- వైద్యుల సలహా లేకుండానే మందుల షాపులకు వెళ్లి యాంటీ బయాటిక్ ఔషధాలు కొని వాడటం భారత్‌లో సర్వసాధారణం! దీనికితోడు కొవిడ్-19 సమయంలో టెట్రాసైక్లిన్, ఎరిథ్రోమైసిన్‌ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. విచ్చలవిడి వాడకం వల్ల రోగకారక బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్‌ను తట్టుకునే శక్తిని సంపాదించాయి. మరోవైపు మానవులు విసర్జించిన యాంటీ బయాటిక్స్ నీటి వనరుల్లో చేరిపోతున్నాయి. అవి ఇతర జీవులకు, పర్యావరణానికీ తీరని హాని కలిగిస్తాయి.
- పర్యావరణంలో కలసిపోయిన టెట్రాసైక్లిన్, ఎరిథ్రోమైసిన్ మందుల అవశేషాలను నిర్మూలించే పద్ధతిని ఐఐటీ-రూర్కీ పరిశోధకులు కనుగొన్నారు. నవీన్‌కుమార్ నవానీ నాయకత్వంలోని ఈ బృందంలో కిరణ్ అంబటిపూడి అనే తెలుగు పరిశోధకుడూ ఉన్నారు.
- వీరు కనుగొన్న ప్రక్రియ యాంటీబయాటిక్స్‌తోపాటు రసాయన కాలుష్యాన్నీ నిర్మూలించగలదు. ఈ ప్రక్రియలో మొదట నీటిలో చేరిన యాంటీబయాటిక్స్ అవశేషాలను కనిపెట్టడానికి బయోసెన్సర్ బ్యాక్టీరియాను ఉపయోగిస్తారు. కార్బన్ ఆధారిత నానోట్యూబ్‌లతో నీటిలోని యాంటీబయాటిక్స్‌ను ఆకర్షించి రసాయన ఉత్ప్రేరకం సాయంతో విచ్ఛిన్నం చేస్తారు.
- ఈ పద్ధతిలో కేవలం 3-4 గంటల్లోనే 93 శాతం యాంటీబయాటిక్ అవశేషాలను నిర్మూలించవచ్చు. నీటిలో కలసిపోయిన ప్రమాదకర రసాయనాలు, ఫార్మా అవశేషాలు, రంగులు, ఇతర యాంటీబయాటిక్స్ అవశేషాలను కూడా ఇదే ప్రక్రియతో విచ్ఛిన్నం చేయవచ్చు.
Friday, August 18, 2023
యాంటీబయాటిక్ అవశేషాల నిర్మూలనకు కొత్త ప్రక్రియ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment