Thursday, October 6, 2016

సీఎస్‌ఐఆర్‌ 75వ వార్షికోత్సవం


శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్‌) 75వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని 2016 సెప్టెంబర్‌ 26న ఢల్లీలో ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోడి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలో తగ్గిపోతున్న నేల, నీటి వనరుల లభ్యత దృష్ట్యా పంట దిగుబడులు పెంచడానికి శాస్త్రీయ పరిష్కార మార్గాలను అభివృద్ధి చేయాలని ప్రధాని మోడి శాస్త్రవేత్తలకు సూచించారు.ఈ సందర్భంగా ప్రధాని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌, అసోం, జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాల నుంచి వచ్చిన రైతులతో చర్చించారు. సీఎస్‌ఐఆర్‌ సంస్థ శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖలలో భాగం. ఈ సంస్థ కింద 38 అధునాతన పరిశోధన సంస్థలు ఉన్నాయి. ఇవి ఏరోస్పేస్‌ నుంచి వ్యవసాయం వరకూ అనేక అంశాలపై పరిశోధలను చేస్తున్నాయి. ఈ సందర్భంగా పీతాంబర్‌ అనే పసుపు వంగడాన్ని ప్రధాని మోడి ఆవిష్కరించారు.
     ఈ సందర్భంగా ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ అవార్డును ప్రకటించారు.
భౌతికశాస్త్రం సుధీర్‌ కుమార్‌ వెంపటి, అనంత రామకృష్ణ
జీవశాస్త్రం                    రిషికేష్‌ నారాయణ, సువేంద్రనాథ్‌ భట్టాచార్య
రసాయనశాస్త్రం పార్థసారధి ముఖర్జీ
భూమి, వాతావరణం, సునీల్‌ కుమార్‌ సింగ్‌
అంతరిక్ష శాస్త్రం
ఇంజినీరింగ్‌ సైన్స్‌ అవినాష్‌ కుమార్‌, వెంకట నారాయణ
గణితశాస్త్రం నవీన్‌ గార్గ్‌
వైద్యశాస్త్రం                   నియాజ్‌ అహ్మద్‌
లైఫ్‌ సైన్సెస్‌ నేషనల్‌ బొటానికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడిసినల్‌,
                  అరోమాటిక్‌ ప్లాంట్స్‌ (సీఐఎంఏపీ, లక్నో) 

No comments:

Post a Comment