Showing posts with label జాతీయ అంశాలు (National). Show all posts
Showing posts with label జాతీయ అంశాలు (National). Show all posts

Saturday, October 8, 2016

ఆవాజ్‌-ఎ-పంజాబ్‌ ప్రారంభం


మాజీ క్రికెటర్‌, రాజకీయ నాయకుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు తాను ఏర్పాటు చేసిన రాజకీయేతర వేదిక ఆవాజ్‌-ఎ-పంజాబ్‌ను చండీగఢ్‌లో ప్రారంభించారు.

Thursday, October 6, 2016

బయో ఎకానమీ జాతీయ మిషన్‌ ప్రారంభం


బయో వనరులతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడమే లక్ష్యంగా బయో ఎకానమీ జాతీయ మిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. షిల్లాంగ్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో శాస్త్రసాంకేతిక మంత్రిత్వ శాఖలోని సుస్థిర అభివృద్ధి, బయో వనరుల సంస్థ (ఐబీఎస్‌డీ) అధిపతి దీనబంధు సాహూ దీన్ని మొదలుపెట్టారు

నేతాజీ మృతిపై విచారణను లార్డ్‌ ఆర్చిబాల్డ్‌ వావెల్‌ ప్రారంభించినట్లు వెల్లడి


నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మృతిపై విచారణను అప్పటి భారత వైశ్రాయ్‌ లార్డ్‌ ఆర్చిబాల్డ్‌ వావెల్‌ ప్రారంభించినట్లు వెలుగులోకి వచ్చింది. నేతాజీ మరణానికి దారితీసిన పరిస్థితులపై ఏర్పాటైన బ్రిటన్‌ వెబ్‌సైట్‌ బోస్‌ ఫైల్‌ డాట్‌ ఇన్ఫో ఈ విషయాన్ని వెల్లడించారు . తైపీలో నేతాజీ మరణించారని వార్తలు వినిపించిన తొమ్మిది రోజుల తర్వాత (1945 ఆగస్టు 27) విచారణకు ఆదేశించామని మంత్రి మండలికి అప్పటి భారత వైశ్రాయ్‌ లార్డ్‌ ఆర్చిబాల్డ్‌ వావెల్‌ తెలియజేశారు. నేతాజీ విమాన ప్రయాణంలోనే మరణించినట్లు మరోసారి స్పష్టమైంది.

Wednesday, October 5, 2016

ఉన్నత వర్గాల అనాథ ప్లికు 27 శాతం రిజర్వేషన్లు


ఉన్నత వర్గాకు చెందిన అనాథ పిల్లలకు ఓబీసీతో కలిపి 27 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌ (ఎన్‌సీబీసీ) తీర్మానించింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగాలు లాంటి వాటికి ఇది వర్తిస్తుందని ఎన్‌సీబీసీ వ్లెడిరచింది. తల్లిదండ్రులను కోల్పోయి పదేళ్లలోపు వయసున్న వారందరినీ ఓబీసీ జాబితాలో చేర్చాలని ఎన్‌సీబీసీ నిర్ణయించింది. అయితే ప్రభుత్వ లేదా ప్రభుత్వ ఎయిడెడ్‌ అనాథాశ్రమాలు, పాఠశాల్లో చదువుకుంటున్న సంరక్షకులెవరూ లేని పిల్లలకే ఇది వర్తిస్తుందని ఎన్‌సీబీసీ స్పష్టం చేసింది.

రైల్వే బడ్జెట్‌కు చెల్లుచీటీ


రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌తో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అలాగే సాధారణ బడ్జెట్‌నూ నెల ముందుగానే ప్రవేశపెట్టడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. బడ్జెట్‌లో ప్రణాళిక, ప్రణాళికేతర ఖర్చు వర్గీకరణ తొలగించి వాటి స్థానంలో మూలధనం, రాబడిని (కేపిటల్‌ అండ్‌ రిసీట్‌) చేర్చాలనీ నిర్ణయించింది. ప్రధాని నరేంద్రమోడి అధ్యక్షతన 2016 సెప్టెంబర్‌ 21న భేటీ అయిన కేంద్ర కేబినెట్‌ ఈ కీక నిర్ణయాలు తీసుకుంది. ఫిబ్రవరి చివరి తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టే బ్రిటిష్‌ కాలపు సంప్రదాయానికి ముగింపు పలకడానికి కేబినెట్‌ సూత్రప్రాయంగా అంగీకరించింది. రైల్వే బడ్జెట్‌ను విడిగా ప్రవేశపెట్టడం 1924లో మొదలైంది.
కేంద్ర కేబినెట్‌ ఇతర కీలక నిర్ణయాలు:

  • ఫ్రాన్స్‌ నుంచి 36 రాఫెల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసే ఒప్పందానికి ఆమోదం
  • స్వాతంత్య్ర సమరయోధుల నెలవారీ పింఛన్‌ 20% పెంపు
  • పప్పు ధాన్యాులు, వంటనూనొలు, నూనెగింజల న్విపై పరిమితులు 2017 సెప్టెంబరు 30 వరకు పొడిగింపు
  • జమ్మూకశ్మీర్‌లో మరో 10 వే ప్రత్యేక పోలీసు అధికారుల (ఎస్‌పీఓ) నియామకాలు
  • గ్రామీణ ప్రాంతాల్లో ల్యాండ్‌లైన్‌ నిర్వహణ కోసం ప్రభుత్వరంగ కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్‌కు వచ్చిన లోటును పూడ్చటం కోసం రూ.1250 కోట్ల పరిహారం 
  • జాతీయ గ్రిడ్‌తో తూర్పు ప్రాంతాన్ని అనుసంధానించడం కోసం జగదీష్‌పూర్‌ హైదియా, బొకారో-ధామా గ్యాస్‌ పైపును (జేహెచ్‌బీడీపీఎల్‌) ప్రాజెక్టుకు రూ.5176 కోట్ల నిధులు

భూకంపాల హెచ్చరిక జోన్‌ మ్యాప్‌లు ఆవిష్కరణ


భూకంపాలు సంభవించే ప్రాంతాలకు సంబంధించి హెచ్చరిక జోన్ల మ్యాపులను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఢల్లీిలో ఆవిష్కరించారు. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏ), భవన సామగ్రి పరిజ్ఞాన ప్రోత్సాహక మండలి (బీఎంపీటీసీ) రూపొందించిన ఈ మ్యాపులు వాడటానికి ఎంతో సులువైనవి. వీటిలో దేశ, రాష్ట్ర జిల్లా, తాలుకా స్థాయిల్లో వివరాలు పొందుపరిచారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణను సురక్షితమైన 2, 3 జోన్లలో పేర్కొన్నారు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంతాలకు ప్రకంపన ముప్పు పొంచి ఉందని ఎన్‌డీఎంఏ తెలిపింది.

60కి చేరిన స్మార్ట్‌సిటీ మిషన్‌ నగరాల సంఖ్య


స్మార్ట్‌సిటీ మిషన్‌ కింద మూడో దశలో ఎంపిక చేసిన 27 నగరాలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. దీంతో ఇప్పటివరకూ ఎంపికైన నగరాల సంఖ్య 60కు చేరింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాలను సకల వసతులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌సిటీ మిషన్‌ను చేపడుతోంది. మూడో దశలో మొత్తం 63 నగరాలు పోటీపడ్డాయి. తాజాగా ఎంపికైన వాటిలో 12 రాష్ట్రాలకు చెందిన 27 నగరాలున్నాయి. మహారాష్ట్ర నుంచి 5, తమిళనాడు, కర్ణాటక నుంచి 4 చొప్పున, ఉత్తరప్రదేశ్‌ నుంచి 3, పంజాబ్‌, రాజస్థాన్‌ నుంచి 2 చొప్పున నగరాలున్నాయి. నాగాలాండ్‌, సిక్కిం రాష్ట్రాలకు తొలిసారిగా జాబితాలో చోటు దక్కింది. తాజా జాబితాలో స్వర్ణ దేవాలయ నగరం అమృత్‌సర్‌ అగ్రస్థానంలో నిలిచింది. 2వ స్థానంలో కళ్యాణ్‌-డాంబివిలీ (మహారాష్ట్ర), 3వ స్థానంలో ఉజ్జయిని(మధ్యప్రదేశ్‌), 4వ స్థానంలో తిరుపతి, 5వ స్థానంలో నాగ్‌పూర్‌(మహారాష్ట్ర) నిలిచాయి. తిరుపతి 62.63 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఆకర్షణీయ తిరుపతి కార్యక్రమం కింద రానున్న ఐదేళ్లలో రూ.1610 కోట్లు ఖర్చు పెట్టనున్నారు. ఇందులో కేంద్రం రూ.1000 కోట్లు అందించనుండగా, పీపీపీ కింద రూ.270 కోట్లు, నగరపాక సంస్థ రూ.100 కోట్లు కేటాయించనున్నాయి. మిగిలిన నిధులను ఇతరత్రా పథకాల కింద సమకూర్చుకోనున్నారు.

9 జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం


5 రాష్ట్రాల్లో రూ.2,600.31 కోట్లతో చేపట్టదచిన 9 జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, నాగాలాండ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టులున్నాయి. మొత్తం 414 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను నిర్మించనున్నారు.

దివ్యాంగుల వాహనాలకు టోల్‌ ట్యాక్స్‌ మినహాయింపు


దివ్యాంగుల అవసరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలకు ప్రభుత్వం టోల్‌ ట్యాక్స్‌ను మినహాయించింది. ఇప్పటికే 63 టోల్‌ ప్లాజాల్లో అమలవుతున్న ఈ నిబంధనను దేశవ్యాప్తంగా వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడిరచింది.

Thursday, September 22, 2016

విద్యార్థుల మానసిక వికాసానికి ‘విద్యాంజలి’ పథకం



ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల మానసిక వికాసానికి దోహదపడేందుకు ‘విద్యాంజలి’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా పలువురు ఉత్సాహవంతులు స్వచ్ఛందంగా పాఠశాలలకు విచ్చేసి విద్యార్థులకు వక్తృత్వం, నటన లాంటి విద్యేతర అంశాల్లో శిక్షణనిచ్చేందుకు వీలుంటుంది. ఈ పథకాన్ని ఢల్లీలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ ప్రారంభించారు.

Wednesday, September 21, 2016

రైల్వే బడ్జెట్‌ కు ఇక చెల్లు చీటీ


కేంద్రం ఇక నుంచి రైల్వేకి సంబంధించిన వ్యవహారాలను బడ్జెట్‌ రూపంలో ప్రవేశపెట్టదు. 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి రైల్వే బడ్జెట్‌ను యూనియన్‌ బడ్జెట్‌లో కలిపివేసే ప్రతిపాదనకు 2016 సెప్టెంబర్ 21 న కేంద్ర కేబినెట్‌ ఆంగీకారం తెలిపింది. 92ఏళ్ల నుంచి యూనియన్‌ బడ్జెట్‌కు ముందు రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆచారంగా వస్తోంది. దేశంలో ఎక్కువ మంది ఉద్యోగులు రైల్వేలోనే పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఏడో వేతన సంఘ సిఫార్సులతో అదనంగా రూ.40,000 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఇప్పటికే ప్రయాణికులకు ఇస్తున్న రాయితీ ఖాతా కూడా రూ.33,000 కోట్లు దాటింది. ప్రస్తుతం రైల్వేశాఖ 458 ప్రాజెక్టులకు సంబంధించి రూ.4.83లక్షల కోట్ల భారాన్ని మోస్తోంది. దీంతో ఆదాయంలో తగ్గుదల, మూలధన వ్యయం పెరగటంతో రైల్వేశాఖను ఆర్థిక శాఖ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం రైల్వే, యూనియన్‌ బడ్జెట్లను కలిపి కేంద్ర ఆర్థిక మంత్రి ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెడతారు. జనవరి 25నాటికే ఈ బడ్జెట్ల విలీనాల ప్రతిపాదనకు పార్లమెంట్‌ ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. అందుకే ఈ సారి బడ్జెట్‌ కసరత్తు కూడా దాదాపు మూడు వారాల ముందే మొదలుపెడుతున్నారు.


Tuesday, September 20, 2016

స్వచ్ఛ భారత్‌పై కామిక్‌ బుక్‌



దేశాన్ని స్వచ్ఛంగా రూపొందించాలని ప్రారంభించిన స్వచ్ఛభారత్‌ మిషన్‌ పై త్వరలో కామిక్‌ పుస్తకం విడుదల  కానుంది. ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన కల్పించేందుకు చేపడుతున్న వివిధ కార్యక్రమాల తో పాటు పిల్లల్లోనూ అవగాహన కల్పించేందుకు కామిక్‌ పుస్తకాన్ని తెస్తున్నారు. ఈ మేరకు ప్రముఖ పబ్లిషింగ్‌ సంస్థ అమర్‌ చిత్ర కథాతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.


Monday, September 19, 2016

వినియోగదారులను తప్పదోవ పట్టిస్తే 5 సం॥ల జైలు


ప్రముఖ వ్యక్తులు, సెలబ్రిటీలు వినియోగదారులను తప్పదోవ పట్టించే వాణిజ్య ప్రకటనల్లో నటించినట్లయితే, 5 సం॥ జైలుశిక్ష, రూ. 50 లక్షల జరిమానా విధించడం వంటి కీలక సిఫార్పులను వినియోగదారుల మంత్రిత్వశాఖ ఆరీచించింది. ముప్పై ఏళ్ల కిందటి వినియోగదారు పరిరక్షణ చట్టాన్ని తొలగించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2015 ఏడాది ఆగస్టులో వినియోగదారుల పరిరక్షణ బిల్లు 2015ను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీనిపై పార్లమెంటరీ స్థాయిరీ సంఘం చేసిన సిఫారసులను ఆమోదించారు. ప్రకటనలు  తప్పదోవ పట్టించేవిగా ఉన్నట్లయితే తొలిసారి నేరానికి రూ.10 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష, రెండోసారి, ఆపైన అదే నేరానికి రూ.50 లక్ష జరిమానా, ఐదేళ్ల జైు శిక్ష విధించానే నిబంధను చేర్చారు.

Saturday, September 17, 2016

పోస్టల్‌ హెల్ప్‌లైన్‌ నంబరు 1924


పోస్టల్‌ శాఖకు సంబంధించిన ఫిర్యాదు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు 1924 నంబరును ఆ శాఖ ప్రారంభించింది. టెలికాం, పోస్టల్‌ శాఖకు సంబంధించిన ఫిర్యాదుకు నె క్రితం ట్విట్టర్‌ సేవను కూడా ప్రభుత్వం ప్రారంభించింది.

పోలీసుల ఎన్నికల విధులకు గౌరవ భృతి


ఎన్నికల్లో విధులను నిర్వర్తించే కేంద్ర, రాష్ట్ర పోలీసులకు ఇకమీదట గౌరవ భృతిని అందజేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇది ఉప ఎన్నికలకు కూడా వర్తిస్తుందని తెలిపింది.

కేంద్ర ప్రభుత్వోద్యోగులకు LTC పొడిగింపు


కేంద్ర ప్రభుత్వోద్యోగులు జమ్మూకశ్మీరు, ఈశాన్య రాష్ట్రాులు, అండమాన్‌ నికోబార్‌ దీవులకు LTC కింద విమానంలో వెళ్లే వెసులుబాటును ప్రభుత్వం పొడిగించింది. 2018 సెప్టెంబరు వరకూ రెండేళ్లపాటు వారికి ఈ వెసులుబాటు వర్తిస్తుంది. అయితే కేవలం ఎకానమీ తరగతిలో మాత్రమే వారు ప్రయాణించాలి. కేంద్ర ఉద్యోగులు LTC నిబంధనను ప్రభుత్వం 2014లో సడలించి ఈ సదుపాయాన్ని కల్పించింది. అప్పట్లో రెండేళ్లపాటు ఈ వెసులుబాటు కల్పించింది.
LTC-Leave Travel Concession

PMNRFకి పెరిగిన విరాళాలు


నరేంద్రమోడి ప్రధానమంత్రి అయ్యాక ప్రధానమంత్రి జాతీయ సహాయ నిది(PMNRF)కి విరాళాలు పెరిగినట్లు వెల్లడైంది. 2016 జులై 31 నాటికి పీఎం రిలీఫ్‌ ఫండ్‌లో రూ.2,621.90 కోట్ల నిధులున్నాయి. వడ్డీ రూపంలోనే ఏటా దాదాపు రూ.150 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.870 కోట్ల విరాళాలు వచ్చాయి. అందులో కేవలం స్వచ్ఛంద విరాళాల రూపంలోనే రూ.608 కోట్లు అందాయి. వడ్డీలు, ఇతర మార్గాల్లో రూ.216 కోట్లు వచ్చాయి. 1948లో దేశ ప్రథమ ప్రధాని నెహ్రూ జాతీయ సహాయ నిధిని ప్రారంభించారు. దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌ నుంచి తరలివచ్చిన బాధితులను ఆదుకోవడానికి ప్రజల నుంచి స్వీకరించిన విరాళాలతో ఈ నిధికి ప్రాణం పోశారు. ప్రస్తుతం ఈ నిధిని వరదలు, తుపాన్లు, భూకంపాల్లాంటి ప్రక ృతి వైపరీత్యాలతో పాటు, భారీ ప్రమాదాలు, మత కలహాల బాధితులకు చేయూతనందించడానికి ఉపయోగిస్తున్నారు. అలాగే గుండె చికిత్సు, కిడ్నీ మార్పిళ్లు, క్యాన్సర్‌ చికిత్స లాంటి వాటి కోసం కూడా సహాయం చేస్తూ వస్తున్నారు. దీనికి ప్రభుత్వం ఎలాంటి బడ్జెట్‌ కేటాయించడం లేదు. పూర్తిగా విరాళాపై ఆధారపడే దీన్ని నిర్వహిస్తున్నారు.
PMNRF-Prime Minister's National Relief Fund 

Saturday, September 10, 2016

కనీస వేతనాలు 42% పెంపు


కేంద్ర ప్రభుత్వం కనీస వేతనాలను 42% పెంచింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 సం॥ల బోనస్‌ ప్రకటించింది. కార్మిక సంఘాల డిమాండ్లపై ఏర్పాటైన మంత్రుల బృందానికి నేతృత్వం వహిస్తున్న ఆర్థిక మంత్రి అరుణ్‌ జ్కెట్లీ వ్యవసాయేతర రంగాల్లో నైపుణ్యం లేని కార్మికుల వేతనాలను రూ.246 నుంచి రూ.350 కు పెంచుతున్నట్లు ప్రకటించారు. సవరించిన నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2014 - 15, 2015-16 సంవత్సరాల బోనస్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. దీని వల్ల కేంద్రంపై రూ.1920 కోట్ల భారం పడుతున్నట్లు వెల్లడించారు.
https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

జైనుల్లో అక్షరాస్యుల శాతం ఎక్కువ



దేశంలో అన్ని మతాల కంటే జైనుల్లో అక్షరాస్యుల శాతం ఎక్కువగా ఉన్నట్లు 2011 జనగణన వెల్లడించింది. 7 సం॥లు, ఆ పైబడిన వయసువారిని ప్రాతిపదికగా తీసుకుని అక్షరాస్యుల శాతాన్ని లెక్కించారు. తాజాగా మతాలవారీగా వెల్లడైన గణాంకాల్లో ముస్లిం జనాభాలో నిరక్షరాస్యుల శాతం ఎక్కువగా ఉంది. 2001తో పోలిస్తే అక్షరాస్యుల శాతంలో అన్ని మతాల్లోనూ పెరుగుదల నమోదైంది.
నిరక్షరాస్యత               శాతం  
ముస్లింలు                42.72
హిందువులు          36.40
సిక్కులు                  32.49
బౌద్ధులు                  28.17
క్రైస్తవులు                  25.66
జైనులు                 13.57

Friday, September 9, 2016

ఐచ్ఛిక ప్రమాద బీమా పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభం



కేంద్ర ప్రభుత్వం రైలు ప్రయాణికుకు ఐచ్ఛిక ప్రమాద బీమా సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది. ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే ఈ అవకాశం కల్పించింది. కొత్త పథకాన్ని కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ప్రభు ఢిల్లీలో ప్రారంభించారు. ఏడాదిపాటు పైలట్‌ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రీమియంగా రూ.92 పైసలు మాత్రమే వసూలు చేస్తారు. రైలు ప్రమాదాల్లో ప్రయాణికుడు మరణిస్తే రూ.10 లక్షల ప్రమాద బీమా అందిస్తారు.
https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

IRTC - Indian Railway Catering and Tourism Corporation