- బ్యాంకుల్లో ఏళ్లుగా మూలుగుతున్న అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ముందడుగు వేసింది.
- వేర్వేరు బ్యాంకుల్లో మూలుగుతున్న అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను ఒకే చోట తెలుసుకొనేందుకు UDGAM (Unclaimed Deposits Gateway To Access Information) పేరిట ఓ సెంట్రలైజ్డ్ పోర్టల్‌ను ప్రారంభించింది.
- ఈ పోర్టల్ ద్వారా అన్‌క్లెయిమ్డ్ మొత్తాలను కావాలంటే తీసుకోవడం లేదా ఆయా ఖాతాలను పునరుద్ధరించుకోవడానికి వీలవుతుందని ఆర్‌బీఐ తెలిపింది.
- ఏదైనా బ్యాంకు ఖాతాలోని నగదు పదేళ్లు లేదా అంతకు మించిన వాడుకలో లేకుండాపోతే దాన్ని అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్‌గా పరిగణిస్తారు. అలా ఎవరూ క్లెయిమ్ చేయని డిపాజిట్లుగా ఆ డబ్బులన్నీ బ్యాంకుల్లోనే పేరుకుపోతుంటాయి. అటువంటి ఖాతాల వివరాలను ఈ పోర్టల్ ద్వారా చూసుకోవచ్చు.
- ప్రస్తుతానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ధనలక్ష్మి బ్యాంక్ లిమిలెడ్, సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్, డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్, సిటీ బ్యాంక్‌కు సంబంధించిన అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలు ఈ పోర్టల్‌లో లభ్యం కానున్నాయి.
- అక్టోబర్ 15 నాటికి ఇతర బ్యాంకుల వివరాలు సైతం అందుబాటులోకి రానున్నాయని ఆర్‌బీఐ తెలిపింది.
ఎలా ఉపయోగపడుతుంది?
- ఎవరైనా హఠాత్తుగా చనిపోతే మృతుడికి ఏయే బ్యాంకుల్లో ఎన్ని ఖాతాలున్నాయి? వాటిలో ఎంత సొమ్ముందన్న వివరాలు కుటుంబ సభ్యులకు తెలిస్తే ఫర్వాలేదు. కష్టకాలంలో ఆ డబ్బు ఉపయోగపడుతుంది. కానీ, చాలా కుటుంబాల్లో ఆర్థిక వ్యవహారాలన్నీ పురుషుల చేతుల మీదుగానే సాగుతుంటాయి. ఆర్థిక వివరాలు ఏవీ ఇతరులకు పెద్దగా చెప్పరు. దాంతో ఆకస్మిక మరణాలు సంభవించినప్పుడు ఆయా డిపాజిట్ల వివరాలు తెలియక కుటుంబ సభ్యులు అవస్థలు పడుతుంటారు. అలాగే, ఏదో బ్యాంకులో మరేదో సందర్భంలో సొమ్ము జమచేసి.. పనుల ఒత్తిడిలో పడిపోయి కాలగమనంలో దాని గురించి మరచిపోతుంటారు కొందరు. అటువంటివారు తమ కష్టార్జితాలను తిరిగి పొందడానికి ఈ పోర్టల్ దోహద పడుతుంది. ప్రస్తుతం క్లెయిమ్ చేయని డిపాజిట్ల గురించి తెలుసుకోవాలంటే ఆయా బ్యాంకుల వెబ్‌సైట్లను ఆశ్రయించాల్సి ఉంటుంది. అసలే బ్యాంకులో ఖాతా ఉందో తెలీకపోతే ఆ వివరాలు తెలుసుకోవడం కష్టం. ఈ పోర్టల్ ద్వారా ఆ కష్టాలు తీరనున్నాయి. డిపాజిట్‌దారులు లేదా మృతిచెందిన ఖాతాదారుల వారసులకు సంబంధిత డిపాజిట్లను వెతికి పట్టుకోవడం సులువవుతుంది.
ఎలా సెర్చ్ చేయాలి?
- UDGAM వెబ్‌సైట్‌లోకి వెళ్లి ముందుగా రిజిస్టర్ అవ్వాలి. తర్వాత లాగిన్ అయ్యి ఖాతాదారు పేరు పేర్కొనాలి. ఫలానా బ్యాంకు వివరాలే కావాలా? అన్ని బ్యాంకుల వివరాలూ (ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్యాంకులు) కావాలా? అనే ఆప్షన్లు ఎంచుకోవాలి. మెరుగైన సెర్చ్ కోసం ఆ తర్వాత పాన్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, పుట్టిన తేదీ వివరాలు ఏవైనా పేర్కొనాలి. ఒకవేళ ఆ వివరాలూ ఏవీ లేకపోతే గ్రామం, జిల్లా, రాష్ట్రం వంటి వివరాలు తెలుసుకోవాలి. అలా సెర్చ్ చేస్తే ఆ పేరుతో ఉన్న వ్యక్తుల వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ ఏదైనా బ్యాంకులో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు కనిపిస్తే బ్యాంకుకు వెళ్లి ఖాతాను పునరుద్ధరించుకోవచ్చు. ఒకవేళ మరణించిన వ్యక్తుల చట్టబద్ధ వారసులైతే సంబంధిత బ్యాంకుకు వెళ్లి పత్రాలను సమర్పించి అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను సెటిల్ చేసుకోవచ్చు.
What is the name of the portal launched by RBI for unclaimed deposits?
- The Reserve Bank of India has taken a major step forward in relation to unclaimed deposits which have been languishing in banks for years.
- A centralized portal called UDGAM (Unclaimed Deposits Gateway To Access Information) has been launched to know the unclaimed deposits lying in different banks at one place.
- RBI said that through this portal, unclaimed amounts can be withdrawn or the accounts can be revived.
- If the cash in any bank account remains unused for ten years or more then it is considered as unclaimed deposit. All that money accumulates in the banks as unclaimed deposits. Details of such accounts can be viewed through this portal.
- Currently, details of unclaimed deposits related to State Bank of India, Punjab National Bank, Central Bank of India, Dhanalakshmi Bank Limited, South Indian Bank Limited, DBS Bank India Limited, Citibank will be available on this portal.
- RBI said that the details of other banks will also be available by October 15.
How useful?
- If someone dies suddenly, how many bank accounts does the deceased have? It is okay if the family members know the details of how much money is in them. That money will come in handy in times of trouble. But, in most families, all financial affairs are handled by men. Don't tell others much about any financial details. Due to this, when sudden deaths occur, the family members are in trouble because they do not know the details of the respective deposits. Also, some people deposit money in some bank for some other occasion. This portal will help such people to get back their hard earned money. Currently, to know about the unclaimed deposits, one has to refer to the websites of the respective banks. It is difficult to know the details if one does not know that the account is actually in the bank. Through this portal, those difficulties will be solved. It makes it easier for depositors or heirs of deceased customers to trace the relevant deposits.
How to search?
- Go to UDGAM website and register first. Then login and specify the account holder name. Need specific bank details? Want details of all banks (currently available banks)? Select the options. For a better search, any details such as PAN, Voter ID, Driving License, Passport, Date of Birth should be specified. If there is none of those details then the details like village, district, state should be known. If you do a search, the details of people with that name will appear. If unclaimed deposits are found in any bank then one can go to the bank and recover the account. In case of legal heirs of deceased persons they can go to the concerned bank and submit the documents and settle the unclaimed deposits.
No comments:
Post a Comment