నైరుతి చైనాలోని చెంగ్డూ నగరంలో 2016 జులై 24న జీ-20 దేశాల ఆర్థిక మంత్రుల, సెంట్రల్ బ్యాంకు గవర్నర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి శక్తికాంత దాస్ హాజరయ్యారు. ఈ సమావేశం కోసం రూపొందించిన గ్లోబల్ ప్రాస్పెక్ట్స్ అండ్ పాలసీ చాలెంజెస్ అనే నివేదికలో భారత ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధి చెందాలంటే 6 కీలక రంగాల్లో మరిన్ని సంస్కరణలు చేపట్టాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) సూచించింది. వస్తు సేవల విక్రయం, కార్మిక విధానాలు, మౌలికం, బ్యాంకింగ్, న్యాయ - ఆస్తుల పరిరక్షణ, ద్రవ్య స్థిరీకరణ లాంటి 6 కీలక విభాగాల్లో మరిన్ని సంస్కరణలను సత్వరం చేపట్టాని వివరించింది.
జీ-20 సభ్య దేశాల సంఖ్య - 20
జీ-20 ఛైర్మన్ - జీ జిన్‌పింగ్
ఏర్పాటు - 1999
No comments:
Post a Comment