Saturday, October 1, 2016

తెలంగాణ పౌరసరఫరాల శాఖకు స్కోచ్‌ అవార్డు

అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని తెలంగాణ పౌర సరఫరాల శాఖ అమలు చేస్తున్న ప్రాజెక్టులు జాతీయ స్థాయిలో స్కోచ్‌ అవార్డుకు ఎంపికయ్యాయి. సరుకులు దారి మళ్లకుండా చూసేందుకు, రైతుకు మద్దతు ధర అందించేందుకు ఈ శాఖ అమలు చేస్తున్న ఈ-పాస్‌ (ఎక్ట్రానిక్‌ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌), ఈపీడీఎస్‌, ఎస్‌సీఎం (సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌) ఓపీఎంఎస్‌ (ఆన్‌లైన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ సిస్టం), ఫిర్యాదు పరిష్కారం వంటి 5 ప్రాజెక్టులు ఈ అవార్డుకు ఎంపికయ్యాయి. అలాగే ఆసరా పింఛన్‌ పధకంలో బయోమెట్రిక్‌ నిర్ధారణ కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్చ్‌) అమలు చేస్తున్న లైవ్‌ ఎవిడెన్స్‌ ప్రక్రియ, వ్యవసాయ పనిముట్లను ఆన్‌లైన్‌ ద్వారా రైతులకు విక్రయించే పద్ధతికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర వ్యవసాయ శాఖకు, ఆన్‌లైన్‌లో స్టాంపు డ్యూటీ రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించేందుకు వీలు కల్పిస్తూ ప్రవేశపెట్టిన ‘ఈ స్టాంప్స్‌’ ప్రాజెక్టులకు కూడా స్కోచ్‌ అవార్డు దక్కాయి.

No comments:

Post a Comment