Showing posts with label Places. Show all posts
Showing posts with label Places. Show all posts

Monday, June 22, 2020

No Ambubachi Mela at Kamakhya Temple for the first time in Recorded History


At the centuries-old historic Kamakhya Temple at Guwahati, for the first time in six centuries of record available from 1565, the 5 days Ambubachi Mela will not be organized due by keeping in mind the possibility of spreading the COVID-19 virus.

  • Every year the fair draws lakhs of pilgrims, tourists, sadhus, and others from all over the country. 
  • As per the Assam State Tourism, a minimum of 5 lakh devotees attend the fair that also includes many foreigners.
  • The rituals of Ambubachi Mahayog will be performed by the priests of the temple by maintaining the social distancing norms. 
  • The Mahayog will be performed at the Devalaya from 07:53:15 am- 22nd June to 8:16:55 pm- 25th June.
  • Kamakhya Temple will remain closed for the devotees till the 30th of June 2020 as per the decision taken by the Kamakhya Devalaya Management Committee.

Kamakhya Temple

  • The Hindu temple located at the Nilachal Hill is dedicated to the mother goddess Kamakhya. 
  • The temple as per history was built by King Narakasura. 
  • As per the official records available from 1565, the temple was rebuilt by Koch King Naranarayan.
  • Kamakhya is one of the 51 Shakti Peeths (each of the 51 Shakti Peeths represents a body part of Lord Shiva’s companion, Sati).

Saturday, October 8, 2016

ఆసియాలో అత్యుత్తమ పురావస్తు ప్రదర్శనశాల జాబితాలో సాలార్‌జంగ్‌ మ్యూజియం


ఆసియాలో అత్యుత్తమ పురావస్తు ప్రదర్శనశాల జాబితాలో హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్‌ మ్యూజియం చోటు దక్కించుకుంది. తప్పకుండా సందర్శించాల్సిన ప్రాంతాలపై ట్రిప్‌ అడ్వయిజర్‌ వెబ్‌సైట్‌ చేసిన సర్వేలో ఈ గౌరవం దక్కింది. ఇందులో ఆసియాలోని 25 అత్యుత్తమ మ్యూజియంలో భారత్‌కు చెందిన సాలార్‌జంగ్‌ మ్యూజియం సహా 5 మ్యూజియంలు స్థానం సంపాదించుకున్నాయి. 

Thursday, October 6, 2016

రేస్‌కోర్స్‌ మెట్రో స్టేషన్‌ పేరు మార్పు


 ప్రధాని అధికారిక నివాసం ఉండే నెంబరు 7 రేస్‌కోర్స్‌ రోడ్‌ పేరును లోక్‌కళ్యాణ్‌ మార్గ్‌గా మార్చిన నేపథ్యంలో అక్కడికి దగ్గరగా ఉన్న రేస్‌కోర్స్‌ మెట్రో స్టేషన్‌ పేరును కూడా లోక్‌ కళ్యాణ్‌ మార్గ్‌ స్టేషన్‌గా మార్చాలని ఢల్లీ మెట్రో రైలు సంస్థ నిర్ణయించింది.

Wednesday, September 21, 2016

తమిళనాడులో అతిపెద్ద సోలార్‌ పవర్‌ప్లాంట్‌


ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్‌ పవర్‌ ప్లాంటును 648 మెగావాట్ల స్థాపక సామర్థ్యంతో అదాని గ్రూపు తమిళనాడులో నిర్మించింది. రామనాథపురం జిల్లాలోని కముధి వద్ద ఈ సోలార్ ప్లాంటును 2016 సెప్టెంబర్ 21 న ప్రారంభించారు. సబ్‌స్టేషన్‌ ద్వారా దీనిని గ్రిడ్‌కు అనుంసంధానిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అధికారికంగా ప్రారంభించారు. 5వేల ఎకరాల విస్తీర్ణంలో రూ.4,550 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. నిర్మాణానికి కావాల్సిన పరికరాలు, యంత్రాలను వివిధ దేశాల నుంచి సమకూర్చి 8 నెలల్లో ప్లాంటును పూర్తి చేశారు. నిర్దిష్ట సమయంలో నిర్మాణాన్ని పూర్తి చేయడానికి రోజుకి 8,500 మంది కార్మికులు పని చేశారు. ఈ ప్లాంటు 3.8 లక్షల ఫౌండేషన్లు, 25లక్షల సోలార్‌ మాడ్యూల్స్‌, 576 ఇన్వర్టర్లు, 154 ట్రాన్స్‌ఫార్మర్లు, 6వేల మీటర్ల పొడవు గల కేబుల్స్‌ను కలిగి ఉంది. 

Tuesday, September 13, 2016

చైనాలో మావో భారీ విగ్రహం ఏర్పాటు, కూల్చివేత


చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్‌కు ఆయన అభిమానులు చైనాలో ఏర్పాటు చేసిన భారీ విగ్రహాన్ని చైనా అధికారులు 2016 జనవరి 8న కూల్చివేశారు. హెనన్‌ రాష్ట్రం కైఫెంగ్‌ సమీపంలోని టంగ్జూ గ్రామ పరిసరాల్లో సుమారు రూ.3 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మూడు రోజుల్లోనే అధికారులు అనుమతి లేదంటూ కూల్చివేశారు. 36 మీటర్ల ఎత్తున్న ఈ ప్రతిమను ఉక్కు, కాంక్రీటుతో రూపొందించి బంగారు రంగు వేశారు. స్థానికలు రైతులు, వ్యాపారులు, మావో అభిమానులు ఇందుకోసం విరాళాలు సమర్పించారు. మావో తన 82వ ఏట 1976 సెప్టెంబరు 9న మరణించారు.

Monday, September 12, 2016

చైనాకు ప్రతి వారం కంటెయినర్‌ నౌకా సేవలు


కృష్ణపట్నం ఓడరేవు చైనాకు ప్రతి వారం కంటెయినర్‌ నౌకా సేవలను అందుబాటులోకి తెచ్చింది. పోర్టులోని రెండో బెర్తుపై మాస్క్‌ కైరెనియా అనే నౌకను ప్రారంభించారు. గతంలో ఈ రేవు నుంచి చైనాకు నౌక వెళ్లేందు కు 25 రోజుల సమయం పట్టేదని, ప్రస్తుత సర్వీసుతో 14 రోజులు  పడుతుందని అధికారులు  పేర్కొన్నారు. ఈ కంటెయినర్‌ సేవ ద్వారా చైనా, కొరియా, సింగపూర్‌, మలేషియా దేశాలతో వ్యాపార సంబంధాలు మెరుగవుతాయి. https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

Sunday, September 11, 2016

ఆస్ట్రేలియాలో వెలుగులోకి మరో భారీ దిబ్బ


ఆస్ట్రేలియాలోని అద్భుత పగడాల దిబ్బ (గ్రేట్‌ బారియర్‌ రీఫ్‌) వెనుక మరో భారీ దిబ్బ వెలుగులోకి వచ్చింది. సిడ్నీ వర్సిటీ, క్వీన్స్‌లాండ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకులు సముద్ర అంతర్భాగం పరిశోధనలో ఈ దిబ్బను గుర్తించారు. ఇందులో అసాధారణ డోనట్‌ ఆకార పుట్టు (మౌండ్స్‌) ఒక్కోటి 200-300 మీటర్లు వ్యాపించి 10 మీటర్ల లోతు వరకు ఉన్నాయి. ఇప్పటివరకు 6 వేల చదరపు కిలోమీటర్ల మేర ఈ దిబ్బను మ్యాప్‌ చేశారు. దీని ఆధారంగా సముద్ర గర్భంలో వాతావరణ మార్పు, గడిచిన 10 వేల సం॥లో అద్భుత పగడాల దిబ్బలో చోటుచేసుకున్న మార్పు తదితర అంశాలు వెలుగులోకి వస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు.

https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYghttps://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

Saturday, September 3, 2016

హైదరాబాద్‌లో మొదటి ఐకియా స్టోర్‌



రిటైల్‌ రంగ దిగ్గజం, స్వీడన్‌కు చెందిన ఐకియా భారత్‌లో తొలి స్టోర్‌కు 2016 ఆగస్టు 11న శంకుస్థాపన చేసింది. హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ సమీపంలో 4లక్షల చదరపు అడుగుల  విస్తీర్ణంలో దీనిని నిర్మించనున్నారు.


Thursday, September 1, 2016

కాబుల్‌లో దారుల్‌ అమన్‌ సౌధం ప్రారంభం



అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో పునరుద్ధరించిన దారుల్‌ అమన్‌ సౌధం (స్టోర్‌ ప్యాలెస్‌)ను ఆ దేశాధ్యక్షుడు అష్రఫ్‌ఘనీ, భారత ప్రధాని నరేంద్రమోడి ప్రత్యక్ష ప్రసార సదస్సు ద్వారా ప్రారంభించారు. దారుల్‌ అమన్‌ సౌధాన్ని మొదట 1920ల్లో అఫ్గాన్‌ రాజు అమానుల్లాఖాన్‌ నిర్మించారు. అనేక చారిత్రక ఘటనలకు ఈ భవనం సాక్షిగా నిలిచింది.


బ్రహ్మొస్ నూతన రెజిమెంట్ ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు?


బ్రహ్మోస్‌కు సంబంధించిన అధునాతన శ్రేణి క్షిపణులతో సైన్యంలోని ఒక కొత్త రెజిమెంట్‌ను ఏర్పాటు చేయడానికి 2016 ఆగస్టు మొదటివారంలో మొదట్లో ప్రధాని మోడి నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీనిపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. రూ.4,300 కోట్లతో ఏర్పాటుచేసే ఈ రెజిమెంట్‌ను అరుణాచల్‌ప్రదేశ్‌లో మోహరిస్తారు. ఈ రాష్ట్రం తమదని చైనా వాదిస్తోంది. అక్కడి వాస్తవాధీన రేఖ వెంబడి గత కొన్నేళ్లలో ఇరుదేశాల దళాలు మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అక్కడ మోహరించబోయే బ్రహ్మోస్‌ క్షిపణిని పర్వత ప్రాంతాల్లో యుద్ధం కోసం ప్రత్యేకంగా రూపొందించారు. సైన్యంలో ఇప్పటికే మూడు బ్రహ్మోస్‌ రెజిమెంట్లు ఉన్నాయి. 

Monday, August 29, 2016

బంగాళాఖాతంలో సహజ వాయువు నిల్వలు


బంగాళాఖాతంలో సహజ వాయువు నిల్వలు బయటపడ్డాయి. గ్యాస్‌హైడ్రేట్ల రూపంలో ఉన్న ఈ నిల్వల ను కృష్ణా-గోదావరి బేసిన్‌లో భారత్‌, అమెరికా సంయుక్త అన్వేషణ ద్వారా గుర్తించాయి. వీటి నుంచి సహజ వాయువులను ఉత్పత్తి చేయడం సాధ్యమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. సహజవాయువు ఉత్పత్తికి అనువైన గ్యాస్‌ హైడ్రేట్ల నిల్వ హిందూ మహాసముద్ర పరిధిలో వెలుగుచూడటం ఇదే ప్రథమం. మన దేశంలో గ్యాస్‌హైడ్రేట్లు అన్వేషణను ప్రభుత్వరంగ సంస్థ ఓఎన్‌జీసీ నేతృత్వంలో అమెరికా భూ విజ్ఞాన సర్వే (యూఎస్‌జీఎస్‌), ది జపనీస్‌ డ్రిల్లింగ్‌ కంపెనీ, జపాన్‌ ఏజెన్సీ ఫర్‌ మెరైన్‌ ఎర్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సంస్థలకు చెందిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం 2014 సెప్టెంబరులో ప్రారంభించింది. సముద్ర తవ్వకం, సంప్రదాయ అవక్షేప కోరింగ్‌, పీడన కోరిగ్‌ లాంటి చర్యల ద్వారా హిందూ మహాసముద్ర పరిధిలో (బంగాళాఖాతం కూడా ఈ పరిధిలోకే వస్తుంది) అన్వేషణనలు వారు కొనసాగించారు. బంగాళాఖాతంలో కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌లో గరుకు ఇసుకను నిక్షిప్తం చేసుకునే భూ పొరల్లో గ్యాస్‌ హైడ్రేట్ల నిల్వను భారీగా గుర్తించినట్లు యూఎన్‌జీసీ ప్రకటించింది. సహజ వాయువును విరివిగా అందించే వనరులుగా గ్యాస్‌హైడ్రేట్లకు పేరుంది. సహజ వాయువు, నీరు కలిసి మంచు రూపంలో కలిసి ఉండేవే ఈ హైడ్రేట్లు. ఇవి మహా సముద్రాల, ధృవ ప్రాంతాల్లో ప్రకృతి సిద్ధంగా ఆవిర్భవిస్తాయి. 

ఆఫ్రికాలోనే పొడవైన వంతెనగా రబాత్‌


మొరాకో రాజధాని రబాత్‌ సమీపంలో ఇటీవలే నిర్మాణం పూర్తిచేసుకున్న వంతెన ఆఫ్రికాలోనే పొడవైనదిగా రికార్డుకెక్కింది. తీగ ఆధారంగా ఈ వంతెనను నిర్మించారు. 

ఏ దేశ జాతీయ దినోత్సవాన్ని బ్యాస్టిల్ డే అంటారు?


ఫ్రాన్స్‌లోని నీస్‌ నగరంలో సముద్రతీర విహార కేంద్రం వద్ద 2016 జులై 14న నిర్వహించిన జాతీయ దినోత్సవ వేడుకల్లో  ఓ ఉగ్రవాది భారీ లారీతో దాడి చేసిన ఘటనలో 84 మంది దుర్మరణం పాలయ్యారు. ట్యునీషియాలో జన్మించిన ఫ్రాన్స్‌వాసి మొహమ్మద్‌ లాహౌయె బౌహ్లెల్‌ (31) ఈ ఘటనకు పాల్పడినట్లుగా తేల్చారు. జనంపైకి లారీని తోలడంతోపాటు బౌహ్లెల్‌  కాల్పులకూ తెగబడటంతో పోలీసు అధికారులు అతన్ని కాల్చి చంపారు. నవంబరులో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదుల దాడి అనంతరం అత్యవసర పరిస్థితిని ప్రకటించి సైన్యాన్ని, రిజర్వు బలగాల్ని మోహరించగా, జులైతో అత్యవసర పరిస్థితిని ఎత్తేయనున్నట్లు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దాడి జరిగింది. దీంతో అత్యవసర పరిస్థితిని మరో 3 నెలలు పొడిగించనున్నట్లు ప్రకటించారు.  ఫ్రాన్స్‌ జాతీయ దినోత్సవం(జులై 14)ను బ్యాస్టిల్‌ డే అంటారు.


DRDL డైరెక్టర్‌గా ఎం.ఎస్‌.ఆర్‌.ప్రసాద్‌


రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థకు చెందిన హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన అభివృద్ధి ప్రయోగశాల (DRDL) డైరెక్టర్‌గా శాస్త్రవేత్త ఎం.ఎస్‌.ఆర్‌.ప్రసాద్‌ నియమితుయ్యారు. క్షిపణుల రూపకల్పనలో  కీలకమైన ఈ ప్రయోగశాలకు మొదటిసారిగా తెలుగు వ్యక్తి డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

DRDL - Defence Research & Development Laboratory




DRDO - Defence Research and Development Organisation



Tuesday, August 23, 2016

జియోలాజికల్‌ హెరిటేజ్‌ సైట్‌గా విశాఖపట్నం ఎర్రమట్టి దిబ్బలు


పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న విశాఖపట్నంలోని ఎర్రమట్టి దిబ్బను భౌగోళిక చారిత్రక సంపద ప్రాంతం(జియోలాజికల్‌ హెరిటేజ్‌ సైట్‌)గా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు  జారీచేసింది. దీని పరిరక్షణ కోసం నిర్దిష్ట ప్రాంతాన్ని గుర్తించింది. జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ) 2014లోనే ఎర్రమట్టి దిబ్బలను భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తించింది.  సుమారు 12,000 ఏళ్ల కిందట సముద్రం ఉప్పొంగడం వల్ల భూతలం కోతకు గురై ఇవి ఏర్పడినట్లుగా భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

GSI - Geological Survey of India

Monday, August 22, 2016

హిరోషిమాను సందర్శించిన తొలి అమెరికా అధ్యక్షుడు ఎవరు..?


జపాన్‌లోని హిరోషిమాపై అణుబాంబు దాడికి 2016 ఆగస్టు 6 నాటికి 71 సం॥లు పూర్తయ్యాయి. ఈ అణుబాంబు సృష్టించిన బీభత్సానికి వేలాది మంది జపాన్‌ వాసులు ప్రాణాలు కోల్పోయారు. 1945 ఆగస్టు 6హిరోషిమాపై బి-29 బాంబర్‌ నుంచి తొలి అణుబాంబు లిటిల్‌ బాయ్‌ను అమెరికా వదిలింది. 1945 ఆగస్టు 9నాగసాకిపై బి-29 బాంబర్‌ నుంచి అణుబాంబు ఫ్యాట్‌ బాయ్‌ను అమెరికా వదిలింది. హిరోషిమాపై దాడితో 1,40,000 మంది, నాగసాకిపై దాడితో 70,000 మంది మరణించారు. 2016 మే 27న అమెరికా అధ్యక్షుడు ఒబామా హిరోషిమాను సందర్శించి అణుబాంబు మృతులకు నివాళులు అర్పించాడు. హిరోషిమాను సందర్శించిన తొలి అమెరికా అధ్యక్షుడు ఒబామా. 


Saturday, August 20, 2016

ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ‘నేర్చుకోండి-సంపాదించండి-తిరిగి ఇవ్వండి’ పథకం


కేంద్రం నుంచి అందే నిధుల్లో కోతపడిన నేపథ్యంలో నిధుల సమీకరణకు ఐఐటీ ఖరగ్‌పూర్‌ సరికొత్త పంథా ఎంచుకుంది. విద్యార్థులకూ ఉపయోగపడేలా భిన్న ప్రణాళికను ఈ విద్యాసంస్థ రూపొందించింది. ఉద్యోగం వచ్చాక డబ్బు అందజేస్తామని ప్రతిజ్ఞ చేస్తే రుసుం మాఫీ వెసులుబాటుతో సదరు విద్యార్థులకు విద్యాబోధన అందించాలని నిర్ణయించింది. ‘నేర్చుకోండి-సంపాదించండి-తిరిగి ఇవ్వండి’ పేరుతో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఈ పథకం ప్రారంభమవుతుంది.

Tuesday, August 16, 2016

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం కాంస్య విగ్రహాన్ని ఇటీవల ఎక్కడ ఆవిష్కరించారు..?

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం ప్రథమ వర్ధంతి సందర్భంగా తమిళనాడులోని రామేశ్వరం పేయ్‌కరుంబులో ఆయన స్మారకం వద్ద ఏర్పాటుచేసిన కాంస్య విగ్రహాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు 2016 జులై 27న ఆవిష్కరించారు. స్మారక మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

దేశంలోనే మొట్టమొదటి గ్రీన్‌ ట్రైన్‌ కారిడార్‌ను ఏ రాష్త్రం లో ప్రారంభించారు..?

దేశంలోనే మొట్టమొదటి గ్రీన్‌ ట్రైన్‌ కారిడార్‌ను తమిళనాడులోని రామేశ్వరం-మానామదురై మధ్య రైల్వే మంత్రి సురేష్‌ప్రభు ప్రారంభించారు. చెన్నైలోని సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌లో నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దీన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రామేశ్వరం-మానామదురై మధ్య 114 కి.మీ. మార్గంలో నడిచే 10 రైళ్లలో బయో టాయిలెట్లను అందుబాటులోకి తెచ్చారు.