మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటకు చెందిన విద్యార్థిని దామని నర్సమ్మ (11) ఆఫ్రికా ఖండంలోనే ఎత్తయిన పర్వతాన్ని 160 మందితో అధిరోహించి ఆసియాలోనే ఈ ఘనత సాధించిన అతి చిన్న వయస్కురాలిగా రికార్డు నమోదు చేసింది. మెదక్ జిల్లాలోని కేజీబీవీల్లో చదువుతున్న 9 మంది విద్యార్థినులతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ సంక్షేమ వసతి గృహాలకు చెందిన 12 మంది బృందం 2016 ఆగస్టు 8న టాంజానియాలోని కిలిమంజారో పర్వతారోహణకు బయలుదేరి వెళ్లి, ఆగస్టు 14న ఈ పర్వతాన్ని అధిరోహించారు. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అక్కడే భారత పతాకాన్ని ఎగరేశారు. ఆ బృందంలో నర్సమ్మ కూడా ఉంది. ఈ బృందంలో అతి చిన్న వయస్కురాలుగా నర్సమ్మ మరో రికార్డు దక్కించుకుంది. కిలిమంజారో పర్వతాన్ని 2006లో 10 ఏళ్ల 11 రోజుల వయసులో కాలిఫోర్నియాకు చెందిన బాలిక జోర్డాన్ రొమెరో అధిరోహించింది. ప్రపంచంలోనే అతి చిన్న వయసులో ఆ పర్వతాన్ని అధిరోహించిన రికార్డు సొంతం చేసుకుంది. 2014 అక్టోబరు 2న హైదరాబాద్‌కు చెందిన జాహ్నవి 12 ఏళ్ల 11 నెల ల వయసులో ఈ పర్వతాన్ని అధిరోహించి ఆసియాలోనే అతి చిన్న వయస్కురాలిగా రికార్డు సొంతం చేసుకొంది. 2004 ఆగస్టు 22న జన్మించిన నర్సమ్మ 11 ఏళ్ల 11 నెలల వయసులో ఈ రికార్డును తిరగరాసింది.
Saturday, August 27, 2016
కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన ఆసియాలో కెల్లా అతిచిన్న వయస్కురాలు నర్సమ్మ

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment