Friday, August 18, 2023

న్యాయశాఖకు 12 బిల్లులు

  • టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సేవల్లోకి విలీనం చేస్తూ శాసనసభ, శాసనమండలి ఆమోదించిన బిల్లు సహా 12 బిల్లులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ న్యాయశాఖ పరిశీలన కోసం పంపించారు. 
  • గవర్నర్‌ ముందస్తు అనుమతి కోసం ఆర్టీసీ బిల్లును ప్రభుత్వం రాజ్‌భవన్‌కు పంపించగా... గవర్నర్‌ 10 సిఫార్సును చేస్తూ ఆ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి అనుమతించారు. 
  • గతంలో గవర్నర్‌ నాలుగు బిల్లులను తిరస్కరించిన సందర్భంలోనూ వాటికి సంబంధించి కొన్ని సిఫార్సులు చేశారు. ఇప్పుడు ఈ అయిదు బిల్లుల్లో తాను సూచించిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్నారా? లేదా? అనే అంశాలను పరిశీలించాలని గవర్నర్‌ తమిళిసై న్యాయశాఖను ఆదేశించారు. వీటితోపాటు కొత్తగా అసెంబ్లీ, మండలి ఆమోదించిన మరో ఏడు బిల్లులను సైతం న్యాయశాఖ పరిశీలన కోరుతూ గవర్నర్‌ కార్యాలయం పంపించింది.

నిలిపివేశారన్నది తప్పుడు ప్రచారం

  • శాసనసభ కార్యదర్శి నుంచి వచ్చిన బిల్లులను న్యాయశాఖ పరిశీలన కోసం పంపించడం సాధారణ ప్రక్రియలో భాగమేనని గవర్నర్‌ కార్యాలయం 2023 ఆగస్టు 17న విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఆర్టీసీ ఉద్యోగులు, కార్పొరేషన్‌ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని గవర్నర్‌ పది సిఫార్సులు చేశారని, వాటిని పొందుపర్చారా? లేదా? అని తెలుసుకున్న అనంతరం... ఆర్టీసీ బిల్లు సహా మిగిలిన బిల్లులపై తదుపరి చర్యలు ఉంటాయంది. ఆర్టీసీ బిల్లును నిలిపివేశారని, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తున్నారని కొన్ని ప్రసార మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అవి పూర్తిగా అసత్యాలేనని స్పష్టం చేసింది. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం నిరాధారణమైన సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, ప్రజలు ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులు వాటిని విశ్వసించొద్దని కోరింది.

రాజ్‌భవన్‌ నుంచి న్యాయశాఖకు వెళ్లిన బిల్లులు

రెండోసారి ఆమోదించి పంపించిన నాలుగు: 

1.తెలంగాణ మున్సిపల్‌ బిల్లు-2022,

2.తెలంగాణ ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు-2022,

3.రాష్ట్ర పంచాయతీరాజ్‌ బిల్లు-2023,

4.తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌(రెగ్యులేషన్‌ ఆఫ్‌ ఏజ్‌ ఆఫ్‌ సూపర్‌యాన్యుయేషన్‌) బిల్లు-2022. 

తొలిసారిగా ఆమోదించి పంపించిన ఎనిమిది:

1.తెలంగాణ పంచాయతీరాజ్‌(మూడో సవరణ) బిల్లు-2023,

2.తెలంగాణ పంచాయతీరాజ్‌(రెండో సవరణ) బిల్లు-2023,

3.తెలంగాణ మున్సిపాలిటీల(రెండో సవరణ) బిల్లు-2023,

4.తెలంగాణ ఆర్టీసీ బిల్లు(సర్కారులో ఉద్యోగుల విలీనం)-2023,

5.కర్మాగారాల చట్ట సవరణ బిల్లు-2023,

6.తెలంగాణ జీఎస్టీ చట్ట సవరణ బిల్లు-2023,

7.తెలంగాణ స్టేట్‌ మైనారిటీస్‌ కమిషన్‌ బిల్లు-2023,

8.టిమ్స్‌ వైద్య సంస్థల బిల్లు-2023.


12 Bills for the Judiciary

  • Governor Tamilisai Soundararajan has sent 12 bills including the bill approved by the Legislative Assembly and the Legislative Council to integrate the TSRTC employees into government services.
  • While the government sent the RTC bill to the Raj Bhavan for the governor's prior approval... the governor made 10 recommendations and allowed the bill to be introduced in the assembly.
  • In the past, the governor had rejected four bills and made some recommendations regarding them. Now have the recommendations suggested by him in these five bills been taken into consideration? Or? Governor Tamilisai ordered the Department of Justice to look into the issues. In addition to these, the Governor's Office has also sent seven more bills newly approved by the Assembly and Council to the Law Department for consideration.

Stopping is false propaganda

  • In a statement issued on August 17, 2023, the Governor's Office said that it is part of the normal process to send bills from the Legislative Secretary to the Judiciary for consideration. Did the governor make ten recommendations keeping in mind the interests of the RTC employees and the corporation and have they been incorporated? Or? After knowing that... there will be further action on the rest of the bills including the RTC bill. It has been clarified that some media are spreading false propaganda that the RTC Bill has been stopped and it is being sent for President's assent, which are completely false. Some are spreading baseless information for selfish purposes and people especially RTC employees should not believe them.

Bills passed from Raj Bhavan to Law Department

The four that were seconded were:

1. Telangana Municipal Bill-2022,

2.Telangana Private Universities Bill-2022,

3. State Panchayat Raj Bill-2023,

4.Telangana Public Employment (Regulation of Age of Superannuation) Bill-2022.

The first eight approved and sent were:

1. Telangana Panchayati Raj (Third Amendment) Bill-2023,

2. Telangana Panchayati Raj (Second Amendment) Bill-2023,

3. Telangana Municipalities (Second Amendment) Bill-2023,

4.Telangana RTC Bill (Merger of Employees in Govt.)-2023,

5.Factories Act Amendment Bill-2023,

6.Telangana GST Law Amendment Bill-2023,

7. Telangana State Minorities Commission Bill-2023,

8. TIMS Medical Institutions Bill-2023.

World Athletics : ప్రపంచ అథ్లెటిక్స్‌ (డబ్ల్యూఏ) ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన భారతీయుడు ఎవరు?

Adil Sumariwala-successsecert

  • భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) అధ్యక్షుడు ఆదిల్‌ సుమరివాలాకు అరుదైన గౌరవం దక్కింది. అతడు 2023 ఆగస్టు 17న ప్రపంచ అథ్లెటిక్స్‌ (డబ్ల్యూఏ) ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 
  • ప్రపంచ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో అత్యంత శక్తిమంతమైన సమాఖ్యలో ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన మొదటి భారతీయుడు సుమరివాలానే. 
  • 2012 నుంచి ఏఎఫ్‌ఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్న 65 ఏళ్ల సుమరివాలా..ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడో అత్యధిక ఓట్లు సంపాదించాడు. 
  • నలుగురు ఉపాధ్యక్షుల్లో సుమరివాలా ఒకరు. నాలుగేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగుతాడు. 
  • 100 మీటర్ల అథ్లెట్‌గా ఒలింపిక్స్‌లో పాల్గొన్న సుమరివాలా.. 2015 నుంచి డబ్ల్యూఏ కౌన్సిల్‌లో సభ్యుడిగా ఉన్నాడు. సెబాస్టియన్‌ కో ప్రపంచ అథ్లెటిక్స్‌ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యాడు.


Who is the Indian who has been elected as the Vice-President of World Athletics (WA)?

  • Athletics Federation of India (AFI) President Adil Sumariwala has received a rare honour. He was elected as the Vice President of World Athletics (WA) on 17 August 2023.
  • Sumariwala is the first Indian to hold the post of vice-president of the world's most powerful federation of track and field.
  • 65-year-old Sumariwala, who has been the president of AFI since 2012, got the third highest number of votes in the recent elections.
  • Sumariwala is one of the four vice-presidents. He will continue in office for four years.
  • Sumariwala, who participated in the Olympics as a 100m athlete, has been a member of the WA Council since 2015. Sebastian Coe was re-elected as World Athletics President.

Wahab Riaz : వాహబ్‌ రియాజ్‌ వీడ్కోలు

  • పాకిస్థాన్‌ ఎడమచేతి  వాటం ఫాస్ట్‌ బౌలర్‌ వాహబ్‌ రియాజ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లపై ఎక్కువ దృష్టిసారించడం కోసం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు 2023 ఆగస్టు 16న వెల్లడిరచాడు. 
  • 2008 నుంచి 2020 వరకు వాహబ్‌ 27 టెస్టులు, 91 వన్డేలు, 36 టీ20ల్లో పాక్‌ తరఫున బరిలో దిగాడు. మూడు ఫార్మాట్లలో వరుసగా 83, 120, 34 వికెట్లు తీశాడు. టెస్టు క్రికెట్లో అరంగేట్ర మ్యాచ్‌లోనే అయిదు వికెట్లు తీసిన తొమ్మిదో పాక్‌ బౌలర్‌గా వాహబ్‌ ఘనత సాధించాడు. 2011 ప్రపంచకప్‌లో పాక్‌.. భారత్‌ చేతిలో ఓడిన సెమీస్‌లో వాహబ్‌ అయిదు వికెట్లు పడగొట్టాడు.

Farewell to Wahab Riaz

  • Pakistan's left-arm fast bowler Wahab Riaz has announced his retirement from international cricket. He announced on 16th August 2023 that he will bid farewell to international cricket to focus more on T20 leagues around the world.
  • From 2008 to 2020, Wahab played 27 Tests, 91 ODIs and 36 T20Is for Pakistan. He took 83, 120 and 34 wickets respectively in three formats. Wahab became the ninth Pakistani bowler to take five wickets in his debut match in Test cricket. In the 2011 World Cup, Wahab took five wickets in the semis when Pakistan lost to India.

యాంటీబయాటిక్‌ అవశేషాల నిర్మూలనకు కొత్త ప్రక్రియ

  • వైద్యుల సలహా లేకుండానే మందుల షాపులకు వెళ్లి యాంటీ బయాటిక్‌ ఔషధాలు కొని వాడటం భారత్‌లో సర్వసాధారణం! దీనికితోడు కొవిడ్‌-19 సమయంలో టెట్రాసైక్లిన్‌, ఎరిథ్రోమైసిన్‌ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. విచ్చలవిడి వాడకం వల్ల రోగకారక బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్‌ను తట్టుకునే శక్తిని సంపాదించాయి. మరోవైపు మానవులు విసర్జించిన యాంటీ బయాటిక్స్‌ నీటి వనరుల్లో చేరిపోతున్నాయి. అవి ఇతర జీవులకు, పర్యావరణానికీ తీరని హాని కలిగిస్తాయి. 
  • పర్యావరణంలో కలసిపోయిన టెట్రాసైక్లిన్‌, ఎరిథ్రోమైసిన్‌ మందుల అవశేషాలను నిర్మూలించే పద్ధతిని ఐఐటీ-రూర్కీ పరిశోధకులు కనుగొన్నారు. నవీన్‌కుమార్‌ నవానీ నాయకత్వంలోని ఈ బృందంలో కిరణ్‌ అంబటిపూడి అనే తెలుగు పరిశోధకుడూ ఉన్నారు. 
  • వీరు కనుగొన్న ప్రక్రియ యాంటీబయాటిక్స్‌తోపాటు రసాయన కాలుష్యాన్నీ నిర్మూలించగలదు. ఈ ప్రక్రియలో మొదట నీటిలో చేరిన యాంటీబయాటిక్స్‌ అవశేషాలను కనిపెట్టడానికి బయోసెన్సర్‌ బ్యాక్టీరియాను ఉపయోగిస్తారు. కార్బన్‌ ఆధారిత నానోట్యూబ్‌లతో నీటిలోని యాంటీబయాటిక్స్‌ను ఆకర్షించి రసాయన ఉత్ప్రేరకం సాయంతో విచ్ఛిన్నం చేస్తారు. 
  • ఈ పద్ధతిలో కేవలం 3-4 గంటల్లోనే 93 శాతం యాంటీబయాటిక్‌ అవశేషాలను నిర్మూలించవచ్చు. నీటిలో కలసిపోయిన ప్రమాదకర రసాయనాలు, ఫార్మా అవశేషాలు, రంగులు, ఇతర యాంటీబయాటిక్స్‌ అవశేషాలను కూడా ఇదే ప్రక్రియతో విచ్ఛిన్నం చేయవచ్చు.

RBI's New Portal for Unclaimed Deposits : అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల కోసం ఆర్‌బీఐ ప్రారంభించిన పోర్టల్‌ పేరు ఏమిటి?

UDGAM-successsecert

  • బ్యాంకుల్లో ఏళ్లుగా మూలుగుతున్న అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లకు సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక ముందడుగు వేసింది. 
  • వేర్వేరు బ్యాంకుల్లో మూలుగుతున్న అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లను ఒకే చోట తెలుసుకొనేందుకు UDGAM  (Unclaimed Deposits Gateway To Access Information) పేరిట ఓ సెంట్రలైజ్డ్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. 
  • ఈ పోర్టల్‌ ద్వారా అన్‌క్లెయిమ్డ్‌ మొత్తాలను కావాలంటే తీసుకోవడం లేదా ఆయా ఖాతాలను పునరుద్ధరించుకోవడానికి వీలవుతుందని ఆర్‌బీఐ తెలిపింది.
  • ఏదైనా బ్యాంకు ఖాతాలోని నగదు పదేళ్లు లేదా అంతకు మించిన వాడుకలో లేకుండాపోతే దాన్ని అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్‌గా పరిగణిస్తారు. అలా ఎవరూ క్లెయిమ్‌ చేయని డిపాజిట్లుగా ఆ డబ్బులన్నీ బ్యాంకుల్లోనే పేరుకుపోతుంటాయి. అటువంటి ఖాతాల వివరాలను ఈ పోర్టల్‌ ద్వారా చూసుకోవచ్చు. 
  • ప్రస్తుతానికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ధనలక్ష్మి బ్యాంక్‌ లిమిలెడ్‌, సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌, డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియా లిమిటెడ్‌, సిటీ బ్యాంక్‌కు సంబంధించిన అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల వివరాలు ఈ పోర్టల్‌లో లభ్యం కానున్నాయి. 
  • అక్టోబర్‌ 15 నాటికి ఇతర బ్యాంకుల వివరాలు సైతం అందుబాటులోకి రానున్నాయని ఆర్‌బీఐ తెలిపింది.

ఎలా ఉపయోగపడుతుంది?

  • ఎవరైనా హఠాత్తుగా చనిపోతే మృతుడికి ఏయే బ్యాంకుల్లో ఎన్ని ఖాతాలున్నాయి? వాటిలో ఎంత సొమ్ముందన్న వివరాలు కుటుంబ సభ్యులకు తెలిస్తే ఫర్వాలేదు. కష్టకాలంలో ఆ డబ్బు ఉపయోగపడుతుంది. కానీ, చాలా కుటుంబాల్లో ఆర్థిక వ్యవహారాలన్నీ పురుషుల చేతుల మీదుగానే సాగుతుంటాయి. ఆర్థిక వివరాలు ఏవీ ఇతరులకు పెద్దగా చెప్పరు. దాంతో ఆకస్మిక మరణాలు సంభవించినప్పుడు ఆయా డిపాజిట్ల వివరాలు తెలియక కుటుంబ సభ్యులు అవస్థలు పడుతుంటారు. అలాగే, ఏదో బ్యాంకులో మరేదో సందర్భంలో సొమ్ము జమచేసి.. పనుల ఒత్తిడిలో పడిపోయి కాలగమనంలో దాని గురించి మరచిపోతుంటారు కొందరు. అటువంటివారు తమ కష్టార్జితాలను తిరిగి పొందడానికి ఈ పోర్టల్‌ దోహద పడుతుంది. ప్రస్తుతం క్లెయిమ్‌ చేయని డిపాజిట్ల గురించి తెలుసుకోవాలంటే ఆయా బ్యాంకుల వెబ్‌సైట్లను ఆశ్రయించాల్సి ఉంటుంది. అసలే బ్యాంకులో ఖాతా ఉందో తెలీకపోతే ఆ వివరాలు తెలుసుకోవడం కష్టం. ఈ పోర్టల్‌ ద్వారా ఆ కష్టాలు తీరనున్నాయి. డిపాజిట్‌దారులు లేదా మృతిచెందిన ఖాతాదారుల వారసులకు సంబంధిత డిపాజిట్లను వెతికి పట్టుకోవడం సులువవుతుంది.

ఎలా సెర్చ్‌ చేయాలి?

  • UDGAM వెబ్‌సైట్‌లోకి వెళ్లి ముందుగా రిజిస్టర్‌ అవ్వాలి. తర్వాత లాగిన్‌ అయ్యి ఖాతాదారు పేరు పేర్కొనాలి. ఫలానా బ్యాంకు వివరాలే కావాలా? అన్ని బ్యాంకుల వివరాలూ (ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్యాంకులు) కావాలా? అనే ఆప్షన్లు ఎంచుకోవాలి. మెరుగైన సెర్చ్‌ కోసం ఆ తర్వాత పాన్‌, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్ట్‌, పుట్టిన తేదీ వివరాలు ఏవైనా పేర్కొనాలి. ఒకవేళ ఆ వివరాలూ ఏవీ లేకపోతే గ్రామం, జిల్లా, రాష్ట్రం వంటి వివరాలు తెలుసుకోవాలి. అలా సెర్చ్‌ చేస్తే ఆ పేరుతో ఉన్న వ్యక్తుల వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ ఏదైనా బ్యాంకులో అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు కనిపిస్తే బ్యాంకుకు వెళ్లి ఖాతాను పునరుద్ధరించుకోవచ్చు. ఒకవేళ మరణించిన వ్యక్తుల చట్టబద్ధ వారసులైతే సంబంధిత బ్యాంకుకు వెళ్లి పత్రాలను సమర్పించి అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లను సెటిల్‌ చేసుకోవచ్చు.


What is the name of the portal launched by RBI for unclaimed deposits?

  • The Reserve Bank of India has taken a major step forward in relation to unclaimed deposits which have been languishing in banks for years.
  • A centralized portal called UDGAM (Unclaimed Deposits Gateway To Access Information) has been launched to know the unclaimed deposits lying in different banks at one place.
  • RBI said that through this portal, unclaimed amounts can be withdrawn or the accounts can be revived.
  • If the cash in any bank account remains unused for ten years or more then it is considered as unclaimed deposit. All that money accumulates in the banks as unclaimed deposits. Details of such accounts can be viewed through this portal.
  • Currently, details of unclaimed deposits related to State Bank of India, Punjab National Bank, Central Bank of India, Dhanalakshmi Bank Limited, South Indian Bank Limited, DBS Bank India Limited, Citibank will be available on this portal.
  • RBI said that the details of other banks will also be available by October 15.

How useful?

  • If someone dies suddenly, how many bank accounts does the deceased have? It is okay if the family members know the details of how much money is in them. That money will come in handy in times of trouble. But, in most families, all financial affairs are handled by men. Don't tell others much about any financial details. Due to this, when sudden deaths occur, the family members are in trouble because they do not know the details of the respective deposits. Also, some people deposit money in some bank for some other occasion. This portal will help such people to get back their hard earned money. Currently, to know about the unclaimed deposits, one has to refer to the websites of the respective banks. It is difficult to know the details if one does not know that the account is actually in the bank. Through this portal, those difficulties will be solved. It makes it easier for depositors or heirs of deceased customers to trace the relevant deposits.

How to search?

  • Go to UDGAM website and register first. Then login and specify the account holder name. Need specific bank details? Want details of all banks (currently available banks)? Select the options. For a better search, any details such as PAN, Voter ID, Driving License, Passport, Date of Birth should be specified. If there is none of those details then the details like village, district, state should be known. If you do a search, the details of people with that name will appear. If unclaimed deposits are found in any bank then one can go to the bank and recover the account. In case of legal heirs of deceased persons they can go to the concerned bank and submit the documents and settle the unclaimed deposits.

‘తెలంగాణ చరిత్ర-సంస్కృతి-ఉద్యమాలు’ ఆవిష్కరణ

చరిత్రకారులు ఆచార్య అడపా సత్యనారాయణ, ద్యావనపల్లి సత్యనారాయణ రచించిన ‘తెలంగాణ చరిత్ర-సంస్కృతి- ఉద్యమాలు’ అనే తెలుగు గ్రంథాన్ని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి 2023 ఆగస్టు 16న ఆవిష్కరించారు. 

International Young Eco Hero Award-2023 : అంతర్జాతీయ యంగ్‌ ఎకో హీరో అవార్డ్‌-2023కు ఎంపికైన 17 మందిలో భారతీయ బాలలు ఎంత మంది ఉన్నారు?

International Young Eco Hero Award-2023-successsecert

  • ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న బాలలకు ప్రదానం చేసే అంతర్జాతీయ యంగ్‌ ఎకో హీరో అవార్డ్‌-2023కు ఎంపికైన 17 మందిలో అయిదుగురు భారతీయ బాలలు ఉన్నారు. 
  • ఈ మేరకు ఐహా దీక్షిత్‌ (మేరఠ్‌), మాన్య హర్ష (బెంగళూరు), నిర్వాణ్‌ సోమానీ (దిల్లీ), మన్నత్‌ కౌర్‌ (దిల్లీ), కర్ణవ్‌ రస్తోగీ (ముంబయి)లకు పురస్కారం లభించింది. అమెరికా స్వచ్ఛంద సంస్థ ‘యాక్షన్‌ ఫర్‌ నేచర్‌’ ఏటా ఈ పురస్కారాలు ఇస్తోంది.
  • ఈ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన ఐహా దీక్షిత్‌ నాలుగేళ్ల వయసు నుంచే మొక్కలు నాటుతోంది. ఆమె కొందరు వాలంటీర్లతో కలిసి మేరఠ్‌ నగరంలో 20,000 మొక్కలు నాటింది. ప్రజలు విరాళంగా ఇచ్చిన మొక్కలతో ఒక నిధిని ఏర్పాటుచేసి ఉచితంగా పంచిపెడుతోంది.
  • 8-12 ఏళ్ల విభాగంలో రెండో స్థానం పొందిన మాన్య హర్ష తన పుస్తకాలు, బ్లాగ్‌, యూట్యూబ్‌ ఛానల్‌ ‘ది లిటిల్‌ ఎన్విరాన్‌మెంటలిస్ట్‌’తో పర్యావరణ స్పృహను పెంచుతోంది. 3,500 మొక్కలను నాటి, 3000 విత్తన బంతులను పంపిణీ చేసింది.
  • 13-16 ఏళ్ల విభాగంలో రెండో స్థానం పొందిన నిర్వాణ్‌ సోమానీ ఇతరులు వాడి వదిలేసిన డెనిమ్‌ జీన్స్‌ దుస్తులను సేకరించి, మార్పుచేర్పులు చేసి పేదలకు పంచుతున్నాడు. అలా 6000 జీన్స్‌ను పంచారు. 800 జీన్స్‌ను దుప్పట్లుగా మార్చి ఇచ్చాడు. తద్వారా ఫ్యాషన్‌ దుస్తులు చెల్లాచెదురుగా పడి కాలుష్యం సృష్టించకుండా జాగ్రత్త పడుతున్నాడు.
  • 13-16 ఏళ్ల విభాగంలో మూడో స్థానం పొందిన మన్నత్‌ కౌర్‌ కాలుష్య రహితంగా వ్యర్థ జలాల శుద్ధిని, తాగు నీటి సరఫరా కార్యక్రమాలను చేపట్టింది.
  • ఈ ఏడాది విజేతల జాబితాలో గౌరవ స్థానం పొందిన 13 ఏళ్ల కర్ణవ్‌ రస్తోగీ ప్లాస్టిక్‌ వ్యర్థాలను నిర్మూలించడం ద్వారా వాతావరణ మార్పుల నిరోధానికి పాటు పడుతున్నాడు.


How many Indian children are among the 17 shortlisted for International Young Eco Hero Award-2023?

  • Five Indian children are among the 17 shortlisted for the International Young Eco Hero Award-2023, which is awarded to children who are involved in environmental protection around the world.
  • To this extent, Aiha Dixit (Meerut), Manya Harsha (Bangalore), Nirvan Somani (Delhi), Mannath Kaur (Delhi) and Karnav Rastogi (Mumbai) were awarded. American charity organization 'Action for Nature' gives these awards annually.
  • Aiha Dixit, who won first place in this competition, has been planting saplings since she was four years old. She along with some volunteers planted 20,000 saplings in Meerut city. A fund is established with plants donated by people and distributed freely.
  • Manya Harsha, who won the second position in the 8-12 years category, is raising environmental awareness with her books, blog and YouTube channel 'The Little Environmentalist'. Planted 3,500 saplings and distributed 3000 seed balls.
  • Nirvan Somani, who won the second position in the 13-16 age category, collects discarded denim jeans, alters them and distributes them to the poor. So 6000 jeans were distributed. He converted 800 jeans into blankets. Thus, he is careful not to create pollution by scattering fashionable clothes.
  • Mannath Kaur, who won the third position in the 13-16 years category, has undertaken pollution-free waste water treatment and drinking water supply programs.
  • 13-year-old Karnav Rastogi, who has bagged an honorable mention in this year's list of winners, is helping prevent climate change by eradicating plastic waste.