Saturday, August 12, 2023

World Record : గుండెకు 3 సార్లు బైపాస్‌ శస్త్రచికిత్సలు చేయించుకొని అత్యధిక కాలం జీవించిన వ్యక్తి కోలిన్‌ హాంకాక్‌


  • గుండెకు మూడు సార్లు బైపాస్‌ శస్త్రచికిత్సలు చేయించుకొని అత్యధిక కాలం జీవించిన వ్యక్తిగా బ్రిటన్‌కు చెందిన 77 ఏళ్ల కోలిన్‌ హాంకాక్‌ గిన్నిస్‌ పుస్తకంలో స్థానం సంపాదించారు. ఈ క్రమంలో పాత రికార్డును ఆయన బద్దలు కొట్టారు. 
  • వంశపారంపర్యంగా సంక్రమించే హైపర్‌ కొలెస్టెరోలేమియా అనే సమస్యతో కోలిన్‌ బాధపడుతున్నారు. ఇది శరీరంలో కొవ్వులు పెరగడంతో పాటు కరోనరీ హార్ట్‌ డిసీజ్‌కు కారణమవుతుంది. దీని వల్ల 30 ఏళ్ల వయసులో అతడికి గుండె పోటు వచ్చింది. 
  • ఆ తర్వాత ఏడాదిలో మూడు సార్లు బైపాస్‌ శస్త్రచికిత్సలు చేశారు. ఈ శస్త్రచికిత్సలు జరిగి 45 సంవత్సరాల 361 రోజులు గడిచింది. ఈ కాలంలో ఆయనకు మరో శస్త్రచికిత్స జరగలేదు. ఇప్పటికీ కోలిన్‌ ఆరోగ్యంగా ఉన్నారు. దీంతో గిన్నిస్‌ పుస్తకంలో చోటు సంపాదించారు. 
  • గతంలో ఈ రికార్డు అమెరికాకు చెందిన డెల్బర్ట్‌ డేల్‌ మెక్‌బీ పేరిట ఉంది. ఆయన మూడుసార్లు బైపాస్‌ శస్త్రచికిత్స చేయించుకుని 41 సంవత్సరాల 63 రోజులు జీవించారు. 2015లో 90వ  ఏట ప్రాణాలు కోల్పోయారు.

No comments:

Post a Comment