- గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. కంప్యూటర్లలో క్రోమ్ బ్రౌజర్‌ను ఉపయోగిస్తున్న యూజర్లు.. వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.
- ఈ మేరకు భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ.. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పానెస్స్ టీమ్ ఆఫ్ ఇండియా క్రోమ్ బ్రౌజర్‌లో లోపాలను గుర్తించినట్లు వెల్లడిరచింది. వీటి వల్ల డేటా చౌర్యం, మాల్‌వేర్ దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
- గూగుల్ క్రోమ్‌లోని ప్రాంప్ట్స్, వెబ్ పేమెంట్స్ ఏపీఐ, స్విఫ్ట్‌షేడర్, వుల్కన్, వీడియో, వెబ్ ఆర్‌టీసీ వంటి వాటి ద్వారా సైబర్ నేరగాళ్లు యూజర్ కంప్యూటర్‌లోకి మాల్‌వేర్‌ను పంపి బ్యాంకింగ్ సమాచారంతోపాటు, వ్యక్తిగత వివరాలను సేకరించే అవకాశం ఉందని పేర్కొంది.
- యూజర్లు క్రోమ్ బ్రౌజర్‌లో అశ్లీల వెబ్‌సైట్‌లు, తక్కువ భద్రతా ప్రమాణాలు కలిగిన వెబ్ పేజ్‌లను ఓపెన్ చేసినప్పుడు మాల్‌వేర్ ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది.
- లైనెక్స్, మ్యాక్ కంప్యూటర్లలో గూగుల్ క్రోమ్ వెర్షన్ 115. 0.5790.170 వాడుతున్న వారు, విండోస్‌లో 115.0.5790.170/.171 వెర్షన్ ఉపయోగిస్తున్నవారు వెంటనే తమ బ్రౌజర్లను అప్‌డేట్ చేసుకోవాలని సెర్ట్-ఇన్ సూచించింది.
- గూగుల్ క్రోమ్‌ను అప్‌డేట్ చేసుకునేందుకు.. ముందుగా బ్రౌజర్‌ను ఓపెన్ చేసి కుడివైపు మూడు చుక్కలపై క్లిక్ చేసి కిందకు స్క్రోల్ చేస్తే సెట్టింగ్స్ కనిపిస్తాయి.
- సెట్టింగ్స్ పేజ్‌లో ఎడమవైపు ఓ జాబితా కనిపిస్తుంది. అందులో చివర ‘అబౌట్ క్రోమ్’ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మీ బ్రౌజర్ అప్‌డేట్ అయిందా? లేదా?అనేది చూపిస్తుంది.
- ఒకవేళ బ్రౌజర్ అప్‌డేట్ కాకుంటే రీలాంచ్ చేసి అప్‌డేట్ చేయాలి. బ్రౌజర్ ఆటోమేటిగ్గా అప్‌డేట్ అయితే ‘క్రోమ్ ఈజ్ అప్ టూ డేట్’ అని చూపిస్తుంది.
Tuesday, August 15, 2023
Google Chrome : వెంటనే బ్రౌజర్‌ను అప్‌డేట్ చేయండి.. క్రోమ్ యూజర్లకు కేంద్రం సూచన
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment