Wednesday, October 5, 2016

సార్క్‌ సదస్సు వాయిదా


ఇస్లామాబాద్‌లో జరగాల్సి ఉన్న సార్క్‌ సదస్సును పాకిస్థాన్‌ వాయిదా వేసింది. భారత్‌తో సహా 5 సభ్య దేశాలు తాము సదస్సుకు రాలేమంటూ స్పష్టం చేయడంతో పాకిస్థాన్‌ ఈ చర్య చేపట్టింది. అయితే, ప్రాంతీయ సహకారానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామనీ, సాధ్యమైనంత త్వరలో ఇస్లామాబాద్‌లోనే సార్క్‌ సదస్సును నిర్వహించడానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. త్వరలోనే కొత్త తేదీను ప్రకటించనున్నట్లు తెలిపింది. 2016 నవంబరు 9, 10 తేదీల్లో సార్క్‌ సదస్సు ఇస్లామాబాద్‌లో జరగాల్సి ఉంది. ఇస్లామాబాద్‌లో జరగాల్సి ఉన్న 19వ సార్క్‌ సదస్సుకు  హాజరు కాబోమని భారత్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, అఫ్గానిస్థాన్‌, శ్రీలంక ప్రకటించాయి. సార్క్‌ నిబంధనల ప్రకారం సభ్యదేశాల్లో ఏ ఒక్క దేశం గైర్హాజరైనా సదస్సును నిర్వహించడానికి వీల్లేదు.
సార్క్‌ (దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం) సభ్య దేశాలు
1. భారత్‌
2. అఫ్గానిస్థాన్‌
3. బంగ్లాదేశ్‌
4. భూటాన్‌
5. మాల్దీవులు
6. నేపాల్‌
7. పాకిస్థాన్‌
8. శ్రీలంక

SAARC-South Asian Association for Regional Cooperation 

No comments:

Post a Comment