Wednesday, October 12, 2016

తెలంగాణ రవాణా శాఖ రిజిస్ట్రేషన్ కోడ్ లు

రాష్ట్రంలోని 31 జిల్లాల తెలంగాణకు రవాణా శాఖ రిజిస్ట్రేషన్ కోడ్ లు ప్రకటించింది. TS 36 వరకు సిరీస్ ఉంది. ఏ జిల్లాకు ఏ కోడ్ వివరాలు ఇలా ఉన్నాయి..
#సిద్దిపేట_జిల్లా కోడ్ TS 36
జిల్లా కోడ్ నంబర్
ఆదిలాబాద్ – TS 1
కరీంనగర్ – TS 2
వరంగల్ అర్బన్ – TS 3
ఖమ్మం – TS 4
నల్గొండ – TS 5
మహబూబ్‌నగర్ – TS 6
రంగారెడ్డి – TS 7
మేడ్చల్ – TS 8
హైదరాబాద్ – TS 9, 10, 11, 12, 13, 14
మెదక్ – TS 15
నిజామాబాద్ – TS 16
కామారెడ్డి – TS 17
నిర్మల్ – TS 18
మంచిర్యాల – TS 19
కొమరంభీమ్ – TS 20
జగిత్యాల – TS -21
పెద్దపల్లి – TS 22
రాజన్న సిరిసిల్ల – TS 23
వరంగల్ రూరల్ – TS 24
జయశంకర్ భూపాలపల్లి – TS 25
మహబూబాబాద్ – TS 26
జనగాం – TS 27
భద్రాద్రి కొత్తగూడెం – TS 28
సూర్యాపేట – TS 29
యాదాద్రి – TS 30
నాగర్ కర్నూల్ – TS 31
వనపర్తి – TS 32
జోగులాంబ గద్వాల – TS 33
వికారాబాద్ – TS 34
మెదక్ – TS 35
సిద్దిపేట – TS 36

ఇజ్రాయెల్‌ మాజీ అధ్యక్షుడు షీమోన్‌ పెరేజ్‌ మృతి

నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, ఇజ్రాయెల్‌ మాజీ అధ్యక్షుడు షీమోన్‌ పెరేజ్‌ (93) టెల్‌ హషోమెర్‌లో 2016 సెప్టెంబర్‌ 28న మరణించారు. ఆయన రెండుసార్లు దేశ ప్రధానమంత్రిగా, విదేశాంగ, ఆర్థికమంత్రిగా పనిచేశారు. పాస్తీనాతో శతాబ్ద కాలం నాటి విరోధాన్ని ముగించడానికి చేసిన కృషి (ఓస్లో శాంతి ఒప్పందం)కిగాను 1994లో ఆయన్ను నోబెల్‌ శాంతి బహుమతి వరించింది. షీమెన్‌కు భారత్‌ అంటే అభిమానం. భూమిపై అతిగొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారత్‌ను అభివర్ణించారు. మహాత్మగాంధీని ‘ప్రవక్త’గా జవహర్‌లాల్‌ నెహ్రూను ‘రాజు’ గాను ఆయన అభివర్ణించేవారు. 

విశ్వకర్మ దివస్‌

2016 సెప్టెంబర్‌ 17న విశ్వకర్మ దివస్‌ను హైదరాబాద్‌లో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించారు. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశ్వకర్మ సేవల్ని ప్రపంచానికి తెలియజేసేందుకు వీలుగా ఏటా సెప్టెంబరు 17ను జాతీయ కార్మిక దినోత్సవంగా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు . విశ్వకర్మ దివస్‌ సందర్భంగా 33 మందికి మంత్రి అవార్డు అందజేశారు.

అండర్‌-18 ఆసియా కప్‌ హాకీ టోర్నీ విజేత భారత్‌

అండర్‌-18 ఆసియా కప్‌ హాకీ టోర్నీలో భారత్‌ విజేతగా నిలిచింది. ఢాకాలో జరిగిన ఫైనల్లో 5-4 గోల్స్‌తో బంగ్లాదేశ్‌ను ఓడించింది.

కాన్పూర్‌లో భారత్‌ 500వ టెస్టు మ్యాచ్‌

భారత క్రికెట్‌ జట్టు చారిత్రక 500వ టెస్టు మ్యాచ్‌ 2016 సెప్టెంబర్‌లో కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయాన్ని  సాధించింది.

జాతీయ సీనియర్‌ సెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఎంఎస్‌కే ప్రసాద్‌

టీమ్‌ ఇండియా మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌, తెలుగు తేజం మన్నవ శ్రీకాంత్‌ కృష్ణప్రసాద్‌ (ఎంఎస్‌కే ప్రసాద్‌) కు అరుదైన గౌరవం దక్కింది. జాతీయ సీనియర్‌ సెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఎంఎస్‌కే ప్రసాద్‌ ఎంపికయ్యాడు. ఈ పదవిలో మూడేళ్లు ఉంటాడు. ఎంఎస్‌కే నేతృత్వంలో మొత్తం ఐదుగురితో కొత్త సెక్షన్‌ కమిటీని బీసీసీఐ ప్రకటించింది. గగన్‌ ఖోడా (సెంట్రల్‌ జోన్‌), దేవాంగ్‌ గాంధీ (ఈస్ట్‌ జోన్‌), జతిన్‌ పరాంజపే (వెస్ట్‌ జోన్‌), శరణ్‌దీప్‌ సింగ్‌ (నార్త్‌ జోన్‌) కు సెక్షన్‌ కమిటీలో చోటు దక్కింది. జూనియర్‌ సెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా టీమిండియా మాజీ పేసర్‌ వెంకటేష్‌ ప్రసాద్‌ మరోసారి నియమితుడయ్యాడు. రాకేష్‌ పారిఖ్‌, ఆశిష్‌ కపూర్‌, అమిత్‌ శర్మ, జ్ఞానేంద్ర పాండేకు ఈ కమిటీలో స్థానం కల్పించారు. మహిళ సెక్షన్‌ కమిటీకి హేమలత ఛైర్మన్‌గా ఎంపికైంది. సీనియర్‌ సెక్షన్‌ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించిన తొలి తెలుగువాడు లక్నల్‌ సీకే నాయుడు. 

ఇండియా-బ్లూకు దులీప్‌ ట్రోఫీ

గులాబి బంతితో తొలిసారి డే/నైట్‌ ఫార్మాట్‌లో నిర్వహించిన దులీప్‌ ట్రోఫీని గౌతమ్‌ గంభీర్‌ నేతృత్వంలోని ఇండియా-బ్లూ సొంతం చేసుకుంది. గ్రేటర్‌ నోయిడాలో జరిగిన ఫైనల్లో 355 పరుగుల తేడాతో యువరాజ్‌ సింగ్‌ నాయకత్వంలోని ఇండియా-రెడ్‌ను ఓడించింది.