Showing posts with label Summits. Show all posts
Showing posts with label Summits. Show all posts

Saturday, October 8, 2016

రామోజీ ఫిలిం సిటీలో ఇండీవుడ్‌ ఫిలిం ఫెస్టివల్‌


ప్రపంచంలోనే అతి పెద్దదైన సినిమా పండుగ ఇండీవుడ్‌ ఫిలిం కార్నివాల్‌ రామోజీ ఫిల్మ్‌సిటీలో 2016 సెప్టెంబర్‌లో నిర్వహించారు.     ఈ సందర్భంగా సినీ ప్రముఖుడు అక్కినేని రమేష్‌ ప్రసాద్‌కు జీవన సాఫల్య పురస్కారాన్ని, సినీరంగానికి అత్యంత ప్రోత్సాహక దేశంగా ఐస్‌ల్యాండ్‌ అంబాసిడర్‌ గిబ్సన్‌కు పురస్కారం అందజేశారు. ఈనాడు గ్రూపు సంస్థ చైర్మన్‌ రామోజీరావుకు జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేశారు.ఇది 2వ ఇండీవుడ్‌ ఫిల్మ్‌ కార్నివాల్‌. ఇండీవుడ్‌ ఫిల్మ్‌ కార్నివాల్‌లో దేశవిదేశాల నుంచి పలు చిత్రాలు, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలు పోటీలో నిలిచాయి. వీటిలో ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి నగదు పురస్కారాలు అందజేశారు.
ఉత్తమ చిత్రం: న్కెస్‌: ది హార్ట్‌ ఆఫ్‌ మ్యాడ్‌నెస్‌
ఉత్తమ ఇండియన్‌ పనోరమ చిత్రం: పతేమరి
ఫిలిం క్రిటిక్స్‌ ఉత్తమ భారతీయ చిత్రం: వయోలిన్‌ ప్లేయర్‌
పీపుల్స్‌ ఛాయిస్‌ ఉత్తమ చిత్రం: షంఖచిట్‌
ఉత్తమ నూతన దర్శకుడి చిత్రం: ఫస్ట్‌సెమ్‌
ఉత్తమ లఘు చిత్రం: ది స్కూల్‌
ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: ది గ్రేట్‌ ట్రాన్స్‌మిషన్‌
ఉత్తమ విద్యార్థి లఘు చిత్రం: చవెర్‌
ఉత్తమ నటన: లొట్టొట్‌ డీ లియెన్‌ (ఫస్ట్‌సెమ్‌)

Wednesday, October 5, 2016

సార్క్‌ సదస్సు వాయిదా


ఇస్లామాబాద్‌లో జరగాల్సి ఉన్న సార్క్‌ సదస్సును పాకిస్థాన్‌ వాయిదా వేసింది. భారత్‌తో సహా 5 సభ్య దేశాలు తాము సదస్సుకు రాలేమంటూ స్పష్టం చేయడంతో పాకిస్థాన్‌ ఈ చర్య చేపట్టింది. అయితే, ప్రాంతీయ సహకారానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామనీ, సాధ్యమైనంత త్వరలో ఇస్లామాబాద్‌లోనే సార్క్‌ సదస్సును నిర్వహించడానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. త్వరలోనే కొత్త తేదీను ప్రకటించనున్నట్లు తెలిపింది. 2016 నవంబరు 9, 10 తేదీల్లో సార్క్‌ సదస్సు ఇస్లామాబాద్‌లో జరగాల్సి ఉంది. ఇస్లామాబాద్‌లో జరగాల్సి ఉన్న 19వ సార్క్‌ సదస్సుకు  హాజరు కాబోమని భారత్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, అఫ్గానిస్థాన్‌, శ్రీలంక ప్రకటించాయి. సార్క్‌ నిబంధనల ప్రకారం సభ్యదేశాల్లో ఏ ఒక్క దేశం గైర్హాజరైనా సదస్సును నిర్వహించడానికి వీల్లేదు.
సార్క్‌ (దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం) సభ్య దేశాలు
1. భారత్‌
2. అఫ్గానిస్థాన్‌
3. బంగ్లాదేశ్‌
4. భూటాన్‌
5. మాల్దీవులు
6. నేపాల్‌
7. పాకిస్థాన్‌
8. శ్రీలంక

SAARC-South Asian Association for Regional Cooperation 

Friday, September 30, 2016

ఆసియాన్‌-భారత్‌ సదస్సు


ఆసియాన్‌ సదస్సులో భాగంగా 2016 సెప్టెంబర్‌ 8న 14వ ఆసియాన్‌-భారత్‌ సదస్సు జరిగింది. ఇందులో భారత ప్రధాని నరేంద్రమోడి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విదేశీ ఉగ్రవాదం పెరిగిపోతుండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని ఆసియాన్‌ సభ్యదేశాలు సమన్వయంతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

ఆసియాన్‌ సదస్సు


ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య (అసోసియేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఈస్ట్‌ ఏషియన్‌ నేషన్స్‌-ఆసియాన్‌) సదస్సు 2016 సెప్టెంబర్‌ 6-8 తేదీల్లో లావోస్‌లోని వియంటైన్లో జరిగింది. ఈ సదస్సును ‘టర్నింగ్‌ విజన్‌ ఇన్‌ టు రియాలిటీ ఫర్‌ ఎ డైనమిక్‌ ఆసియాన్‌ కమ్యూనిటీ’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. సదస్సులో ఆసియాన్‌ కమ్యూనిటీ విజన్‌ 2025 అమలుపై ఆసియాన్‌ వెలుపలి భాగస్వాములతో సహకారాన్ని విస్తరించుకోవడంపై నేతలు చర్చించారు. ఈ సందర్భంగా ‘వన్‌ ఆసియాన్‌, వన్‌ రెస్పాన్స్‌’ అనే ఆసియాన్‌ డిక్లరేషన్‌పై నేతలు సంతకాలు చేశారు. ఈ ప్రాంతంతో పాటు వెలుపలి ప్రాంతంలో సంభవించే విపత్తుపై ఆసియాన్‌ ఒకటిగా స్పందించాలని నిర్ణయించారు.

Monday, September 19, 2016

జైపూర్‌లో బ్రిక్స్‌ దేశాల మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు


జైపూర్‌లో 2016 ఆగస్టు 20, 21 తేదీల్లో బ్రిక్స్‌ దేశాల మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రతినిధుల  బ్రిక్స్‌ దేశాల  మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించడంతోపాటు ప్రపంచ సంస్థల్లో తమ దేశాలకు అధిక భూమిక ఉండాని అభిలషించారు. లోక్సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ మాట్లాడుతూ వాతావరణ మార్పు పరిణామాలను ఎదుర్కోవడం, మహిళ సంక్షేమాన్ని పెంపొందించడంపై బ్రిక్స్‌ దేశాలు  అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు.

Saturday, September 17, 2016

వాషింగ్టన్‌లో ఫిక్కీ అమెరికా-భారత్‌ ప్రతినిధల సమావేశాలు


అణుభద్రత, ఉగ్రవాదం తదితర అంశాపై ఇరు దేశాలు కలిసి పని చేసే దిశగా ఫిక్కీ ఆధ్వర్యంలో అమెరికా-భారత్‌ ప్రతినిధుల సమావేశాలు వాషింగ్టన్‌లో 2016 సెప్టెంబరు 11 నుంచి 17 వరకు జరిగాయి. ఈ సమావేశాలకు భారత్‌ తరఫున బిజూ జనతాదళ్‌ (బీజేడీ) ఎంపీ జే పాండ నేతృత్వంలో గల్లా జయదేవ్‌ (టీడీపీ), హరీష్‌ చందర్‌ మీనా, అనురాగ్‌ ఠాకుర్‌ (బీజేపీ), సుస్మితాదేవ్‌, రాజీవ్‌ (కాంగ్రెస్‌), నీరజ్‌ శేఖర్‌ (సమాజ్‌వాదీ పార్టీ) బృందం పాల్గొంది. 

Sunday, September 11, 2016

ముంబయిలో ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ సమావేశం


ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ 69వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని 2016 సెప్టెంబర్‌ 1న ముంబయిలో నిర్వహించారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఈ సదస్సుకు హాజరై ప్రసంగించారు. https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

విశాఖపట్నంలో ప్రకంపన సదస్సు



విపత్తు సమయాల్లో వివిధ శాఖల మధ్య సమన్వయం సాధించడమే లక్ష్యంగా విశాఖపట్నంలో 2016  ఆగస్టు 31న ప్రకంపన సదస్సును నిర్వహించారు. వివిధ యుద్ధ విమానాల పనితీరును విశాఖలోని నౌకాదళ వాయుస్థావరం ఐ.ఎన్‌.ఎస్‌.డేగాలో ప్రదర్శించారు. సీకింగ్‌లు, చేతక్‌లు, యూహెచ్‌ 3హెచ్‌ హెలికాప్టర్లను ఉపయోగించి విపత్తు సమయాల్లో సహాయ సామగ్రిని వివిధ ప్రాంతాలకు ఎలా తరలిస్తారో, ఆపదలో చిక్కుకున్నవారిని ఎలా రక్షిస్తారన్న విషయమై నమూనా విన్యాసాలు చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించిన ఐఎన్‌-32 విమానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇదే శ్రేణికి చెందిన విమానం ఇటీవల తాంబరం నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు వెళ్తూ బంగాళాఖాతంలో గల్లంతయింది. విపత్తు సమయాల్లో ఐఎన్‌-32 విమానాన్ని ఎయిర్‌ అంబులెన్స్‌గా మారుస్తారు. దీనికి పైలట్‌గా నీమ్‌ హుదా అనే మహిళ బాధ్యతలు  నిర్వహిస్తుంది. విపత్తు సమయాల్లో నిరూపక్‌ యుద్ధనౌకను వైద్య సేవలందించే ఆసుపత్రిగా మార్చే వెసులుబాటు ఉందని అధికారులు  వెల్లడించారు.  https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

Tuesday, September 6, 2016

హ్యూమన్‌ క్యాపిటల్‌ సదస్సు-2016లో మంత్రి కేటీఆర్‌


శ్రీంక రాజధాని కొలంబోలో జరిగిన హ్యూమన్‌ క్యాపిటల్‌ సదస్సు-2016లో ఆగస్టు 10న బిల్డింగ్‌ ఎ ఫ్యూచర్‌ రెడీ వర్క్‌ఫోర్స్‌ ఇండియన్‌ ఎక్స్‌పీరియెన్స్‌ అనే అంశంపై తెలంగాణ పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రసంగించారు. ఈ సదస్సులో శ్రీంక ప్రధాని రణిల్‌ విక్రమ సింఘే, ప్రపంచ బ్యాంక్‌ మానవాభివృద్ధి విభాగం డెరైక్టర్‌ అమిత్‌ధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Saturday, August 27, 2016

ఇస్లామాబాద్‌లో సార్క్‌ కూటమి హోం మంత్రుల సమావేశం


7వ సార్క్‌ కూటమి హోం మంత్రుల సమావేశాన్ని 2016 ఆగస్టు 4న ఇస్లామాబాద్‌లో నిర్వహించారు. భారత హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ సమావేశంలో ప్రసంగించారు. ఉగ్రవాదును ప్రోత్సహించడం, వారిని కీర్తించడం మానుకోవాలని పాక్‌కు సింగ్‌ సూచించారు. రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ సమావేశంలో హిందీలో ప్రసంగించారు. పాక్‌ హోమంత్రి చౌధురి నిసార్‌ అలీఖాన్‌ తన ప్రసంగంలో కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు. ‘కశ్మీర్‌లో అమాయక ప్రజలపై జరుగుతున్న హింస బహిరంగ ఉగ్రవాదమే’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Thursday, August 18, 2016

జీ-20 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది..?

నైరుతి చైనాలోని చెంగ్డూ నగరంలో 2016 జులై 24న జీ-20 దేశాల  ఆర్థిక మంత్రుల, సెంట్రల్‌ బ్యాంకు గవర్నర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల  విభాగం కార్యదర్శి శక్తికాంత దాస్‌ హాజరయ్యారు. ఈ సమావేశం కోసం రూపొందించిన గ్లోబల్‌ ప్రాస్పెక్ట్స్‌ అండ్‌ పాలసీ చాలెంజెస్‌ అనే నివేదికలో భారత ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధి చెందాలంటే 6 కీలక రంగాల్లో మరిన్ని సంస్కరణలు  చేపట్టాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) సూచించింది. వస్తు సేవల  విక్రయం, కార్మిక విధానాలు, మౌలికం, బ్యాంకింగ్‌, న్యాయ - ఆస్తుల పరిరక్షణ, ద్రవ్య స్థిరీకరణ లాంటి 6 కీలక విభాగాల్లో మరిన్ని సంస్కరణలను సత్వరం చేపట్టాని వివరించింది. 

జీ-20 సభ్య దేశాల సంఖ్య - 20
జీ-20 ఛైర్మన్‌ - జీ జిన్‌పింగ్‌
ఏర్పాటు - 1999