Tuesday, August 16, 2016

కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన ప్రపంచం లోనే అతి పిన్న వయస్కురాలు ఎవరు?



తెలంగాణలోని మెదక్‌ జిల్లా కొల్చారం మండలం  రంగంపేటకు చెందిన 11 ఏళ్ల బాలిక నర్సమ్మ దేశం గర్వించదగ్గ విజయాన్ని సాధించింది. ఆఫ్రికా ఖండంలోనే ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి ఆసియాలోనే ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా నర్సమ్మ రికార్డు నమోదు చేసింది. 

రంగంపేటకు చెందిన  గొర్రె కాపర్లయిన గామని చిన్నసంజీవులు , జమున దంపతుల  చిన్న కుమార్తె నర్సమ్మ.  నర్సమ్మ ప్రస్తుతం కొల్చారంలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాయంలో 8వ తరగతి చదువుతోంది. మెదక్‌ జిల్లాలోని కేజీబీవీల్లో చదువుతున్న తొమ్మిది మంది విద్యార్థినులతోపాటు..తెలంగాణ రాష్ట్రంలోని వివిధ సంక్షేమ వసతిగృహాలకు చెందిన 12 మంది బృందం 2016 ఆగస్టు 8న టాంజానియాలోని కిలిమంజారో పర్వతారోహణకు బయల్దేరి వెళ్లి ఆగస్టు 14న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2016 ఆగస్టు 15న అక్కడే భారత పతాకాన్ని రెపరెపలాడించారు. ఆ బృందంలో నర్సమ్మ కూడా ఉంది. ఈ బృందంలో అతి చిన్న వయస్కురాలు నర్సమ్మ. కిలిమంజారో పర్వతాన్ని 2006లో 10 సం॥ 11 రోజుల వయసులో కాలిఫోర్నియాకు చెందిన బాలిక జోర్డాన్‌ రొమెరో అధిరోహించింది. ప్రపంచంలోనే అతి చిన్న వయసులో ఆ పర్వతాన్ని అధిరోహించిన రికార్డు సొంతం చేసుకుంది. 2014 అక్టోబరు 2న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు పాఠశా విద్యార్థిని జాహ్నవి 12 సం॥11 నెలల వయసులో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి ఆసియాలోనే అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సొంతం చేసుకుంది. తాజాగా 2004 ఆగస్టు 22న జన్మించిన నర్సమ్మ 11 సం॥ 11 నెలల వయసులో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి రికార్డు తిరగరాసింది. 


జోర్డాన్‌ రొమెరో


జాహ్నవి



నర్సమ్మ



No comments:

Post a Comment