అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని తెలంగాణ పౌర సరఫరాల శాఖ అమలు చేస్తున్న ప్రాజెక్టులు జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డుకు ఎంపికయ్యాయి. సరుకులు దారి మళ్లకుండా చూసేందుకు, రైతుకు మద్దతు ధర అందించేందుకు ఈ శాఖ అమలు చేస్తున్న ఈ-పాస్ (ఎక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్), ఈపీడీఎస్, ఎస్‌సీఎం (సప్లై చైన్ మేనేజ్‌మెంట్) ఓపీఎంఎస్ (ఆన్‌లైన్ ప్రొక్యూర్‌మెంట్ సిస్టం), ఫిర్యాదు పరిష్కారం వంటి 5 ప్రాజెక్టులు ఈ అవార్డుకు ఎంపికయ్యాయి. అలాగే ఆసరా పింఛన్ పధకంలో బయోమెట్రిక్ నిర్ధారణ కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్చ్) అమలు చేస్తున్న లైవ్ ఎవిడెన్స్ ప్రక్రియ, వ్యవసాయ పనిముట్లను ఆన్‌లైన్ ద్వారా రైతులకు విక్రయించే పద్ధతికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర వ్యవసాయ శాఖకు, ఆన్‌లైన్‌లో స్టాంపు డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించేందుకు వీలు కల్పిస్తూ ప్రవేశపెట్టిన ‘ఈ స్టాంప్స్’ ప్రాజెక్టులకు కూడా స్కోచ్ అవార్డు దక్కాయి.
Saturday, October 1, 2016
మేఘనా పంత్‌కు ఎఫ్‌ఓఎన్ పురస్కారం
కుమొన్ లిటరరీ ఫెస్టివల్ ఎఫ్‌ఓఎన్ (ఫెలోస్ ఆఫ్ నేచర్) సౌత్ ఏషియా స్టోరీ పురస్కారానికి ముంబై రచయిత్రి మేఘనా పంత్ ఎంపికయ్యారు. పీపుల్ ఆఫ్ ది సన్ అనే కథకు గాను మేఘనకు ఈ గౌరవం దక్కింది. ఫ్రెంచ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో కుమొన్ లిటరరీ ఫెస్టివల్ నిర్వాహకులు ఈ అవార్డును అందచేస్తున్నారు. ప్రకృతి సంబంధిత అంశాల్లో సాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఈ పురస్కారం కింద గ్రహీతకు రూ.లక్ష నగదు అందజేస్తారు.
ఫార్చ్యూన్ శక్తివంతమైన మహిళల్లో ముగ్గురు భారతీయులు
ఫార్చ్యూన్ తాజాగా రూపొందించిన అమెరికాకు వెలుపల అత్యంత శక్తివంతమైన 50 మంది మహిళల జాబితాలో అరుంధతీ భట్టాచార్య చందా కొచర్, శిఖాశర్మ స్థానం పొందారు. ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య జాబితాలో రెండో స్థానాన్ని కైవసం చేసుకోగా, ఐసీఐసీఐ బ్యాంక్ హెడ్ చందా కొచర్ 5వ స్థానంలో నిలిచారు. యాక్సిస్ బ్యాంక్ సీఈవో శిఖాశర్మ 19వ స్థానంలో ఉన్నారు. మార్కెట్ విలువ పరంగా యూరో జోన్‌లోనే అతిపెద్ద బ్యాంక్ అయిన బ్యాంకో శాన్‌టండర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అనబాటిన్ ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు.
యంగ్ ప్రొఫెషనల్ ఆఫ్ ద ఇయర్‌గా భారత సంతతి వ్యక్తులు
భారత సంతతికి చెందిన నలుగురు పారిశ్రామికవేత్తలకు ఈ ఏడాదికిగాను యంగ్ ప్రొఫెషనల్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం దక్కింది. భారత్-అమెరికా మధ్య బంధాలను బలోపేతం చేయడంలో తమవంతు పాత్ర పోషించినందుకు, పారిశ్రామిక రంగంలో విశేష ప్రతిభ కనబర్చినందుకు మలిషా పటేల్, రేవలి పింకు, భావేశ్ పటేల్, అబ్దార్ ఎస్ తయాబ్జీకు ఈ పురస్కారం దక్కింది. వీరితో పాటు మార్విన్ ఓడమ్, రిచర్డ్ హబ్నర్, డాక్టర్ జాన్ మెండ్లెన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ పురస్కారం దక్కింది.
పదమ్‌సీ చిత్రానికి రూ.19 కోట్లు
భారతీయ చిత్రకారుడు అక్బర్ గీసిన పదమ్‌సీ చిత్రానికి శాఫ్రాన్ ఆర్ట్స్ సంస్థ నిర్వహించిన వేలం లో రూ.19 కోట్ల రికార్డు ధర పలికింది. గ్రీక్ ల్యాండ్ స్కేప్ పేరిట 1960లో గీసిన ఈ చిత్రం భారీ ధరతో రికార్డు సృష్టించింది. 2011లో సోత్ బై సంస్థ వేలం లో రూ.93 కోట్లకు అమ్ముడుపోయిన రీక్లైనింగ్ న్యూడ్ చిత్రమే ఇప్పటివరకూ ప్రపంచ రికార్డు.
దీపా మలిక్‌కు రజతం
పారాలింపిక్స్‌లో మహిళ షాట్‌పుట్ (ఎఫ్-53) ఈవెంట్‌లో భారత క్రీడాకారిణి, 46 ఏళ్ల దీపా మలిక్ రజత పతకాన్ని సొంతం చేసుకుంది, దీంతో పారాలింపిక్స్‌లో పతకం నెగ్గిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. 2016 సెప్టెంబర్ 12న జరిగిన ఫైనల్లో దీపా ఇనుప గుండును 461 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచింది. ఫాతిమా నెధమ్ (బహ్రెయిన్-476 మీటర్లు) స్వర్ణం సాధించగా, దిమిత్రా కొరోకిడా (గ్రీస్-428 మీటర్లు) కాంస్యం సంపాదించింది. దీపా మలిక్ 2012లో కేంద్ర ప్రభుత్వం నుంచి అర్జున అందుకొని ఈ అవార్డు పొందిన పెద్దవయస్కురాలిగా (42 ఏళ్ల వయసులో) గుర్తింపు పొందింది.
ఇన్‌శాట్-3డీఆర్ ప్రయోగం విజయవంతం
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి 2016 సెప్టెంబర్ 8న వాతావరణ ఉపగ్రహం ఇన్‌శాట్-3డీ ఆర్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. దీని కోసం దేశీయంగా రూపొందించిన సంక్లిష్ట క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ అమర్చిన భారీ రాకెట్ జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్05 ను ఉపయోగించారు. ఇది ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇన్‌శాట్-3డీఆర్ పనిచేయని ఇన్‌శాట్-3డీ స్థానంలో వాతావరణ, గాలింపు, సహాయ చర్యల్లో సాయపడనుంది. ఈ ఉపగ్రహంలో 6-చానల్ ఇమేజర్, 9-చానల్ సౌండర్ పరికరాలు, వాతావరణ సమాచార (డాటా) రిలే ట్రాన్స్‌పాండర్స్
(డీఆర్టీ) శాటిలైట్ ఎయిడెడ్ సెర్చ్ అండ్ రెస్క్యూ (ఎస్‌ఏఎస్ అండ్ ఆర్) పరికరాలను అమర్చారు.
ఉపగ్రహ విశేషాలు
రాకెట్ : జీఎస్‌ఎల్‌వీ ఎఫ్ 05
తీసుకెళ్లగ సామర్థ్యం : 415.2 టన్నులు
ఎత్తు : 49.1 మీటర్లు
వ్యాసం : 34 మీటర్లు
ఉపగ్రహం : ఇన్‌శాట్ 3డీఆర్
బరువు
లం : 10 సం॥లు
కొలతలు : 24I16I15(మీటర్లు)
విద్యుత్తు : 1700 వాట్ల విద్యుత్తు
ఉత్పత్తి చేయగ రెండు సౌరఫకాలు, 90 ఏహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీ
ప్రయోగ వ్యయం : రూ.210 కోట్లు
రాకెట్‌కు ఖర్చు : రూ.160 కోట్లు
ఉపగ్రహ వ్యయం : రూ.50 కోట్లు
Subscribe to:
Posts (Atom)






