విపత్తు సమయాల్లో వివిధ శాఖల మధ్య సమన్వయం సాధించడమే లక్ష్యంగా విశాఖపట్నంలో 2016 ఆగస్టు 31న ప్రకంపన సదస్సును నిర్వహించారు. వివిధ యుద్ధ విమానాల పనితీరును విశాఖలోని నౌకాదళ వాయుస్థావరం ఐ.ఎన్.ఎస్.డేగాలో ప్రదర్శించారు. సీకింగ్‌లు, చేతక్‌లు, యూహెచ్ 3హెచ్ హెలికాప్టర్లను ఉపయోగించి విపత్తు సమయాల్లో సహాయ సామగ్రిని వివిధ ప్రాంతాలకు ఎలా తరలిస్తారో, ఆపదలో చిక్కుకున్నవారిని ఎలా రక్షిస్తారన్న విషయమై నమూనా విన్యాసాలు చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించిన ఐఎన్-32 విమానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇదే శ్రేణికి చెందిన విమానం ఇటీవల తాంబరం నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు వెళ్తూ బంగాళాఖాతంలో గల్లంతయింది. విపత్తు సమయాల్లో ఐఎన్-32 విమానాన్ని ఎయిర్ అంబులెన్స్‌గా మారుస్తారు. దీనికి పైలట్‌గా నీమ్ హుదా అనే మహిళ బాధ్యతలు నిర్వహిస్తుంది. విపత్తు సమయాల్లో నిరూపక్ యుద్ధనౌకను వైద్య సేవలందించే ఆసుపత్రిగా మార్చే వెసులుబాటు ఉందని అధికారులు వెల్లడించారు. https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg
Sunday, September 11, 2016
విశాఖపట్నంలో ప్రకంపన సదస్సు

Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment