బంగాళాదుంప, ఉల్లిపాయ, కారట్‌
2) ఏపిల్‌, గుడ్డు, గోధుమ
3) ధాన్యం, మాంసం, వెన్న
4) మాంసం, పాలు, గుడ్డు
11. ఒక గ్రాము కొవ్వు విడుదల చేసే కిలో కేలరీల శక్తి?
1) 5.49 2) 4.59
3) 9.45 4) 5.94
12. ఐరన్‌ లోపం వల్ల  కలిగే వ్యాధి?
1) డయాబిటిస్‌ 2) రికెట్స్‌
3) ఎనీమియా 4) స్కర్వి
13. గాయిటర్‌ దేనిలోపం వల్ల కుగుతుంది?
1) కాల్షియమ్‌ 2) జింక్‌
3) సిలీనియమ్‌ 4) అయోడీన్‌
14. ఏదీ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఎముకల్లో లోపాలు కలుగుతాయి?
1) ఫాస్పరస్‌ 2) పొటాషియం
3) ఫాటీ ఆమ్లం 4) ఫ్లోరిన్‌
15. శరీరంలో అధికంగా ఉండే కొవ్వు కింద ఇవ్వబడిన కణాలలో నిలువ చేయబడుతుంది?
1) గుండె 2) చర్మకణజాలం
3) పిత్తాశయము 4) అడిపోస్‌ కణజాలం
16. ఏ విటమిన్‌ లోపం వల్ల రికెట్స్‌ వ్యాధి కలుగుతుంది?
1) కెరోటిన్‌ 2) కాల్సిపెరాల్‌
3) సయనకోబామైన్‌ 4) థయమిన్‌
17. థయమిన్‌ లోపం వ్ల కలిగే వ్యాధి?
1) గ్లాసైటిస్‌ 2) పెల్లాగ్రా
3) స్కర్వి 4) బెరిబెరి
18. విటమిన్‌ బి3లోపం వల్ల కలిగే వ్యాధి?
1) బెరిబెరి 2) స్కర్వి
3) పెల్లాగ్రా 4)  వంధ్యత్వము
19. గ్లాసైటిస్‌ అనే వ్యాధి ఏ విటమిన్‌ లోపం వల్ల కలుగుతుంది?
1) బి3 2) బి12
3) బి6 4) బి2
20. పైరిడాక్సిన్‌ అనేది ఏ విటమిన్‌ రసాయన నామము?
1) సి 2) ఎ
3) డి 4) బి6
21. ఫోలిక్‌ ఆమ్లము?
1) కార్బోహైడ్రేటు 2) ఖనిజవణము
3) కొవ్వు 4) విటమిన్‌
22. పాంటోథినిక్‌ ఆమ్లలోపము వల్ల మంటలు మండే భాగము?
1) జీర్ణకోశము 2) చేతులు
3) కాళ్ళు 4) హృదయం
23. బయోటిన్‌ అనేది
1) కొవ్వు 2) విసర్జన పదార్థం
3) విటమిన్‌ 4) ఆహార పదార్థం
24. విటమిన్‌ సి లోపం వల్ల కలిగే వ్యాధి?
1) జిరాఫ్‌దాల్మియా 2) రికెట్స్‌
3) స్కర్వి 4) పెల్లాగ్రా
25. కొవ్వులో కరిగే విటమినులు?
1) ధయమిన్‌, కెరోటిన్‌, బయోటిన్‌
2) ఎస్కార్బిక్‌ ఆమ్లం, కేల్సిఫెరాల్‌, రైబోప్లావిన్‌
3) టోకోఫెరాల్‌, నియాసిన్‌, సయానోకోబాలమిన్‌
4) కేల్సిఫెరాల్‌, కెరాటిన్‌, టోకోఫెరాల్‌
26. నీటిలో కరిగే విటమినులు?
1) ఫోలిక్‌ ఆమ్లం, కెరోటిన్‌, పైరిడాక్సిన్‌
2) టోకోఫెరాల్‌, నియాసిన్‌, పాంటోథినిక్‌ ఆమ్లం
3) రైబోప్లావిన్‌, సయానోకోబాలమైన్‌, కాల్సిపెరాల్‌
4) థయమిన్‌, ఆస్కార్‌బిక్‌ ఆమ్లం, బయోటిన్‌
27. ఏ పదార్థం తింటే జపాన్‌ దేశ నావికుల్లో బెరిబెరి వ్యాధి కలిగిందని తెలిసింది?
1) వేరుశనగ 2) గుడ్డు
3) పాలిష్‌ చెయ్యని బియ్యం 4) పాలిష్‌ చేసిన బియ్యం
28. గాయాలు మానటంలోనూ విరిగిన ఎముకలు అతుక్కోవటంలోనూ తోడ్పడే విటమిన్‌?
1) కె 2) సి
3) బి12 4) బి1
29. విటమిన్‌ సి ఏ ఖనిజలవణాన్ని శోషణ చేసుకొని నిలువ చేయటంలో తోడ్పడుతుంది?
1) అయోడీన్‌ 2) ఐరన్‌
3) సల్ఫర్‌ 4) సోడియం
30. వేడిమికి అతిత్వరితంగా నశించిపోయే విటమిన్‌?
1) ఇ 2) బి1
3) సి 4) ఎ
31. రక్తం గడ్డకట్టడానికి అవసరమయ్యే విటమిన్‌?
1) బి6 2) సి
3) కె 4) బి1
32. క్రింది వాటిలో ఏది ముఖ్యమైన జీవక్రియ?
1) రవాణా 2) విసర్జన
3) కిరణజన్య సంయోగక్రియ 4) పోషణము
33. పి.హెచ్‌. అనగా దేని అణువుల గాఢత?
1) హైడ్రోజన్‌ 2) క్లోరైడు
3) సోడియం 4) సల్ఫేట్‌
34. ఎమైలేస్‌ చర్య జరిపే పదార్థం?
1) మాంసకృత్తులు 2) కొవ్వులు
3) పిండి పదార్థాలు 4) విటమినులు
35. మలకభళనాన్ని ప్రదర్శించే జంతువు?
1) ఆవు 2) కుందేలు
3) మేక 4) ఎద్దు
36. లాలాజలంలో ఉండే ఎంజైము?
1) పెప్సిన్‌ 2) ఎమైలేస్‌
3) లైఫేస్‌ 4) ట్రిప్సిన్‌
37. జఠరరసంలో ఉండే ఆమ్లము?
1) నత్రికామ్లము 2) స్ఫ్యురిక్‌ ఆమ్లము
3) హైడ్రోక్లోరిక్‌ ఆమ్లము 4) ఎసిటిక్‌ ఆమ్లము
38. ఎంజైము లేని జీర్ణరసము?
1) పైత్యరసము 2) అంత్రరసము
3) క్లోమరసము 4) లాలాజము
39. అంత్రరసంలో ఉండే ఎంజైము?
1) పెప్సిన్‌ 2) ట్రిప్సిన్‌
3) రెనిన్‌ 4) సుక్రేసు
40. కైము అంటే
1) పాక్షికంగా జీర్ణం అయిన ఆహారము
2) జీర్ణం కాని ఆహారము
3) శోషించబడిన ఆహారము
4) ఘన రూపంలో వున్న ఆహారం
41. ఏ అవయవం ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది?
1) మూత్రపిండం 2) మెదడు
3) పేగు 4) ఊరితిత్తి
42. ఆహార, వాయు మార్గాల కూడలి?
1) నాశిక 2) గ్రసని
3) స్వరపేటిక 4) ఊపిరితిత్తి
43. వాయునాళానికి ఇంకో పేరు?
1) వాయు గోణి 2) శబ్దపేటిక
3) వాయు కోశము 4) గాలి గొట్టం
44. ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించే గాలిలోని ఆక్సిజన్‌ శాతము
1) 19 2) 20
3) 21 4) 22
45. సామాన్యంగా మానవుడు నిమిషానికి తీసుకొనే శ్వాస సంఖ్య?
1) 6 2) 18
3) 30 4) 25
46. గాలిని లోపలికి పీల్చే వ్యవస్థ?
1) జీర్ణ వ్యవస్థ 2) శ్వాస వ్యవస్థ
3) నాడీ వ్యవస్థ 4) విసర్జక వ్యవస్థ
47. కార్బన్‌ మోనాక్సయిడ్‌ శరీరంలో దేని రవాణాలో అడ్డుపడుతుంది?
1) కార్బన్‌ డై ఆక్సైయిడ్‌ 2) నికోటిన్‌
3) నైట్రోజన్‌ 4) ఆక్సిజన్‌
48. వాయు సహిత శ్వాసక్రియ మాత్రమే జరిగేది?
1) కండరాలు 2) యీస్టుకణాలు
3) టెటనస్‌ బాక్టీరియాలు 4) మొకెత్తు విత్తనాలు
49. ఆక్సీకరణ చెందడానికి, కణ శ్వాసక్రయిలో ఆహార పదార్థాలు ఈ క్రింది విధంగా ఉండాలి?
1) పిండి పదార్థం 2) సెల్యులోజ్‌
3) గ్లూకోజ్‌ 4) కొవ్వులు
50. కణ శ్వాసక్రియ జరిగే స్థలం?
1) కణ ద్రవ్యం 2) కేంద్రకం
3) హరితరేణువుల 4) మైటోకాండ్రియాలు

dŸeÖ<ó‘H\T fÉdt¼ 7 :
1)  4 2)   2 3)   3 4)  4 5)  2 6)   1 7)  1 8)   4 9)   2 10) 4
11) 3 12) 3 13) 4 14) 4 15) 4 16) 2 17) 4 18) 3 19) 4 20) 4
21) 4 22) 3 23) 3 24) 3 25) 4 26) 4 27) 4 28) 2 29) 2 30) 3
31) 3 32) 3 33) 1 34) 3 35) 2 36) 2 37) 3 38) 1 39) 4 40) 1
41) 4 42) 2 43) 4 44) 3 45) 2 46) 2 47) 4 48) 4 49) 3 50) 4