Showing posts with label Records. Show all posts
Showing posts with label Records. Show all posts

Saturday, October 8, 2016

బుర్జ్‌ ఖలీఫాలో ఎక్కువ ఫ్లాట్లు కలిగిన వ్యక్తిగా భారత వ్యాపారి రికార్డు


ప్రపంచంలోనే ఎత్తైన నిర్మాణమైన దుబాయిలోని ప్రఖ్యాత బుర్జ్‌ ఖలీఫాలో భారతీయ వ్యాపారి, కేరళకు చెందిన జార్జ్‌ వీ నెరియపరంబిల్‌ 22 ఫ్లాట్లను సొంతం చేసుకుని వార్తల్లో నిలిచారు. దీంతో ఆయన బుర్జ్‌ ఖలీఫాలో ఎక్కువ భాగం కలిగిన ప్రైవేటు వ్యక్తిగా రికార్డుకెక్కారు.

పొడవైన గడ్డం పెంచిన తొలి మహిళగా హర్మాన్‌ కౌర్‌ గిన్నిస్‌ రికార్డు


బ్రిటన్‌కు చెందిన సిక్కు మోడల్‌ హర్మాన్‌ కౌర్‌ 6 అంగుళాల పొడవైన గడ్డం పెంచిన తొలి మహిళగా గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. హర్మాన్‌ కౌర్‌కు అండాశయాల్లో నీటి తిత్తుల సమస్య (పాలీసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌) ఉంది. దీని కారణంగా మీసం, గడ్డం వస్తుంది. ఇటీవల తలపాగా, గడ్డంతో లండన్‌ ఫ్యాషన్‌ వీక్‌లో పాల్గొంది. అలా గడ్డంతో ర్యాంప్‌ మీద నడిచిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది.

Thursday, October 6, 2016

తాపేశ్వరం లడ్డూకు గిన్నిస్‌ రికార్డు


వినాయక చవితి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరం సురుచి ఫుడ్స్‌ సంస్థ తయారు చేసిన 29,465 కిలోల (సుమారు 30 టన్నులు) మహాలడ్డూకు గిన్నిస్‌ రికార్డు దక్కింది. ఇప్పటివరకు గుజరాత్‌లోని అంబాజిపట్నంలో తయారు చేసిన 11,115 కిలోల వినాయక లడ్డూకు ఉన్న గిన్నిస్‌ రికార్డును తాపేశ్వరం లడ్డూ అధిగమించింది

Wednesday, October 5, 2016

నరేంద్రమోడి జన్మదినోత్సవం రోజు 3 ప్రపంచ రికార్డులు


ప్రధాని నరేంద్రమోడి తన 66వ జన్మ దినోత్సవాన్ని సొంత రాష్ట్రం గుజరాత్‌లో దాహోద్‌ జిల్లాలోని లిమ్‌ఖేడాలో గిరిజనులతో, నవ్‌సరిలో దివ్యాంగులతో జరుపుకున్నారు. నీటి ఎద్దడి ఉండే దాహోద్‌ జిల్లా నీటి అవసరాలు తీర్చడానికి రూ.4817 కోట్లతో గుజరాత్‌ సర్కారు నిర్మించిన సాగు, తాగునీటి ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ప్రధాని నరేంద్రమోడి పుట్టినరోజు సందర్భంగా దక్షిణ గుజరాత్‌లోని నవ్‌సరిలో ఒకే వేదికపై మూడు ప్రపంచ రికార్డు నమోదయ్యాయి. అవి:
1. 989 మంది చిన్నాయి మట్టి ప్రమిదల్లో 30 సెకన్ల వ్యవధిలో ఒకేసారి దీపాు వెలిగించారు.
2. వెయ్యి మంది దివ్యాంగులైన చిన్నారులు చక్రాల కుర్చీల్లో కూచుని అతిపెద్ద చక్రాల కుర్చీ లోగోను ఏర్పరిచారు. చక్రాల కుర్చీకే పరిమితమైన ఈ వెయ్యి మంది కాషాయ, ధవళ వర్ణపు వస్త్రాల ధరించి ‘హ్యాపీ బర్త్‌డే పీఎం’ అనే అక్షరా రూపంగా కూడా ఏర్పడ్డారు.
3. 1700 మంది బధిరులకు 3,400 వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు. 

Monday, September 12, 2016

సుగారు జసంధిని ఈదిన అత్యంత పెద్ద వయస్కుడిగా తోషియో తొమినాగా రికార్డు


జపాన్‌కు చెందిన తోషియో తొమినాగా (73) జపాన్‌లోని సుగారు జలసంధిని ఈదిన అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించారు. ఉత్తర జపాన్‌లోని సుగారు జలసంధి ఈతకు ప్రపంచంలోనే అత్యంత కష్టసాధ్యమైన వాటిలో ఒకటిగా గుర్తింపు పొందింది.  https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

Sunday, September 11, 2016

అతి పెద్ద నదీ ద్వీపంగా మాజులీ రికార్డు




అసోంలోని మాజులీ ద్వీపాన్ని అతి పెద్ద నదీ ద్వీపంగా గిన్నిస్‌ బుక్‌ గుర్తించింది. ఇది బ్రహ్మపుత్ర నదీ మధ్యలో ఉన్న ద్వీపం. దీని విస్తీర్ణం 880 చదరపు కిలోమీటర్లు. అంటే విస్తీర్ణంలో హైదరాబాద్‌ నగరం కంటే పెద్దది. మాజులీ ద్వీపంలో 144 గ్రామాలున్నాయి. అక్కడి ప్రజల్లో ఎక్కువ మంది అరుణాచల్‌ప్రదేశ్‌ నుంచి వలస వచ్చిన గని కార్మికులే. మాజులీ శాసనసభ నియోజకవర్గం కూడా. అసోం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్‌ ఇక్కడి నుంచే ఎన్నికయ్యారు. https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg



చిన్మయ్‌ కుమార్‌ ఘోష్‌ అనుచరుల రికార్డు


భారత ఆధ్యాత్మిక గురువు చిన్మయ్‌ కుమార్‌ ఘోష్‌ 85వ జయంతి సందరంగా ఆయన అనుచరులు 2016 ఆగస్టులో న్యూయార్క్‌లో 45 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు  గల కేకుపై 72,000 కొవ్వొత్తులు వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించారు. 

Saturday, September 3, 2016

సింగరేణికి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు


2016 జూన్‌ 21అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు కంపెనీవ్యాప్తంగా నిర్వహించిన సామూహిక యోగాకు గాను సింగరేణికి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో చోటు దక్కింది. యోగా దినోత్సవాన్ని సద్వినియోగం చేసుకొని కార్మికులకు యోగా ప్రాముఖ్యత తెలియజేయడానికి ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. కంపెనీ విస్తరించిన ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో ఉన్న 11 ఏరియాల్లో 176 సెంటర్లలో ఒకేసారి యోగా ప్రదర్శనలు నిర్వహించగా 60,369 మంది పాల్గొన్నారు.


Friday, September 2, 2016

నరేంద్రమోడి సూటు గిన్నిస్‌ రికార్డు


భారత ప్రధాని నరేంద్రమోడి ధరించిన సూటు గిన్నిస్‌ ప్రపంచ రికార్డు సాధించింది. డిల్లీలో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాను కలిసినపుడు మోడి వేసుకున్న ఈ సూటు అప్పట్లో వివాదాకు దారితీసింది. అదే వేలంలో అమ్ముడైన అత్యంత ఖరీదైన సూటుగా (రూ.4.31 కోట్లు) రికార్డుకెక్కింది. దీన్ని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి లాల్జీభాయ్‌ తుల్సీభాయ్‌ పటేల్‌ 2015 ఫిబ్రవరి 20న దక్కించుకున్నారు. సూటుపై నరేంద్ర దామోదరదాస్‌ మోదీ అనే బంగారు అక్షరాలను సైతం అమర్చారు. ఈ సూటు ద్వారా లభించిన మొత్తాన్ని గంగా ప్రక్షాళన కార్యక్రమానికి విరాళంగా ఇచ్చారు.


లాల్జీభాయ్‌ తుల్సీభాయ్‌ పటేల్‌



Saturday, August 27, 2016

కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన ఆసియాలో కెల్లా అతిచిన్న వయస్కురాలు నర్సమ్మ


మెదక్‌ జిల్లా కొల్చారం మండలం రంగంపేటకు చెందిన విద్యార్థిని దామని నర్సమ్మ (11) ఆఫ్రికా ఖండంలోనే ఎత్తయిన పర్వతాన్ని 160 మందితో అధిరోహించి ఆసియాలోనే ఈ ఘనత సాధించిన అతి చిన్న వయస్కురాలిగా రికార్డు నమోదు చేసింది. మెదక్‌ జిల్లాలోని కేజీబీవీల్లో చదువుతున్న 9 మంది విద్యార్థినులతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ సంక్షేమ వసతి గృహాలకు చెందిన 12 మంది బృందం 2016 ఆగస్టు 8న టాంజానియాలోని కిలిమంజారో పర్వతారోహణకు బయలుదేరి వెళ్లి, ఆగస్టు 14న ఈ పర్వతాన్ని అధిరోహించారు. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అక్కడే భారత పతాకాన్ని ఎగరేశారు. ఆ బృందంలో నర్సమ్మ కూడా ఉంది. ఈ బృందంలో అతి చిన్న వయస్కురాలుగా నర్సమ్మ మరో రికార్డు దక్కించుకుంది. కిలిమంజారో పర్వతాన్ని 2006లో 10 ఏళ్ల 11 రోజుల వయసులో కాలిఫోర్నియాకు చెందిన బాలిక జోర్డాన్‌ రొమెరో అధిరోహించింది. ప్రపంచంలోనే అతి చిన్న వయసులో ఆ పర్వతాన్ని అధిరోహించిన రికార్డు సొంతం చేసుకుంది. 2014 అక్టోబరు 2న  హైదరాబాద్‌కు చెందిన జాహ్నవి 12 ఏళ్ల 11 నెల ల వయసులో ఈ పర్వతాన్ని అధిరోహించి ఆసియాలోనే అతి చిన్న వయస్కురాలిగా రికార్డు సొంతం చేసుకొంది. 2004 ఆగస్టు 22న జన్మించిన నర్సమ్మ 11 ఏళ్ల 11 నెలల వయసులో ఈ రికార్డును తిరగరాసింది.

Tuesday, August 23, 2016

25 వే అడుగు ఎత్తు నుంచి దూకి రికార్డు


అమెరికన్‌ స్కై డైవర్‌ లూర్యక్‌ ఐకిన్స్‌ ప్యారాచూట్‌ లేకుండా ఆకాశం నుంచి 25 వేల అడుగు ఎత్తు(7.6 కి.మీ.)లో ఉన్న విమానం నుంచి కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వలలో దూకి చరిత్ర సృష్టించాడు. 42 ఏళ్ల లూర్యక్‌కి 18వేల జంప్‌లు చేసిన అనుభవం ఉంది. కాలిఫోర్నియా సమీపంలోని సిమీవ్యాలీ ఈ అరుదైన రికార్డుకు వేదికైంది.

కిలిమంజారో తాడుపై నడిచి స్టీఫెన్‌ సీగ్రిస్ట్‌ ప్రపంచ రికార్డు


సముద్ర మట్టానికి 5700 మీటర్ల ఎత్తులో ఉన్న కిలిమంజారో పర్వత శిఖరాలకు కట్టిన (20 మీటర్ల దూరం) తాడుపై నడిచి స్విట్జర్లాండ్‌కు చెందిన స్టీఫెన్‌ సీగ్రిస్ట్‌ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇటీవల తెలంగాణ కు చెందిన నర్సమ్మ అనేది బాలిక కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన ఆసియాలో కెల్లా అతి  వయస్కురాలిగా రికార్డు సాధించింది. 

11 రోజుల్లో హాట్‌ఎయిర్‌ బెలూన్‌పై ప్రపంచాన్ని చుట్టి రికార్డు


రష్యాకు చెందిన ఫెడర్‌ కొన్యుష్కోవ్‌ 11 రోజుల్లో హాట్‌ఎయిర్‌ బెలూన్‌పై ప్రపంచాన్ని చుట్టి సరికొత్త రికార్డు సృష్టించారు. గతంలో పదమూడున్నర రోజులతో ఉన్న రికార్డును ఆయన బద్దలు కొట్టారు.

Tuesday, August 16, 2016

కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన ప్రపంచం లోనే అతి పిన్న వయస్కురాలు ఎవరు?



తెలంగాణలోని మెదక్‌ జిల్లా కొల్చారం మండలం  రంగంపేటకు చెందిన 11 ఏళ్ల బాలిక నర్సమ్మ దేశం గర్వించదగ్గ విజయాన్ని సాధించింది. ఆఫ్రికా ఖండంలోనే ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి ఆసియాలోనే ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా నర్సమ్మ రికార్డు నమోదు చేసింది. 

రంగంపేటకు చెందిన  గొర్రె కాపర్లయిన గామని చిన్నసంజీవులు , జమున దంపతుల  చిన్న కుమార్తె నర్సమ్మ.  నర్సమ్మ ప్రస్తుతం కొల్చారంలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాయంలో 8వ తరగతి చదువుతోంది. మెదక్‌ జిల్లాలోని కేజీబీవీల్లో చదువుతున్న తొమ్మిది మంది విద్యార్థినులతోపాటు..తెలంగాణ రాష్ట్రంలోని వివిధ సంక్షేమ వసతిగృహాలకు చెందిన 12 మంది బృందం 2016 ఆగస్టు 8న టాంజానియాలోని కిలిమంజారో పర్వతారోహణకు బయల్దేరి వెళ్లి ఆగస్టు 14న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2016 ఆగస్టు 15న అక్కడే భారత పతాకాన్ని రెపరెపలాడించారు. ఆ బృందంలో నర్సమ్మ కూడా ఉంది. ఈ బృందంలో అతి చిన్న వయస్కురాలు నర్సమ్మ. కిలిమంజారో పర్వతాన్ని 2006లో 10 సం॥ 11 రోజుల వయసులో కాలిఫోర్నియాకు చెందిన బాలిక జోర్డాన్‌ రొమెరో అధిరోహించింది. ప్రపంచంలోనే అతి చిన్న వయసులో ఆ పర్వతాన్ని అధిరోహించిన రికార్డు సొంతం చేసుకుంది. 2014 అక్టోబరు 2న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు పాఠశా విద్యార్థిని జాహ్నవి 12 సం॥11 నెలల వయసులో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి ఆసియాలోనే అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సొంతం చేసుకుంది. తాజాగా 2004 ఆగస్టు 22న జన్మించిన నర్సమ్మ 11 సం॥ 11 నెలల వయసులో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి రికార్డు తిరగరాసింది. 


జోర్డాన్‌ రొమెరో


జాహ్నవి



నర్సమ్మ