Friday, September 2, 2016

ప్రపంచవ్యాప్తంగా భారత్‌లోనే అధికంగా క్షయ కేసులు


మన దేశంలో క్షయ బాధితుల సంఖ్య ప్రస్తుత అంచనా కంటే 2-3 రెట్లు ఎక్కువగా ఉండొచ్చని తాజా అధ్యయనం పేర్కొంది. సవరిత జాతీయ క్షయ నియంత్రణ కార్యక్రమం(ఆర్‌ఎన్‌టీసీపీ), ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర సంస్థలకు చెందిన పరిశోధకుల  బృందం రూపొందించిన ఈ అధ్యయన వివరాలను ప్రముఖ వైద్య పత్రిక లాన్సెట్‌లో ప్రచురించారు.

(RNTCP-Revised National TB Control Program

హర్యానా అసెంబ్లీలో జైన దిగంబర మత గురువు ధార్మిక ప్రసంగం



 జైన దిగంబర మత గురువు తరుణ్‌సాగర్‌ తొలిసారిగా హర్యానా శాసనసభలో కద్వే వచన్‌ పేరిట ధార్మిక ప్రసంగం చేశారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా 40 నిమిషాల పాటు ప్రసంగించారు. రాజకీయాలపై ధర్మం నియంత్రణ తప్పనిసరి అని తరుణ్‌సాగర్‌ పేర్కొన్నారు. ఆడశిశువును గర్భంలోనే చంపేసే భ్రూణహత్యలు పెద్దసమస్య అనీ, సమాజంలో సమతౌల్యాన్ని దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారు.


యూఎన్‌ఓ దక్షిణాది మహిళా సంక్షేమ దూతగా ఐశ్వర్యా ధనుష్‌


ఐక్యరాజ్య సమితి దక్షిణాది మహిళా సంక్షేమ దూతగా నటుడు రజనీకాంత్‌ కూతురు, ధనుష్‌ సతీమణి ఐశ్వర్యా ధనుష్‌ ఎంపికైంది. ఈ బాధ్యతలను 2014లో టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా, 2015లో బాలీవుడ్‌ దర్శకుడు ఫర్హాన్‌ అక్తర్‌ నిర్వహించారు. మహిళా హక్కుల కోసం, వారిపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా గళమెత్తడం, అవగాహన కల్పించడం వారి బాధ్యత.


ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న తొలి 10 మంది హీరోయిన్‌లో దీపికా పదుకొణెకు 10వ స్థానం


ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న తొలి 10 మంది కథానాయిక జాబితాను ఈ ఏడాదికిగాను ఫోర్బ్స్‌ ప్రకటించింది. ఇందులో బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణేకు 10వ స్థానం దక్కింది. దీంతో బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయికగా దీపిక నిలిచింది. జెన్నిఫర్‌ లారెన్స్‌ వరుసగా రెండో ఏడాది ప్రపంచంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయికగా గుర్తింపు పొందింది. ఈ జాబితాలో స్థానం దక్కించుకున్న తొలి బాలీవుడ్‌ నటి దీపికానే.
1 జెన్నిఫర్‌ లారెన్స్‌
2 మెలిస్సా మెకార్తి
3 స్కార్‌లెట్‌ జాన్సన్‌
4 జెన్నిఫర్‌ యాంగ్‌స్టీన్‌
5 ఫాన్‌ బింగ్‌ బింగ్‌
6 ఛార్లెజ్‌ థెర్న్‌
7 ఎమీ ఆడమ్స్‌
8 జులియా రాబర్ట్స్‌
9 మిలా క్యూనిస్‌
10 దీపికా పదుకొణె 

ఎన్‌బీఈ పాలక మండలి సభ్యుడిగా డాక్టర్‌ రవిరాజు


జాతీయ పరీక్ష సంస్థ (NBE)  పాలక మండలి సభ్యుడిగా ఎన్టీఆర్‌ హెల్త్‌  వైస్‌ ఛాన్స్‌ర్‌ డాక్టర్‌ రవిరాజు నియమితులయ్యారు. అఖిల భారత స్థాయిలో పరీక్ష నిర్వహణలో ఎన్‌బీఏ కీలక పాత్ర పోషిస్తోంది. వైద్య విద్యలో పీజీ, సూపర్‌ స్పెషాలిటీ ప్రవేశ పరీక్షలను ఎన్‌బీఈ నిర్వహిస్తోంది. ఈ ఏడాది నుంచి నీట్‌ ద్వారా నిర్వహించనున్న పీజీ, సూపర్‌ స్పెషాలిటీ వైద్యవిద్య ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఎన్‌బీఏకే అప్పగించారు. ఎన్‌బీఏ పాలకమండలిలో ఆరుగురు సభ్యులుంటారు. అందులో ఒకరిగా రవిరాజును నియమించారు.

NBE - National Board of Examinations

వైట్‌హౌస్‌ ఫెలో ప్రోగ్రామ్‌కు ఇద్దరు భారతీయ అమెరికన్‌ మహిళలు


అమెరికాలో ప్రతిష్టాత్మక వైట్‌హౌస్‌ ఫెలో ప్రోగ్రామ్‌కు ఇద్దరు భారతీయ అమెరికన్‌ మహిళలు ఎంపికయ్యారు. కాలిఫోర్నియాకు చెందిన ఆస్ట్రోఫిజిసిస్ట్‌ అంజలీ త్రిపాఠీ, షికాగోకు చెందిన ఫిజిషియన్‌ టీనా ఆర్‌షాలు 2016-17 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఎంపికైన 16 మంది జాబితాలో ఉన్నారు. వైట్‌హౌస్‌ ఫెలోగా ఎంపికైనవారు సమాఖ్య ప్రభుత్వంలో ఉన్నతస్థాయిలో తమ విజ్ఞాన నైపుణ్యాను అందించాల్సి ఉంటుంది. 

దాతృత్వ కార్యక్రమాలకు జుకర్‌బర్గ్‌ తొలి విడత విరాళం


 ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ దాతృత్వ కార్యక్రమాలకు తొలి విడతగా 9.5 కోట్ల డాలర్లు (దాదాపు రూ.635 కోట్లు) విరాళం ఇచ్చేందుకు ఫేస్‌బుక్‌లో ఆ మేరకు షేరును విక్రయించారు. 2015లో జుకర్‌బర్గ్‌ దంపతులు ఫేస్‌బుక్‌లో తమకున్న వాటాల్లో 99 శాతాన్ని మానవ సామర్థ్యాల  పెంపు, చిన్నారుల మధ్య సమానత్వం లాంటి కార్యక్రమాలకు విరాళంగా అందిస్తామని ప్రకటించారు.



చూసారా..కోటీశ్వరుడైన జుకర్ బర్గ్ కూడా కొడుకు బట్టలు మారుస్తున్నాడు