Showing posts with label Science & Tech. Show all posts
Showing posts with label Science & Tech. Show all posts

Monday, January 29, 2024

బ్యాకప్‌ అవసరం లేకుండానే వాట్సప్‌ చాట్‌ బదిలీ


  • బ్యాకప్‌ చేయకుండానే వాట్సప్‌లోని చాట్‌ హిస్టరీని కొత్త స్మార్ట్‌ఫోన్‌కు బదిలీ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం వాట్సప్‌ చాట్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆప్షన్‌ను వినియోగించుకోవాలి. 
  • క్లౌడ్‌ ఆధారంగా పనిచేసే బ్యాకప్‌ కంటే ఈ ప్రక్రియ చాలా వేగంగానూ, సులభంగానూ ఉంటుంది. ఇందుకోసం రెండు (పాత, కొత్త) ఫోన్లూ మీ వద్దే ఉండాలి. అవి రెండు ఒకే వైఫైకి కనెక్ట్‌ అయ్యి ఉండడంతో పాటు, లొకేషన్‌ సర్వీసు కూడా ఆన్‌లో ఉంచాలి.

బదిలీ ఇలా..

  • ముందు మీ పాత ఫోన్‌లో వాట్సప్‌ ఓపెన్‌ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.
  • చాట్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అందులో చాట్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • చాట్‌ ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించి ప్రక్రియ మీ పాత ఫోన్‌లో ప్రారంభం అవుతుంది. ఇక్కడో క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌ ఓపెన్‌ అవుతుంది.
  • తర్వాత కొత్త ఫోన్‌లో వాట్సప్‌ ఇన్‌స్టాల్‌ చేయాలి. అదే ఫోన్‌ నంబర్‌తో లాగిన్‌ అవ్వాలి.
  • పాత ఫోన్‌కు వచ్చే వెరిఫికేషన్‌ కోడ్‌ను కొత్త దాంట్లో ఎంటర్‌ చేయాలి.
  • కొత్త ఫోన్‌లో చూపించే క్యూఆర్‌ కోడ్‌ను పాత ఫోన్‌లో చూపించే స్కానర్‌తో స్కాన్‌ చేయాలి.
  • ఆ తర్వాత పాత ఫోన్లో ఉన్న డేటా మొత్తం కొత్త ఫోన్‌లోకి బదిలీ అవుతుంది.
  • కొన్ని నిమిషాల పాటు కొనసాగే ఈ ప్రక్రియ సమయంలో రెండు ఫోన్లూ పక్కపక్కనే ఉంచాలి. స్క్రీన్‌లూ ఆన్‌లోనే ఉంచాలి.

Iran : కక్ష్యలోకి మూడు ఇరాన్‌ ఉపగ్రహాలు


  • మహ్దా, కయ్హన్‌-2, హతెఫ్‌-1 అనే మూడు ఉపగ్రహాలను తాము విజయవంతంగా ప్రయోగించినట్లు ఇరాన్‌ 2024 జనవరి 28న ప్రకటించింది. 
  • దేశీయంగా అభివృద్ధి చేసిన సిమోర్గ్‌ రాకెట్‌.. వాటిని 450 కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్ష్యలోకి చేర్చినట్లు తెలిపింది. మహ్దా పరిశోధక ఉపగ్రహమని.. కయ్హన్‌-2 జీపీఎస్‌ కోసం, హతెఫ్‌-1 కమ్యూనికేషన్‌ కోసం ఉపయోగపడనున్నాయని వెల్లడిరచింది. 
  • ఇరాన్‌ తన బాలిస్టిక్‌ క్షిపణి సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకే తాజా ఉపగ్రహాలను ప్రయోగించిందని పశ్చిమ దేశాలు ఆరోపించాయి.

Thursday, April 23, 2020


On April 22, 2020, the Indian Council of Medical Research announced that pooled testing can be done only in areas where the COVID-19 prevalence is less than 5%. Also, the ICMR has instructed that not more than 5 samples shall be pooled. This is done to improve the efficacy of pooled testing

What is pooled testing?

  • Pooled testing is putting swab samples obtained from several people that might be exposed to COVID-19 and testing them all using one RT-PCR (Real Time-Polymerase Chain Reaction) test kit.
  • When the bulk samples test positive, this means at least one person is infected by COVID-19. Later, the samples are tested individually to identify the infected person.
  • The method is used to track asymptomatic cases and check community transmission.

India’s stand in testing

The testing in India is less as compared to other countries. Between March 21, 2020 and April 21, 2020, the following number of people were tested per 1000
  • India-0.33
  • UK-5.91
  • South Korea-11.09
  • US-12.08
  • Italy-224.52
  • Israel-28.45
This says that India lags way behind in testing as compared to other countries. Therefore, more of such pooled testing strategies should be adopted.


NASA: Air Pollution in India at 20 year low


On April 22, 2020, NASA (National Aeronautics and Space Administration) announced that Air Pollution in India has reached 20 year low.

Highlights

  • According to the data published by NASA, the Aerosol Optical Depth in 2020 has been the least as compared to the average of 2016 to 2019. Aerosol Optical Depth is absorption of light by airborne particles in the atmosphere. When the aerosols are near the surface, the optical depth of 1 or above indicate hazy conditions.
  • The AOD was 0.7 in 2016 and has now reached 0.1. The patterns were observed by the MODIS model. MODIS is Moderate Resolution Imaging Spectroradiometer

Aerosol Optical Depth


  • The aerosols are particles in atmosphere released due to anthropogenic activities such as industries, vehicles and natural events such as dust storms, fires, etc. The presence of Aerosols in the atmosphere is also affected by particulate matter in the atmosphere.
  • The Aerosol Optical Depth is the quantitative measure of aerosols present in the atmosphere. It measures the extinction of light when it passes through the atmosphere. As AOD increases, the rate of extinction of light increases.

Saturday, October 8, 2016

100 సం॥ల తర్వాత హెచ్‌ఎంఎస్‌ వారియర్‌ నౌక ఆచూకీ లభ్యం


మొదటి ప్రపంచ యుద్ధంలో భాగంగా సాగిన జూట్లాండ్‌ పోరులో జర్మనీ దాడులతో తీవ్రంగా దెబ్బతిని మునిగిపోయిన హెచ్‌ఎంఎస్‌ వారియర్‌ నౌక ఆచూకీ సుమారు 100 సం॥ల తర్వాత లభ్యమైంది. స్కాట్‌లాండ్‌, నార్వే మధ్య ఉత్తర సముద్రం అడుగు భాగంలో వారియర్‌ను గుర్తించారు. డెన్మార్క్‌లోని సీ వార్‌ మ్యూజియం జూట్లాండ్‌ చేపట్టిన సర్వేలో భాగంగా నౌకను గుర్తించారు. 

ట్రంప్‌ ఓటమి కోసం ఫేస్‌బుక్‌ సహ వ్యవస్థాపకుడి విరాళం


అమెరికా అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు పోటీపడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ ఓటమి కోసం ఆయన ప్రత్యర్థి హ్లిరీ క్లింటన్‌కు 20 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.135 కోట్లు) విరాళం అందించాలని ఫేస్‌బుక్‌ సహ వ్యవస్థాపకుడు డస్టిన్‌ మెస్కోవిట్జ్‌ నిర్ణయించుకున్నారు. విధానాలు, ఆలోచనకు అతీతంగా ప్రజల్ని చీల్చే రీతిలో అమెరికాలో ప్రయత్నాలు జరుగుతున్నాయని, దాన్ని అడ్డుకునేందుకే ఈ విరాళం ఇవ్వాని తమ దంపతులు నిర్ణయించుకున్నట్లు డస్టిన్‌ చెప్పారు. తామిలా చేయడం ఇదే ప్రథమమని తెలిపారు. రిపబ్లికన్‌ పార్టీకి, ముఖ్యంగా ట్రంప్‌నకు ఒక దార్శనికత లేదని విమర్శించారు.

Wednesday, October 5, 2016

జీశాట్‌-18 ప్రయోగం విజయవంతం


భారత్‌కు చెందిన అధునాతన కమ్యూనికేషన్‌ ఉపగ్రహం జీశాట్‌-18 ప్రయోగం విజయవంతమయ్యింది. ఫ్రెంచ్‌ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియాన్‌-5 వీఏ-231 రాకెట్‌ ద్వారా 2016 అక్టోబర్ 5 వేకువజామున విజయవంతంగా దీన్ని ప్రయోగించారు. అక్టోబర్ 3వ తేదీ అర్ధరాత్రే ఈ ప్రయోగం జరగాల్సి ఉండగా వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేసి అక్టోబర్ 5న ప్రయోగించారు. 

చైనాలో ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్‌ ప్రారంభం


గ్రహాంతరవాసుల అన్వేషణకు దోహదపడే భారీ రేడియో టెలిస్కోప్‌ను చైనా 2016 సెప్టెంబర్‌ 25న ప్రారంభించింది. 4450 ఫలకాలు కలిగిన ఈ పరికరం ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్‌. విశ్వ వీక్షణకు ఇది శక్తిమంతమైన సాధనమవుతుందని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు. ఫైవ్‌ హండ్రెడ్‌ మీటర్‌ అపెర్చర్‌ స్పెరికల్‌ టెలిస్కోప్‌(ఫాస్ట్‌)ను గుయ్‌ రaా ఫ్రావిన్స్‌లోని కార్ప్స్‌ లోయలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ సాధనానికి లాంఛనంగా అంతరిక్షం నుంచి తొలి సంకేతాలు అందాయి. ప్రస్తుతం దీన్ని విస్తృతంగా పరీక్షిస్తారు. 3 సం॥ పాటు క్రమాంకనం చేస్తారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెస్తారు. 18 కోట్ల డాలర్లతో 2011లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. అంతకు ముందు 17 ఏళ్ల కిందట చైనా ఖగోళ శాస్త్రవేత్తలు దీన్ని ప్రతిపాదించారు. టెలిస్కోప్‌లోని డిష్‌ యాంటెన్నా వెడల్పు  500 మీటర్లు. ఇది 4450 ఫలకాలతో కూడిన రిఫ్లెక్టర్‌. దీని పరిమాణం 30 ఫుట్‌బాల్‌ మైదానాల స్థాయిలో ఉంటుంది. ప్రస్తుతం ప్యూర్టోరికోలో ఉన్న ఆరిసెబో అబ్జర్వేటరీలో అతిపెద్ద రేడియో టెలిస్కోపు ఉంది. దీని వెడ్పు 305 మీటర్లు. ఫాస్ట్‌ టెలిస్కోపు పరిసరాల్లో రేడియో నిశ్శబ్ద వాతావరణం ఉండాలి. అందువ్ల ఆ ప్రాంతంలోని దాదాపు 8 వేల మంది ప్రజలను తరలించారు. ఖగోళ వస్తువుల నుంచి వెలువడే రేడియో తరంగాలను ఈ టెలిస్కోప్‌ ఆలకిస్తుంది. దీని పరిమాణం పెద్దగా ఉండటం వల్ల విశ్వంలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సంకేతాలను కూడా సేకరించగదు. విశ్వంలోని అసాధారణ వస్తువులను శోధించి, విశ్వం ఆవిర్భావం గురించి కొత్త విషయాలను వెలుగులోకి తీసుకురావడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రహాంతరవాసుల అన్వేషణకు సాగుతున్న ప్రయత్నాలకు ఇది ఊతమిస్తుందని చెప్పారు. వచ్చే 10-20 సం॥ వరకూ ఇదే అగ్రస్థాయి రేడియో టెలిస్కోప్‌గా ఉంటుందని పేర్కొన్నారు. టెలిస్కోప్‌ నిర్మాణం పూర్తయ్యాక విశ్వంలో 3 పల్సార్ల నుంచి వెలువడ్డ రేడియో తరంగాలను ఈ పరికరం గుర్తించగలిగింది. వేగవంతమైన భ్రమణం, ఎక్కువ సాంద్రత కలిగిన నక్షత్రాను పల్సార్లుగా పేర్కొంటారు.

FAST - Five-hundred-meter Aperture Spherical radio Telescope

Saturday, October 1, 2016

ఇన్‌శాట్‌-3డీఆర్‌ ప్రయోగం విజయవంతం


నెల్లూరు  జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌) నుంచి 2016 సెప్టెంబర్‌ 8న వాతావరణ ఉపగ్రహం ఇన్‌శాట్‌-3డీ ఆర్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. దీని కోసం దేశీయంగా రూపొందించిన సంక్లిష్ట క్రయోజనిక్‌ అప్పర్‌ స్టేజ్‌ అమర్చిన భారీ రాకెట్‌ జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌05 ను ఉపయోగించారు. ఇది ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇన్‌శాట్‌-3డీఆర్‌ పనిచేయని ఇన్‌శాట్‌-3డీ స్థానంలో వాతావరణ, గాలింపు, సహాయ చర్యల్లో సాయపడనుంది. ఈ ఉపగ్రహంలో 6-చానల్‌ ఇమేజర్‌, 9-చానల్‌ సౌండర్‌ పరికరాలు, వాతావరణ సమాచార (డాటా) రిలే ట్రాన్స్‌పాండర్స్‌
(డీఆర్టీ) శాటిలైట్‌ ఎయిడెడ్‌ సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ (ఎస్‌ఏఎస్‌ అండ్‌ ఆర్‌) పరికరాలను అమర్చారు.
ఉపగ్రహ విశేషాలు
రాకెట్‌                       : జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌ 05
తీసుకెళ్లగ సామర్థ్యం : 415.2 టన్నులు
ఎత్తు            : 49.1 మీటర్లు
వ్యాసం                : 34 మీటర్లు
ఉపగ్రహం      : ఇన్‌శాట్‌ 3డీఆర్‌
బరువు
       లం : 10 సం॥లు
కొలతలు : 24I16I15(మీటర్లు)
విద్యుత్తు : 1700 వాట్ల విద్యుత్తు
ఉత్పత్తి చేయగ రెండు సౌరఫకాలు, 90 ఏహెచ్‌ లిథియం-అయాన్‌ బ్యాటరీ
ప్రయోగ వ్యయం : రూ.210 కోట్లు
రాకెట్‌కు ఖర్చు : రూ.160 కోట్లు
ఉపగ్రహ వ్యయం : రూ.50 కోట్లు

Tuesday, September 20, 2016

వరిలో కొత్త వంగడం థాన్‌ 45


పోషకాహార లోపానికి చెక్‌ పెట్టేలా జింక్‌ ఎక్కువగా ఉండే సరికొత్త వరి వంగడాన్ని భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు సృష్టించారు. దీనికి థాన్‌ 45 అనే పేరుపెట్టారు. పార్లమెంటరీ స్థాయి కమిటీ సూచన మేరకు భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ (గతంలో వరి పరిశోధన సంస్థ) 12 ఏళ్లు నిర్విరామ కృషి చేసింది. డీఆర్‌ఆర్‌ ధాన్‌ 45 అని పిలిచే ఈ వరి 125 రోజల్లో కోతకు వస్తుంది. దీనిలో అత్యధికంగా 22.6 పీపీఎం (ఇప్పటి వరకూ ఉన్న వరి వంగడాల్లో ఇదే ఎక్కువ) జింక్‌ ఉంటుంది.

కొత్తగా కనుగొన్న చేపకు ఒబామా పేరు


కొత్తగా కనుగొన్న ఒక చేపకు శాస్త్రవేత్తలు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పేరు పెట్టనున్నారు. హవాయ్‌ తీరంలో కొత్త సముద్ర జీవుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఒబామా నిర్ణయించడంతో ఆయనను ఈవిధంగా గౌరవించనున్నారు. ముదురు ఎరుపు, బంగారు వర్ణంలో ఉండే ఈ చేపను కురే అటాల్‌ అనే పగడాల దీవి దగ్గర్లో 300 అడుగుల లోతు నీటిలో కనుగొన్నారు.



లెప్రసీకి వ్యాక్సిన్‌ కనుగొన్న భారత్‌


భారతదేశం ప్రపంచంలోనే తొలిసారిగా లెప్రసీ(కుష్టు వ్యాధి)ని నిరోధించే వ్యాక్సిన్‌ తయారు చేసింది. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునాలజీ వ్యవస్థాపక డైరెక్టర్‌ జీపీ తల్వార్‌ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. ఈ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ముందుగా బిహార్‌, గుజరాత్‌లోని 5 జిల్లాల్లో పెలైట్‌ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. 2013-14 లెక్కల ప్రకారం మనదేశంలో 127 లక్షల మంది లెప్రసీతో బాధపడుతున్నారు

స్క్రామ్‌ జెట్‌ ఇంజన్‌ ప్రయోగం విజయవంతం


భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) 2016 ఆగస్టు 28న భూవాతావరణంలోని ఆక్సిజన్‌ను ఇంధనంగా వాడుకుంటూ అంతరిక్షంలోకి దూసుకుపోయే స్క్రామ్‌ జెట్‌ రాకెట్‌ ఇంజన్‌ సామర్థ్యాన్ని విజయవంతంగా పరీక్షించింది. దీంతో స్క్రామ్‌ జెట్‌ రాకెట్‌ ఇంజన్‌ సామర్థ్యం కలిగిన 4వ దేశంగా భారత్‌ నిలిచింది. దీంతో ఉపగ్రహా ప్రయోగ ఖర్చును గణనీయంగా తగ్గించడంతో పాటు అత్యాధునిక ఎయిర్‌ బ్రీతింగ్‌ ఇంజన్‌ రూపకల్పనలో ఇస్రో ముందడుగేసింది.


Monday, September 12, 2016

కాంగో, టాంజానియా, మొజాంబిక్‌లో వర్తులాకార సూర్యగ్రహణం


రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, టాంజానియా, మొజాంబిక్‌, మడగాస్కర్‌ లోని కొన్ని ప్రాంతాల్లో వర్తులాకార సూర్యగ్రహణం సంభవించింది. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కమ్మేయని సందర్భాల్లో వర్తులాకార గ్రహణం సంభవిస్తుంది. ఈ సందర్భంగా భూమిపై నుంచి చూసేవారికి తెల్లని  వెలుగుకు బదులుగా, చంద్రుడి నల్లని   నీడ చుట్టూ సూర్యకాంతి ఎరుపు రంగులో మెరుస్తూ కనిపిస్తుంది. ప్రతి గ్రహణమూ సంపూర్ణ సూర్య గ్రహణం కాకపోవడానికి కారణం చంద్రుడి దీర్ఘ వృత్తాకార కక్ష్యే. వర్తులాకార గ్రహణం 18 నెలకోసారి సంభవిస్తుంది.  https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన అమెరికా వ్యోమగామి విలియమ్స్‌


అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో దాదాపు 6 నెలల పాటు గడిపిన ముగ్గురు వ్యోమగాములు భూమికి సురక్షితంగా తిరిగొచ్చారు. అమెరికా వ్యోమగామి (ఆస్ట్రోనాట్‌) జోఫ్‌ విలియమ్స్‌, రష్యా వ్యోమగాము (కాస్ట్రోనెట్‌) అలెక్సీ ఒప్చివిన్‌, ఒలెగ్‌ స్క్రిసోచ్కా 2016 సెప్టెంబర్‌ 7న కజకిస్థాన్‌లో భూమిపై దిగారు. తాజా యాత్రతో అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన అమెరికా వ్యోమగామిగా విలియమ్స్‌(58)చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు నాలుగు యాత్రల్లో కలిపి మొత్తం 534 రోజులపాటు ఆయన అంతరిక్షంలో గడిపారు. అత్యధిక కాలం అంతరిక్షంలో గడిపిన రికార్డు మాత్రం రష్యాకు చెందిన గెన్నడీ పడల్కా (879 రోజు) పేరిట ఉంది. https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

రోదసిలో తొలిసారి జన్యు క్రమం ఆవిష్కరణ


రోదసిలో తొలిసారిగా జన్యు క్రమాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ఆవిష్కరించింది. భూ కక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో ఈ ఘనతను సాధించింది. బయోమాలిక్యూల్‌ సీక్వెన్సర్‌ ప్రయోగంలో భాగంగా సూక్ష్మ గురుత్వ శక్తి వాతావరణంలో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రయోగాన్ని నాసా వ్యోమగామి కేట్‌ రూబిన్స్‌ నిర్వహించారు. మిన్‌ అయాన్‌ అనే డీఎన్‌ఏ సీక్వెన్సింగ్‌ పరికరం సాయంతో ఎుకు, వ్కెరస్‌, బ్యాక్టీరియా డీఎన్‌ఏ నమూనాను విశ్లేషించారు. నిర్దిష్ట డీఎన్‌ఏ క్రమాన్ని గుర్తించారు. అంతరిక్షంలో డీఎన్‌ఏనూ ఆవిష్కరించే విధానం వ్ల వ్యోమగాముకు రోగ నిర్ధారణ చేయడానికి, ఐఎస్‌ఎస్‌లో వృద్ధి చెందుతున్న సూక్ష్మజీవును గుర్తించడానికి, వాటి వల్ల ఆరోగ్యానికి ముప్పు ఉంటుందా లేదా అన్నది తేల్చడానికి వీలు కలుగుతుందని నాసా పేర్కొంది.
NASA-National Aeronautics and Space Administration
ISS-International Space Station 

Tuesday, September 6, 2016

భూమిపై అత్యంత వేడి నెలగా జులై


ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో భూమిపై అత్యంత వేడి నెలగా 2016 జూలై నెల కొత్త రికార్డు సృష్టించింది. గత 137 సంవత్సరాల గణాంకాలతో పోల్చితే ఈ జూలైలో ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉన్నాయని అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ పర్యవేక్షణ సంస్థ ప్రకటించింది. 20వ శతాబ్దపు సగటు ఉష్ణోగ్రతతో పోల్చితే ఈ జూలైలో ఉష్ణోగ్రత 1.57 డిగ్రీలు అధికంగా ఉంది. 

ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఎయిర్‌ ల్యాండర్‌-10


ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఎయిర్‌ ల్యాండర్‌-10 2016 ఆగస్టు 17న ఇంగ్లండ్‌లోని కార్డింగ్టన్‌లో ఆకాశంలోకి ఎగిరింది. 85 ఏళ్ల కిందట 1930 అక్టోబర్‌లో ఇదే ఎయిర్‌ఫీల్డ్‌ నుంచి ఎగిరిన ఎయిర్‌షిప్‌-ఆర్‌101 ఫ్రాన్స్‌లో కూలిపోయింది. ఈ సంఘటనలో 30 మంది చనిపోయారు. ఆ తర్వాత బ్రిటన్‌లో ఎయిర్‌షిప్‌ను రూపొందించడం
ఆపేశారు. తాజాగా 302 అడుగుల పొడవైన ఎయిర్‌ ల్యాండర్‌-10ను అమెరికా ఆర్మీ కోసం బ్రిటన్‌ సంస్థ హైబ్రిడ్‌ ఎయిర్‌ వెహికల్స్‌ రూపొందించింది.

Friday, September 2, 2016

టాన్సిట్‌ ఎలివేటెడ్‌ బస్సును పరీక్షించిన చైనా


రోడ్డు మార్గాల్లో రద్దీని ఎదరుర్కొనేందుకు చైనా ట్రాన్సిట్‌ ఎలివేటెడ్‌ బస్‌(TEB) పేరుతో కొత్తరకం లాండ్‌ ఎయిర్‌ బస్‌ను చైనా 2016 ఆగస్టు 5న పరీక్షించింది. రోడ్ల మీద వెళుతున్న వాహనాల మీదుగా ప్రయాణించడం ఈ బస్సు ప్రత్యేకత. 72 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పు ఉండే ఈ బస్సు విద్యుచ్ఛక్తితో నడుస్తుంది. ఒకేసారి 1400 మంది కూర్చోవచ్చు. గంటకు 60 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది.

TEB - Transit Elevated Bus

తుపాన్ల సమాచారాన్ని అందించే రాడార్‌


తుపాన్లు, ఇతర తీవ్రస్థాయి వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారాన్ని అందించే సీ బ్యాండ్‌ పోరీ మెట్రిక్‌ డాప్లర్‌ వాతావరణ రాడార్‌ను ఇస్రో చైర్మన్‌ ఎ.ఎస్‌.కిరణ్‌కుమార్‌ 2016 ఆగస్టు 4న తిరువనంతపురంలోని వీఎస్‌ఎస్‌సీలో ప్రారంభించారు. ఈ తరహా రాడార్‌ను దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం. ఈ రాడార్‌ ద్వారా భారత వాతావరణ విభాగానికి సమాచారం అందుతుంది