Friday, September 2, 2016
నరేంద్రమోడి సూటు గిన్నిస్ రికార్డు
లాల్జీభాయ్ తుల్సీభాయ్ పటేల్
Thursday, September 1, 2016
కాబుల్‌లో దారుల్ అమన్ సౌధం ప్రారంభం
అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లో పునరుద్ధరించిన దారుల్ అమన్ సౌధం (స్టోర్ ప్యాలెస్)ను ఆ దేశాధ్యక్షుడు అష్రఫ్‌ఘనీ, భారత ప్రధాని నరేంద్రమోడి ప్రత్యక్ష ప్రసార సదస్సు ద్వారా ప్రారంభించారు. దారుల్ అమన్ సౌధాన్ని మొదట 1920ల్లో అఫ్గాన్ రాజు అమానుల్లాఖాన్ నిర్మించారు. అనేక చారిత్రక ఘటనలకు ఈ భవనం సాక్షిగా నిలిచింది.
బ్రహ్మొస్ నూతన రెజిమెంట్ ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు?
బ్రహ్మోస్‌కు సంబంధించిన అధునాతన శ్రేణి క్షిపణులతో సైన్యంలోని ఒక కొత్త రెజిమెంట్‌ను ఏర్పాటు చేయడానికి 2016 ఆగస్టు మొదటివారంలో మొదట్లో ప్రధాని మోడి నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీనిపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. రూ.4,300 కోట్లతో ఏర్పాటుచేసే ఈ రెజిమెంట్‌ను అరుణాచల్‌ప్రదేశ్‌లో మోహరిస్తారు. ఈ రాష్ట్రం తమదని చైనా వాదిస్తోంది. అక్కడి వాస్తవాధీన రేఖ వెంబడి గత కొన్నేళ్లలో ఇరుదేశాల దళాలు మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అక్కడ మోహరించబోయే బ్రహ్మోస్ క్షిపణిని పర్వత ప్రాంతాల్లో యుద్ధం కోసం ప్రత్యేకంగా రూపొందించారు. సైన్యంలో ఇప్పటికే మూడు బ్రహ్మోస్ రెజిమెంట్లు ఉన్నాయి.
ముస్లింలకు సద్భావన మండపాలు
ముస్లింల కోసం అన్ని రాష్ట్రాల్లో సద్భావన మండపాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటిల్లో సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకోవడంతో పాటు ముస్లింలకు ఉద్దేశించిన సంక్షేమ పథకాల అమలుకు కేంద్రంగా నిలిచేలా చూడాలనేది ప్రభుత్వ సంకల్పం. 2011లో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడి ఉన్నప్పుడు చేపట్టిన సద్భావన యాత్ర స్పూర్తితో రూ.6,500 కోట్లతో సద్భావన మండపాల నిర్మాణాన్ని చేపటనున్నారు
నీతి ఆయోగ్ ప్రథమ వార్షికోత్సవం ఎక్కడ జరిగింది?
డిల్లీలో 2016 ఆగస్టు 26న నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా ప్రథమ ఉపన్యాస కార్యక్రమంలో ప్రధాని మోడి ప్రసంగించారు. సంపూర్ణ మార్పును భారత్ చవిచూలంటే ఒక్కో మెట్టూ ఎక్కితే సరిపోదని, పూర్తి రూపాంతరణ అవసరమని ఆయన పేర్కొన్నారు. నీతి ఆయోగ్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మోడితోపాటు కేంద్ర మంత్రివర్గ సభ్యులందరూ పాల్గొన్నారు. సింగపూర్ ఉప ప్రధాని తర్మన్ షణ్ముగ రత్నం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Subscribe to:
Posts (Atom)










