Showing posts with label Other States. Show all posts
Showing posts with label Other States. Show all posts

Thursday, October 6, 2016

బిహార్‌లో మద్యం నిషేధం ఉత్తర్వు కొట్టివేత


బిహార్‌లో మద్య నిషేధం విధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను పట్నా హైకోర్టు కొట్టివేసింది. మద్యం వినియోగం, అమ్మకాలపై నిషేధం విధిస్తూ 2016 ఏప్రిల్‌ 5న రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వు రాజ్యాంగ విరుద్ధమని, అమలు చేయరాదని పేర్కొంది. 

Wednesday, October 5, 2016

ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా నదీజలాల ట్రైబ్యునల్‌ కాపరిమితి పొడిగింపు


ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా మధ్య నదీజల వివాద పరిష్కారానికి ఏర్పాటైన ట్రైబ్యునల్‌ కాపరిమితిని కేంద్ర ప్రభుత్వం 2017 సెప్టెంబరు 17 వరకు పెంచింది. 2010 ఫిబ్రవరి 24న ఏర్పాటైన ఈ ట్రైబ్యునల్‌ 2013 ఫిబ్రవరి 23 నాటికల్లా తీర్పు వెలువరించాల్సి ఉంది. అయితే ఈ ట్రైబ్యునల్‌ 2012 సెప్టెంబరు 17న ఏర్పాటైనట్లు పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ ఒడిశా ప్రభుత్వం 2013లో కోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీంకోర్టు ఒడిశా వాదనను సమర్థిస్తూ 2013 డిసెంబరు 13న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ట్రైబ్యునల్‌ ఏర్పాటు తేదీని 2012 సెప్టెంబరు 17గా నిర్ధారిస్తూ 2014 మార్చి 14న నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ రోజు నుంచి మూడేళ్ల లోపు నివేదిక ఇవ్వాని నిర్దేశించింది. ఆ గడువు 2015 సెప్టెంబరు 17తో ముగిసిపోయినప్పటికీ దాన్ని మరో ఏడాది పొడిగించాలని ట్రైబ్యునల్‌ కోరడంతో 2016 వరకు పెంచింది. ఇప్పుడు రెండోసారి చేసిన విజ్ఞప్తి మేరకు మరో ఏడాది పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 

అరుణాచల్‌ప్రదేశ్‌లో ఒకే ఒక్క కాంగ్రెస్‌ ఎమ్మెల్యే


అరుణాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 43 మంది శాసనసభ్యులు ముఖ్యమంత్రి పెమా ఖండు నేతృత్వంలో ఒకేసారిగా పార్టీ ఫిరాయించారు. వీరంతా బీజేపీ నేతృత్వంలోని కూటమికి సంబంధించిన పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ అరుణాచల్‌ (పీపీఏ)లో పార్టీని విలీనం చేశారు. కాంగ్రెస్‌కు అరుణాచల్‌ప్రదేశ్‌లో ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యేనే మిగిలాడు.

Friday, September 30, 2016

కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరి జల వివాదం


కావేరి నదీ జలాల పంపిణీపై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదం ముదిరి హింసాత్మకంగా మారింది. దీంతో రెండు రాష్ట్రాల్లోను పౌరులు, ఆస్తులపై పెద్దఎత్తున దాడులు జరిగాయి. తమిళనాడుకు రోజుకు 12 వేల క్యూసెక్కుల చొప్పన 10 రోజుల పాటు కావేరి జలాలు విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు 2016 సెప్టెంబర్‌ 12న ఆదేశాలిచ్చింది. దీంతో ఒక్కసారిగా అల్లర్లు చెలరేగి హింసాత్మకంగా మారడంతో వందల సంఖ్యలో ప్రభుత్వ ప్రైవేటు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. 

Saturday, September 17, 2016

కశ్మీర్‌లో ఆపరేషన్‌ కామ్‌ డౌన్‌


కశ్మీర్‌లో శాంతిని నెకొల్పే ఉద్దేశ్యంతో భారత సైన్యం ఆపరేషన్‌ కామ్‌ డౌన్‌ను ప్రారంభించింది. ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులను ఏరివేసి సాధారణ పరిస్థితులు కల్పించడానికి దక్షిణ కశ్మీర్‌లో 4 వేల మంది అదనపు జవాన్లను రంగంలోకి దింపింది. 

Saturday, September 10, 2016

సౌనీ తొలి దశ ప్రారంభం



నర్మదా నది మిగులు జలాలను 115 జలాశయాలకు మళ్లించడానికి రూ.12,000 కోట్లతో ప్రతిపాదించిన సౌరాష్ట్ర నర్మదా అవతరణ్‌ సాగునీటి పారుదల పథకం (సౌనీ) తొలి దశను గుజరాత్‌లోని జామ్‌నగర్‌ జిల్లాలోని సనోసరా గ్రామంలో ప్రధాని నరేంద్రమోడి 2016 ఆగస్టు 30న ప్రారంభించారు.

https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

తమిళనాడు గవర్నర్‌గా చెన్నమనేని విద్యాసాగర్‌రావు


తమిళనాడులో 5 సం॥ల పాటు గవర్నర్‌గా కొనసాగిన కొణిజేటి రోశయ్య పదవీకాలం  2016 ఆగస్టు 31న ముగిసింది. దీంతో మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగరరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు.



Friday, September 9, 2016

తమిళనాడు క్రీడాకారులకు అమ్మ వ్యాయామశాలలు


తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలిత అమ్మ పథకాల పరంపరను కొనసాగిస్తూ మరో పథకాన్ని ప్రకటించారు. క్రీడాకారులకు ఊతమిచ్చేలా రాష్ట్రమంతటా అమ్మ వ్యాయామశాలలు ఏర్పాటు చేయనున్నట్లు శాసనసభలో ప్రకటించారు. https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

Saturday, September 3, 2016

యూపీ చలనచిత్ర అభివృద్ధి మండలి సీనియర్‌ వైస్‌ ఛైర్మన్‌గా జయప్రద


మాజీ ఎంపీ, సీనీనటి జయప్రద ఉత్తర్ ప్రదేశ్‌ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి మండలి సీనియర్‌ వైస్‌ చైర్‌పర్సన్‌గా నియమితుయ్యారు. గతంలో రాంపూర్‌ నియోజక వర్గం నుంచి ఆమె రెండు పర్యాయాలు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీగా గెలుపొందారు. యూపీ చలనచిత్ర అభివృద్ధి మండలి ఛైర్మన్‌గా గోపాల్‌దాస్‌ నీరజ్‌ నియమితుయ్యారు.

గుజరాత్‌ నూతన ముఖ్యమంత్రి ఎవరు?


గుజరాత్‌ ముఖ్యమంత్రిగా విజయ్‌ రూపానీ 2016 ఆగస్టు 7న ప్రమాణస్వీకారం చేశారు. విజయ్‌ రూపానీ 2006 నుంచి 2012 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. మాజీ సీఎం ఆనందిబెన్‌ పటేల్‌ కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు.

గుజరాత్‌ సీఎం అనందిబెన్‌ రాజీనామా


గుజరాత్‌ తొలి మహిళా ముఖ్యమంత్రి ఆనందిబెన్‌ పటేల్‌ 2016 ఆగస్టు 3న తన పదవికి రాజీనామా చేశారు.

Friday, September 2, 2016

త్రిపుర సుందరి ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం


త్రిపుర రాజధాని అగర్తల  నుంచి డిల్లీ వెళ్లే త్రిపుర సుందరి ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు 2016 జూలై 31న ప్రారంభించారు. దీంతో  త్రిపురలో తొలిసారి బ్రాడ్‌గేజ్‌ లైన్‌ కూడా అందుబాటులోకి వచ్చింది.

హర్యానా అసెంబ్లీలో జైన దిగంబర మత గురువు ధార్మిక ప్రసంగం



 జైన దిగంబర మత గురువు తరుణ్‌సాగర్‌ తొలిసారిగా హర్యానా శాసనసభలో కద్వే వచన్‌ పేరిట ధార్మిక ప్రసంగం చేశారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా 40 నిమిషాల పాటు ప్రసంగించారు. రాజకీయాలపై ధర్మం నియంత్రణ తప్పనిసరి అని తరుణ్‌సాగర్‌ పేర్కొన్నారు. ఆడశిశువును గర్భంలోనే చంపేసే భ్రూణహత్యలు పెద్దసమస్య అనీ, సమాజంలో సమతౌల్యాన్ని దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారు.


బెంగాలీ శ్రోతలకు ఆకాశవాణి మైత్రి రేడియో ఛానల్‌


బెంగాలీ శ్రోతల కోసం ఆకాశవాణి మైత్రి రేడియో ఛానల్‌ను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో 2016 ఆగస్టు 23న ప్రారంభించారు. బెంగాలీ సంస్క తిని ప్రతిబింబిస్తూ భారత్‌ - బంగ్లాదేశ్‌ సమ్మిళిత సమాచారంతో ఈ ఛానల్‌ కార్యక్రమాలను అందిస్తుంది.

కశ్మీర్‌లో బీఎస్‌ఎఫ్‌ మోహరింపు


కశ్మీర్‌లో 12 ఏళ్ల తర్వాత తొలిసారిగా సరిహద్దు భద్రతాదళం (BSF)  మోహరించింది. శ్రీనగర్‌లోని ప్రముఖ వాణిజ్యప్రాంతం లాల్‌చౌక్‌, ఆ పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతలు పర్యవేక్షణ బాధ్యతలను BSFకు అప్పగించినట్లు పోలీసు వెల్లడించారు.

BSF - Border Security Force


Saturday, August 27, 2016

అరుణాచల్‌ప్రదేశ్‌ మాజీ సీఎం అనుమానాస్పద మృతి


అరుణాచల్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కలిఖోపుల్‌ 2016 ఆగస్టు 7న అనుమానాస్పద స్థితిలో ఇటానగర్‌లోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో మృతి చెందారు. కాంగ్రెస్‌ తిరుగుబాటు నేత అయిన పుల్‌ 2016  ఫిబ్రవరి 19 నుంచి జులై 13 వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని జులైలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆయన సీఎం పదవి నుంచి తప్పుకున్నారు.

Wednesday, August 24, 2016

గుజరాత్‌లో ఈబీసీ 10% రిజర్వేషన్‌ ఆర్డినెన్స్‌ కొట్టివేత


గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు 10% కోటా కల్పిస్తూ జారీచేసిన అత్యవసర ఆదేశాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. పటేల్‌ వర్గ ఉద్యమాన్ని చల్లబరిచేందుకు వార్షికాదాయం రూ.6 లక్షలకు మించని, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈబీసీ)కు రిజర్వేషనేతర కేటగిరీలో ప్రభుత్వోద్యోగాలు, విద్యాసంస్థల్లో 10% కోటా కేటాయిస్తూ 2016 మే 1న ప్రభుత్వం ఈ ఆర్డినెన్సును జారీ చేసింది. సుప్రీంకోర్టు విధించిన 50 శాతం రిజర్వు కోటా పరిమితికి ఇది ఉల్లంఘనేనని పేర్కొన్న హైకోర్టు ఆర్డినెన్సును కొట్టివేసింది.

Tuesday, August 23, 2016

మద్రాసు హైకోర్టు పేరు మార్పుకు ప్రభుత్వం వ్యతిరేకత


మద్రాసు హైకోర్టు పేరును చెన్నై హైకోర్టుగా మార్చుతూ కేంద్రం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకించింది. తమిళనాడు హైకోర్టుగా మార్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తమిళనాడు శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం దేశంలోని బొంబాయి, కలకత్తా, మద్రాసు హైకోర్టు పేర్లను మార్చుతూ హైకోర్టు (పేర్ల సవరణ) బిల్లు 2016ను తీసుకొచ్చింది. ఈ బిల్లు ప్రస్తుతం లోక్‌సభ, రాజ్యసభ ఆమోదం పొందాల్సి ఉంది. దాని ప్రకారం మద్రాసు హైకోర్టును చెన్నై హైకోర్టుగా మార్చనున్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శాసనసభలో ముఖ్యమంత్రి జయలిత ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఎన్నో రాష్ట్రాలు ఏర్పడి అక్కడి హైకోర్టుకు ఆ రాష్ట్రం పేరు పెట్టారని, అదే విధానాన్ని ఇక్కడా అమలు చేయాలని కోరారు. ఈ తీర్మానానికి డీఎంకే కూడా మద్దతు పలికింది.

Tuesday, August 16, 2016

సంజీవనీ ఔషధం ఆనవాళ్లు కనుక్కోవడానికి కమిటీని ఏర్పాటు చేసిన రాష్త్రం ఏది...?

రామాయణంలో పేర్కొన్న సంజీవనీ ఔషధం ఆనవాళ్లు  కనుక్కోవడానికి ఆయుర్వేద నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేయాని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. లంకలో రావణ సైన్యంతో యుద్ధం చేస్తున్న సమయంలో లక్ష్మణుడు తీవ్రంగా గాయపడగా సుసేనుడి సూచన మేరకు చికిత్స చేయడానికి  సంజీవనీ ఔషధాన్ని తీసుకురావాల్సిందిగా హనుమంతుడిని రాముడు ఆదేశించినట్లు రామాయణంలో ఉంది. ద్రోణగిరి పర్వతంపై ఉన్న ఆ ఔషధం జాడ తెలియక ఏకంగా పర్వతాన్నే హనుమంతుడు పెకిలించుకొచ్చినట్లు ఆ ఇతిహాసంలో ఉంది. ప్రస్తుతం ద్రోణగిరి పేరుతో పిలిచే పర్వతశ్రేణి ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌కు 400 కి.మీ. దూరంలో ఉంది.