Friday, August 18, 2023

International Young Eco Hero Award-2023 : అంతర్జాతీయ యంగ్‌ ఎకో హీరో అవార్డ్‌-2023కు ఎంపికైన 17 మందిలో భారతీయ బాలలు ఎంత మంది ఉన్నారు?

International Young Eco Hero Award-2023-successsecert

  • ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న బాలలకు ప్రదానం చేసే అంతర్జాతీయ యంగ్‌ ఎకో హీరో అవార్డ్‌-2023కు ఎంపికైన 17 మందిలో అయిదుగురు భారతీయ బాలలు ఉన్నారు. 
  • ఈ మేరకు ఐహా దీక్షిత్‌ (మేరఠ్‌), మాన్య హర్ష (బెంగళూరు), నిర్వాణ్‌ సోమానీ (దిల్లీ), మన్నత్‌ కౌర్‌ (దిల్లీ), కర్ణవ్‌ రస్తోగీ (ముంబయి)లకు పురస్కారం లభించింది. అమెరికా స్వచ్ఛంద సంస్థ ‘యాక్షన్‌ ఫర్‌ నేచర్‌’ ఏటా ఈ పురస్కారాలు ఇస్తోంది.
  • ఈ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన ఐహా దీక్షిత్‌ నాలుగేళ్ల వయసు నుంచే మొక్కలు నాటుతోంది. ఆమె కొందరు వాలంటీర్లతో కలిసి మేరఠ్‌ నగరంలో 20,000 మొక్కలు నాటింది. ప్రజలు విరాళంగా ఇచ్చిన మొక్కలతో ఒక నిధిని ఏర్పాటుచేసి ఉచితంగా పంచిపెడుతోంది.
  • 8-12 ఏళ్ల విభాగంలో రెండో స్థానం పొందిన మాన్య హర్ష తన పుస్తకాలు, బ్లాగ్‌, యూట్యూబ్‌ ఛానల్‌ ‘ది లిటిల్‌ ఎన్విరాన్‌మెంటలిస్ట్‌’తో పర్యావరణ స్పృహను పెంచుతోంది. 3,500 మొక్కలను నాటి, 3000 విత్తన బంతులను పంపిణీ చేసింది.
  • 13-16 ఏళ్ల విభాగంలో రెండో స్థానం పొందిన నిర్వాణ్‌ సోమానీ ఇతరులు వాడి వదిలేసిన డెనిమ్‌ జీన్స్‌ దుస్తులను సేకరించి, మార్పుచేర్పులు చేసి పేదలకు పంచుతున్నాడు. అలా 6000 జీన్స్‌ను పంచారు. 800 జీన్స్‌ను దుప్పట్లుగా మార్చి ఇచ్చాడు. తద్వారా ఫ్యాషన్‌ దుస్తులు చెల్లాచెదురుగా పడి కాలుష్యం సృష్టించకుండా జాగ్రత్త పడుతున్నాడు.
  • 13-16 ఏళ్ల విభాగంలో మూడో స్థానం పొందిన మన్నత్‌ కౌర్‌ కాలుష్య రహితంగా వ్యర్థ జలాల శుద్ధిని, తాగు నీటి సరఫరా కార్యక్రమాలను చేపట్టింది.
  • ఈ ఏడాది విజేతల జాబితాలో గౌరవ స్థానం పొందిన 13 ఏళ్ల కర్ణవ్‌ రస్తోగీ ప్లాస్టిక్‌ వ్యర్థాలను నిర్మూలించడం ద్వారా వాతావరణ మార్పుల నిరోధానికి పాటు పడుతున్నాడు.


How many Indian children are among the 17 shortlisted for International Young Eco Hero Award-2023?

  • Five Indian children are among the 17 shortlisted for the International Young Eco Hero Award-2023, which is awarded to children who are involved in environmental protection around the world.
  • To this extent, Aiha Dixit (Meerut), Manya Harsha (Bangalore), Nirvan Somani (Delhi), Mannath Kaur (Delhi) and Karnav Rastogi (Mumbai) were awarded. American charity organization 'Action for Nature' gives these awards annually.
  • Aiha Dixit, who won first place in this competition, has been planting saplings since she was four years old. She along with some volunteers planted 20,000 saplings in Meerut city. A fund is established with plants donated by people and distributed freely.
  • Manya Harsha, who won the second position in the 8-12 years category, is raising environmental awareness with her books, blog and YouTube channel 'The Little Environmentalist'. Planted 3,500 saplings and distributed 3000 seed balls.
  • Nirvan Somani, who won the second position in the 13-16 age category, collects discarded denim jeans, alters them and distributes them to the poor. So 6000 jeans were distributed. He converted 800 jeans into blankets. Thus, he is careful not to create pollution by scattering fashionable clothes.
  • Mannath Kaur, who won the third position in the 13-16 years category, has undertaken pollution-free waste water treatment and drinking water supply programs.
  • 13-year-old Karnav Rastogi, who has bagged an honorable mention in this year's list of winners, is helping prevent climate change by eradicating plastic waste.

No comments:

Post a Comment